Gunde Ninda Gudi Gantalu September 1st: ప్రభావతిని ఇరికించిన మనోజ్.. బాలుపై రోహిణి ఫైర్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 29వ తేదీ 499వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మనోజ్ కు మంచి వ్యాపారం చూపిస్తాడు. ఫర్నీచర్ షాపు అమ్మకానికి ఉందని తెలుసుకొని వెళ్లి ఇంట్లో చెబుతాడు. మనోజ్ కు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే ఆ షాప్ తీసుకోమని సలహానిస్తాడు. దీంతో సత్యం సంతోషిస్తాడు. ముందు వెళ్లి ఆ ఫర్నీచర్ షాప్‌ను చూసి వద్దామని అంటాడు. ఆ వెంటనే అందరూ కలిసి ఆ షాప్ దగ్గరకు వెళ్లి ఫర్నీచర్ ఎలా ఉంది, ఎంత వర్త్ చేస్తుందనేది గమనిస్తారు. ఇక ఆ వ్యాపారం అయితేనే మనోజ్ కు సరిగ్గా సెట్ అవుతుందని అందరూ భావిస్తారు. మనోజ్ రోహిణి కూడా ఆ వ్యాపారం చేసేందుకు ఓకే చెబుతారు. ఇక షాప్ ఓనర్ తో ఎంత డబ్బులు ఇవ్వాలి, ప్రాఫిట్స్ ఎంత ఉంటుందనే విషయాలను మేము తర్వాత మాట్లాడుతామని చెబుతారు. మళ్లీ విడిగా వస్తామని రోహిణి అంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి తిరిగి వెళ్తారు. ఇక మనోజ్ వ్యాపారం మొదలు పెట్టబోతుండటంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది. మనోజ్ వ్యాపారస్తుడు అవుతుండటంతో బాలు కూడా హ్యాపీగా ఫీలవుతాడు.

ఇక అందరూ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత షాపు గురించి మరోసారి డిస్కస్ చేస్తారు. ఫర్నీచర్ షాప్ చాలా పెద్దగా ఉందని, వ్యాపారం బాగా నడుస్తుందని అందరూ తమ అభిప్రాయాలను చెబుతారు. అసలు ఇంతకీ మీ షాపుకు ఎవరి పేరు పెడుతున్నారని శృతి అడుగుతుంది. ఇంకా ఎవరి పేరు అనుకోలేదు బాగా ఆలోచించి పెడుతామని రోహిణి అంటుంది. అందుకు శృతి ఎవరి పేరు పెడితే బాగుంటుందని అందరి అభిప్రాయాన్ని అడుగుతుంది. ఇక మీనా మాత్రం సుశీలమ్మ గారి పేరు పెడిగే బాగుంటుందని చెబుతుంది. దాంతో సత్యం, బాలు, రవి, శృతి సంతోషిస్తారు. కానీ తన పేరు చెప్పడం లేదని ప్రభావతి లోలోపల అసంతృప్తితో ఉంటుంది. మనోజ్ రోహిణి మాత్రం అలాంటి పేర్లు బాగుండవేమో అని అంటారు. మా షాపు పేరు ఎలా ఉండాలో మేం ఆలోచిస్తామని, మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని రోహిణి అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 1వ తేదీ 500 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 500 September 1st

మనోజ్, రోహిణి తమ గదిలో కూర్చొని తమ వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఫర్నీచర్ షాప్ కు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో సలహానివ్వు రోహిణి అని మనోజ్ అడుగుతాడు. అత్తమ్మ పేరే ప్రభావతి అని పెట్టుకుందామని రోహిణి చెబుతుంది. కానీ మనోజ్ మా అమ్మ పేరు వద్దు అని అంటాడు. ఇప్పటికే ఆ అమ్మ పేరు పెట్టుకున్న రెండు షాపులు మధ్యలోనే చేతికి అందకుండా వెళ్లిపోయాయి అని చెబుతాడు. కానీ రోహిణి మాత్రం మనం మీ అమ్మగారి పేరే పెట్టుకోవాలని అంటుంది. మనోజ్ వద్దు అని అంటాడు. కావాలంటే అమ్మకు మంచి చీర కొని పెడుదామని అంటాడు. ఫర్నీచర్ షాప్ కు మాత్రం వేరే పెడుదామని నిర్ణయిస్తాడు. అయితే వీరు గట్టిగా మాట్లాడుతుండటంతో బాలు బయట నుంచి వింటాడు. మనోజ్ మాటలను బాలు రికార్డ్ చేస్తాడు. తన తల్లి ప్రభావతిపై మనోజ్ తక్కువ చేసి మాటలను తన ఫోన్ లో రికార్డ్ చేసి సేవ్ చేస్తాడు. ఆ తర్వాత మనోజ్, రోహిణిల గదిలోకి నేరుగా వెళ్లి నువ్వేం మాట్లాడుతున్నావురా అంటాడు. భ్యారా భర్తలు అన్నాక చాలా మాట్లాడుకుంటాంరా అసలు నువ్వు ఎందుకు లోపలికి వచ్చావురా అని మనోజ్ బాలును ప్రశ్నిస్తాడు. ఇక బాలు స్పందిస్తూ నువ్వు నేను చెప్పినట్టుగానే వినాలని అంటాడు. ఎందుకు ఏ విషయంలో అని మనోజ్ అడుగుతాడు. మీ షాప్ కు నేను చెప్పిన పేరే పెట్టాలని అంటాడు.

అదేంటీ మా షాప్ కు నువ్వు చెప్పిన పేరు పెట్టాల్సిన అవసరం ఏముందని రోహిణి అంటుంది. అవసరం ఉంది. మీరు మీ షాప్ కు మా అమ్మ ప్రభావతి పేరే పెట్టుకోవాలని బాలు డిమాండ్ చేస్తాడు. మీరు ఇప్పటికీ ఈ ఉంటున్నారంటే దానికి కారణం అమ్మనే. అలాగే మనోజ్ అంటే మా అమ్మకు ఎంతో ఇష్టం. నిద్రపోతున్న అమ్మను లేపి అమ్మా నీకు ఎవరు ఇష్టమని అడిగితే మనోజ్ అని ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా చెబుతుందని బాలు అంటాడు. వీడు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆమె వెనకేసుకొని వచ్చింది. తప్పులను సరిదిద్దుతూ సపోర్ట్ చేస్తూనే ఉంది. అలాంటి అమ్మ పేరును నీ షాప్ కు పెట్టనని అంటావా? అని బాలు పైర్ అవుతాడు. ఎవ్వరు ఏమన్నా అమ్మ తట్టుకుంటుంది కానీ నువ్వు అమ్మను ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేదురా అని బాలు చెబుతాడు. అసలు నేను అమ్మను అన్నాను అనడానికి ఆధారం ఏంటని అంటాడు మనోజ్. దాంతో బాలు తను రికార్డ్ చేసిన మనోజ్ మాటలను ఫోన్ లో వినిపిస్తాడు. ఇక రోహిణి ఇలా మా పర్సనల్ విషయాలను రికార్డ్ చేయడం సిగ్గుచేటని అంటుంది. పర్సనల్ విషయాలు నాకెందుకు, అమ్మ గురించి కాబట్టి రికార్డ్ చేశాను. నేను చెప్పినట్టు వినకపోతే ఈ రికార్డ్ ను అమ్మకు వినిపిస్తానని చెప్పి వెళ్లిపోతాడు.

ఇక బాలుకు తన కన్న తల్లి ప్రభావతిపై ఉన్న ప్రేమను మీనా మరోసారి తెలుసుకుంటుంది. మనోజ్ తో బాలు తన తల్లి గురించి మాటలు విని ఎమోషనల్ అవుతుంది. ఇక బాలు రాగానే మీ తల్లి అంటే ఎంతో ఇష్టమని నాకు తెలుసు అని అంటుంది. ఆమె మీ కోసం ఒక్కరోజు కూడా ప్రేమగా లేదు. అయినా మీరు మీ అమ్మ కోసం నిత్యం తపన పడుతూనే ఉంటారని అంటుంది. అదే కన్నపేగు బంధం కావొచ్చు మీనా, అమ్మను ఎవ్వరు ఏమన్నా అస్సలు ఊరుకోను అని చెబుతాడు. ఇక మరోవైపు శృతి, రవి బట్టలను వేసుకుంటుంది. రవిని కూడా తన నైటీ వేసుకోమని బలవంతం చేస్తుంది. అంతే కాదు, కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెట్టుకొని తీసుకొని రమ్మని కండీషన్ పెడుతుంది. దీంతో రవి చప్పుడు కాకుండా కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడుతాడు. ఇదే సమయంలో ప్రభావతి వచ్చి చూస్తుంది. రవి దాక్కుంటాడు. ఇక దొంగ దొంగా అని ప్రభావతి అరవడంతో అందరూ హాలులోకి వస్తారు. బాలు కిచెన్ లోకి వెళ్లడంతో రవి నైటీలో కనిపిస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత శృతి బయటికి వచ్చి జరిగింది చెప్పడంతో అంతా కూల్ అవుతారు. కానీ రవిని ఇంకోసారి ఇలాంటివి చేయకని హెచ్చరిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X