Gunde Ninda Gudi Gantalu November 13th Episode: ప్రభావతి గుట్టురట్టు.. బామ్మ చివరి కోరిక తీర్చిన బాలు..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ లో బామ్మ సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలు ఆనందంగా కొనసాగుతున్నాయి. కానీ, బాలు లేని వెలితి అందరినీ కలచివేస్తోంది. దీంతో సుశీలమ్మ మీనాను ప్రశ్నిస్తే, "ఏం లేదు బామ్మ, బాలు మీ మీద ప్రేమ తగ్గలేదు" అంటూ సమాధానమిస్తుంది. మీనా ను రెడీ అవ్వమని సుశీలమ్మ చెబుతుంది. అయితే, ఈలోగా ప్రభావతి వంట చేసేది ఎవరు అని తగువేస్తుంది. దీనికి సుశీలమ్మ గట్టిగా సమాధానం ఇస్తూ.. "నువ్వు కూడా ఆడదానివే కదా? నీకు వంట రాదా?" అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు మీనాను నగలు వేసుకుని రామ్మనడంతో ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నకిలీ నగల విషయం బయటపడుతుందేమో అని భయపడుతుంది. ఇక మరోవైపు మౌనిక తన అత్తయ్య సువర్ణకు ఫోన్ చేసి పరిస్థితి అడుగుతుంది. అప్పుడు సంజు వచ్చి మౌనిక గురించి అడగడంతో సువర్ణ అబద్ధం చెబుతుంది.

కానీ సంజు అనుమానం చెంది, మౌనికకు ఫోన్ చేస్తాడు - అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో సంజు అనుమానం మరింత పెరుగుతుంది. ఇదిలా ఉంటే మీనాక్షి టీవీ గిఫ్ట్ తీసుకురావడంతో ఇంట్లో మరో డ్రామా మొదలవుతుంది. ప్రభావతి అది తానే కొన్నట్లు చెప్పడంతో అందరికీ అనుమానం కలుగుతుంది. ఈ సమయంలో మీనా నగలు ధరించి కిందికి వస్తుంది. సుశీలమ్మ ఆనందపడుతుంది. ఇంతలో సుమతి, పార్వతి రావడంతో ప్రభావతి వారిని అవమానిస్తుంది. దీనికి సుమతి కౌంటర్ ఇస్తూ అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. సుశీలమ్మ సుమతిని ప్రశంసిస్తూ, "ఆడపిల్ల జాబ్ చేసుకోవాలి, కానీ సరైన సమయంలో పెళ్లి జరగాలి" అంటుంది. పార్వతి కూడా అంగీకరిస్తుంది. వేడుకల్లో ఆనందం, టెన్షన్, అనుమానాలు ఇలా అన్నీ కలగలిసి ఒక సీరియస్ మలుపు తీసుకుంటాయి. గురువారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 553 November 13th 2025

Courtesy: Jiohotstar

గురువారం ఎపిసోడ్ లో సుశీలమ్మ.. సుమతి గురించి మాట్లాడుతూ.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంది. సుమతి పెళ్లి చేయాలంటే మళ్లీ ఎవడో ఒకరు చావాలి అంటూ ప్రభావతి అపశకనం మాటలు మాట్లాడుతుంది. దీంతో ఇంటిల్లిపాది ప్రభావతిపై సీరియస్ అవుతారు. శృతి, రవి, సత్యం, మీనా, బామ్మ కూడా ప్రభావతిపై మండిపడతారు. 'అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఎందుకు అంత నీచంగా మాట్లాడుతున్నావ్.. నువ్వు మనిషివేనా?' అంటూ సత్యం విరుచుకోపడతాడు. బామ్మ కూడా..'నువ్వు ఆడదానివే కదా ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడతావా.. నువ్వు మనిషివా రాక్షసువా?' అంటూ వీర లెవెల్లో క్లాస్ పీకుతుంది.

శృతి కూడా 'మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీనా కూడా 'ఆమెకు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాలో అర్థం కాదు. మా అమ్మ వచ్చిన ప్రతిసారి ఏడిపించి పంపించాలని ఇలా మాట్లాడుతుంది' అంటూ ఎమోషన్ అవుతుంది. ఇలానే ఉంటే గొడవ మరి పెద్ద అవుతుందని మీనాక్షి ప్రభావతిని పక్కకు తీసుకెళుతుంది. మంచి సంబంధం చూద్దాం అని సత్యం అంటారు. టంగ్ స్లిప్ అయ్యింది మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అంటుంది శృతి.

ఇంతలో శృతి వల్ల అమ్మ శోభ ఇంటికి చేరుకుంటుంది.ఈ సారి కచ్చితంగా ఏదైనా గొడవ చేయాలని ఫిక్స్ అవుతుంది. 'వచ్చి రాగానే పర్వాలేదే మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కూడా బర్త్డే ఫంక్షన్ లు చేస్తారా?' అంటూ హేళనగా మాట్లాడుతుంది. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. 'అభిమానం పంచుకోవడానికి, ఆత్మీయంగా ఉండడానికి డబ్బుతో పని లేదు' అని సత్యం బదులిస్తాడు. దీంతో శోభ అక్కడితో ఆగకుండా 'డబ్బు ఖర్చు లేని పని కదా' అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది. 'మౌనికని చూసి మీ ఆయన నిన్ను బాగానే పంపించాడే?'అంటుంది. దీంతో మీనాకు ఎక్కలేని కోపం వస్తుంది. కానీ ప్రభావతి ఊరుకో అంటూ అడ్డుకుంటుంది.

కానీ పక్కనే ఉన్న మీనాక్షి మాత్రం..'ఇది మీ హై క్లాస్ వాళ్లకు కొత్త పలకరింపా? లోకంలో లేని మాటలు మాట్లాడుతున్నారు ఏంటి? ఇంతకీ మీ ఆయన ఎక్కడ? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక సుశీలమ్మ కూడా గట్టిగా వేసుకుంటుంది.' ఎవరైనా కొత్తగా పెళ్లయితే మీ సంసారం ఎలా ఉంది? అని అడుగుతారు. కానీ, మీ ఆయన ఎక్కడ ఉన్నారు? అని ఎవరు అడగడం నేను చూడలేదు అంటుంది'తీరా ఆ టాపిక్ రోహిణి వైపుకు తీరుకుంది.'ఇప్పటివరకు రోహిణి వాళ్ళ అమ్మానాన్నలను చూడనే లేదు.. కనీసం వారి ఫోటో కూడా లేదు. ఇలాంటి సంబంధాలను కోడలు తీసుకువచ్చింది' అంటూ సెటైర్ వేస్తోంది సుశీలమ్మ.

సర్లే మీ ఇవన్నీ పట్టించుకోకండి. మీరు కూర్చోండి అంటూ ప్రభావతి అతివినియం ప్రదర్శిస్తుంది. కానీ పక్కనే ఉన్న 'మీనాక్షి మాత్రం ఆమె కూర్చోవాలంటే ఈ సోపాలు సరిపోతాయో లేదో.. పక్కనే ఉన్న మహారాజా కుర్చీలో కూర్చోబెట్టు ప్రభావతి' అంటూ చమత్కరిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమతి బెలూన్తో ఆడుతూ పగలగొడుతుంది. ఆశబ్దానికి రవి భయపడతాడు. దీంతో రవి'నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో వాడు మటాష్' అని ఆటపట్టిస్తాడు. ఎలాగైనా పట్టుకొని కొట్టాలని భావిస్తుంది సుమతీ. కానీ, రవి తప్పించుకొని తిరుగుతాడు. ఇంతలో శృతి వారిని చూస్తుంది. ఏం జరుగుతుందని ప్రశ్నిస్తుంది. దీంతో ఇంట్లో వారంతా షాక్ అవుతారు. శృతి ఎలా రియాక్ట్ అవుతుందో అని కంగారు పడుతూ ఉంటారు.

ఇక ప్రభావతి అయితే మొగుడుతో వేరే అమ్మాయి సరసాలు ఆడితే ఏ భార్య అయినా ఊరుకుంటుందా? అంటూ మరోసారి నోరు జారుతుంది. కానీ శ్రుతి మాత్రం.. 'ఎవరైనా ఆటపట్టిస్తే ఊరుకుంటారా.. అని రవిని వంగబెట్టి, సుమతిని కొట్టుకుంటుంది. దీంతో ఇంట్లో నవ్వుల పువ్వులు పూస్తాయి. ఏ అమ్మాయి పెళ్లి గురించి తక్కువ చేసి మాట్లాడితే.. ఇలానే బుద్ధి చెప్పాలి అంటూ ప్రభావతిని టార్గెట్ చేస్తుంది. పక్కనున్న మీనా కూడా 'సంస్కారం అంటే ఇది.. విశాల మనసు అంటే ఇది' అంటూ శృతిని మెచ్చుకొని ప్రభావతికి ఇన్ డైరెక్ట్ గా పంచు వేస్తుంది. 'వయసులో చిన్నది అయినా.. నాకు మంచి మనసున్న కోడలు దొరికింది' అంటూ శృతిని మెచ్చుకుంటాడు సత్యం.

ఇంతలో మనోజ్ జోక్యం చేసుకొని.. సైలెంట్ గా ఉండొచ్చు కదా ఎందుకు అల్లరి చేస్తున్నారు? అని అంటారు.. దీంతో శృతి ఆఫీసర్ ఆర్డర్ వేస్తున్నారు. అందరూ సైలెంట్ గా ఉండండి 'ఎస్ సర్' అని సెల్యూట్ చేస్తుంది. దీంతో మరోసారి నవ్వుల పువ్వులు పూస్తాయి. ఏ కలమశం లేని మంచి మనసులు వాళ్ళవి అంటుంది సుశీలమ్మ.కానీ శోభ మాత్రం.. ఎలాగైనా గొడవ చేయాలని ఫిక్స్ అవుతుంది. మీనా బంగారం నకిలీ అని హేళన చేస్తోంది. అక్కడ గొడవ పెద్దగా అవుతుందోనని శృతి తన తల్లిని తీసుకొని బయటికి వెళుతుంది. 'నా ఫ్యామిలీ విషయంలో మరోసారి నువ్వు వేలు పెట్టొద్దు, మరోసారి నా ఇంటికి రావద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చి శోభనం అక్కడి నుండి పంపిస్తోంది.

మరోవైపు సంజు..తన భార్య మౌనిక మీరు డౌట్ వస్తుంది.మౌనిక ఏ గుడికి వెళ్ళింది? అని ఆరా తీస్తాడు. తన తల్లి సువర్ణ..'కనీసం పూజ చేసుకోనివ్వవా ? అంటుంది. 'నాకు ఆ గుడి పేరు చెప్పు.. నేను వెళ్లి తీసుకొస్తా ?అని బదులిస్తాడు. 'మౌనికకు ఆ గుడి కొత్తెం కాదు వస్తుందిలే. అనవసరంగా టెన్షన్ పడకు చక్కగా టిఫిన్ చేసి వెళ్ళు' అంటుంది. కానీ, సంజీవ్ మాత్రం కోపంతో వెళ్లిపోతాడు. మరోవైపు మౌనికకు ఫోన్ల మీద ఫోన్లో రావడంతో తాను వెళ్ళిపోతానని అంటుంది. కానీ కేక్ కట్ చేసిన తర్వాత వెళ్లిపొమ్మని రిక్వెస్ట్ చేయడంతో ఆగిపోతుంది.

ఇక కేక్ కూడా తీసుకు వస్తారు. బామ్మ కేకు రెడీ అయింది వచ్చి తొందరగా కట్ చెయ్యి అని రవి అనగా.. బాలు రానివ్వండి వాడు వచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తూ ఉంటా.. అని సుశీలమ్మ అంటుంది. దీంతో ప్రభావతి కలగజేసుకొని..'వాడు ఎక్కడ తాగి పడుకున్నాడో. వాడు వచ్చినట్లే మీరు కేక్ కట్ చేసినట్లే' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. మనోజ్ కూడా వాడి కోసం మేమంతా వెయిట్ చేయాలా? వాడు ఏడ తాగి పడుకున్నాడో అని వెటకారంగా మాట్లాడుతాడు. దీంతో మీ నాకు ఎక్కలేని కోపం వస్తుంది. 'అనవసరంగా ఆయనపై ఆబండాలు వేయకండి' అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్ కమింగ్ సీరియల్.. బాలు తన బామ్మ చిన్ననాటి స్నేహితులను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. దీంతో సుశీలమ్మ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. సుశీలమ్మ చివరి కోరిక తీర్చిన బాలుకి ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X