Gunde Ninda Gudi Gantalu September 2nd: అత్త ప్రభావతిపై మీనా ఫైర్.. పరువు పోగొట్టుకున్న మనోజ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ 500వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ వ్యాపారం చేయాలని అనుకోవడంతో బాలు మనోజ్ కోసం ఒక ఫర్నిచర్ షాప్ అమ్మకానికి ఉండడంతో చెబుతాడు. బాలు ఇచ్చిన సలహా మేరకు కుటుంబ సభ్యులు అంతా వెళ్లి ఆ ఫర్నిచర్ షాప్ ని చూస్తారు. ఇక ఆ షాపును తీసుకునేందుకు సిద్ధమవుతారు. అయితే ఇప్పుడు ఆ షాప్ కు ఎవరి పేరు పెట్టాలి అని చర్చలు జరుగుతున్నాయి. దీంతో మనోజ్ రోహిణి తమ స్టార్ట్ చేసే బిజినెస్ కోసం ఎలాంటి పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇంట్లో వాళ్ళు పలు రకాలుగా సూచనలు చేస్తారు. ఇక మీనా కూడా ఒక సలహాను ఇస్తుంది. మీరు చేయబోయే వ్యాపారానికి సుశీలమ్మ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెబుతుంది. దాంతో రవి శృతి లు కూడా ఆ పేరు పెట్టుకుంటేనే బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని కూడా చెబుతారు. మరోవైపు ప్రభావతి తన పేరు ఎవరు చెప్పడం లేదని మండిపడుతూ ఉంటుంది.
ఇక మనోజ్ రోహిణి తమ ప్రారంభించబోతున్న ఫర్నిచర్ బిజినెస్ కు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సమయంలో రోహిణి మనోజ్ వాళ్ళ అమ్మ ప్రభావతి పేరును పెడదామని అంటుంది. కాని మనోజ్ మాత్రం వద్దని చెబుతాడు. తన తల్లి పేరును షాపుకి పెట్టుకుంటే కలిసి రాదని అంటాడు. ఇప్పటికే మన పార్లర్, మీనా పూల కొట్టు ఎలా మూసుకుపోయాయో చూసాం కదా అని అంటాడు. కావాలంటే అమ్మకు ఒక చీర కొని పెడదామని చెబుతాడు. ఇక మనోజ్ మాటలను బాలు వింటాడు. రికార్డ్ చేస్తాడు కూడాను. మీరు కచ్చితంగా మీ షాప్ కు అమ్మ పేరు పెట్టుకోవాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే ఈ రికార్డు అమ్మకు వినిపిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో మనోజ్ రోహిణి కంగారు పడతారు. మరోవైపు శృతి రవితో తన నైటీని వేయించి ఇంట్లో వాళ్ళు దొరికిపోయేలా చేస్తుంది. దాంతో రవి పరువు పోతుంది. ఆ తర్వాత బాలు రవి పై పనిగా కామెంట్లు పేలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 2వ తేదీ 501 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ప్రభావతి పెద్ద గొంతు వేసుకొని మీనా ను పిలుస్తుంది. అత్త ప్రభావతి అరుపులు విన్న మీనా వెంటనే వస్తుంది. మీనా రాగానే ప్రభావతి ఏం వంట చేస్తున్నావని అడుగుతుంది. కిచెన్ లో ఏ కూరగాయలు ఉంటే ఆ వంటకం చేస్తానని చెబుతోంది. అదే ఏ కూరగాయలు ఉన్నాయి ఏం వంట చేస్తావని మళ్లీ ప్రశ్నిస్తుంది. ఇదే సమయానికి మనోజ్ రోహిణి తమ గది నుంచి కిందికి వస్తారు. ఇక మనోజ్ తల్లి ప్రభావతితో ఈరోజు ఏం వంట చేస్తున్నారు అమ్మ అని అడుగుతాడు. మీకు ఏది నచ్చితే అది చేయిస్తాను రా అని చెబుతోంది. రోహిణి ప్రత్యేకంగా అడిగి మరి నీకే వంటకం కావాలో చెప్పమ్మా మీనా చేసి పెడుతుంది అని అంటుంది. ఇదే సమయంలో బాలు కూడా వస్తాడు. ప్రభావతి మాటలు వింటాడు. వాళ్ల కోసం నా భార్య మీనా ఎందుకు వండి పెట్టాలని అడుగుతాడు. వాళ్లకు ఏ వంటకం కావాలో వాళ్ళు చేసుకుని తినలేరా అని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి ఘాటుగా స్పందిస్తుంది.
వాళ్ళు వ్యాపారం చేయడానికి వెళుతున్నాను. మీనా లాగా ఇంట్లోనే ఉండటం లేదు కదా. వ్యాపారం అంటే నాలుగు చోట్లకి వెళ్లాలి నాలుగు విషయాలు తెలుసుకోవాలి మాట్లాడాల్సి ఉంటుంది. అలా చేయాలంటే వాళ్ళకి ఒంట్లో శక్తి ఉండాలి కదా, అందుకోసం పుష్టిగా తినాలి. ఇక వాళ్లకు వండుకోవడానికి సమయం ఉండడం లేదు కాబట్టి మెయిన్ అను వండమని చెబుతున్నానని ప్రభావతి అంటుంది. ఇంతకీ వ్యాపారమే ప్రారంభం కాలేదు. అప్పుడే బిజీ అయిపోయారు అని బాలు కామెంట్ చేస్తాడు. ఇక బాలుడు మౌనంగా ఉండమని చెప్పి రోహిణి ఏం వండాలో చెప్పమని ప్రభావతి అడుగుతుంది. దానితో రోహిణి వెజిటేబుల్ బిర్యానీ చేయమని చెప్పండి అత్తయ్య అని అంటుంది. ఇక మీనా స్పందిస్తూ అలా బిర్యానీ చేయాలంటే కిచెన్ లో కూరగాయలు ఉండాలి కదా అని అంటుంది. అందుకు సరిపడ కూరగాయలు లేవు అని చెబుతోంది. కూరగాయలు లేకపోతే మేము తెచ్చి ఇస్తామని రోహిణి అంటుంది. ఆ వెంటనే మనోజ్ ను కూరగాయలకు పంపిస్తారు. మనోజ్ కు రోహిణి 500 ఇచ్చే కూరగాయలు తీసుకురమ్మని చెబుతుంది.
అయితే మనోజ్ కూరగాయల కోసం వెళ్లి చాలాసేపటి తర్వాత తిరిగి వస్తాడు. కూరగాయలు ఇచ్చి ఒక రూపాయి మిగిలిందని చేతిలో పెడతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. సూపర్ మార్కెట్లో కూరగాయలు తెచ్చానని చెబుతాడు. అయినా ఈ కూరగాయలకు అంత ఖరీదు అని అందరూ ప్రశ్నిస్తారు. ఆ వెంటనే ఒక అబ్బాయి వచ్చింది అందులో బిల్లు తప్పుగా పడింది, 300 రూపాయలు మీకే తెలివి వస్తాయని ఇచ్చి పోతాడు. దాంతో మనోజ్ ను ఇంట్లో వాళ్ళందరూ తిడతారు. ఒక వ్యాపారం ఎలా చేస్తాడో అంటూ ఆందోళన చెందుతారు. మరోవైపు బాలు మీనాల పెళ్లిరోజు వస్తుంది. దీంతో భాను మీ నాన్న ఇంటికి పిలిచేందుకు మీనా వాళ్ళ అమ్మ వస్తుంది. ఇద్దరిని పిలిచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత బాలు మీనాల పెళ్లిరోజును ఘనంగా జరిపించాలని రవి శృతి అంటారు. మరోవైపు ఊర్లో నుంచి నానమ్మ సుశీల కూడా వస్తుంది. చాలా గ్రాండ్ పెళ్లిరోజులు జరుపుకోవాలని అంటారు. ఇదే సమయంలో మౌనికను కూడా పిలుద్దామని అంటారు. కానీ మౌనిక వస్తే సంజీవ్ గురించి అసలు విషయం బయటపడుతుందని మీనా భయపడుతుంది. దాంతో వాళ్లు ఎందుకులే అని చెబుతుంది. ఈ సందర్భంగా మీనాను అందరూ షాకింగ్ గా చూస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications










