Gunde Ninda Gudi Gantalu September 11th: సంజూ వేళ్లు విరగ్గొట్టిన బాలు.. చెల్లి జోలికి రావొద్దని వార్నింగ్

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాల పెళ్లిరోజు కావడంతో శృతి తల్లి వచ్చి బంగారు గాజుల్ని కానుకగా ఇవ్వడంతో ప్రభావతి, రోహిణిలు షాక్ అవుతారు. మీనా చేతికి గాజులు వేయగా.. వాటిని తిరిగి శృతి చేతికి వేసేస్తుంది మీనా. నాకు బంగారం మీద వ్యామోహం లేదని, మేం పూలు అమ్ముకునే వాళ్లమని అంటుంది మీనా. ఆ తర్వాత బాలు, మీనాలే కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని అందరికీ తినిపిస్తారు. ఆ వెంటనే నేను కూడా ఓ గిఫ్ట్ తెచ్చానని బాలుకి ఓ కవర్ ఇస్తాడు సంజూ.

ఆ లెటర్ చదివిని మనోజ్.. బావగారు నీకు పర్సనల్ డ్రైవర్‌గా ఉద్యోగం ఇచ్చారని, నెలకు 50 వేల రూపాయల జీతమని చెబుతాడు. నా సొంత కారును కష్టపడి నడుపుతానని, ఎవరి కిందా నేను పనిచేయనని తేల్చేస్తాడు బాలు. సంజూ వెళ్లి కుర్చీలో కూర్చోగా అది విరిగి నేల మీద పడిపోతాడు. మీకు కొనేంత స్థోమత లేదని నేనే సోఫా కొని పంపిస్తానని చెబుతుంది శృతి తల్లి. ఆ మాటలతో సత్యం, బాలులు రగిలిపోతారు. మాకు మీరు ఫ్రీగా ఏం ఇవ్వొద్దని చెప్పడంతో శృతి తల్లి అలిగి వెళ్లిపోతుంది. ఇంతలో బాలు, మీనాల గురించి ఇంట్లో వాళ్లు ఒక్కొక్కరు మాట్లాడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 11వ తేదీ, 508వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 508 September 11th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

బాలు, మీనాల గురించి ప్రభావతిని మాట్లాడమని సుశీల డార్లింగ్ అడుగుతుంది. నేను ఏం మాట్లాడలేనని, నాకు రాదని అంటుంది ప్రభావతి. అందరూ బలవంతం చేయడంతో ప్రభావతి సరేనని అంటుంది. వీళ్ల పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిగిందని, అందుకే పెళ్లిగా అంగీకరించలేకపోయానని కానీ తప్పదు, భరించాలి.. మీనాకు ఇంటి కోడలిగా ఒప్పుకోవాలి, సమాజం కోసమైనా అంగీకరించాలని అంటుంది. బాలు పుట్టి ఇన్నేళ్లు అయినా నేను వాడిని భరించలేకపోతున్నానని.. వాడికి పెళ్లయితే ఏ భార్యా వాడితో కాపురం చేయదని భరించలేక పారిపోతుందని అనుకున్నా. కానీ మీనా చాలా మొండిది వాడి కోపాన్ని భరిస్తుంది, బాధలో ఉంటే క్షమిస్తుంది అందుకే వాడి కాపురం నిలబడిందని అంటుంది. దాంతో అందరూ చప్పట్లు కొడతారు.

మా అమ్మ తొలిసారి నా భార్యను మెచ్చుకుందని, ప్రభావతి మంచివతి అయ్యిందని అంటాడు బాలు. నేను జీవితంలో మీనాను క్షమించనని చెబుతుంది ప్రభావతి. బాలును మాట్లాడమని శృతి అనగా.. నాకు రాదు, నాకు సిగ్గు అని అంటాడు బాలు. నన్ను ఇంట్లో ఒక మనిషిగా గుర్తించింది మా నాన్న ఒక్కడే, కానీ మీనా నా జీవితంలోకి వచ్చాక నన్ను మంచిగా చూసిందని చెబుతాడు బాలు. మీనా నన్ను మార్చేసిందని అందరూ అనుకుంటున్నారు కానీ, తన కోసమే నన్ను నేను మార్చుకున్నానని అంటాడు.

మీనా మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఇదే రోజున ఇతనిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డానని చెబుతుంది. ఇప్పుడు నా అదృష్టం కొద్ది ఈయననే చేసుకున్నానని అనుకున్నానని.. మా అమ్మ, మా మావయ్య కలిసి నాకు మంచే చేశారని చెప్పింది. అందరికీ ఈయన కోపమే కనిపిస్తుంది కానీ నాకు ఈయన మనసు మాత్రమే కనిపిస్తుందని, ఈయనది పసిపిల్లాడి మనస్తత్వమని.. రేపు నాకు పిల్లాడు పుడితే మొదటి పిల్లాడు బాలునే అని, ఈయన మనసులో ఏదో వెలితి ఉందని చెబుతుంది మీనా. ఆయన మనసులో బాధ, కష్టం ఉందని అది ఏంటో నేను తెలుసుకోలేకపోయానని చెప్పడంతో మనోజో టెన్షన్ పడతాడు.

భార్యను ఎలా ప్రేమించాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలని, కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో మా వదినను చూసి నేర్చుకోవాలని, మేం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెబుతుంది మౌనిక. ఆ మాటలతో బాలు కుటుంబం షాక్ అవుతుంది. మీ ఉపన్యాసాలు ఆపితే మనం బయల్దేరదామని మౌనికపై మండిపడతాడు సంజూ. దాంతో అందరికీ వీడ్కోలు చెప్పి బయల్దేరతారు మౌనిక, సంజూ. భోజనం చేసి వెళ్లొచ్చు కదా అని మౌనికతో అంటాడు బాలు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా? ఏం చెప్పుకోవాలని అనుకున్నా ఈ అన్నయ్య ఉన్నాడని మరిచిపోవద్దని మౌనికతో చెబుతాడు బాలు. ఎవరైనా ఏమైనా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు.. వాళ్ల సంగతి నేను చూసుకుంటానని అంటాడు. ఆ మాటలతో సంజూ రగిలిపోతాడు.

సంజూ కారు ఎక్కబోతుండగా వేళ్ల మీద డోర్ వేస్తాడు బాలు. ఇది శాంపిల్ మాత్రమే.. నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను, ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావని సంజూకి వార్నింగ్ ఇస్తాడు బాలు. రోహిణి దగ్గరికి వెళ్లి బాలు, మీనాల పెళ్లి రోజు ఫంక్షన్ బాగా జరిగిందని.. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు కానీ మీ ఇంట్లో వాళ్లు మాత్రం ఎవరూ రావడం లేదని నిలదీస్తుంది ప్రభావతి. నీ అచ్చట ముచ్చట తీర్చడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, కనీసం మీ నాన్న వచ్చి చూస్తాడు అనుకుంటే మాకు ముఖం కూడా చూపించలేదని అంటుంది. మా నాన్న జైళ్లో ఉన్నాడు కదా అందుకే అని రోహిణి చెబుతుండగా.. అంతకుముందు వారానికి ఒకసారి వచ్చాడా? ఏంటీ అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. మీ ఇంట్లో వాళ్లు ఎవరూ రావడం లేదని అంటున్నారని, వాళ్లతో ఎందుకు అనిపించుకోవాలని అంటుంది ప్రభావతి.

ఆ మాటలతో బాధపడ్డ రోహణి.. తన కొడుకు గురించి తల్లికి ఫోన్ చేస్తుంది. బాలు, మీనాల పెళ్లి రోజు సందర్బంగా అందరూ వచ్చారని నాకే ఎవ్వరూ లేరని చెప్పి బాధపడుతుంది. నిన్ను అందరిలో సంతోషంగా చూడాలని నాకూ ఉందని, కానీ ఏం చేస్తాం తిండికి టీకానా లేని దానిని అని చెబుతుంది రోహిణి తల్లి. వచ్చే వారం నేను ఇంటికి వస్తున్నానని రోహిణి చెప్పడంతో తల్లి సంతోషిస్తుంది. బాలు, మీనాలకు దిష్టి తగిలిందని ఉప్పు, మిరపకాయలు తీసుకురమ్మని ప్రభావతితో చెబుతుంది సుశీల. అయితే రోహిణి- మనోజ్, శృతి- రవిలకు కూడా దిష్టి తీయమని అడుగుతుంది ప్రభావతి. నేనెప్పుడూ వాళ్లని తక్కువ చేయలేదు, నువ్వెందుకు మీనాను తక్కువ చేస్తున్నావని ప్రశ్నించింది సుశీల డార్లింగ్.

మా అమ్మ మెచ్చుకోవాలంటే మలేషియా నుంచైనా రావాలి, బాగా కోటీశ్వరులైనా అయ్యుండాలని సెటైర్లు వేస్తాడు బాలు. నాకు అందరూ ఒకటేనని, నీకు, సత్యానికి కూడా దిష్టి తీస్తానని చెబుతుంది సుశీల డార్లింగ్. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి.. నువ్వు కాబట్టి ఎవ్వరినీ చేయి జారనీవ్వకుండా చూసుకుంటున్నావని ప్రభావతిని మెచ్చుకుంటుంది సుశీల. ఆ తర్వాత అందరికీ కొడుకు, కోడలికి.. మనవళ్లు, మనవరాళ్లికి దిష్టి తీస్తుంది సుశీల డార్లింగ్. నాకు బాగా నిద్ర వస్తుందని మేడపైన పడుకుంటామని బాలు అంటాడు. ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి.. మీరిద్దరూ గదిలో పడుకోండి, మేం హాల్‌లో పడుకుంటామని చెబుతాడు సత్యం.

ముగ్గురు కొడుకుల్లో ఇద్దరి కొడుకులకు గదులు ఎందుకు ఇచ్చావ్? బాలు, మీనాలకు ఎందుకు ఇవ్వలేదని సుశీల నిలదీస్తుంది. శృతి, రోహిణిలు రెడీ అయి వెళ్లాలి కదా అని ప్రభావతి అంటుంది. అసలు అందరికన్నా ముందు లేచేదే వాళ్లని, వాడు సంపాదిస్తున్నాడు, మీనా సంపాదిస్తోంది.. వీళ్లంటే ఎందుకు తేడాగా చూస్తున్నావని ప్రశ్నిస్తుంది సుశీల డార్లింగ్. వీళ్లను తక్కువగా ఎందుకు చూస్తున్నావని మండిపడుతుంది. అమ్మానాన్న కింద పడుకోకూడదని మేమే మేడపైన పడుకుంటున్నామని చెబుతాడు బాలు. నీ అన్నయ్య, తమ్ముడు ఎందుకు అలా ఆలోచించడం లేదని అడుగుతుంది సుశీల. నాకు గనుక మండిందంటే నిన్ను, నీ పెళ్లాన్ని ఊరు తీసుకెళ్లి నీ పెళ్లాం చేత పిడకలు కొట్టిస్తానని వార్నింగ్ ఇస్తుంది సుశీల. బాలు కోసం మా రూమ్ ఇస్తామని చెబుతాడు రవి.

పెళ్లి రోజు పడుకోవడానికి గది కూడా లేకుండా వాళ్లిద్దరూ మేడ మీదకు వెళ్లారని, నాకేం నచ్చలేదని అంటుంది సుశీల. పల్లెటూరులో ఆరుబయట పడుకుంటే ఆ లెక్క వేరని చెబుతుంది. వాళ్లిద్దరూ అలా మేడపైన పడుకోవడం నాకూ బాధగానే ఉందని, నా ఆరోగ్యం బాలేదని వాళ్లు గది మాకిచ్చి మేడపైన పడుకుంటున్నారని చెబుతాడు సత్యం. ఇలాంటి పరిస్ధితి రాకూడదనే మేడపైనే ఇంకో గది కట్టించాలని అనుకున్నానని అంటాడు. శృతి వాళ్ల అమ్మ గారు కూడా కట్టిస్తానని చెప్పారని కానీ మీరే ఒప్పుకోలేదని చెబుతుంది ప్రభావతి. అలా ఒప్పుకుంటే నా తల వాళ్ల గుమ్మం దగ్గర పెట్టినట్లేనని అంటుంది. నీ బుర్రకి కక్కుర్తి తప్ప, ఆత్మగౌరవం లాంటివి ఉండవా? అని సుశీల డార్లింగ్ నిలదీస్తుంది. మన ఇల్లు మనమే కట్టుకోవాలని, మేడ మీద డబ్బు కట్టించు ఆ డబ్బు నేనే ఇస్తానని చెబుతుంది సుశీల. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X