Gunde Ninda Gudi Gantalu November 12th Episode: మీనాకు అవమానం.. ప్రభావతి బాగోతాన్ని బయపెట్టిన శోభ..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంళవారం ఎపిసోడ్ ప్రారంభంలో మౌనికను రవి, శృతి కలిసి ఇంటికి రమ్మని అడగడంతో, అత్తయ్య ప్రోత్సాహంతో ఆమె సంతోషంగా వెళ్తుంది. బామ్మ 75వ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి. ఈ వేడుకల్లో మీనా, బాలు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి, సుశీలమ్మ మధ్య మాటతీరు ఘర్షణకు దారి తీస్తుంది. ప్రభావతి బాలు ప్రవర్తనకు బామ్మనే కారణమని నిందిస్తే, సుశీలమ్మ ఆవేదనతో ఎమోషనల్ అవుతుంది. మీనా మధ్యలో జోక్యం చేసుకోవడంతో ప్రభావతి ఆమెపై కోపం చూపిస్తుంది. అదే సమయంలో రవి, శృతి మౌనికను తీసుకొచ్చి ఇంట్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తారు.

మౌనికను ఎవరూ పిలవలేదని తెలుసుకున్న సత్యం ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇక రోహిణి బామ్మకు మేకప్ చేస్తూ, ఆమె కుటుంబంపై సుశీలమ్మ ఆరా తీస్తుంది. మేకప్ తర్వాత బామ్మ అందంగా తయారవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. మౌనిక, శృతి, రవి ఆమెను ఆటపట్టిస్తూ నవ్వులు పూయిస్తారు. సత్యం పూజలు నిర్వహించి బామ్మకు పట్టుచీర కానుక ఇస్తాడు. ఈ సన్నివేశం చూసి ప్రభావతి అసహనం చెందుతుంది. వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి కానీ బాలు లేని లోటు అందరినీ బాధిస్తుంది. చివర్లో సుశీలమ్మ మీనాను నిలదీస్తూ - "బాలు ఎక్కడ? నాకు తెలుసుకోవాలి " అని భావోద్వేగంతో ప్రశ్నిస్తుంది. బుధవారం (నవంబర్12వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 552 November 12th 2025
Courtesy: Jiohotstar

బామ్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, బాలు లేని వెలితి అక్కడ కొట్టొస్తుంది. దీంతో సుశీలమ్మ బాలు ఎక్కడ? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అని మీనాను ప్రశ్నిస్తోంది. 'అదేం లేదు..మీ మీద ప్రేమ తగ్గిందని మాత్రం అస్సలు అనుకోకండి. మిగతా మన్మల్ల లాగా బాలు మీరిచ్చే గిఫ్ట్ కోసం తాపత్ర పడేవాడు కాదని మీకు తెలుసు కదా బామ్మ.. మళ్ళీ ఇలా అడుగుతున్నారు ఏంటి?' అని మీనా అంటుంది. ' వాడి మనస్తత్వం నాకు తెలుసు'అంటుంది. 'సరేలే గాని ముందు వెళ్లి కొత్త చీర కట్టుకొని, నగలు పెట్టుకుని రా?' అంటుంది సుశీలమ్మ. దీంతో మీనా రెడీ కావడానికి పైకి వెళుతుంది.

అంతలోనే ప్రభావతి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ ? వంట ఎవరు చేయాలి? ముందు ఆ పని చూడు అంటుంది. దీంతో పక్కనే ఉన్న సుశీలమ్మ.. నువ్వు కూడా ఆడదానివే కదా? నీకు వంట చేయడం రాదా? లేకపోతే నువ్వు కూడా పాయింట్ షర్టు వేసుకొని తిరుగు ఇంట్లో మిగతా కోడలు ఉన్నారు కదా.. మీనానే ఎందుకు నువ్వు టార్గెట్ చేస్తున్నావ్? మీనా కూడా ఏంటి కోడలే ఆ విషయాన్ని మర్చిపోకు. అంటూ ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. 'మీనా నువ్వు వెళ్లి రెడీగా.. అలాగే ఆ నగలు పెట్టుకో.. ఈ పుట్టింటి వారు చేయించలేదు.. నేను నా మనుమరాలు కోసం చేయించా' అంటుంది. అలాగే ప్రభావతి నువ్వు వెళ్లి వంట చెయ్ అని వార్నింగ్ ఇస్తుంది సుశీలమ్మ. దీంతో ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎక్కడ ఆ నగలు నకిలీవో.. అని గుర్తు పడుతుందని భయపడుతుంది. దీనికి తోడు మనోజ్ కూడా మన బాగోతం బయటపడుతుందని మరింత భయపట్టిస్తాడు.

మరోవైపు.. మౌనిక తన అత్తయ్య సువర్ణకు ఫోన్ చేస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? అని తెలుసుకుంటుంది.'అనవసరంగా ఇక్కడికి ఫోన్ చేయకు.. ఇక్కడ అంతా బాగానే ఉంది. నువ్వు మీ పుట్టింట్లో ఉన్నంత సేపు సత్యం కూతుర్లానే ఉండు. సంజు ఫోన్ చేస్తే నేను చూసుకుంటా అని ధైర్యం ఇస్తుంది' సువర్ణ. ఇంతలోనే సంజు వస్తాడు. ఎక్కడ మౌనిక గురించి అడుగుతాడు అని. సువర్ణ భయపడుతుంది. ఇంతకీ మౌనిక ఏది అని ప్రశ్నించగా..' గుడిలో ప్రత్యేక పూజలు ఉన్నాయి. అక్కడ విడిచి నేను వచ్చాను' అంటుంది. దీంతో అనుమానంగానే సరేలే అని సంజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ సంజు అనుమానంతో మౌనికకు ఫోన్ చేస్తాడు. కానీ, మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో సంజీవ్ కు అనుమానం మరింత పెరుగుతుంది. 'మౌనిక ఎక్కడికి వెళ్ళింది ? మా అమ్మ కావాలని బయటకు పంపించిందా? అని తన మనసులో అనుకుంటాడు. ఈ క్రమంలో సువర్ణ తన కోడలు మౌనికకు ఫోన్ చేసి.. సంజీవ్ వచ్చాడు. ఎలాగైనా వీలు చూసుకుని రా.. అని చెబుతుంది. దీంతో మౌనిక కంగారుపడుతుంది.

ఇదిలా ఉంటే మరోవైపు మీనాక్షి.. ప్రభావతికి మాట ఇచ్చిన ప్రకారం టీవీ తీసుకుని వస్తుంది. ఆ టీవీని హాల్లో పెట్టి కొత్త టీవీల కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి. దీంతో సత్యం ఆశ్చర్యపోతాడు. 'ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు.. నేనే అత్తయ్య కోసం టీవీ కొన్నాను' అంటుంది ప్రభావతి. పక్కనే ఉన్న మీనాక్షి నేను మోసుకొచ్చాను అంటూ పొంతనలేని సమాధానం చెబుతుంది. దీంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వస్తుంది. మనోజ్ మాత్రం చాలా ఫీల్ అవుతాడు. తన షాప్ లో ఎందుకు తీసుకోలేదని, వేరే షాప్ లో కంటే తక్కువ ధరకే ఇచ్చేవాడిని కదా ఫీల్ అవుతాడు. ప్రభావతి ఇచ్చే గిఫ్ట్ను చూసి.. సుశీలమ్మ కూడా ఆశ్చర్య పోతుంది. ఇది కలయా నిజమా? ఎప్పుడు లేని విధంగా ఇంత ప్రేమ వలకపొస్తుంది అని సత్యం కూడా ఆశ్చర్యపోతాడు. 'నేనే కొన్నాను అత్తయ్య.. మీరు ఆ చిన్న టీవీలో సీరియల్ చూస్తున్నారు కదా.. ఈ పెద్దా... టీవీలో ఎంచక్కా చూడొచ్చు' అంటుంది.

దీన్ని చూస్తే పాత టీవీ లా ఉందే అని శృతి అనగా..'కాదు కాదు ఇది పాత మోడల్ టీవీ.. కొత్త టీవీలను ఆపరేటింగ్ చేయడం బామ్మకు రాదు కదా' అని కవరింగ్ చేస్తుంది. ఇంతలో మీనా పట్టు చీర కట్టుకొని, నగలు పెట్టుకుని కిందికి వస్తుంది. మీ నాన్న చూసి సుశీలమ్మ సంబరపడుతుంది మహాలక్ష్మి లాగా ఉన్నావమ్మా అంటూ మెచ్చుకుంటుంది.నగలను చూసి నీకు బాగున్నాయి అంటుంది. వెంటనే మీనాక్షి ఆ నగలైనా అంటుంది. దీంతో సుశీలమ్మకు అనుమానం వస్తుంది. 'ఆ నగలు ఏంటి ?' అని ప్రశ్నించగా.. ఆరోజు చేయించిన నగలు అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి.

ఇదెలా ఉంటే.. మీనా తల్లి పార్వతి, సుమతి బర్త్డే వేడుకలకు వస్తారు. వచ్చి రాగానే మిమ్ములను ఎవరు పిలిచారు? అంటూ ప్రభావతి అవమానిస్తుంది. దీంతో సుమతి.. 'మీ ఇంటికి పిలవకుండా ఎవరూ రాలేదు. బర్త్డే ప్రోగ్రామ్ ఉందని మామయ్య పిలిస్తేనే మేము వచ్చాం. అయినా మీ ఇంటికి తినడానికి ఎవరూ రాలేదు.. బామ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామంటూ' దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది. 'ఏంటి అలా మాట్లాడుతున్నావ్ తప్పు కదా 'అని పార్వతి అనగా.. 'సంస్కారం తెలియని వారికి అలాంటి సమాధానం ఇస్తేనే కరెక్ట్' అంటూ సుమతిని సమర్థిస్తోంది సుశీలమ్మ. దీంతో ప్రభావతి నోరు మూతపడుతుంది.

అయితే.. సుమతి చిన్న బొట్టు చూసిన సుశీలమ్మ ఇటు రావే పిల్ల.. అంత చిన్న బొట్టు పెట్టుకున్న అంటూ.. కుంకుమ బొట్టు పెడుతుంది. ఏం చేస్తున్నావ్? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ కుశల ప్రశ్నలు అడుగుతుంది సుశీలమ్మ. దీంతో తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటుంది సుమతి. ఆ సమాధానంతో.. ఇంప్రెస్ అయిన శృతి చప్పర్లు కొడుతుంది. సుశీలమ్మ కూడా.. 'సరిగ్గా చెప్పావు ఆడపిల్ల జాబ్ చేయాలి లేకపోతే ఈ రోజులలో ఇల్లు గడవడం కష్టమే.. అలాగే గౌరవం కూడా ఉండదు. కానీ, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరుగుతేనే బాగుంటుంది' అంటుంది సుశీలమ్మ. దీంతో పార్వతి.. 'మంచి సంబంధం వస్తే కచ్చితంగా చేస్తాం.. బామ్మా అంటూ బదిలిస్తుంది.మీ పెద్ద కూతురికి జరిగినట్లు చిన్న కూతురుకు జరగాలంటే ఎవరికి ఒక్కరికి యాక్సిడెంట్ కావాల్సిందే అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X