Gunde Ninda Gudi Gantalu September 15th: మనోజే గొప్ప, బాలుని హీనంగా చూసిన ప్రభావతి.. భర్తకు అండగా మీనా

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: ముగ్గురు కోడళ్లు, ముగ్గురు కొడుకులను నువ్వు వేరు వేరుగా చూస్తున్నావని ప్రభావతిపై ఫైర్ అవుతుంది సుశీల డార్లింగ్. నా కొడుకు ఆరోగ్యం కోసం బాలు, మీనాలు మేడపైన పడుకుని త్యాగం చేస్తున్నారని చెబుతుంది. వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మేడపైన మరో రూమ్ కట్టించాలని అంటుంది. నా పెన్షన్ డబ్బులతో గది కట్టిస్తానని సత్యం చెప్పడంతో నువ్వు ఇబ్బంది పడొద్దని ఆ డబ్బు నేనే సర్దుతానని చెబుతుంది సుశీల డార్లింగ్. ఉదయాన్నే కొడుకులు, కోడళ్లను పిలిచి ఈ విషయం గురించి చెబుతాడు సత్యం. ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందోనని మనోజ్ టెన్షన్ పడతాడు. నా పెన్షన్ డబ్బులతో మరో రూమ్ కట్టిస్తానని సత్యం చెప్పడంతో నువ్వు ఈ వయసులో కష్టపడొద్దని.. నేను, మీనాలు సర్దుకుపోతామని చెబుతాడు బాలు.

మా నాన్న సంపాదించేది నా కోసమేనని, ఆయనకు చెబితే నిమిషాల్లో ఇంకో గది కట్టిస్తాడని శృతి చెప్పడంతో సత్యం, బాలులు దానిని అవమానంగా ఫీల్ అవుతారు. దాంతో ఎవరికి ఇబ్బంది లేకుండా సుశీల ఓ పరిష్కారం చెబుతుంది. గదిని ముగ్గురు కోడళ్లు, ముగ్గురు కొడుకులు సమానంగా వాడుకోవాలని.. వారానికి ఒకరు హాల్‌లో పడుకోవాలని చెబుతుంది. తొలివారం హాల్‌లో పడుకోవడానికి మనోజ్ - రోహిణిలు రాకపోవడంతో బాలు వెళ్లి వారి బెడ్‌రూమ్ తలుపులు బాదేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక సెప్టెంబర్ 15వ తేదీ, 510వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 510 September 15th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

హాల్‌లో పడుకోవాలంటే దోమలు కూడుతున్నాయని, ఎలా పడుకోవాలని మనోజ్ ప్రశ్నిస్తాడు. మరి మామయ్యకి బెడ్‌రూమ్ ఇచ్చినప్పటి నుంచి మీనా, బాలు ఇక్కడే పడుకుంటున్నారు కదా అని శృతి ప్రశ్నిస్తుంది. వాళ్ల కంఫర్ట్స్ గురించి అన్నయ్య మాట్లాడుతున్నాడని, మిగతా వాళ్లు ఏమైపోతే వాళ్లకెందుకు అని రవి నిలదీస్తాడు. ఆ మాటలతో మండిపడ్డ ప్రభావతి.. బాలుని ఉసిగొలిపి పంపించింది నువ్వేనా అని ప్రశ్నిస్తుంది. నేనే వెళ్లి తలుపులు బాదమని రెచ్చగొట్టి పంపించాను, దానికి రవి- శృతిలే సాక్ష్యాలని అంటుంది మీనా. వదిన ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా అన్నయ్యే ఆగకుండా వెళ్లాడని రవి అంటుంది. బాలు కరెక్ట్‌గానే చేశాడు కదా.. మీనాను ఎందుకు అనవసరంగా అంటున్నారని శృతి ఫైర్ అవుతుంది.

హాల్‌‌లో ఏసీ లేదు, ఏసీ పెట్టించొచ్చు కదా అని అంటాడు మనోజ్. వాడు ఎలా పడుకుంటాడు? శృతి ఏసీ పెట్టిద్దామని అంటే మీరే గొప్పలకు పోయి వద్దన్నారని అంటుంది ప్రభావతి. ఇంకొకరి దయా దాక్షిణ్యాల మీద బతకడం నాకిష్టం లేదని ఫైర్ అవుతాడు సత్యం. చిన్నప్పటి నుంచి నలుగురు పిల్లలతో ఈ ఇంట్లోనే ఉన్నామని, ఇప్పుడే ఏసీ అవసరం పడిందా అని ప్రశ్నిస్తాడు. దోమలు, ఉక్కపోత మనోజ్ అన్నయ్యకేనా? .. బాలు అన్నయ్య, మీనా వదినలని దోమలు కుట్టావా అని ప్రశ్నిస్తాడు రవి. అయినా మా అమ్మ నా కోసం ఏసీ పంపిస్తానని చెప్పిందని అంటుంది శృతి. మీరేమీ కొనరు, ఇంకొకరిని కొననివ్వరని మండిపడుతుంది ప్రభావతి. గొడవ సద్దుమణగడంతో బాలు, మీనాలు మనోజ్ గదిలో పడుకుంటారు.

వాళ్లు ప్రశాంతంగా ఎలా పడుకుంటారో? నేను చూస్తానని రోహిణితో అంటాడు మనోజ్.. ఆ వెంటనే తన గది దగ్గరికి వెళ్లి తలుపుకొట్టి ఛార్జర్ మరిచిపోయాడని చెప్పి తీసుకెళ్తాడు. నా ఫేవరెట్ పిల్లో లేదని నాకు దాని మీద పడుకుంటేనే నిద్రపడుతుందని మళ్లీ పైకి వెళ్లి దిండు తెంచుకుంటాడు. వాడు రోజంతా ఏసీ కారులోనే తిరుగుతాడు కదా? మళ్లీ ఏసీ ఎందుకని బాలు దగ్గరికి మళ్లీ వెళ్తాడు మనోజ్. మీనా వచ్చిందేమో అనుకున్న బాలు తలుపు తీయగా.. మనోజ్ వెళ్లి బాలుపై పడతాడు. ఇప్పుడేం కావాలని మండిపడ్డ బాలు.. గదిలో మొత్తం వస్తువులన్నీ మూటకట్టి ఇస్తాడు.

నిద్రపట్టక అటు ఇటు తిరుగుతున్న మనోజ్‌ దగ్గరికి ప్రభావతి వస్తుంది. ఇదంతా ఆ మీనా మీ నానమ్మతో చేయించిందని, ఎదురు చెప్పలేం కదా అని కొడుకుతో అంటుంది. తన కోసం హాల్‌లో పడుకున్న రోహిణికి మనోజ్ సారీ చెబుతాడు. మన బిజినెస్ బాగా క్లిక్ అయ్యాక ఒక ఫ్లాట్ తీసుకుని వెళ్లిపోదామని అంటాడు. ఇప్పుడు అవన్నీ వద్దని తర్వాత చూసుకుందామని చెబుతుంది రోహిణి. ఈసారి కూడా తలుపులు బాదడంతో మనోజ్ వచ్చాడనుకున్న బాలు.. కోపంగా వెళ్లేసరికి మీనా ఉంటుంది. లోపలికి రాగానే చాప దిండు వేస్తుంది. అంత పెద్ద మంచం పెట్టుకుని, నేల మీద పడుకుంటావా? అని మండిపడతాడు బాలు.

ఆ మంచం మనది కాదని, భార్యకు తన భర్త తినే కంచం, పడుకోబోయే మంచం కూడా అంతే ప్రత్యేకమని చెబుతుంది. ఈ చాప మంచం మీద వేసుకుని మీరే పడుకోండని మీనా చెబుతుంది. నువ్వు నేల మీద పడుకుంటే నేను మంచం మీద ఎలా పడుకుంటానని దిండు వేసుకుని పడుకుంటాడు. నేను నా మీనా దగ్గరే పడుకుంటాను.. నువ్వు నా గుండెల మీద తలపెట్టుకుని పడుకోమని చెబుతాడు బాలు. నేను మీ గుండెల మీద పడుకుంటే మీకు ఇబ్బందిగా ఉండదా అని అడుగుతుంది మీనా. నాకేం ఇబ్బంది ఉండదని చెబుతుంది.

నీకు ఇలా గుండెల మీద పడుకుంటే ఏం అనిపించదా? అని బాలు ప్రశ్నించగా.. నాకు హాయిగా ఉంటుంది. రోజంతా చేసే పని, ఇంట్లో గొడవలు ఏం గుర్తుకురావని.. చిన్నప్పుడు అమ్మ ఒడి, పెళ్లాయ్యాక భర్త కౌగిలి, వీటికంటే గొప్పచోటు ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది మీనా. నువ్వు ఇలా మాట్లాడితే నేను మంచి భర్తను అయిపోయానేమో అనిపిస్తుందని అంటాడు బాలు. నా పక్కన పడుకోవాలని ఎందుకు అనిపించిందని మీనా అడగ్గా.. నీ నుంచి వచ్చే పూల వాసన లేకుంటే నాకు నిద్రపట్టదని చెబుతాడు బాలు. అయితే ఫ్రీజ్‌లో ఉన్న పూలన్నీ తెచ్చి చుట్టనా అని అడుగుతుంది మీనా. ముద్దబంతి పువ్వులా నువ్వు ఉన్నావ్ కదా నిన్ను చుట్టుకుంటానని చెబుతాడు బాలు.

నిద్రపట్టకపోవడంతో మనోజ్ చిరాకు పడుతుంటాడు. ఒక వారమైతే పర్లేదు.. నెలలో రెండు వారాలు ఇలాగే ఉంటే నా వల్ల కాదని అంటాడు. అంత అవసరం లేదని, వచ్చే వారమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటుంది రోహిణి. ఎలా అని మనోజ్ అడగ్గా.. వచ్చే వారం రవి - శృతి బయట పడుకోవాల్సి వస్తుంది కదా. శృతి గురించి నాకు బాగా తెలుసు.. తను లగ్జరిగా పెరిగింది, తను మేడ మీద పడుకోలేక ఖచ్చితంగా గొడవ చేస్తుందని అవసరమైతే వాళ్ల పేరెంట్స్‌తో చెబుతుందని, అప్పుడు మన ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుందని అంటుంది రోహిణి. ఆ మాటలతో మనోజ్ సంతోషిస్తాడు.

ఉదయాన్నే తల్లిని చూసి రాత్రంతా నాకు నిద్రపట్టలేదని, అసలే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని.. ఓనర్‌ని నేనే అలిసిపోయి వెళితే కస్టమర్లు ఏమనుకుంటారని అడుగుతాడు మనోజ్. బిజినెస్ అంటే బుర్ర పెట్టి చేయాలి.. ఆ బాలుగాడిలా గేర్లు మార్చడం కాదని అంటాడు. ఏదో ఒకటి చేయ్, చాలా ఇబ్బందిగా ఉందని చెబుతాడు. ఒక్కరోజుకే ఇలా అంటున్నావ్.. మీ నాన్న, నేను చాలా రోజులు ఇక్కడే పడుకున్నామని అప్పుడు నీకు ఏం అనిపించలేదా? అని అడుగుతుంది ప్రభావతి. నాకు జాలి వేసేదని, కానీ మీకు పగలు నిద్రపోయే అవకాశం ఉందని చెబుతాడు. నాకు వారం రోజులు టైం ఇవ్వు ఏదో ఒక పరిష్కారం చూపిస్తానని చెబుతుంది ప్రభావతి.

టిఫిన్ చేస్తూ డైనింగ్ టేబుల్ మీదే పడుకుంటాడు మనోజ్. దాంతో అందరూ నవ్వుకుంటారు. మనోజ్‌ని రోహిణి నిద్రలేపడంతో ఉలిక్కిపడి లేచి కుర్రీ, టేబుల్, సోఫా ఏం కావాలని అంటాడు. రాత్రంతా నిద్రలేదని, దోమలు కుట్టాయని చెబుతాడు మనోజ్. మాకు కూడా ఉండేది కాదని, ఆ దోమలు మమ్మల్ని కూడా కుట్టేవని బాలు, మీనా చెబుతారు. నువ్వు, వాడు ఒకటేనా అని ప్రభావతి నిలదీయడంతో అంతా షాక్ అవుతారు. మనోజ్ పై నుంచి దిగొచ్చాడా? ఇద్దరూ మీ కడుపులో నుంచే కదా వచ్చింది అని మీనా రివర్స్‌లో తగలుకుంటుంది. నిద్రపడితేనే కదా మైండ్ ఫ్రెష్‌గా ఉండేదని, అప్పుడే షాప్ సరిగా చూసుకోగలమని రోహిణి చెబుతుంది.

ఆలూ లేదు చూలు లేదు అన్నట్లుగా ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు, అప్పుడే బిజినెస్ గురించి మాట్లాడొద్దని సెటైర్లు వేస్తాడు బాలు. షాప్ ఎవరితో ఓపెన్ చేయిస్తున్నారని శృతి అడుగుతుంది. ఇంకా ఎవరినీ అనుకోలేదని మనోజ్ చెబుతాడు. నేను సెలబ్రెటీలను ట్రై చేస్తున్నానని అంటాడు. వీడేమైనా కొత్త సినిమా విడుదల చేస్తున్నాడా? ఆ బ్రిటీష్ వాళ్లు రావడానికి అంటాడు బాలు. బ్రిటీష్ వాళ్లు కాదు.. సెలబ్రిటీష్ అంటాడు రవి. చివరిలో ఉన్నది అదే కదా నైటీలు వేసుకునేవాడా? అని బాలు అనడంతో శృతి, రవి బాధపడతారు. డబ్బులిస్తే సెలబ్రెటీలు వస్తారని మనోజ్ చెప్పడంతో అంతా తిడతారు. మీ మేనమామ ఇండియాలోనే ఉన్నాడు కదా ఆయన్ని పిలవొచ్చు కదా అని అడుగుతాడు రవి.

ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదని చెబుతుంది రోహిణి. మేకమామ.. మేకమామ అని పాట పాడితే పరిగెత్తుకుంటూ వస్తాడని సెటైర్లు వేస్తాడు బాలు. కస్టమర్లను అట్రాక్ట్ చేయాలంటే ఇలాగే చేయాలని మనోజ్ అంటాడు. ఇంటి ముందే పెట్టుకునే పూలబండి కాదని రోహిణి అనడంతో మీనా బాధపడుతుంది. శృతితో మీ పూలబండి ఓపెన్ చేయించి డబ్బులిచ్చారు కదా అని గుర్తుచేస్తుంది రోహిణి. నాకు ఇచ్చింది 2000 వేలే అని చెబుతుంది శృతి. ఇంట్లో వాళ్ల హస్తవాసి మీద మనోజ్ గాడికి నమ్మకం లేదనుకుంటా అని అంటాడు బాలు. నువ్వు ఇన్నాళ్లూ ఎన్ని తప్పులు చేసినా క్షమించిన అమ్మని మరిచిపోయావని చెబుతాడు బాలు. నువ్వు గొప్పవాడివి కావాలని మీ అమ్మ ఎన్నో కలలు కనిందని, అమ్మతో ఓపెన్ చేయిస్తే నీకు మంచి జరుగుతుందని అంటాడు సత్యం. నువ్వు లక్షలు మింగినా దాచింది? పార్క్‌లో పడుకున్నా దాచింది? అమ్మని మరిచిపోయావెంట్రా అని మండిపడతాడు బాలు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X