Gunde Ninda Gudi Gantalu November 7th Episode: షీలా డార్లింగ్ రిట్నర్ గిప్ట్ .. అయోమయంలో ప్రభావతి కుటుంబం..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌లో బాలు-మీనా ఇంటికి కోపంగా చేరుతారు. మీనా బంగారం విషయం గురించి గొడవ వద్దని చెప్పడంతో బాలు సైలెంట్‌గా ఉంటాడు. కానీ, ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రభావతి మీనాపై అరుస్తుంది. దీంతో మీనా కూడా కౌంటర్ ఇస్తూ ఆవేశంగా స్పందిస్తుంది. బాలు కోపాన్ని అణిచుకుంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావతి ముందు తన అసహనాన్ని చూపిస్తాడు. ఈ గందరగోళంలో ప్రభావతి, మనోజులు తమ రహస్యం బయటపడు తుందేమోనని టెన్షన్ పడతారు. ఇక రోహిణి తన కొడుకుతో మాట్లాడటం మనోజ్ విని అనుమానం పెంచుకుంటాడు. కానీ రోహిణి రొమాంటిక్‌గా మాట్లాడి ఆ పరిస్థితిని సర్దుకుంటుంది.

మరోవైపు మీనా తన తల్లిని బామ్మ పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తుంది. గిఫ్ట్ విషయంలో బాలు, మీనా చర్చించుకుని చివరికి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయిస్తారు. తరువాత రోజు సుశీలమ్మ ఇంటికి వస్తుంది. బాలు ముఖం చూసి ఏదో దాచిపెడుతున్నాడని ఆమెకు అర్థమవుతుంది. సత్యం తన తల్లి గురించి ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. బామ్మ ఇంటికి రాగానే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. మీనాను విస్మరించి రోహిణి, శృతిలను హారతి ఇవ్వమని చెప్పడం సుశీలమ్మకు నచ్చదు. చివరికి మీనా సర్ప్రైజ్ గిఫ్ట్‌తో బామ్మను ఎమోషనల్ చేస్తుంది. సుశీలమ్మ సంతోషంగా వేడుకలను ఆస్వాదిస్తుంది. ఇక శుక్రవారం(నవంబర్ 7వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 549 November 7th 2025 here is full story
Courtesy: Jiohotstar

సుశీలమ్మ తన పుట్టినరోజు వేడుకలను చూసి తెగ సంతోషపడుతుంది. తన కోసం ఇంత ఘనంగా వేడుకలు చేస్తున్నందుకు కుటుంబ సభ్యులందరికీ థాంక్స్ చెప్తుంది'. ఈ సమయంలో శృతి చిలిపిగా.. 'బామ్మ మీ అందానికి రహస్యం ఏమిటి?' అని ప్రశ్నించగా.. 'ఏం లేదు.. సంతోషంగా ఉండడమే. ప్రతి పనిని నేనే చేసుకుంటా.. ఇతరులపై ఆధారపడ పొలం పనులు ఇంటి పనులు అన్ని నేనే దగ్గర ఉండి చూసుకుంటా.. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే.. మీ అత్త ఎలా గుండ్రంగా తయారవుతారు' అంటూ సెటైర్ వేస్తోంది. దీంతో బాలు' మా మీనా ఎన్నటికీ ముసలిద్ది కాదు.. అందంగానే ఉంటుంది' అంటూ ప్రభావతి కి మరోసారి చురక వేస్తాడు.

ఈ సమయంలో. 'ఎవరైతే నా మనసుకు నచ్చే బహుమతి ఇస్తారో.. వారికి నేను ఊహించని బహుమతి ఇస్తాను' అని సుశీలమ్మ ప్రకటిస్తుంది. దీంతో 'ప్రభావతి ఆత్రుతగా ఏంటి ఆ బహుమతి?' అని అడుగుతుంది. 'నేను ఇచ్చేటప్పుడే చెప్తా.. అప్పటివరకు సస్పెన్స్. మీరిచ్చే బహుమతి నా మనసుకు నచ్చే విధంగా ఉండాలి' అంటుంది. 'నా మనసుకు నచ్చి బహుమతి ఇస్తే.. వారికి ఊహించని విధంగా గిఫ్ట్ ఇస్తా' అంటుంది సుశీలమ్మ. దీంతో అందరూ ఆ గిఫ్ట్ ఏంటా అని ఆలోచనలో పడతారు.

ప్రభావతి దాని గురించి తీక్షణంగా ఆలోచిస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటి? అని ప్రభావతి సత్యం అని అడుగుతుంది. ఇంతకీ మీరేం ఇస్తున్నారు అని తన భర్త ను అడుగుతుంది. 'నేనేం గిఫ్ట్ కొనియాలి?' అంటూ పలు ప్రశ్నలు అడుగుతుంది. దీంతో సత్యం ఆశ్చర్యపోతాడు. 'నువ్వేనా మా అమ్మ గురించి అడుగుతుంది' అని ప్రభావతిని గిల్లుమంటాడు. 'ఇది మీ అమ్మగారి 75 పుట్టిన రోజు మనం ఏదైనా ప్రత్యేకంగా బహుమతి ఇవ్వాలి కదా?' అంటుంది. 'మా అమ్మకు ఇచ్చే గిఫ్ట్ కంటే.. ఆమె ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మీదనే నీకు అసలు ఉన్నట్టున్నాయి' అని సత్యం అసలు విషయాన్ని బయటపడతాడు.

దీంతో ప్రభావతి 'నేను ఎంతైనా ఆమె కోడల్ని కదా.. నాకు ఆమె మీద ప్రేమ ఉంటుంది కాదా.. మీరు ఎందుకు అలా అంటున్నారు'అంటుంది. దీంతో సత్యం 'ఇన్ని రోజులు ఈ కోడలు కోమాలో ఉందా ? ఏ రోజైనా మా అమ్మకి ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ ? ఏం చేస్తున్నావ్? నీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి? ఏ రోజైనా ఫోన్ చేసి ప్రశ్నించావా? అంటూ ప్రభావతికి క్లాస్ పీకుతాడు. మీరు ఏమైనా అనండి మా అత్తగారి కోసం నేను ఓ ప్రత్యేక గిఫ్ట్ కొనిస్తా అంటూ అక్కడినుండి వెళ్ళిపోతుంది. దీంతో సత్యం ఈ ప్రేమ వెనక ఏదో కుట్ర ఉంది ఆటో ఆలోచనలో పడతాడు.

ఇక మరోవైపు శృతి మనోజులు కూడా గిఫ్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏం గిఫ్ట్ ఇస్తే.. బామ్మ కు నచ్చుతుందని, ఇంతకీ ఆ బామ్మ ఇచ్చేటటువంటి రిటన్ గిఫ్ట్ ఏంటి? అంటూ గింజుకుంటారు. 'అయినా ఎక్కువ ఆలోచించకు.. ఎందుకంటే ఆ గిఫ్ట్ ఎలాగో బాలు కి వెళుతుంది' అని రోహిణి డిసప్పాయింట్ చేస్తోంది. దీంతో మనోజ్ ఈసారి ఇలాగేనా తాను బామ్మ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా గెలుచుకుంటానని అంటాడు.ఈ సమయంలో మనోజ్ బాగా ఆలోచించి తాను పగడాల దండ కొనిద్దాం అంటాడు. దీంతో రోహిణి కూడా సరే అంటుంది. అయితే ముందుగా కొన్న చీర ఉంది కదా దాన్ని రిటర్న్ ఇద్దామని మనోజ్ అంటాడు. దీంతో రోహిణి చీరేస్తా అని లెవల్లో చూస్తోంది. పొదుపుకు పిసినారి తనానికి ఓ లెవెల్ ఉంటుంది మరి ఇంత దారుణంగా ఆలోచిస్తావా? అంటూ మనోజ్ ను తిడుతుంది.

మరోవైపు శృతి రవి ఇద్దరు కూడా ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు.'ఏమైనా ఆలోచన వచ్చిందా? అని శృతి అడగగా.. గెలవాలంటే మంచి గిఫ్ట్ కావాలి కదా బుల్లెమ్మ ఏ కాంపిటీషన్లోనూ ఓడింది లేదని రవి గొప్పలు చెబుతాడు. 'నేను బామ్మకు సెల్ ఫోన్ ఇద్దామని పిక్స్ అయ్యాను' అంటుంది శృతి. 'నాకు భామకు ఇచ్చేది గిఫ్ట్ తెలుసు .. కానీ, బామ్మలకి ఇచ్చే గిఫ్ట్ నాకు తెలియదు' రవి అంటాడు. 'అయినా నాకు నువ్వు ఏం గిఫ్ట్ ఇచ్చావు? 'అంటుంది శృతి. దీంతో రవి 'నీకు నచ్చిన వంటలు వండి పెట్టాలి కదా' అని గుర్తు చేస్తాడు. అయితే ఇంకేం ఆలోచిస్తున్నావ్ భామకు నచ్చిన వంటకాన్ని ప్రిపేర్ చేయి అని సలహా ఇస్తుంది శృతి.

మరోవైపు కిచెన్ లో బాలు,మీనా కూడా గిఫ్ట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. 'మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి అందరికంటే ఎక్కువగా బామ్మ ప్రేమ మీకే దొరికింది. ఆమె మనసు కూడా మీకే తెలుసు. ఆమె మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వండి' అంటుంది మీన. 'అవును నన్ను మా బామ్మ నే పెంచింది. ఆమె మనసుకు నచ్చే ఏదైనా గిఫ్ట్ కొనిస్తా' అంటూ బయటికి వెళ్లిపోతాడు బాలు. ఇంతలో బామ్మ అడ్డుపడి 'ఏరా ఎటు వెళ్తున్నావ్ అందరం కలిసి సంతోషంగా గడుపుదాం అనుకున్నాం కదా..' అని బాలుని ప్రశ్నిస్తుంది. సత్యం కూడా అడుగుతాడు. తనకు అర్జెంటు పని పడిందని త్వరగా తిరిగి వస్తానని బాలు వెళ్లిపోతాడు.

మరోవైపు ప్రభావతి మీనాక్షికి ఫోన్ చేస్తుంది. మా అత్తయ్య తన పుట్టినరోజు సందర్భంగా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందని అసలు విషయాన్ని మీనాక్షికి చెబుతుంది. దీంతో మరి మీ అత్తయ్యకు ఏం గిఫ్ట్ తీసుకోవాలని భావిస్తున్న అని అనగా.. నాకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదా నీకు తెలుసు కదా అంటుంది ప్రభావతి. 'గుమ్మి లోని వడ్లు గుమ్మిలో ఉండాలి.. పిల్లలు మాత్రం గుమటాలుల తయారు కావాలంటే ఎలా? మంచి గిఫ్ట్ తీసుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా' అని మీనాక్షి అంటుంది. తన దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని మీ ఇంట్లో వాడని టీవీ ఉంది కదా ఆ టీవీని గిఫ్టుగా ఇద్దామని భావిస్తున్నా అని అసలు విషయాన్ని చెబుతుంది ప్రభావతి. దీంతో మీనాక్షి కూడా కాదన లేకుండా సరే నీ ఇష్టం తీసుకువెళ్ళు అంటుంది. మరోవైపు బాలు తన బామ్మకు మంచి గిఫ్ట్ కోసం ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X