Gunde Ninda Gudi Gantalu September 22nd: మీనాను మెడపట్టి లాక్కొచ్చిన ప్రభావతి.. బాలు దెబ్బకి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: బాలు సోఫా రిటర్న్ చేయడం, స్టాఫ్ ముందు అవమానం జరగడం, కస్టమర్లు తిరిగి వెళ్లిపోవడంతో సీరియస్ అయిన మనోజ్- రోహిణిలు ఇంట్లో పెద్ద గొడవ చేస్తారు. ఇకపై నాకు చెప్పకుండా నీ బోడి పెత్తనం చేస్తే ఊరుకోనని బాలుకి వార్నింగ్ ఇస్తాడు మనోజ్. దాంతో రగిలిపోయిన బాలు.. మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. రౌడీయిజం చేస్తున్నావా అని రవి అనడంతో ఏంట్రా నైటీలు వేసుకునేవాడా నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయి నన్ను అంటావా? అంటూ రవి మీదకి వెళ్తాడు బాలు. దాంతో తోడికోడళ్లు ముగ్గురు తమ భర్తలను పక్కకి తీసుకొచ్చేస్తారు.

దాంతో సత్యం బాలుపై కోప్పడి తప్పు నీదేనని.. ఉమ్మడి కుటుంబంలో నీ ఒక్కడి నిర్ణయం చెల్లుబాటు కాదని చెప్పడంతో బాలు బాధపడతాడు. బాలు కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో శృతి బాధపడుతుండగా ఆమెను ఓదారుస్తాడు రవి. అసలు బాలు- శృతిల వల్ల మనశ్శాంతి లేకుండా పోతోందని, ఇంట్లో నుంచి వారిద్దరినీ పంపించేయాలని సత్యంతో చెబుతుంది ప్రభావతి. రోహిణికి పుస్తెల తాడు తిరిగి కొనిపెట్టాలని ప్రభావతి చెప్పగా.. అది ఆమె భర్త మనోజ్ బాధ్యత అంటాడు. ఇంట్లో జరిగిన దానికి మీనాపై నిందలు వేస్తుండటంతో ప్రభావతిపై సీరియస్ అవుతుంది శృతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ, 515వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 515 September 22nd 2025 here is full story

Photo Courtesy: JioHotstar

మీరు తాళిబొట్టు తీయించిన దగ్గరి నుంచి మీనా కూడా పసుపు తాడు వేయించుకుని తిరుగుతోందని ప్రభావతిపై మండిపడుతుంది శృతి. మీకు కోడలంటే రోహిణి ఒక్కటేనా? మీనా కాదా? అని ప్రశ్నిస్తుంది. మీనా గురించి నువ్వు నాతో ఎందుకు గొడవ పడుతున్నావ్? అని ప్రభావతి అడుగుతుంది. నిజంగా ఇంటి కోడలంటే ఎలా ఉండాలో మా ఇద్దరికీ అస్సలు తెలియదని మీనాకు మాత్రమే తెలుసు, బాలు సోఫాను వెనక్కి పంపడం తప్పే కావొచ్చు, కానీ దాని కోసం బంగారం తాకట్టుపెట్టి మరి మా అమ్మకి డబ్బులు ఇవ్వాలా? అని ప్రశ్నిస్తుంది శృతి. అలా ఇవ్వమని మా అమ్మ అడిగిందా? రోహిణిదే తప్పని అంటుంది.

మీ అమ్మగారు అడగలేదని, కానీ వస్తువు రిటర్న్ చేశాక డబ్బులు ఇవ్వకపోవడం తప్పు కదా, మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అని చెబుతుంది రోహిణి. నా లాగే రోహిణికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువని ప్రభావతి అనడంతో మరి రోహిణి వాళ్ల నాన్నగారు డబ్బులిస్తే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తుంది శృతి. ఈ విషయం ఇంతటితో వదిలేశాయ్, మనోజ్ ఎలాగైనా కొనిస్తాడన్న నమ్మకం నాకుందని అంటుంది రోహిణి. మీనాకు జలుబు చేయడంతో ఆసుపత్రికి వెళ్దామని అంటాడు బాలు.

రోహిణి గోల్డ్ చైన్ తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న ఆమె ఫ్రెండ్ మండిపడుతుంది. ఆ టైమ్‌లో నేను పుస్తెలతాడు తాకట్టు పెట్టకపోయుంటే శృతి వాళ్ల అమ్మ ముందు నా పరువు పోయేదని చెబుతుంది రోహిణి. నువ్విలా పసుపు తాడుతో మీ ఇంట్లో తిరుగుతుంటే మీ తోడి కోడలి ముందు విలువ ఉండదేమో అని అంటుంది రోహిణి స్నేహితురాలు. నేను పుస్తెలతాడు తీసివ్వడమే నాకు శ్రీరామరక్ష.. నేను చేసిన పని వల్ల మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడని, తను ఈ పసుపు తాడు చూసినప్పుడల్లా నేను చేసిన త్యాగం గుర్తొస్తుందని చెబుతుంది రోహిణి. ఇంట్లో ఏ సమస్య వచ్చినా తను నాకు సపోర్ట్‌గా ఉంటాడని అంటుంది. మీ అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకోవచ్చు కదా అని ఫ్రెండ్ అడగ్గా.. ఆవిడ దగ్గరి కంటే బయట వడ్డీకి తీసుకోవడం బెటర్ అని లేదంటే మా నాన్న గురించి అడిగి అడిగి చంపేస్తుందని చెబుతుంది రోహిణి. తాళిబొట్టు చూసినప్పుడల్లా నా మీద జాలి చూపిస్తుందని అంటుంది.

బాలు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి మీనా కుర్చీలో నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమెకు జ్వరం రావడంతో నేను వెళ్లి టాబ్లెట్ తీసుకొస్తానని, ఈలోపు నువ్వు మనోజ్ గాడి రూమ్‌లో పడుకోమని చెబుతాడు బాలు. మీనా నేను పడుకోనని చెప్పగా.. ఇది మన ఇల్లు, ఒంట్లో బాలేకపోతే ఎక్కడైనా పడుకోవచ్చని చెబుతాడు. ఇంతలో రోహిణి, మనోజ్‌లు ఫర్నిచర్ షాప్ నుంచి అలిసిపోయి ఇంటికి వస్తారు. గదిలో మీనా పడుకుని ఉండటం చూసిన మనోజ్ రగిలిపోతాడు. వెంటనే ప్రభావతిని పిలిచి ఎవరూ లేకపోతే.. ఎవరైనా ఎవరి బెడ్‌రూమ్‌లోనైనా పడుకోవచ్చా అని మండిపడతాడు మనోజ్. మీనా నా గదిలో పడుకుందా అదంత ధైర్యం చేయదు కదా అని అంటుంది ప్రభావతి. ఈ టైంకి మేం వస్తాం అని తెలుసు కదా? ఇప్పుడే వెళ్లి పడుకున్నట్లుగా ఉందని మండిపడుతుంది రోహిణి.

ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఈ టైంలో మీనా వెళ్లి రోహిణి వాళ్ల గదిలో పడుకుందని ప్రభావతి చెప్పడంతో అంతేనా అంటాడు సత్యం. ఈ ఇల్లు ఏమైనా లాడ్జా 24 గంటల్లో కొద్దిగంటలే పడుకోమనడానికి? ఇది అందరి ఇల్లు.. అయినా ఈ టైంలో మీనా అస్సలు పడుకోదు, ఆమెకు జలుబు బాగా చేసింది, నీరసంగా ఉంది, లేదంటే నువ్వు చేయించే చాకిరీ ఎక్కువైందేమో? అని అంటాడు సత్యం. లేదంటే ఏ రోజూ మీనా ఇంత త్వరగా పడుకోదని చెబుతాడు. నేను ఇంతకు ముందులా కాదు, బిజినెస్‌మెన్‌ని హాల్‌లో పడుకోలేను.. నా రూమ్ నాకు ఇప్పించండి అని అంటాడు మనోజ్. మేం రాకముందే మీనా పడుకుందంటే ఇది కావాలనే చేసినట్లుగా ఉందని అంటుంది రోహిణి.

సత్యం చెప్పినా వినిపించుకోకుండా మీనాను లేపుతుంది ప్రభావతి. ఈ రూమ్ నీ బాబు కట్టించాడా? అంటూ మండిపడుతుంది. ఒంట్లో బాలేదని అందుకే పడుకున్నానని మీనా చెప్పడంతో, నాకే కథలు చెబుతావా? మీకు రూమ్ ఇవ్వలేదని తెలిసి పెళ్లాం, మొగుడు కలిసి ముందే దూరిపోదామని అనుకున్నారని ఫైర్ అవుతుంది ప్రభావతి. అంత అలిసిపోవడానికి ఏం పనిచేశావ్? రూమ్‌లో పడుకుంటే జ్వరం తగ్గిపోతుందా? అని ప్రశ్నిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి చీకటి పడగానే వచ్చి పడుకుంటావా? మీ ఇంట్లో కూడా ఇలాగే సెపరేట్ గదిలో పడుకునే దానివా? అని మండిపడుతుంది. నీలాంటి పూలు అమ్ముకునే దానికి స్పెషల్ ఏసీ రూమ్ కావాలా? జనరల్ రూమ్ సరిపోదా? అని నిలదీస్తుంది.

నాది తప్పేనని మీనా క్షమాపణలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా రూమ్‌లో నుంచి ఈడ్చిపడేస్తుంది ప్రభావతి. ఇదంతా చూసిన బాలు కోపంతో ఊగిపోతాడు. ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఈ ఇంట్లో జనాలు రోజురోజుకు జంతువుల్లా మారిపోతున్నారని అంటాడు బాలు. నా భార్యకి జ్వరం వచ్చింది, నేనే మనోజ్‌గాడి గదిలో పడుకోమని చెప్పి టాబ్లెట్స్ తీసుకొద్దామని వెళ్లానని అంటాడు. నేను వచ్చే లోగా మీనాని, వాళ్ల కుటుంబం స్థాయిని ఎండగడుతోందని ఫైర్ అవుతాడు. తప్పయింది క్షమించమని మీనా బతిమలాడుతున్నా, చేయి పట్టుకుని ఈడ్చుకొచ్చిందని చెబుతాడు బాలు. నేను లేకపోయుంటే వీధిలోకి గెంటేసేదని చెప్పడంతో సత్యం కోపంతో రగిలపోతాడు.

నీదేం జన్మ, అసలు ఒక మనిషిలాగా ప్రవర్తించావా? ఒంట్లో బాలేదు కాబట్టే మీనా పడుకుని ఉంటుంది, లేపోద్దని చెప్పాను కదా అని ఫైర్ అవుతాడు. అయినా కోడల్ని గదిలో నుంచి బయటికి లాక్కెళ్తావా, కనీసం మానవత్వం కూడా లేదా అని మండిపడతాడు. ఇంతలో శృతి, రవిలు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. లోపల ఫైవ్ స్టార్ హోటల్ కట్టారు.. అందులో ఈ బిజినెస్‌మెన్, ఈ పార్లరమ్మ మాత్రమే ఉండాలట అని సెటైర్లు వేస్తాడు బాలు. రూమ్ కోసం మళ్లీ గొడవ పడుతున్నారా? అని శృతి అడగ్గా.. ఈ ఇంట్లో మీనాని అసలు మనిషిలాగే చూడటం లేదని అంటాడు బాలు. జ్వరం వచ్చిన మనిషిని గదిలో నుంచి ఈడ్చుకొచ్చేసిందని బాలు చెబుతాడు.

వీళ్లు మనోజ్ గదిలో పడుకోవాలనే జ్వరం అని నాటకాలు ఆడుతున్నారని ప్రభావతి అంటుంది. జ్వరం లేకపోతే మీనా ఈ టైంకి ఎందుకు పడుకుంటుంది? వాడెందుకు టాబ్లెట్స్ తీసుకొస్తాడని అడుగుతాడు సత్యం. మీనా వదిలేయమని చెబుతున్నా ప్రభావతి నానా రాద్ధాంతం చేస్తుంది. జ్వరం వచ్చిందని చెప్పాను, క్షమాపణలు చెప్పాను అయినా పశువులాగా ఈడ్చుకొచ్చారని మీనా బాధపడుతుంది. మీనాని ఇలాగే ఈడ్చుకొచ్చేసిందని మనోజ్‌ని లాక్కెళ్తాడు బాలు. నెక్ట్స్ వీక్ నీ రూమ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అర్ధమవుతుందని అంటుంది రోహిణి. అప్పుడు నీలాగా ఇంత సిల్లీగా ఎందుకు బిహేవ్ చేస్తానని ప్రశ్నిస్తుంది శృతి. ఆ వీక్ అంతా రవిని తీసుకుని మా పుట్టింటికి వెళ్లిపోతానని చెబుతుంది శృతి. నువ్వు, మీనా, రోహిణిలు ఒక గదిలో.. నేను, మనోజ్ ఒక గదిలో పడుకుంటామని సత్యం అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X