Gunde Ninda Gudi Gantalu october 2nd: చింటూ నోటి నుంచి బయటపడిన నిజం… రోహిణి రహస్యం బయటపడిందా ?
courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి ఇంట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో సుగుణమ్మ చింటూని తీసుకెళ్తానని చెబుతుంది. కానీ మీనా మరో వారం రోజులు పాటు ఇంట్లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ విషయం నచ్చక రోహిణి టేబుల్‌పై ఉన్న పాలగిన్నెను కావాలనే కింద పడేసి టాపిక్ మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అందరూ అది యాక్సిడెంట్ అనుకుంటారు కానీ రవి మాత్రం నిజం గమనించి శృతికి చెబుతాడు. శృతి రోహిణిని నేరుగా ప్రశ్నించగా, రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే విషయం బాలు గమనించి రోహిణిపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇక ప్రభావతి ఇంటికి వచ్చి చింటూ కుర్చీలో కూర్చోవడంతో మండిపడుతుంది. అంతటితో ఆగకుండా సుగుణమ్మ, మీనాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతలో బాలు చేరి ప్రభావతితో వాగ్వాదం చేస్తాడు.
సుగుణమ్మ గొడవలు మానుకోవాలని అనుకుంటే మీనా మళ్లీ ఉండమని ఒప్పిస్తుంది. కానీ బాలు మాత్రం రోహిణి ప్రవర్తనపై తీవ్ర అనుమానంతో ఉంటాడు. రోహిణి చింటూపై చూపిస్తున్న ప్రత్యేకమైన ప్రేమను బాలు గమనించి, తల్లి కావాలనే ఆలోచనతో ఉందని అనుకుంటాడు. ఇదే విషయాన్ని మనోజ్‌కి అడగ్గా, అతను బిజినెస్‌పై దృష్టి పెట్టమని రోహిణి ఆపేస్తుంది. మరుసటి రోజు సుగుణమ్మ వెళ్లిపోతామని చెబుతుండగా ప్రభావతి మరోసారి చింటూ పుట్టుకపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది. దాంతో రోహిణి సహనం కోల్పోయి గట్టిగా అరుస్తుంది. ఈ సంఘటనతో బాలు షాక్ అవుతాడు. రోహిణి నిజ స్వరూపం బయటపడుతుందని గ్రహించి నిలదీస్తాడు. చింటూపై ప్రేమ, ఆప్యాయత అన్నీ నాటకమేనా? అని ప్రశ్నిస్తాడు. దీంతో సీరియల్ క్లైమాక్స్ చేరుకుంటుంది. ఇక అక్టోబర్ 2 వ తేదీ, 523వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

courtesy: jiohotstar
రోహిణి ప్లాన్ గురించి ప్రభావతి బయట పెట్టగానే ఇదంతా నాటకమా పార్లరమ్మ అంటూ అందరి ముందు నిలదీస్తాడు బాలు. ఇలా ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది. 'వారిని బయటికి పంపించాలని ప్రయత్నించడానికి కారణం మీ అమ్మనే.. ఆమె పోరు భరించలేకనే వారిని బయటికి పంపిస్తానని హామీ ఇచ్చా' అంటూ అసలు విషయాన్ని బయట పెడుతుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. 'నావల్ల మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు. మరోసారి బలవంతం చేసి నన్ను మీ ఇంటికి తీసుకురావద్దు' అని బాలుని ప్రాధేయపడుతుంది సుగుణమ్మ. ఇక హాస్పిటల్ కి బయలుదేరుతున్నామని మరోసారి ఇంటికి రాను ఇన్ డైరెక్ట్ గా ప్రభావతి చెబుతుంది సుగుణ. ఈ సమయంలో చింటూ ఒక్కసారిగా అమ్మ అని పిలుస్తాడు. దీంతో రోహిణి కంగారుపడుతుంది.
ఆ విషయాన్ని బాలు గమనించి, ఎవరిని అమ్మఅని పిలిచావని చింటూని అడుగుతాడు. ఎక్కడ అసలు విషయాన్ని బయట పెడుతుందోనని రోహిణి కంగారుపడుతుంది. 'లేదు బాబు.. వాడికి నొప్పి అనిపించినప్పుడల్లా వాడు అమ్మ'అని అంటున్నాడని కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది సుగుణమ్మ. కన్న కొడుకు బాధపడుతుంటే రోహిణి తన మనసులో తీవ్ర ఆవేదన చెందుతుంది. కాసింత ఎమోషనల్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రభావతి గమనించి, 'ఏంటమ్మా వాళ్ల కోసం నువ్వు ఏడుస్తున్నావ్ ఏంటి?' అని ప్రశ్నిస్తుంది. 'అదేం లేదు.. కంట్లో దుమ్ము పడింది' అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ కి ఎలా వెళ్లాలని రోహిణి తన రూమ్ లోకి వచ్చాను ఆలోచిస్తుంది.
ఇంతలో మనోజ్ వచ్చి.. వాళ్లు ఉన్నంత సేపు తనకు చాలా కంపరంగా ఉండేదని ఇప్పుడు తనకు హ్యాపీగా అనిపిస్తుందని అంటాడు. అంతేకాకుండా సుగుణమ్మ గురించి ఇష్టవచ్చినట్టు మాట్లాడుతాడు. అలాంటి వారికి క్యారెక్టర్ లేదని, ఫ్రీగా వస్తే ఇక్కడనే లైఫ్ లాంగ్ ఇక్కడనే ఉండిపోయేలా ఉన్నారని, నానా మాటలు అంటాడు దీంతో రోహిణికి ఎక్కలేని కోపం వస్తుంది. 'మనుషులను చిన్నచూపు చూడడం నీకు అలవాటు ఎవరితో ఎలా ఉండాలో నీకు తెలియదు' అంటూ మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో మనోజ్ కూడా షాక్ అవుతాడు. 'వారిని అంటే మీ వాళ్లను అన్నట్లు ఫీల్ అవుతున్నావు ఏంటి? 'అని ప్రశ్నిస్తాడు. సర్లే గాని షాప్ కి వెళ్దాం అని పిలుస్తాడు. 'నా మూడు ఏం బాలేదు నేను రాను' అంటూ అక్కడి నుండి రోహిణి వెళ్ళిపోతుంది.
మరోవైపు చింటూకు విప్పడానికి హాస్పిటల్ కు తీసుకెళ్తారు. తనకట్లు విప్పగానే మొదట అమ్మను చూడాలని మారం చేస్తాడు. ఇందులోనే రోహిణి అక్కడి చేరుకుంటుంది. ఇలా కట్లు విప్పగానే మొదట తన తల్లి రోహిణి చూస్తాడు చింటూ. అమ్మ అని పిలవగానే.. రోహిణి కూడా ఎమోషనల్ అయ్యి, ముద్దు చేస్తూ.. తన కొడుకుని గుండెలకు హత్తుకుంటుంది. 'ఎందుకు నువ్వే నా అమ్మ అని చెప్పలేదు అని తన తల్లిని అడుగుతాడు'చింటూ. 'తన పరిస్థితి బాగోలేదని అందుకే ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు'అని రోహిణి ఏడుస్తుంది. అమ్మతోనే ఉంటాను అని చింటూ మారం చేస్తాడు. ఇప్పుడు కాదు తర్వాత తీసుకవెళ్లానని చింటూ కి హామీ ఇస్తుంది రోహిణి. అటుగా మీనా బాలు రావడానికి గమనించి వాళ్ళ ముందు తనని అమ్మ అని పిలవకూడదని చింటూకి చెబుతుంది.
బాలు వచ్చి నువ్వు వచ్చావ్ ఏంటి పార్లరమ్మ అని అడుగుతాడు. వాళ్లు బ్యాక్ మర్చిపోయారని ఆ బ్యాగు ఇవ్వడానికి ఇటుగా వచ్చానని కవరింగ్ చేస్తుంది. చింటూ మీకు చాలా దగ్గర అయినట్టున్నారు. అందుకే అమ్మ అని పిలుస్తున్నాడు గా అని మీనా అంటుంది. మరోవైపు బాలు.. 'నువ్వు అచ్చు వాడి అమ్మ లాగా ఉన్నావు'అంటాడు. 'ఏంటి నేను వాడి అమ్మ లాగా ఉండడం ఏంటి?' అని రోహిణి కంగారుపడుతుంది. 'అదే ఉన్నన్ని రోజులు వాడిని అమ్మలాగా చూసుకున్నావు కదా.. అందుకే వాడు నీకు చాలా దగ్గర అయ్యాడు. కానీ మా అమ్మ ప్రభావతితో కలిసి వాడిని పంపించాలని ప్రయత్నించావు కదా'అని రోహిణికి బాలు షాక్ ఇస్తాడు. బాలు మీనాలు బిల్లు కట్టడానికి వెళ్ళగా.. తనతో రమ్మని చింటూ మారం చేస్తాడు. తాను బర్త్డే నాడు కేకు బట్టలు తీసుకొని వస్తానని రోహిణి చింటూ కి మాట ఇస్తుంది.
ఇక మరోవైపు ఇంటికి రాగానే సత్యం తన ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్లడానికి రెడీ అవుతాడు. ఏంటి నాన్న పెళ్ళికొడుకులా రెడీ అయ్యావ్ అని బాలు అనగానే.. 'నా పెళ్లి రా' అని సత్యం సెటైరికల్ గా మాట్లాడుతాడు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొత్త పిన్నిని త్వరగా తీసుకురా అంటూ సరదాగా ఆట పట్టిస్తాడు. దీంతో ప్రభావతికి మండుతుంది. కాసేపు సరదా సరదాగా సీరియల్ సాగుతుంది. ఇంతలోనే బాలు చిన్ననాటి ఫ్రెండ్ రాజశేఖర్ ఇంటికి చేరుకుంటాడు. తన అన్నయ్య పెళ్లి ఉందని పెళ్లి కార్డు ఇవ్వడానికి ఇలా సడన్ గా వచ్చానని చెబుతాడు. ఈ సమయంలో బాలు మాట్లాడుతూ అన్నయ్య పెళ్లి ఎప్పుడు తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండాలనీ, వాళ్లు లేచిపోతే మనల్ని బలి చేస్తారని, అప్పుడు జీవితాంతం బాధపడాలి అంటూ సరదాగా మాట్లాడుతాడు. వాస్తవానికి బాలు సరదాగా మాట్లాడిన మీనా మాత్రం బాధపడుతుంది. ఆ మాటలు మీనా మనసును గాయపరుస్తాయి.


Click it and Unblock the Notifications











