Gunde Ninda Gudi Gantalu November 5th Episode: మోసాన్ని పసిగట్టిన బాలు.. ప్రభావతి బాగోతాన్ని బట్టబయలు..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్‌లో బాలు తన నాన్నమ్మ సుశీల పుట్టినరోజును గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయిస్తాడు. గోల్డ్ చైన్ బహుమతిగా ఇవ్వాలని భావిస్తాడు కానీ డబ్బుల కోసం ప్రయత్నించి విఫలమవుతాడు. అప్పుడు మీనా తన అమ్మగారి దగ్గర ఉన్న నగలను తాకట్టుపెట్టమని సూచిస్తుంది. బాలు తండ్రి సత్యం ద్వారా ఆ నగలను తీసుకురావాలనుకుంటాడు. కానీ ఈ విషయం మనోజ్ దొంగ చాటున వెంటాడు. అతను వెంటనే ప్రభావతికి చెబుతాడు. ప్రభావతికి షాక్ అవుతుంది ఎందుకంటే ఆ నగలను మనోజ్ ఇప్పటికే అమ్మేశాడు. తాకట్టు పెట్టమన్నప్పుడు అమ్మేస్తే నాలుగు లక్షలు వస్తాయని చెప్పి ఆ నగలను అమ్మేశానని మనోజ్ నిజం చెబుతాడు.

ప్రభావతి ఆగ్రహంతో మనోజ్‌ను తిడుతుంది. కానీ, వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. మనోజ్ దగ్గర ఉన్న నగల ఫోటో ఆధారంగా కవరింగ్ నగలు చేయించి అసలు నగల స్థానంలో పెట్టాలని నిర్ణయిస్తుంది. వీరి కుట్రకు మీనాక్షి సాక్షిగా ఉండి "ఒకరోజు వీరి బాగోతం బయటపడుతుంది" అని మనసులో అనుకుంటుంది. మరోవైపు భోజనం సమయంలో బాలు తన ప్లేట్‌లో వెంట్రుక కనిపించడంతో "ఇంటికి కష్టాలు వస్తున్నాయేమో" అని అనుమానం వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో మనోజ్, ప్రభావతి నకిలీ నగలతో ఇంటికి చేరుతారు. ఇలా వారి చేతులు కొత్త సమస్యలకు దారి తీస్తాయి. ఇక బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 547 November 5th 2025 here is full story
Courtesy: Jiohotstar

ఇక ఎపిసోడ్ ప్రారంభంలో ప్రభావతి, మనోజ్ లు ఇద్దరు కలిసి ఇంటికి రావడంతో 'చెడు కీడు కలిసి వచ్చాయి' అంటూ సెటైర్ వేస్తాడు. ఈ క్రమంలో సత్యం ఎటు వెళ్లారని వారిని ప్రశ్నిస్తాడు. 'అవును ఇద్దరూ ఒకేసారి వస్తున్నారు కలిసి వెళ్లారా?' అని రోహిణి అడగగా.. తాను డీలర్లను కలిసి వస్తున్నాననీ,, అమ్మ బయటే ఉంది అలా ఇద్దరం కలిసి వచ్చామని మనోజ్ అంటాడు. 'సర్లే గాని నిన్ను ఒక మాట అడగాలి.. మీనా బంగారం ఎక్కడ ? 'అని సత్యం అడుగుతాడు. దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. 'ఇప్పుడు ఆ నగలు ఎందుకు?' అని ఆరా తీస్తుంది. 'ఆయన వాళ్ల నగలు వాళ్లకు ఇవ్వడానికి నీకేం అభ్యంతరం ? 'అని సత్యం అడుగుతాడు. 'లేదు వేసుకోవాలని తిరిగి చేసింది కదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది' అని ప్రభావతి వ్యంగంగా మాట్లాడుతుంది.

దీంతో మీనా 'నా ముఖం పెట్టుకొని అడుగుతున్న ఆ నగలు ఇవ్వండి' అని అంటుంది. ఇంతలో మనోజ్ కలగజేసుకుని 'అయినా బాలు చేయించినప్పుడే వేసుకుంటా అన్నావు కదా.. మళ్లీ ఎందుకు అడుగుతున్నావు?' అంటూ ఆ టాపిక్ లోకి ఎంటర్ అవుతాడు. దీంతో పక్కనే ఉన్న శృతికి కోపం వస్తుంది. 'మీనా నగలు మీనాకు ఇవ్వకుండా.. మధ్యలో మీ అభ్యంతరం ఏంటి ?'అని సూటిగా ప్రశ్నిస్తుంది. బాలు కూడా కరెక్ట్ గా అడిగావ్ డబ్బుడమ్మ అంటాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు నగల గురించి ప్రశ్నిస్తారు. ఇక వారి నుండి టాపిక్ డైవర్ట్ చేయలేక.. నగలు తన దగ్గరనే ఉన్నాయని తీసుకువచ్చి ఇస్తానని చెబుతుంది. బయటకు గంభీరంగా మాట్లాడుతున్న లోపల మాత్రం ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది.

మనోజ్ కూడా తన బాగోతం ఇక్కడ బయటపడుతున్నానని కంగారు పడతాడు. ఈ విషయాన్ని బాలు మీనాలు గమనిస్తూనే ఉంటారు. బాలు తనకు ఏదో తేడా కొడుతుందనీ అని అంటాడు. ప్రభావతి టెన్షన్ పడుతూనే బంగారం తీసుకువచ్చి ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో అని తన మనసులో ఆందోళన చెందుతుంది. ఆ నగలను మీనా తీసుకుని పరిశీలిస్తుంది . ఇప్పుడే కొన్నట్లు ఉన్నాయి అని అనుమానం వ్యక్తం చేస్తుంది.

బాలు కూడా 'అవునే తలదళ మెరుస్తున్నాయి' అంటాడు. 'మీనా ఇచ్చినప్పుడు వాటిని క్లీన్ చేసి పెట్టానని అందుకే అలా మీరు వస్తున్నాయని కవరింగ్ చేస్తోంది ప్రభావతి. అలా ఆ నగలను తీసుకొని బాలు మీనా లు నగల షాప్ కి వెళ్తారు. సుశీలమ్మ కోసం.. ఓ బంగారు గొలుసు సెలెక్ట్ చేస్తారు. అది రెండు లక్షలు ఉంటుందని షాప్ ఓనర్ చెప్పగా.. తమ దగ్గర కొన్ని నగలు ఉన్నాయి వాటిని తాకట్టు పెట్టి.. ఇవి తీసుకుంటాం అని చెప్పా షాప్ ఓనర్ అంగీకరిస్తాడు. వెంటనే.. ఆ నగలను పరిశీలించి, అవి నకిలీ నగలని గుర్తిస్తారు.

మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా..? అంటూ ఆ షాప్ కీపర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తాము తెచ్చిన నగలు అసలైన నగలేనని మీ దగ్గరనే కొన్నామని చెబుతారు. కానీ మీరు ఇచ్చినవి నకిలీ నగలు, ఇలా ఎంత మందిని మోసం చేశాడు. పోలీసులు అక్కడ ఫోన్ పనిచేసే అకౌంట్ ఎందుకు చెబుతాడు. 'పోలీసులు పిలిస్తే నేను భయపడతామా ?మీరే మా నగలను ఏదో చేశారు? ' అని బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇలా మాట మాట పెరుగుతుంది. ఇంతలోనే ఆ షాప్ అసలైన ఓనర్ వస్తాడు. మీనా ను గుర్తించి.. ఏంటి మీనా ఏం జరిగింది? అని అని ప్రశ్నిస్తాడు. తాము ఇలా నగల ఇచ్చామని వాటికి వేరే తీసుకోవాలని అనుకున్నామని చెప్తాడు.

అతడు అసలు విషయాన్ని గ్రహించి, మీరు తెచ్చిన నగలు నకిలీ .. నకిలీవి కావని ఎలా చెప్తారు? మా దగ్గర మొత్తం పుటేజ్ ఉంటుంది వాటిని కావాలంటే పరిశీలించండి. అయినా నాకు నువ్వు తెలుసు .. కాబట్టి నేను పోలీసులకు ఫోన్ చేయకుండా ఆగాను. ఇది వేరే షాప్ లో అయితే ఈపాటికి మీరు పోలీస్ స్టేషన్లో ఉండేవారు. మీ దగ్గరనే ఏదో తప్పు జరిగిందని ఆ విషయాన్ని మీరే తెలుసుకోమని వారికి నగలు ఇచ్చి పంపిస్తాడు ఆ షాప్ ఓనర్.

దీంతో బాలు కోపం కట్టలు పెంచుకుంటుంది. మనోజ్ తన తల్లి ఇద్దరు కలిసి ఏదో చేశారని, వాళ్లే నగలను మార్చి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు. డైరెక్టర్ మనోజ్ గాడి దగ్గరికి వెళ్లి అసలు విషయం బయట పెడతానని, మీనాను ఇంటికి వెళ్ళమని చెబుతాడు. కానీ మీనా అనవసరంగా గొడవ చేయకండి. బామ్మ పుట్టినరోజు ఉంది మన వల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవద్దు. కావాలంటే పుట్టినరోజు తర్వాత ఈ నగల విషయం బయటపడదాం.. మన వాళ్ల గొడవ జరిగి.. ఇంట్లో సంతోషాన్ని దూరం చేయవద్దని బాలు దగ్గర మాట తీసుకుంటుంది. బాలు మాత్రం మనోజ్, తన తల్లి ఇద్దరు కలిసి నగలు మార్చారని కచ్చితంగా ఆ విషయాన్ని బయట పెడతానని ఆవేశపడుతాడు. ఇలా చెప్తే బాలు అర్థం చేసుకోవడం లేదని, బామ్మ వెళ్లేంతవరకు ఇంట్లో ఇలాంటి గొడవ చేయనని మాట ఇవ్వమని ఒట్టు వేయించుకుంటుంది. దీంతో బాలు సైలెంట్ అయిపోతాడు.

మరోవైపు ప్రభావతి మనోజులు టెన్షన్ పడతారు. తమ విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఈ గొడవకు కారణమైన మనోజ్ను ప్రభావతి తిడుతుంది. మనం బయటకు ఉంటే.. బయట నన్ను బయటకి నుకేస్తారు. ఇంట్లో ఉంటే ఎవరైనా ఆపవచ్చు అని మనోజ్ తన చావు తెలివితేటలను చూపిస్తారు. మరోవైపు ఇంట్లో బామ్మ బర్త్డే వేడుకలు షురూ ఐతాయి. డెకరేషన్స్ వంటి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏం పని చేయకుండా ప్రభావతి సైలెంట్ గా ఉండిపోతుంది. దీంతో సత్యం 'ఏంటి ? నువ్వు ఏమైనా ఇంటికి వచ్చిన బంధువు అనుకుంటున్నావా..? నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చు కదా' అని క్లాస్ పీకుతాడు.

'అయినా అమ్మ ఏం పని చేస్తుంది నాన్న అందరికీ ఆర్డర్లు వేస్తుంది కానీ..' అంటూ రవి కూడా సెటైర్ వేస్తాడు. 'మీనా ఉంటే పనులు చక చకా చేసేది' శృతి అనగా.. 'అమ్మగారు అయ్యగారితో బలాదూర్ తీయడానికి వెళ్లారు.. ఇప్పుడు ఎప్పుడు వస్తుందిలే.. తన దొంగ ' అని మీ నాన్న తిడుతుంది. ఇంతలోనే బాలు మీనాలు ఇంటికి చేరుకుంటారు. దీంతో ప్రభావానికి మనోజ్ కు గుండెల్లో దడ మొదలవుతుంది. అయితే బాలు నగల విషయంలో ఇంట్లో గొడవ చేస్తాడా..? ప్రభావతి మనోజుల బాగోతం బయటపడుతుందా ? అనేది ఉత్కంఠ భరితంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X