Gunde Ninda Gudi Gantalu November 6th Episode: రెండు రోజులు గడువు .. మీనా వల్ల ప్రభావతి, మనోజ్ సేఫ్
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో కథ ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కలిసి ఇంటికి రావడంతో సత్యం అనుమానపడి "మీనా బంగారం ఎక్కడ?" అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి గందరగోళానికి గురవుతుంది. మీనా కూడా సూటిగా "నా నగలు ఇవ్వండి" అని అడగడంతో మనోజ్ మధ్యలో జోక్యం చేసుకుని మాటలు కలుపుతాడు. అయితే శృతి అతన్ని నిలదీయడంతో పరిస్థితి వేడెక్కుతుంది. చివరికి ప్రభావతి నగలు తీసుకువచ్చి ఇస్తుంది. కానీ, లోపల టెన్షన్‌లో ఉంటుంది. బాలు, మీనా ఆ నగలను తీసుకుని షాప్‌కి వెళ్తారు.అక్కడ అవి నకిలీ నగలని తెలిసి షాక్ అవుతారు.
షాప్ ఓనర్ సీసీ ఫుటేజ్ చూపిస్తానని చెబుతాడు. కానీ మీనా తెలుసు కాబట్టి పోలీసులకు చెప్పకుండా వదిలేస్తాడు. దీంతో బాలు ఆగ్రహంతో మనోజ్, ప్రభావతి పైన అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ మీనా బామ్మ పుట్టినరోజు కారణంగా గొడవ పడవద్దని బాలుతో ఒట్టు వేయించుకుంటుంది. ఇదిలా ఉంటే ప్రభావతి, మనోజ్ టెన్షన్‌లో పడిపోతారు. ఇంట్లో బామ్మ బర్త్‌డే వేడుకలు ప్రారంభమవుతాయి. అందరూ ఆనందంగా ఉన్నా, ప్రభావతి మనసులో భయం మొదలవుతుంది. ఇదే సమయంలో బాలు, మీనా ఇంటికి చేరడంతో ప్రభావతి గుండెల్లో దడ మొదలవుతుంది. ఇక బాలు నగల రహస్యం బయటపెడతాడా, ప్రభావతి బాగోతం బహిర్గతమవుతుందా అనేది సస్పెన్స్‌గా మిగిలింది. ఇక గురువారం (నవంబర్ 6వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Courtesy: Jiohotstar
గురువారం సీరియల్ ప్రారంభంలో బాలు, మీనాలు ఆగ్రహంతో ఇంటికి చేరుతారు. కారు దిగగానే బాలుకి మరోసారి మీనా గుర్తుచేస్తుంది. అనవసరంగా ఇంట్లో గొడవ చేయొద్దని, బంగారం విషయం రెండు రోజుల తర్వాత చూసుకుందామని మాట తీసుకుంటుంది. దీంతో బాలు కూడా సైలెంట్ అయిపోతాడు. కానీ, లోపల అగ్నిపర్వతం బద్దలైనట్లు ఉంటుంది. అలా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే మీనాపై ప్రభావతి అరుస్తుంది. ఎక్కడికి వెళ్లావు? ఇంట్లో వంట చేయాలని తెలియదా? ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చావా? అంటూ నానా మాటలు అంటుంది.
దీంతో మీనా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. 'నా మొగుడితో బాలాధురే తిరిగి వస్తా.. అది నా ఇష్టం. అయినా మీకు చేతులు లేవా? వంట చేసుకోవడం రాదా..ఝ నేను లేనప్పుడు ఎవరు వంట చేశారు? నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా..? మీకు ఆకలిగా ఉంటే వంట చేసుకుని తినండి. అనవసరంగా నా మీద అరవకండి' అంటూ మీనా రెచ్చిపోతుంది. మీనా ఇచ్చిన రిప్లై చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక బాలు కూడాతన ఆవేశాన్ని, కోపాన్ని ఇన్ డైరెక్ట్ గా.. బెలూన్స్ పై చూపిస్తాడు. ఏమైంది అని రవి అడగగా.. అగ్నిపర్వతం బద్దలు అయినట్లు ఉంది.. అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతి మనోజులకు అర్థమయ్యేట్లు సమాధానం ఇస్తాడు.
మీనా మాత్రం ఆకలి కేకలు వేస్తున్నాడు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. 'ఆకలి వేసినప్పుడు తొందరగా ఇంటికి వస్తే.. బాగుండు కదరా' అని సత్యం అనగా.. 'గుళ్లో అమ్మ పేరిట అర్చన చేపించా.. రెండు రోజుల తర్వాత అభిషేకం చేస్తా 'అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో రవి.. 'వదిన నేను ఏమైనా సహాయం చేయాలా?' అని అడుగుతాడు. దీంతో మీనా 'అవసరం లేదు.. ఇప్పటికే బాగా మండుతుంది మంట. నేనే వంట చేస్తా.. మంట కూడా నేనే పెట్టుకుంటా' అంటూ మీనా కూడా వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రభావతి మనోజులు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ సమయంలో తమ బాగోతం బయటపడుతుందని లోలోపల మదనపడతారు.
ఇదిలా ఉంటే.. రోహిణికి తన కొడుకు చింటూ ఫోన్ చేసి.. క్లాసులో తాను ఫస్ట్ వచ్చానని, నిన్ను చూడాలని ఉందమ్మా అని ఆశగా కోరుతాడు. తాను సమయం చూసుకొని వస్తానంటూ రోహిణి మాట ఇస్తుంది. ఈ విషయాన్ని మనోజ్ వింటాడు. ఫోన్లో ఎవరు అని అడుగుతే తన ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఆ టాపిక్ డైవర్ట్ అయ్యేలా.. రొమాంటిక్ గా మాట్లాడుతుంది. దీంతో మనోజ్ కూల్ అవుతాడు. ఇంతలో భామకు మనం ఏదైనా గిఫ్ట్ ఇద్దామా అని రోహిణి అనగా.. 'అవసరం లేదు'అంటాడు. 'మనవడిగా ఏదో ఒకటి చేయాలి కదా' అని రోహిణి మరోసారి అడగగా.. 'ఆవిడ నాకు ఏం చేయలేదు అన్ని బాలు గాడికి చేసింది. అవసరం లేదు గిఫ్ట్. పైసలు అనవసరంగా ఖర్చు చేయకు'అంటాడు.'ఏది చేయకుండా ఉంటే బాగోదు కదా..' అని రోహిణి అనగా.. ' ఓ చీర కొనిద్దాంలే..'షాపింగ్ కి వెళ్దాం రెడీ కాని రోహిణి కి చెప్తాడు మనోజ్.
మరోవైపు మీనా తన తల్లికి ఫోన్ చేసి.. బామ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని ఇంటికి రమ్మని చెబుతోంది. ఆల్రెడీ మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. తాము తప్పకుండా వస్తామని అంటుంది. అయితే ఏం గిఫ్ట్ తీసుకోవాలని మీ నాన్న అడిగితే.. స్తోమతకు సరిపోయేలా గిఫ్ట్ తీసుకోమని, అనవసర ఖర్చు చేయవద్దని చెబుతోంది. బాలు కూడా మాట్లాడి అనవసర ఖర్చు చేసుకోవద్దని సూచిస్తాడు. తర్వాత బాలు బామ్మకు ఏదైనా గిఫ్ట్ కొనియాలని ఆలోచిస్తాడు. వాళ్లు అలా చేయకపోతే మనం బంగారు గొలుసు ఇచ్చే వాళ్ళమని మీనా అంటుంది. సరేలే ఆ విషయాన్ని ఇప్పటికీ విడిచిపెట్టు.. ఏం తీసుకుందామని బాలు మరోసారి మీనాను అడుగుతాడు.దీంతో మీనా 'ఓ చీర కొనిద్దాం' అంటుంది. 'కాదు.. కానీ ఆవిడ మనసుకు నచ్చేలా.. వేరే ఏదో ఒకటి తీసుకుందాం' అంటాడు బాలు. సరే చూద్దాం అని మీనా వంట రూమ్ లోకి వెళుతుంది.
మరుసటి రోజు ఉదయం.. సుశీలమ్మ వస్తుంది. ఆమెను పికప్ చేసుకోవడానికి బాలు వెళ్తాడు. అయితే బాలు మూడు అబ్జర్వ్ చేసిన సుశీలమ్మ ఏదో జరిగిందని. తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావని బాలుని అడుగుతుంది. 'లేదు రాత్రి ట్రిప్పు వస్తే వెళ్లి వచ్చానని విశ్రాంతి లేక కాస్త అలసటగా ఉంది' అని అబద్ధం చెప్తాడు. దీంతో సుశీలమ్మ 'ఒరేయ్ నీ ఆరోగ్యం బాగుంటే.. నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళాం మీనా బాగుంటుంది. నీ పని బాగుంటుంది అన్ని బాగుంటాయి' అని చెబుతుంది. దీంతో బాలు' దేవుడా.. నాలో ఉన్న కోపం, బాధ కనిపించకుండా చూడు స్వామి' అని మనసులో అనుకుంటాడు.
మరోవైపు.. సత్యం తన తల్లి కోసం.. వెయిట్ చేస్తుంటాడు. గేటు దాకా వచ్చిన మీ అమ్మ ఇంట్లోకి రాదా. అనవసరంగా టెన్షన్ పడుతున్నారు అంటుంది ప్రభావతి. దీంతో సత్యం 'మీ అమ్మ బతికి ఉంటే.. నీకు అర్థం అయ్యేది. అదృష్టం కొద్ది ఆమె పోయింది. నువ్వు ఏ రోజు కూడా మంచి కూతురువి కాలేదు మంచి తల్లివి కూడా కాలేదు' అని ప్రభావతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంతలో సుశీలమ్మ ఇంటికి రాగానే .. సత్యం తన తల్లికి పుట్టిన శుభాకాంక్షలు చెబుతాడు.
మరోవైపు.. మీనా హరతి తీసుకుని వస్తుండగా.. అన్ని నేనే చేస్తున్నట్లు.. అతి ప్రేమ చూపించకు అంటుంది ప్రభావతి. దీంతో మీనా 'అత్తగారు జాబితాలో మీరు ఆణిముత్యం.. మీరు చాలా గ్రేట్ అత్తయ్య' అంటూ మీనా సెటైర్ వేస్తోంది. హారతి రోహిణి శృతిలకు ఇవ్వు.. అనవసరంగా ఎక్స్ట్రాలు చేయకు అన్నట్లు మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. దీంతో సైలెంట్ గా మీనా.. హారతిని రోహిణికి ఇస్తుంది. బామ్మ ఇంట్లోకి రాగానే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. దీంతో సుశీలమ్మ సంతోషం రెట్టింపు అవుతుంది. అయితే మీనా దూరంగా ఉండటం చూసి.. ఏదో జరిగిందని అర్థం చేసుకుంటుంది సుశీలమ్మ.
హారతి ఇవ్వమంటూ రోహిణి శృతిలను మాత్రమే ప్రభావతి పిలవడం.. సత్యం కు నచ్చదు. ముగ్గురు కోడలు ఉండగా ముగ్గురిని హారతి ఇవ్వమని చెప్తాడు. దీంతో బాలు దారిలోని దారి దూకుడు జరిగినట్లు ఉంది. ఆ హారతిని మీనానే రెడీ చేసి ఉంటుంది అంటాడు బాలు. నాకు తెలియదా.. ఇలాంటి అతని ఎంతోమంది చూసుంటాను అని సుశీలమ్మ.. ఇన్ డైరెక్ట్ గా ప్రభావతికి చురకలాంటిస్తుంది. మరోవైపు.. శృతి వచ్చి హారతి ఇవ్వమని అంటుంది. దీంతో మీనా వచ్చి సుశీలమ్మకు శుభాకాంక్షలు చెప్పి హారతి ఇస్తుంది. కానీ ప్రభావతికి ఆ విషయం అస్సలు నచ్చదు. మరోవైపు మీనా సుశీలమ్మకు సర్ప్రైజ్ ఇచ్చేలా కండ్లు మూసి ఇంట్లోకి తీసుకువస్తుంది.
అలా ఇంట్లోకి వచ్చిన సుశీలమ్మ తన బర్త్డే సెలబ్రేషన్స్ చూసి ఆశ్చర్య పోతుంది. తానే దగ్గరుండి వేడుకలు జరిపిస్తున్నానని ప్రభావతి గొప్పలు చెప్పుకుంటుంది. దీంతో సుశీలమ్మ 'నాకు తెలియదా? నీ గురించి ప్రభావతి' అని చురుకవేస్తోంది. ఆ సంతోషంలో నా మనసుకు నచ్చేలా ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వారికి ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రభావతి ప్రకటిస్తుంది. దీంతో సుశీలమ్మ మనసు దోచుకునేలా గిఫ్ట్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో పడతారు.


Click it and Unblock the Notifications











