Gunde Ninda Gudi Gantalu November 11th Episode: రోహిణీపై సుశీలమ్మ అనుమానం.. మీనా నగలు అడిగిన బామ్మ..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం సీరియల్ ప్రారంభంలో ప్రభావతి, మీనాక్షి మధ్య సరదా డీల్ జరుగుతుంది. పాత టీవీ ఇస్తే రిటర్న్ గిఫ్ట్‌లో సగం వాటా ఇస్తానని ప్రభావతి చెప్పగా, మీనాక్షి సరదాగా అంగీకరిస్తుంది. మరోవైపు మీనా, బామ్మ సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలను వీడియోగా రికార్డ్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తుంది. మొదట సుశీలమ్మ "నేనేమైనా సెలబ్రిటినా?" అని అడిగినా, తర్వాత మనవరాలిపై ప్రేమతో ఓకే అంటుంది. ఈ క్రమంలో ప్రభావతి జోక్యం చేసుకోగా, సుశీలమ్మ "నువ్వు దేవసేన అనుకుంటున్నావా?" అంటూ పంచ్ వేస్తుంది.
తరువాత మీనా, బామ్మను డాబాపైకి తీసుకెళ్లి, తమ కష్టాలను చూపిస్తుంది. ఒక్కో ఇటుకతో ఇల్లు కడుతున్నామని చెప్పడంతో సుశీలమ్మ కదిలిపోతుంది. సహాయం చేస్తానని చెప్పినా, మీనా తమ కష్టమే గౌరవమని చెబుతుంది. సుశీలమ్మ తన బాల్య స్నేహితులను గుర్తుచేసుకుంటూ వారిని కలవాలని చివరి కోరిక చెబుతుంది. ఇక బాలు ఇంటికి రాకపోవడంతో సత్యం ఆందోళన చెందుతాడు. ప్రభావతి అతను తాగి ఉంటాడని వ్యంగ్యంగా మాట్లాడగా, సత్యం కోపపడతాడు. వాస్తవానికి బాలు బామ్మ స్నేహితులను వెతుకుతున్నాడని తెలియదు. ఈ క్రమంలో రవి, శృతి మౌనికను బామ్మ బర్త్‌డేకు ఆహ్వానిస్తారు. మొదట సంకోచించిన మౌనిక, అత్తయ్య అనుమతితో చివరికి రావడానికి సిద్ధమవుతుంది. ఇక మంగళవారం (నవంబర్11వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ఇక మంళవారం ఎపిసోడ్ ప్రారంభంలో రవి,శృతి ఇద్దరు కలిసి మౌనికను ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. దీంట్లో మౌనిక వెళ్లాలా?వద్దా?అని సందేహ పడుతుంది. అత్తయ్య వెళ్ళమని, సంజు వస్తే చూసుకుంటా అని బరువు భరోసా ఇచ్చి పంపిస్తుంది. దీంతో మౌనిక సంతోషంగా తన అమ్మగారింటికి వెళ్తుంది. బామ్మ 75వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొంటుంది. మరోవైపు మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే బామ్మ వచ్చి..'వాడు ఇంకా రాలేదా.. మీ ఇద్దరు ఏమైనా అనుకున్నారా? అని మీనాను అడుగుతుంది సుశీలమ్మ. ఇంతలోనే ప్రభావతి రావడంతో.. 'బాలుని ఈరోజు ఏమైనా అన్నావా?' అంటూ నిలదీస్తోంది.
దీంతో ప్రభావతి 'నాకేం తెలుసు.. వాడి పెళ్ళాన్ని అడగండి' అంటూ బదిలిస్తుంది. 'నువ్వు ఏం అనకపోతే.. వాడు ఎందుకు ఇంటికి రాడు.. ఏదో జరిగింది? అని మరోసారి గట్టిగా ప్రశ్నిస్తోంది బామ్మ. దీంతో ప్రభావతి.. 'మీ పెంపకం వలనే వాడు తల్లికి గౌరవం ఇవ్వడం లేదు.. మీ వల్లనే ఇలా తయారు అయ్యాడు' అంటూ సుశీలమ్మను నిందిస్తుంది ప్రభావతి. 'నువ్వు ఇలా మాట్లాడితే నాకు వేడుకలు వద్దు.. సంబరాలు వద్దు. నేను వెళ్ళిపోతా.. వాడికి తల్లి ప్రేమ దొరకకపోతే నేను వాడిని పెంచాను. ఈ రోజైనా కొడుకును తల్లిలాగా చూశావా' అంటూ బామ్మ ఎమోషనల్ అవుతుంది.
'ఇప్పుడు నేను ఏం అన్నానని మీరు అలా మాట్లాడుతున్నారు?' అంటూ ప్రభావతి అంటుంది. దీంతో మీనా ఇప్పుడే కదా బామ్మ పెంపకం గురించి బాలు గురించి ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు' అని మీనా అంటుంది. 'అంటే ఇదంతా నీ ప్లానా' అని మీనాను నిందిస్తుంది ప్రభావతి. మీనా చెప్తేనే నాకు అర్థం అవుతుందా? నాకంటూ జ్ఞానం లేదా నీ గురించి నాకు తెలియదా ? ఇన్ని సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను. నువ్వు ఏంటో.. నీ ప్రవర్తన ఏంటో నాకు బాగా తెలుసు'అని ప్రభావతిపై మండిపడుతుంది సుశీలమ్మ. ఇంతలోనే రవి శృతి.. మౌనికను తీసుకొని ఇంట్లోకి వస్తారు. ఆ సర్ప్రైజ్ ఎంట్రీ చూసి బామ్మ కూడా షాక్ అవుతుంది. మౌనిక రావడంతో సంబరాలలో మరింత ఉత్సాహం పెరుగుతుంది.
అయితే మౌనికను బర్త్డే పార్టీకి ఎవరు పిలవలేదని తెలుసుకొని సత్యం బాధపడతాడు. తన కూతురికి ఫోన్ చేయమని చెప్పాను కదా అని ప్రభావతిని ప్రశ్నిస్తాడు. వాళ్లు కోట్లలో సంపాదించేవాళ్లు ఇలాంటి చిన్న ఫంక్షన్లకు వస్తారా? అని నేనే ఫోన్ చేయలేదని ప్రభావతి చెబుతుంది. దీంతో సత్యం మండిపడతాడు. 'మీరు పిలిస్తే నేనెందుకు రానమ్మ ఇప్పుడు వచ్చాను కదా బామ్మ కంటే స్పెషల్ ఏముంటుంది’ అని మౌనిక బదులిస్తుంది.
మరోవైపు రోహిణి వచ్చి మౌనికను ఆత్మీయంగా పలకరిస్తుంది. ఇక తర్వాత బామ్మను పిలిచి మేకప్ వేస్తుంది. ముందు బామ్మ వద్దన్నా మనుమలు, మనమరాలు బలవంతం చేయడంతో మేకప్ చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది. అయితే మేకప్ చేసే సమయంలో సుశీలమ్మ.. రోహిణి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీస్తుంది. 'మీ అమ్మానాన్న ఎక్కడుంటారు? వాళ్ళు ఏం చేస్తారు? మీ మామయ్య ఎక్కడ? అతన్నైనా పిలవచ్చు కదా.. ఒకసారి వాళ్ళ ఫోటో చూపించు’ అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది. దీంతో అనవసరంగా మేకప్ చేస్తానని పిలిచి ఇబ్బందులు పడ్డానా అని తన మనసులో అనుకుంటుంది.
ఇందులో మౌనిక .. రోహిణి రూంలోకి వచ్చి బామ్మను చూసి షాక్ అవుతుంది. 'నానమ్మ నువ్వు అచ్చం హీరోయిన్ లా ఉన్నావు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తేస్తుంది. మనం ఓ సెల్ఫీ తీసుకుందాం అంటూ మౌనిక తన ఫోన్లో బామ్మతో కలిసి సెల్ఫీ తీసుకుంటుంది. ఇలా అందంగా మేకప్ వేసుకొని రెడీ అయిన బామ్మను చూసి షాక్ అవుతారు. సత్యం కూడా తన తల్లిని చూసి సంబురపడతాడు. ఇంతలో శృతి బామ్మను ఆట పట్టిస్తుంది బామ్మ మేకప్ వేసుకున్నారు అలాగే మాడ్రన్ డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగుంటారు అని అనగా.. రవి 'బామ్మ జీన్స్ ప్యాంటు షర్ట్ కొనక్క రావాలా ’అంటూ ఆట పట్టిస్తాడు.
మరోవైపు.. సత్యం తన తల్లి పుట్టిన రోజు వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చాలని.. వేద పండితులను పిలిచి వారితో పూజ చేయిస్తాడు. దీంతో సుశీలమ్మ చాలా సంతోషపడుతుంది. ఈ సమయంలో వేద పండితులు సుశీలమ్మకు అమ్మవారి పట్టుచీరను కానుకగా ఇస్తారు. ఇదంతా చూసిన ప్రభావతి కుళ్ళుకుంటుంది. మీ నాన్న చూసావా రా తన తల్లి కోసం ఎంత చేస్తున్నారు నువ్వు ఎప్పుడైనా ఏమైనా నా కోసమే ఇలా చేసావు అంటూ మనోజ్ ను తిడుతుంది.
ఆ తర్వాత అందరూ బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ, ఎంతమంది ఉన్నా బాలు లేని లోటు మాత్రం కొట్టి వస్తుంది. ఇంతకీ బాలు ఎటు వెళ్లిపోయాడు అని సుశీలమ్మ మరోసారి ప్రశ్నిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందని మీనాను ప్రశ్నిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది ఎందుకు వాడు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు తెలియాలి అని మీ నాన్న నిలదీస్తుంది సుశీలమ్మ.


Click it and Unblock the Notifications










