Gunde Ninda Gudi Gantalu October 1st: ప్రభావతిపై రోహిణి ఆగ్రహం.. ఇంటిల్లిపాది షాక్..

Gunde Ninda Gudi Gantalu: రోహిణి నిజమైన తల్లి అని తెలుసుకుని చింటూ ఏడుస్తూ ఆమెను హత్తుకుంటాడు. రోహిణి పరిస్థితుల కారణంగా తనను ఇంట్లో "అమ్మ" అని పిలవొద్దని కోరుతుంది. దీంతో చింటూ బాధపడుతూనే అంగీకరిస్తాడు. ఇన్ని రోజుకు చింటూ ప్రశ్నలకు సమాధానం దొరికినందుకు సంతోషిస్తుంది సుగుణమ్మ. ఇంతలో బాలు ఇంటికి వస్తాడు. రోహిణి చింటూ కి బిర్యానీ తినిపించడంతో బాలు షాక్ అవుతాడు, పార్లరమ్మలో తొలిసారి తల్లిని చూశానని సెటైర్లు వేస్తాడు. చింటూ సంతోషంగా రోహిణితో గడుపుతాడు.

మీనా విద్యతో జరిగిన విషయాలను చర్చిస్తుంది. మీనా సహనం, క్షమా గుణం విద్యను ఇంప్రెస్ చేస్తుంది. మీనా చింటూ కి సర్ప్రైజ్ కళ్లజోడు ఇస్తుంది. రోహిణి చేతిలో ఉన్న గిన్నెతో అందరిని షాక్ కి గురి చేస్తుంది. అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో చింటూ, సుగుణమ్మ ఇంటి నుండి వెళ్తారు. ప్రభావతి వారిని మళ్లీ ఇంటికి రానివ్వకపోవడం వల్ల రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక అక్టోబర్ 1వ తేదీ, 522వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 522 Novermber 1st 2025 here is full story

చింటూని తీసుకొని వెళ్ళిపోతామని సుగుణ చెబుతుంది. అవసరంలేదు ఇంకో వారం రోజులు పాటు ఇంట్లోనే ఉండండి అని మీనా రిక్వెస్ట్ చేస్తుంది. ఈ విషయం నచ్చక రోహిణి టేబుల్ పై ఉన్న పాల గిన్నెను కింద పడేసి.. ఆ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అందరూ యాక్సిడెంటల్ గా పాలగిన్నె కిందపడిపోయిందనీ అందరూ భావిస్తారు. కానీ అసలు విషయాన్ని రవి గమనిస్తాడు. తర్వాత ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇందులోని రవి దగ్గరికి శృతి వచ్చి.. 'ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నా.. అసలు ఏం జరిగింది?' అని అడుగుతుంది. దీంతో అసలు విషయాన్ని బయట పెడతాడు. రోహిణి కావాలనే పాల గిన్నె పడేసిందని, ఆ విషయాన్ని తాను గమనించానని చెప్తాడు. చింటూ ఇంట్లో ఉండడం రోహిణికి నచ్చడం లేదని అంటాడు. దీంతో శృతి నేనే స్వయంగా వెళ్లి అడుగుతానని అంటుంది. రవి ఆపే ప్రయత్నం చేసిన శృతి మాత్రం వెళ్లిపోతుంది.

రోహిణి దగ్గరికి శృతి వెళ్లి చింటూ, వాళ్ళ అమ్మమ్మ నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? అని నేరుగా అడిగేస్తుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్ అంటుంది రోహిణీ. 'మీరు నువ్వు ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే నేనిలా అడగాల్సి వస్తుందనగా.. మనోజ్ పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అందుకే వారిపై అ ఇష్టంగా ఉన్నానని టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది రోహిణి. ఈ విషయాన్ని మీనాకు చెబుతానని అనడంతో ఒక రోజే కదా అడ్జస్ట్ అవుతాను అని చెబుతుంది రోహిణి. ఇంట్లో ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని తనలో తానుఅనుకుంటుంది. ఇంతలో బాలు వచ్చి, ఏంటి శృతి నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నారు? అయినా నీ ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. ఈమధ్య చింటూ పై అతిగా ప్రేమ చూపిస్తున్నవ్ ? వాడికి స్పెషల్ గా రూమ్ ఇచ్చావ్? పైగా వాడికి తినిపిస్తున్నావ్? ఏదో తేడాగా ఉంది అంటూ బాలు ఇన్ డైరెక్ట్ గా రోహిణికి పంచ్ వేసి వెళ్తాడు.

ఇక ప్రభావతి గుడి నుండి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వచ్చేసరికి చింటూ తన కుర్చీపై కూర్చోవడంతో ఎక్కలేని కోపం వస్తుంది. ఎవర్రా ఈ కుర్చీలో కూర్చొని అంటూ ఆ పిల్లవాడిని చెడమడ తిడుతుంది. ఇంతలోనే రోహిణి రావడంతో 'నువ్వు నాకు చెప్పింది ఏంటి? నువ్వు చేసేదేంటి? వీళ్లను ఇంట్లో నుండి పంపిస్తానని మమ్మల్ని బయటికి పంపించి, ఏం చేసావ్? ' అని ప్రశ్నిస్తుంది. బాలు రావడంతో తాను సైలెంట్ అయిపోయానని, మళ్లీ ఏదైనా గొడవ అవుతుందని చెబుతుంది. ప్రభావతి అక్కడితో ఆగకుండా.. రెచ్చిపోతుంది. 'అసలు వీడిని కాదు ఆ ముసలావిడను అనాలి' అంటూ సుగుణ పై ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసహ్యంగా నానా మాటలు అంటుంది. మరోవైపు మీనా అని పిలిచి, ఇంట్లోకి అడ్డమైన వారిని, దారిలో పోయిన వారిని ఇంట్లోకి తీసుకు వస్తున్నారని మండిబడుతుంది. ఒక చిన్న పిల్లవాడి పై ఇంతలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? అదే వాడికి తల్లి ఉంటే ఒక్క మాట కూడా అననిచ్చేది కాదని మీనా గట్టిగా బదిలిస్తుంది.

ఇందులోనే బాలు ఇంటికి చేరుకుంటాడు. ఏమైంది ప్రశ్నించగా. ఇంకోసారి తన పర్మిషన్ లేకుండా ఇంటికి ఎవరు తీసుకురావద్దని, ఆ చిన్న పిల్లవాడు తనకి ఎదురు సమాధానం చెబుతున్నాడని, అయినా బామ్మ దగ్గర పెరిగిన వాళ్ళు అంతా ఇలానే వ్యవహరిస్తారంటే ఇన్ డైరెక్ట్ గా బాలుని టార్గెట్ చేస్తుంది. దీంతో బాలు ఆగ్రహానికి లోనవుతాడు. 'నీ దగ్గర పెరిగిన వాళ్ళు ఒకడు లక్షల తీసుకుని ఇంట్లో నుండి పారిపోయాడు. మరొకడు లేచిపోయాడు. ఇది నీ పెంపకం' అంటూ తల్లికి ఎదురు చెప్తాడు బాలు. ఆ మాటలకు మనోజ్ కోప్పడతాడు మధ్యలో అనవసరంగా తనని తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తాడు.

గొడవ పెద్దవి కావడంతో సుగుణ రియాక్ట్ అవుతుంది. తాను ఇంట్లో ఉండి వెళ్ళిపోతామని, తన వల్ల గొడవలు కావడం ఇష్టం లేదని అంటుంది. దీంతో మీనా మా ఇంట్లో ఇలాంటి గొడవలు సహజమే మీరు వాటిని పట్టించుకోకుండా ఇంట్లోకి రండి అని పిలుస్తుంది. ఇక బాలు చింటూని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు కూడా కిందనే పడుకోవాలా?' అని మనోజ్ ఫీలవుతాడు. ఆ విషయాన్ని 'మీ పెళ్ళాన్ని అడుగురా?'అని ప్రభావతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి ఈ రోజుని ఇలా చేస్తున్నావ్.. ఈరోజు కూడా కిందనే పడుకోవాలా అని ప్రశ్నిస్తాడు. పార్కులో పడుకున్న రోజులు మరిచిపోయావా అంటూ రోహిణి కూడా వెళ్ళిపోతుంది.

మరోవైపు రోహిణి ప్రవర్తనపై బాలుకి అనుమానం వస్తుంది. చింటూపై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంది. ఈ విషయాలను బట్టి రోహిణి తల్లి కావాలని భావిస్తున్నట్లు తనకు అర్థమైందని బాలు ఉంటాడు. అయితే ఈ విషయాన్ని మనోజ్ చాటుగా ఉంటాడు. ఇక రోహిణి దగ్గరికి రాగానే.. నువ్వు ఎందుకు చింటూ ప్రేమగా ఉంటున్నావు తనకు అర్థమైందని, బాలు అర్థం చేసుకున్న విధంగా కూడా తాను అర్థం చేసుకోలేదని అంటాడు. 'ఇంతకీ బాలు ఏమన్నాడు? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావ్?' అని ప్రశ్నిస్తుంది రోహిణి. నువ్వు తల్లి కావాలని ఉంది కదని అనడంతో.. రోహిణికి ఎక్కలేని కోపం వస్తుంది. ముందు బిజినెస్ ఎలా డెవలప్ కావాలో అది ఆలోచించు అప్పుడే పిల్లలు అని మనోజ్ నోరు మూపిస్తుంది.

మరుసటి రోజు ఉదయం తామ వెళ్లిపోతున్నామని సుగుణమ్మ చెబుతోంది. మరోసారి ఇంటికి రా వద్దని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. అంతటితో ఆగకుండా అసలు వాడి పుట్టుక ఏంటో? వాడి తల్లి ఎలాంటిదో? అని ఇష్టం వచ్చినట్లు ప్రభావతి మాట్లాడుతుంది. దీంతో ఆగ్రహానికి లోనైనా రోహిణి మరోసారి ఇలా మాట్లాడవద్దని ప్రభావతిపై గట్టిగా అరుస్తోంది. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. 'నువ్వే కదా మమ్ములను ఇంట్లో నుండి పంపించి, వాళ్లను వెళ్లగొడుతానని అన్నావ్? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దీంతో బాలు షాక్ అవుతాడు. ఇప్పుడు రోహిణి అసలు నిజ స్వరూపం బయటపడింది. చింటూకు తినిపించడం వాడితో ప్రేమగా ఉండడం ఇదంతా నాటకమా ? అంటూ రోహిణి నిలదీస్తాడు బాలు. దీంతో ఈ సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X