Gunde Ninda Gudi Gantalu October 20th Episode: సత్యం కొత్త రూమ్ ప్లాన్.. మీనా మాస్ కౌంటర్‌తో ప్రభావతి షాక్!
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో బెడ్‌రూమ్ విషయంలో మరోసారి పెద్ద వివాదం చెలరేగింది. కొడుకులు తమ భార్యలను ఎత్తుకుని తిరుగుతుండటంపై ప్రభావతి అసహనం వ్యక్తం చేస్తూ, "ఇలాంటివి ఉంటే బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి" అంటూ వ్యంగ్యంగా స్పందించింది. దానికి శృతి "ఆ బెడ్‌రూమ్ అగ్గిపెట్టెలా ఉంది" అని వెటకారంగా, మీనా "మాకు రూమ్ కూడా లేదు కదా?" అంటూ సూటిగా సమాధానం ఇచ్చింది. ఈ మాటల యుద్ధంలో రోహిణి అగ్గిరాజేసినట్టు "శృతి తన పుట్టింటికి వెళ్తానంది కదా" అని చెప్పడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో ఎక్కడ తన రూమ్ ఇవ్వాల్సివస్తుందోనని మనోజ్ అహంకారంగా "నేను బిజినెస్‌మాన్‌ని, నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. మీలా డ్రైవర్, కూక్ ను కాదు" అని తమ్ములను తక్కువగా చూసాడు.
దానికి శృతి ఘాటుగా "నీలాగా గుడి ముందు మా ఆయన అడుక్కోవడం లేదండి!" అని కౌంటర్ ఇచ్చింది. ఇక సత్యం ఫ్యామిలీ మీటింగ్ పెట్టి, ఇంటి ఖర్చులకు అందరూ సహకరించాలంటూ నిర్ణయించగా, కొత్త వివాదం మొదలైంది. మనోజ్ మొదట 2000 ఇస్తానని చెప్పగా, చివరకు 8000కి పెంచాడు. బాలు, రవి చెరో 10,000 ఇవ్వాలని నిర్ణయించగా, మీనా కూరగాయల కోసం అదనంగా 2000 ఎక్స్ట్రా చెబడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కిచెన్‌లో రోహిణి, శృతి, మీనా మధ్య మాటల తూటాలు సాగాయి. "గుడ్డు పెట్టే కోడి లేని నొప్పి, ఆమ్లెట్ తినేవాళ్లకు ఎందుకో?" అంటూ మీనా ఇచ్చిన కౌంటర్ హైలైట్‌గా నిలిచింది. చివర్లో ప్రభావతి మీద మీనా వేసిన మాట "మీ దయదక్షిణానే మేము బతుకుతున్నామా?" అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక సోమవారం (అక్టోబర్ 20 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

courtesy: Jiohotstar
దీపావళి పండుగ సమీపిస్తోందన్న ఆనందం ప్రభావతి ఇంట్లో ఉన్న అందరి ముఖాల్లో కనిపిస్తోంది. కానీ ఆ ఆనందం వెనుక మరోసారి చీకటి మేఘాలు కమ్ముకొస్తాయి. ఎప్పట్లానే చిన్న చిన్న మాటలతో మొదలైన గొడవలు పెద్దవిగా మారి, ప్రభావతి కుటుంబం అంతా విభేదాలలో ఇరుక్కుపోతుంది. ప్రభావతి మీనాపై చురకలు విసురుతుండగా ఆ దృశ్యాన్ని గమనించిన సత్యం "శభాష్" అని మెచ్చుకుంటాడు. "నీ అత్తయ్యకి ఇలా ట్రీట్ చెయ్యకపోతే నెత్తినెక్కి కూర్చుంటుంది" అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. దీంతో ప్రభావతి చిరాకుతో మండిపడుతుంది. "నేను ఈ దీపావళికి ఇద్దరు కోడలతో లక్ష్మీ పూజలు చేయాలని భావిస్తున్నా " అంటుంది.
ఇది విన్న సత్యం వెంటనే ఆగ్రహంతో "1, 2, 3 లు మర్చిపోయావా? మన ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి లాగా ముగ్గురు దేవతలు మన ఇంటికి అల్లుకుపోయారు. ఇద్దరే అంటావు ఏంటి?" అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి వ్యంగ్యంగా, "ఈవిడ పూజ చేస్తే తప్ప లక్ష్మీదేవి మన ఇంటికి రానా?"అని మీనాపై వ్యంగ్యంగా మాట్లాడుతుంది. వెంటనే బాలు స్పందిస్తూ, "నీ పెళ్లయినప్పటి నుండి నువ్వే పూజ చేస్తున్నావ్. ఎక్కడ సంసారం ఉంది చెప్పు?" అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇస్తాడు.
ఇలా మాటల యుద్ధం సాగుతుండగా సత్యం మధ్యలో జోక్యం చేసుకుంటూ, "ఈసారి దీపావళిని ముగ్గురు కోడలు, ముగ్గురు కొడుకులతో కలిసి సంతోషంగా జరుపుకుందాం" అని చెబుతాడు. అప్పుడు మీనా చురుకుగా స్పందిస్తూ, "ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలే కాదు. మీకు కూతురు అల్లుడు కూడా ఉన్నారు" అని గుర్తు చేస్తుంది. దాంతో ప్రభావతి వెంటనే తన కూతురు మౌనికకు ఫోన్ చేసి, "పండుగకి రా బంగారం" అని చెబుతుంది. కానీ మౌనిక నెమ్మదిగా "అమ్మా, రాము కాదు సంజీవ్‌కి ముంబైలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్‌కి నేనూ వెళ్ళాలి. లేకపోతే కోటి రూపాయల నష్టం వస్తుంది" అంటుంది. దీంతో ప్రభావతి "వామ్మో! కోటి రూపాయల నష్టమా? అప్పుడు వద్దులే" అని వెనక్కి తగ్గిపోతుంది.
ఇక మరుసటి రోజు సత్యం బిల్డర్స్‌ని ఇంటికి పిలిపించి కొత్త రూమ్ కోసం కొలతలు వేయిస్తాడు. బిల్డర్ "ఐదు లక్షల రూపాయలు అయితే ఈ రూమ్ రెడీ అవుతుంది" అని చెబుతాడు. ఈ మాట విన్న ఇంట్లో ఉన్న వారందరూ షాక్ అవుతారు. ప్రభావతి కోపంగా, "ఐదు లక్షలు ఎక్కడి నుండి వస్తాయి?" అని అడుగుతుంది. అప్పుడు సత్యం, "ఇంటిపై లోన్ తీసుకుందాం. మీరు అందరూ మీ మీ డబ్బుల నుండి ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది" అని చెప్పేస్తాడు. ప్రభావతికి ఇది అస్సలు నచ్చదు. "నేను నా ఇంటిని ఎవరి కోసం తాకట్టు పెట్టను. అనవసరమైన పనుల కోసం అప్పు తీసుకోవడం నాకిష్టం లేదు" అంటూ కరాకండిగా చెబుతుంది.
బాలు బాధతో "ఎన్ని రోజులు రూమ్ లేకుండా ఉన్నాను, ఇక కూడా మూలన సర్దుకుంటాను. రూమ్ వద్దు" అని చెప్పేస్తాడు.
ఇంతలో ప్రభావతి మరోసారి ఘాటుగా "పైన ఓ గుడిసె వేస్తే చాలు, మీరు అంతవరకు గుడిసెలోనే ఉన్నారు కదా" అంటూ బాలను అవమానిస్తుంది. దీనిపై శృతి రియాక్ట్ అవుతూ, "మీరు అందరి కొడుకులను ఒకేలా చూడాలి. బాలను ఎందుకు తక్కువగా చూస్తున్నారు?" అని ప్రశ్నిస్తుంది. దాంతో సత్యం, "గుడిసె కదా ఖచ్చితంగా కట్టిస్తా కానీ బాలు కోసం కాదు, మన అందరి కోసం. ఇకముందు మనం గుడిసెలోనే ఉంటాం" అని చెప్పేస్తాడు.
ఈ మాటలు విన్న ప్రభావతి తట్టుకోలేక "మా నాన్న కట్టించిన ఈ ఇంటిని తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు. గుడిసెలో నుండి వచ్చినవాళ్లు ఎప్పటికీ గుడిసెలానే ఉంటారు" అంటూ మీనాను అవమానిస్తుంది. దీనిపై మీనా తీవ్రంగా స్పందిస్తూ, "ఎవరు గుడిసెలో ఉన్నారు? చిన్న ఇల్లు అయినా మన కష్టం మీద గడిపాం. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారా? మా ఇంట్లో అందరం సమానంగా జీవించాం. మీరు ఒక్క కొడుకును డబ్బు సంచిలో నుండి, ఇంకొక కొడుకును గర్భసంచిలో నుండి కన్నారా?" అంటూ ఘాటుగా అడుగుతుంది. ప్రభావతి ఆగ్రహంతో "డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మనోజ్‌కి, డ్రైవర్‌గా ఉన్న నీ భర్తకి తేడా లేదా?" అంటుంది.
వెంటనే మీనా ఘాటుగా "మీ భర్త కూడా డ్రైవర్‌నే కదా! మీరు మర్చిపోయారు. మామయ్య సంపాదన మీద ఈ ఇల్లు నడిచింది. నేను నా భర్త డ్రైవర్ అని గర్వంగా చెబుతాను. నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను" అంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఈ మాటలతో ఇంట్లో గట్టి ఉద్రిక్తత నెలకొంటుంది. ప్రభావతి కోపంతో, "ఇంత పొగరుబోతుగా మాట్లాడే దానికోసం రూమ్ కడతారా? నేనైతే చచ్చిన ఒప్పుకోను" అంటుంది. బాలు నిరాశగా "ఏ మూలనైనా ఉంటాను. రూమ్ అవసరం లేదు" అంటూ వెళ్ళిపోతాడు.
తరువాత రోజు ఉదయం పండుగ హడావిడి మొదలవుతుంది. మీనా ఇంటి ముందు అందంగా ముగ్గులు వేస్తుంటుంది. ప్రభావతి "ముగ్గులు వేసింది చాలు, లోపలికి వచ్చి పిండివంటలు చేయి" అంటూ ఆర్డర్ వేస్తుంది. మీనా "ఎన్ని రోజులు మీరు చేసారు? ఇప్పుడు మేము చేస్తే తప్పా?" అని ప్రశ్నిస్తుంది. సైలెంట్‌గా వెళ్ళిపోతుంది ప్రభావతి - ఎందుకంటే గట్టిగా మాట్లాడితే పని తనపై పడుతుందని అర్థం అవుతుంది.
ఇక బాలు పండుగ కోసం టపాసులు తెచ్చేస్తాడు. సత్యం అందరికీ కొత్త బట్టలు కొనిపెడతాడు. ముగ్గురు కోడెలకు సమానంగా చీరలు ఇస్తాడు. కానీ రోహిణి మాత్రం అసూయతో, "మామయ్యా, అందరికీ ఒకే రేటు పెట్టి తీసుకువచ్చారా? దాని ముఖానికి ఇంత ఖరీదైన చీర ఎప్పుడైనా కట్టిందా?" అని అగ్గి రాజేస్తుంది. ప్రభావతి కూడా మద్దతుగా "అందరికీ ఒకేలా ఎందుకు?" అంటుంది. అప్పుడు సత్యం తట్టుకోలేక "ముగ్గురు కోడలు సమానమే . ఎవరికీ తారతమ్యం ఉండదు" అని స్పష్టంగా చెబుతాడు. ఈ మాటలతో ప్రభావతి నోరు మూసుకుని పోతుంది. అంతిమంగా అందరూ కొత్త బట్టలు వేసుకొని, పండుగ పూట పటాసులు పేలుస్తూ ఆనందంగా దీపావళి జరుపుకుంటారు. కానీ ఆ సంతోషం వెనక ప్రతీ ఒక్కరి మనసులో గాయాలు మాత్రం మిగిలి ఉంటాయి.


Click it and Unblock the Notifications











