Gunde Ninda Gudi Gantalu September 25th: చింటూ కోసం మాటలు పడ్డ మీనా.. రోహిణి తల్లిని అవమానించిన ప్రభావతి

Photo Courtesy: JioHotstar

చింటూకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని రోహిణికి చెబుతుంది ఆమె తల్లి. ఆ వార్త వినగానే రోహిణి షాక్ అవుతుంది. చింటూ దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియక ఫర్నిచర్ షాపుకి పబ్లిసిటీ చేస్తానని హాస్పిటల్‌కి వెళ్తానని చెబుతుంది రోహిణి. ఆసుపత్రిలో చింటూకి ఆపరేషన్ చేసిన డాక్టర్.. బాబు బాగున్నాడని, ప్రమాదం తప్పిందని చెప్పడంతో బాలు, మీనా, రోహిణి తల్లి సంతోషిస్తారు. కొడుకు కోసం ఆసుపత్రికి వచ్చిన రోహిణి.. ముందు మేనేజర్‌ని కలిసి వాటర్ కెటిల్స్ పంచడానికి పర్మిషన్ తీసుకుంటుంది.

రోహిణి తల్లికి ధైర్యం చెప్పి బాలు, మీనాలు వస్తుండగా వారికి రోహిణి ఎదురవుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని రోహిణి అడగటంతో బిజినెస్‌కి ప్రచారం చేయడానికి వచ్చానని తప్పించుకుంటుంది. బెడ్‌పై కళ్లకు కట్టుతో, పడుకుని ఉన్న బిడ్డను చూసుకుని రోహిణి కంటతడి పెడుతుంది. నా ఆరోగ్యం బాగోడం లేదని నాకు ఏమైనా అయితే వీడు అన్యాయం అయిపోతాడని రోహిణితో తల్లి చెబుతుంది. త్వరలోనే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోహిణికి మళ్లీ బాలు, మీనాలు ఎదురవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 25వ తేదీ, 518వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 518 September 25th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

ఆసుపత్రి నుంచి బయటికి వస్తుండగా.. మీనా, బాలులు మళ్లీ రోహిణికి కనిపిస్తారు. లోపల బాబును చూశావా అని బాలు అడగ్గా.. చూశానని, బాబుకు బాగా గాయమైందని ఆ పెద్దావిడకి ధైర్యం చెప్పి వచ్చానని చెబుతుంది రోహిణి. పాపం ఆ బాబుకి అమ్మానాన్న ఎవరూ లేరట, ఎవరో మేనత్త ఉందని.. ఆ పెద్దావిడని, చిన్నబాబుని వదిలి దుబాయ్‌లో ఉంటుందట.. ఎవరైనా పెద్దవాళ్లని, పసివాళ్లని వదిలేసి ఉండగలరా, ఆవిడేం మనిషో అని బాలు అంటాడు. ఆవిడ ఆ మనోజ్‌గాడిలాగే తన స్వార్ధం తను చూసుకునే రకం అనుకుంటా అని నానామాటలు అంటాడు బాలు. మీరెందుకు ఇంకా వెళ్లలేదని రోహిణి అడుగుతుంది. ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకున్నామని చెబుతుంది మీనా.

మీనా జ్వరంతో ఉంది కదా? రెస్ట్ తీసుకోవాలి కదా? అని అంటుంది రోహిణి. వాళ్లకి ఏ దిక్కూ లేదు కదా? వాళ్ల అత్త నెంబర్ తీసుకుని కడిగిపారేస్తానని, అక్కడ బాగా సంపాదించి తన సుఖం తాను చూసుకుంటోందని బాధ్యతే లేదని మండిపడతాడు బాలు. అసలు నీకెందుకు? అని రోహిణి సీరియస్ అవ్వడంతో బాలు, మీనాలు షాక్ అవుతారు. ఆవిడ ఏ పరిస్ధితుల్లో ఉందో? అక్కడ సంపాదించి ఇక్కడికి పంపిస్తేనే కదా వీళ్లు బతికేది అని అంటుంది రోహిణి. ఇన్ని వివరాలు నీకెలా తెలుసు పార్లరమ్మ అని బాలు అడగ్గా.. ఇప్పుడే ఆవిడ చెప్పారని అంటుంది రోహిణి.

మీరు వెళ్లండి చాలా పనులు ఉంటాయని రోహిణి అనగా.. మాకేం పనులు ఉండవని మేం రోజూ కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లం, మీరు లక్షల్లో బిజినెస్‌లు చేస్తారు, గంట లేట్‌గా వెళ్లినా చాలా నష్టం వస్తుందని మీనా సెటైర్లు వేస్తుంది. బాబును చూడటానికి బాలు, మీనాలు వెళ్లగా.. మీరింకా వెళ్లలేదా అని రోహిణి తల్లి అడుగుతుంది. మా వదిన మీ దగ్గరికి వచ్చిందా? అని రోహిణి తల్లిని ప్రశ్నిస్తాడు బాలు. ఒకసారి మా అన్న మీద అలిగి ఎక్కడికో వెళ్లిపోతే నేను, మా వాడు వచ్చి వెతికాం కదా? ఆ తల్లే ఈ తల్లి అని చెబుతాడు బాలు. ఇంతలో బాబు స్పృహలోకి వచ్చి నాకేం కనిపించడం లేదని, అంతా చీకటిగా ఉందని చెప్పడంతో అందరూ బాధపడతారు.

నీ కంటికి దెబ్బ తగిలింది కదా? మందురాసి కట్టుకట్టారు.. రెండ్రోజుల్లో తీసేస్తారని చెబుతుంది రోహిణి తల్లి. నీకేం కాదని బాలు అనగా.. మీరు ఇక్కడే ఉండండి అంకుల్ అని పిల్లాడు అంటాడు. ఆ మాటలతో బాలు, మీనాలు ఎమోషనల్ అవుతారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఎలా ఉంది? అని అడుగుతాడు.. నొప్పిగా ఉందని, చీకటిగాద ఉందని చెప్పడంతో తగ్గిపోతుందని అంటారు డాక్టర్. ఇవాళే డిశ్చార్జ్ చేస్తామని అంటాడు. ఈ విషయాన్ని రోహిణికి చెబుతుంది ఆవిడ తల్లి. ఊరెళ్లిపోతానని, రెండ్రోజులు ఆగి మళ్లీ వస్తామని చెప్పడంతో రోహిణి వద్దని అంటుంది. కట్లు విప్పడానికి రెండ్రోజుల తర్వాత మళ్లీ రావాలి కాబట్టి.. ఇక్కడే ఉండిపోతామని బాలు, మీనాలకు చెబుతుంది రోహిణి తల్లి.

ఇక్కడ ఉండొద్దని పిల్లాడికి చాలా కష్టంగా ఉంటుందని, మా ఇంట్లో ఉండండి అని బాలు, మీనాలు చెబుతాడు. అంతమంది ఉండే ఆ ఇంటికి మేం అదనంగా వచ్చి ఉండటం పద్ధతి కాదని అంటుంది రోహిణి తల్లి. ఆమె ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా పిల్లాడిని వాళ్లింటికి తీసుకొస్తాడు బాలు. కొడుకుకు ఎలా ఉందోనని తల్లికి పదే పదే ఫోన్ చేసి కంగారు పడుతుంది రోహిణి. ఇంతలో మనోజ్ వచ్చి భోజనం చేద్దామని అడగ్గా.. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేయ్ అంటుంది. దాంతో మనోజ్‌పై రోహిణి విసుక్కుంటుంది. ఆ మాటలలతో మనోజ్ బాధపడతాడు.

వంట చేసిన ప్రభావతి.. అందరినీ భోజనానికి పిలుస్తుంది. దాంతో మా వల్ల కాదని అంతా భయపడతారు. వంట చేయాల్సి వస్తుందని పెళ్లాన్ని తీసుకుని బాలు ఆసుపత్రికి వెళ్లాడని ఇన్ని గంటలు అక్కడేం పని అని నిలదీస్తుంది ప్రభావతి. ఇంతలో మీనాతో పాటు రోహిణి తల్లి, చింటూలు లోపలికి రావడంతో అందరూ షాక్ అవుతారు. ఈవిడ మా చుట్టం కాదని, ఎవరో దారినిపోయే వాళ్లని ప్రభావతి అనడంతో రోహిణి తల్లి బాధపడుతుంది. ఇంతలో చింటూని తీసుకుని బాలు లోపలికి వస్తాడు. బాబును చూడగానే అందరూ బాధపడతారు. ఎల్లుండి వాడికి కట్లు విప్పుతారని, అప్పటి వరకు మనింట్లోనే ఉంటారని ఆయన తీసుకొచ్చారని చెబుతుంది మీనా.

నీకు, నీ మొగుడికే రూం లేక కొట్టుకు చస్తున్నారని, మీకు తోడుగా ఇంకో ఇద్దరినీ తీసుకొస్తావా? అని మండిపడుతుంది ప్రభావతి. ఆ మాటలతో సత్యం కోప్పడతాడు. నేను ఆసుపత్రిలోనే ఉంటానని చెప్పానని, కానీ బాలు మీనాలు వినకుండా తీసుకొచ్చారని, మేం వెళ్లిపోతామని అంటుంది రోహిణి తల్లి. వాళ్లు ఇక్కడే ఉంటారని బాలు తేల్చిచెబుతాడు. వాళ్లకి ఈ ఊరులో మనం తప్ప ఎవరూ లేరని అలా ఎలా వదిలేస్తామని అంటుంది. నీకు అంత జాలి దయ ఉంటే మీ పుట్టింటికి తీసుకెళ్లపోయావా అని ప్రభావతి అనగా.. మా అమ్మ అయితే ఇలా వచ్చిన వాళ్ల ముందు మాట్లాడేది కాదని అంటుంది మీనా.

ఆవిడను ఇక్కడే ఉంచుదామని మనోజ్ అనడంతో నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ రవి షాక్ అవుతాడు. వాళ్లింటికి వెళితే నన్ను చాలా బాగా చూసుకుందని చెబుతాడు మనోజ్. కావాలంటే వాళ్లిద్దరూ మా బెడ్‌రూంలో ఉంటారని రోహిణి అంటుంది. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. అయినప్పటికీ ప్రభావతి ఒప్పుకోకపోవడంతో నీ బట్టలు బయట పడేస్తాను, నీ దిక్కున్న చోట చెప్పుకోమ్మని వార్నింగ్ ఇస్తాడు సత్యం. నేను బాబుని చూసుకుంటానని మీరంతా వెళ్లి భోజనం చేయమని చెబుతుంది రోహిణి. ఎప్పుడూ లేనిది రోహిణి చాలా మంచిగా మాట్లాడేసరికి బాలు, రవిలకు డౌట్ వస్తుంది.

కొడుకుని చూసుకుని రోహిణి బాధపడుతుండగా.. ప్రభావతి వచ్చి పిల్లాడిపై బాలు, మీనాలపై మండిపడుతుంది. అసలు వీడి అమ్మ ఉందో, ఎవరితోనైనా వెళ్లిపోయిందో తెలియదని అనేసరికి రోహిణి బాధపడుతుంది. కూతురు చేసిన మోసాన్ని మోసుకుంటూ తిరుగుతోంది, ఏం బతుకో ఏంటో అని ప్రభావతి అనడంతో రోహిణి ఫైర్ అవుతుంది. వీళ్లని ఇంట్లో నుంచి తరిమేయడానికి నువ్వే మంచి ఐడియా ఇవ్వాలని అడుగుతుంది ప్రభావతి. మీనా పూలకొట్టు లేకుండా మంచి ఐడియా ఇచ్చావ్ కదా? అలాగే వీళ్లని కూడా పంపించేద్దామని చెబుతుంది ప్రభావతి. అత్తగారి మాటలతో రోహిణి బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X