Gunde Ninda Gudi Gantalu November 10th Episode: సుశీలమ్మ చివర కోరిక.. బామ్మ కోసం బాలు పరుగులు..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలతో ఇల్లు ఆనందంతో నిండిపోతున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఆమెకు సర్ప్రైజ్ వేడుకలు ఏర్పాటు చేస్తారు. సుశీలమ్మ సంతోషంగా "ఇంత ప్రేమగా చూసుకున్నందుకు థాంక్స్" అంటూ అందరినీ ఆశీర్వదిస్తుంది. ఈ సమయంలో శృతి చిలిపిగా "బామ్మ, మీ అందానికి రహస్యం ఏమిటి?" అని అడగగా, సుశీలమ్మ నవ్వుతూ "సంతోషంగా ఉండడం, నా పనులు నేనే చేసుకోవడం" అంటుంది. వెంటనే బాలు "మా మీనా ఎప్పటికీ ముసలిద్ది కాదు" అంటూ ఫన్నీ పంచ్ వేస్తాడు. ఇంతలో సుశీలమ్మ "నా మనసుకి నచ్చిన గిఫ్ట్ ఇచ్చేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను" అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపడతారు.
ప్రభావతి వెంటనే సత్యం వద్దకు వెళ్లి "ఏం గిఫ్ట్ ఇవ్వాలి?" అని అడగగా, సత్యం "ఇప్పుడు మా అమ్మ గురించి కూడా నువ్వే ఆలోచిస్తున్నావా?" అంటూ సెటైర్ వేస్తాడు. ప్రభావతి మాత్రం "నేను కోడల్ని కదా, నాకు ప్రేమ ఉంటుంది కదా" అని చెప్పినా, సత్యం ఆమె ఉద్దేశ్యం రిటర్న్ గిఫ్ట్ కోసమేనని గుర్తిస్తాడు. ఇక రోహిణి, మనోజ్, శృతి, రవి కూడా గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తూ చర్చిస్తారు. రోహిణి మనోజ్ పొదుపు ప్లాన్‌పై నవ్వుతుండగా, శృతి బామ్మకు సెల్‌ఫోన్ ఇస్తానని చెబుతుంది. రవి మాత్రం ఆమెకు నచ్చిన వంటకం చేయాలని చెబుతాడు. బాలు మాత్రం "బామ్మ మనసు నాకు బాగా తెలుసు" అంటూ గిఫ్ట్ కోసం బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే ప్రభావతి తన అత్తగారికి మీనాక్షిఇంట్లో ఉన్న పాత టీవీని గిఫ్ట్‌గా ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది. ఇక సోమవారం (నవంబర్10వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

సీరియల్ ప్రారంభంలో.. ప్రభావతి, మీనాక్షి మధ్య డీల్ జరుగుతుంది.'పాత టీవీ ఇస్తే.. మా అత్తయ్య ఇచ్చే.. రిటర్న్ గిఫ్ట్ ఇలా సగం వాటా ఇస్తా'నని మీనాక్షికి చెబుతోంది. దీంతో మీనాక్షి కూడా 'సరేలే వద్దంటే ఊరుకుంటావా.. టీవీ తెస్తానులే' అని ఈసాడించుకుంటుంది మీనాక్షి. ఇక మరోవైపు మీనా ..బామ్మ పుట్టినరోజు వేడుకలను ఫోటోలు వీడియోలు తీసి, ఆమెకు ఒక తీపు గుర్తుల అందించాలని భావిస్తుంది. అలా తన చెల్లెలు సహాయంతో ఫోన్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సమయంలో తన చెల్లెలు సుమతి.. కవరింగ్ నగల గొడవను గురించి మాట్లాడగా, అనవసరంగా ఆ విషయాన్ని మాట్లాడవద్దని, అది తన అత్తగారింటి సమస్య అని దాటవేస్తుంది.
ఇక మీనా.. బామ్మ పుట్టినరోజు వేడుకలను ఫోన్ తో ఫోటోలు, వీడియోలు తీస్తుంది. ఏంటి మీనా ఏం చేస్తున్నావని సుశీలమ్మ ప్రశ్నించగా, మీ పుట్టినరోజు వేడుకలను ఫోన్లో వీడియో తీసి మీకు పంపించాలని అనుకుంటున్నా బామ్మ అని చెప్తుంది. 'నేనేమైనా సినిమా హీరోయిన్ నా..? లేకపోతే సెలబ్రిటీ నా..? ఇవన్నీ అవసరమా?' అని సుశీలమ్మ అంటుంది. 'మాకు తెలిసినంతవరకు మీరే మా సెలబ్రిటీ.. 75 వ పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు. ఇంతకంటే అదృష్టమే ఉంటుంది' అని మీనా అంటోంది. అందుకు సుశీలమ్మ చిరునవ్వుతో.. 'ఓకే నీ ముచ్చట నేను కాదంటానా.. నీకు నచ్చినట్లు తీసుకో..' అంటుంది.
ఏదైనా మాట్లాడు బామ్మ.. అని మీనా అనగా, సుశీలమ్మ తన కొడుకు గురించి మాట్లాడుతుంది. ఇంతలో ప్రభావతి అందులోకి దూరుతుంది. 'నువ్వు అవసరమా? నేను నా కొడుకు గురించి చెప్పాలనుకుంటున్నా.. నువ్వు పక్కకు జరుగు' అంటూ ప్రభావతి పై సుశీలమ్మ కోప్పడుతుంది. దీంతో ప్రభావతి.. 'మీరు రాజమాత.. మీ కొడుకు బాహుబలి.. ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించండి'అంటుంది. 'నువ్వు ఏమైనా దేవసేనా అనుకుంటున్నావా?' అంటూ సుశీల పంచ్ వేస్తుంది.
అయితే కింద హాల్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దీంతో మీనా 'బామ్మ మనం పైకెళ్ళి.. వీడియో రికార్డ్ చేసుకుందాం' అంటూ సుశీల మనం డాబా పైకి తీసుకువెళ్తుంది. అలా డాబా మీదకి వెళ్ళిన సుశీలమ్మ.. అక్కడ ఇటుకలను చూసి ఆశ్చర్య పోతుంది. ఏంటి ఈ ఇటుకలు.. ఇలా పెట్టారు? అని ప్రశ్నిస్తుంది. దీంతో మీనా అసలు విషయాన్నీ బయటపడుతుంది. తాము ఇంటి కోసం కష్టపడుతున్నామని, పిచ్చుకలు ఒక్కొక్క గడ్డి పూసను తెచ్చుకున్నట్లు.. మేము కూడా ఒక్కొక్క ఇటుక తెచ్చుకుంటున్నామని చెబుతుంది.
దీంతో తన మనుమడు, మనవరాలు పడుతున్న బాధలను సుశీలమ్మ అర్థం చేసుకుంటుంది. తాను డబ్బు ఇస్తానని అంటుంది. కానీ మీనా అందుకు ఒప్పుకోదు. ఏదైనా తాము కష్టపడి ఇల్లు కట్టుకుంటామని, అదే మాకు ఆత్మ అభిమానం అంటుంది. సరే మీ మాట నేను కాదనను కానీ ఈ సమయంలోనైనా డబ్బు అవసర పడితే ఒక ఫోన్ కొట్టండి. వెంటనే డబ్బుతో ఇక్కడ వాలిపోతాను అని మాట ఇస్తుంది. ఆ తర్వాత మీనా..'సరేలే బామ్మ మీకు. 75 సంవత్సరాల జీవిత అనుభవంలో మీ తీపి గుర్తులను అనుభవాలను చెప్పండి' అని అడుగుతుంది. దీంతో సుశీలమ్మ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది.
తనకు చిన్నప్పుడు ముగ్గురు స్నేహితులు ఉండేవారని, వారితో కలిసి చేసిన బాల్యపు స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అవుతుంది సుశీలమ్మ. పెళ్లయిన తర్వాత ఇప్పటివరకు వారిని కలవలేదని, ఒక్కసారి అయినా వారిని చూడాలని, వారితో కాసేపు సరదాగా గడపాలని భావిస్తున్న అది నా చివరి కోరిక, నా కోరికను తీర్చే వారు ఉన్నారో? లేదో? అంటూ బామ్మ బాధపడుతుంది. దీంతో మీనా కూడా ఎమోషనల్ అవుతుంది.
ఇక మరోవైపు బాలు.. ఇంకా ఇంటికి రాకపోవడంతో సత్యం కంగారు పడతాడు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేకపోవడంతో తాగి వస్తాడా అని సందేహపడతాడు. ఇదే విషయాన్ని మీనాను అడగగా... తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, కాకపోతే ట్రిప్పు కి వెళ్ళాడని చెబుతుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి .. బామ్మ పుట్టినరోజు వేడుకని ఫుల్లుగా తాగి ఉంటాడు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో సత్యం అనవసరంగా నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు.. వెళ్లి నీ పనిలో చూసుకో అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రభావతి 'చూస్తారు కదా సాయంత్రం వరకు ఫుల్లుగా తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేస్తాడు చూడండి' అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
దీంతో సత్యం కూడా బాలు తాగి వస్తాడా అని అనుమానపడతాడు. బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. దీంతో మీనా కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక బాలు తన బామ్మ కోసం.. ఆమె చిన్ననాటి స్నేహితులను వెతికే క్రమంలో బిజీబిజీగా ఉంటాడు. మరోవైపు.. రవి శృతిలు గుడికి వెళ్ళగా అక్కడ.. మౌనిక కనిపిస్తుంది. ఇంట్లో బామ్మ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని, మౌనికను కూడా బర్త్డే పార్టీకి రమ్మని వారు ఇన్వైట్ చేస్తారు. కానీ మౌనిక సందేహపడుతూ.. తనకు వేరే పని ఉందని తాను రాలేనని చెబుతోంది. దీంతో రవి.. బామ్మ 75 పుట్టినరోజులు ఘనంగా చేస్తున్నాం, నువ్వు లేకపోతే ఎలా? ఒక్కసారి ఇలా వచ్చే అలా వెళ్ళిపో అంటాడు. పక్కనే ఉన్న శృతి మీ అత్తయ్య పర్మిషన్ అడగాలా? అంటుంది. దీంతో పక్కనే ఉన్న తన అత్తమ్మ.. 'నేను పుట్టిన రోజు వేడుకలను మీ చెల్లిని పంపిస్తాలే మీరు టెన్షన్ పడకండి' అంటుంది. దీంతో మౌనిక కంగారుపడుతుంది.


Click it and Unblock the Notifications











