Gunde Ninda Gudi Gantalu November 14th Episode: బామ్మకు సర్ప్రైజ్ ఇచ్చిన బాలు.. సుశీలమ్మ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ?

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ లో సుశీలమ్మ సుమతి పెళ్లి గురించి మంచి మాట మాట్లాడుతుంటే, ప్రభావతి మాత్రం "సుమతి పెళ్లి చేయాలంటే ఎవరో ఒకరు చావాలి" అంటూ అసహ్యకరమైన వ్యాఖ్య చేస్తుంది. దీంతో ఇంట్లో వారంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సత్యం, శృతి, మీనా, బామ్మ వరుసగా ఆమెను నిందిస్తారు. దీంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది. ఇలాంటి సమయంలో శోభ హౌస్‌లోకి ప్రవేశించి "మిడిల్ క్లాస్ ఇళ్లలో కూడా బర్త్‌డే ఫంక్షన్ చేస్తారా?" అంటూ హేళనగా మాట్లాడటంతో మరోసారి గొడవ రాజుకుంది. మీనాక్షి, సుశీలమ్మ ఆమె మాటలకు కూడా తగిన కౌంటర్లు ఇస్తూ సీనును హైలైట్ చేశారు. సుమతి-రవి సరదాగా గొడవ పడుతున్నప్పుడు ప్రభావతి మరోసారి నోరు జారింది.

అయితే శృతి ఆ విషయాన్ని పాజిటివ్‌గా మలుస్తూ రవిని సుమతితో కొట్టిస్తుంది. దీంతో మరోసారి ఇంట్లో నవ్వుల పువ్వులు పూశాయి. శృతి చేతలకు సత్యం కూడా ఇంప్రెస్ అయి "వయసులో చిన్నదైనా మనసు పెద్దది" అని ప్రశంసించాడు. శోభ మాత్రం మీనా బంగారం నకిలీ అని ప్రస్తావిస్తూ కొత్త గొడవకు తెరలేపడానికి ప్రయత్నించగా, శృతి ఘాటుగా హెచ్చరిస్తూ "ఇక మీదట నా ఇంటికి రాకు" అని బయటకు పంపించింది. మరోవైపు సంజీవ్ మౌనికపై అనుమానంతో తల్లి సువర్ణతో తగువాడి కోపంతో బయటకు వెళ్లిపోతాడు. కేక్ కటింగ్ సమయంలో కూడా బాలు రాకపోవడంతో బామ్మ అతనిని ఎదురు చూడాలని చెబుతుంది. ప్రభావతి, మనోజ్ అతడిని అవమానించేలా మాట్లాడుతుండగా, మీనా వారిని నిలదీసింది. శుక్రవారం (నవంబర్ 14 వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 554 November 14th 2025 here is full story
Courtesy: Jiohotstar

బాలు రాకపోవడంతో ప్రభావతి మనోజ్ అతి చేస్తారు. 'వాడు రాకపోతే ఏంటి? కేక్ కట్ చేయండి' అంటూ బామ్మను ఒత్తిడి చేస్తారు. దీంతో సుశీలమ్మ.. 'అసలు బాలు కి ఏమైంది? వాని ఫోన్ కూడా కలవడం లేదా? వాడు ఎటు వెళ్ళాడు?' అంటూ మీనాను సుశీలమ్మ అడుగుతుంది. దీంతో రవి జోక్యం చేసుకొని..' బామ్మ అనవసరంగా టెన్షన్ పడకు.. మా లాగానే అన్నయ్య కూడా ఏదో ఒక బహుమతి తీసుకురావడానికి వెళ్లి ఉంటాడు కాసేపు వెయిట్ చేద్దాం' అంటాడు. కానీ మనోజ్ మాత్రం..'కొంటాడు కొంటాడు ఏదో ఫుట్ పాత్ మీద దొరికిన వాటిని బేరం చేస్తూ ఉండే ఉంటాడు' అని బాలు ని హేళన చేసి మాట్లాడుతాడు.

దీంతో మీనా కోపంతో 'అత్తగారింటి సొమ్ముతో వ్యాపారం చేసే మీరు కూడా మాట్లాడుతున్నారా? ఏ రోజైనా భార్యకు మూరేడు మల్లెపూలు తెచ్చారా? అని నిలదీస్తుంది మీనా. దీంతో రోహిణి 'మా ఆయనను ఎందుకు లాగుతున్నావు?' అంటుంది. దీంతో మీనా 'ఇది మా సమస్య.. మీ ఆయన మా ఆయనను ఎందుకు లాగుతున్నాడు?' అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. దీంతో శృతి కూడా మీనాకు సపోర్ట్ గా నిలుస్తుంది. అందరూ ఆంటీ లాగా తన భర్తను తిడుతుంటే సైలెంట్ గా ఉండిపో లేరు కదా అంటూ సెటైర్ వేస్తోంది.

సమయం మించి పోవడంతో బాలుకి ఫోన్ చేసావా? అని సత్యం మీనాను అడుగుతాడు. దీంతో మీనా బదులుస్తూ ఫోన్ చేశాను మామయ్య కానీ అతని ఫోన్ స్విచాఫ్ వస్తుంది అంటూ బదిలిస్తుంది. పక్కనున్న ప్రభావతి జోక్యం చేసుకొని..'అప్పు పుట్టగా ఎక్కడో దీనంగా కూర్చొని ఉంటాడు' అంటూ అవమానిస్తుంది. దీంతో మీనా 'మీ పెద్ద కొడుకులా.. గుడి ముందు మాత్రం అడుక్కోడు' అని దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇస్తుంది. బాలు రాకపోవడంతో సుశీలమ్మ కూడా కంగారుపడుతుంది. ఇంతకీ ఏం జరిగిందో అని ఆందోళన చెందుతుంది. 'మీరు అనవసరంగా కంగారు పడకండి బామ్మ గారు.. బాలు ఎక్కడికి వెళ్లినా క్షేమంగానే ఇంటికి చేరుకుంటారు' అంటుంది మీనా.

దీంతో మనోజ్ కలగజేసుకొని 'బామ్మ బాలు వచ్చేంతవరకు మా గిఫ్ట్ అయినా తీసుకో' అంటూ బలవంతం చేస్తాడు. దీంతో బామ్మ అంగీకరిస్తుంది. అలా మొదట మనోజ్ వచ్చి.. నవరత్నాల హారాన్ని గిఫ్టుగా ఇస్తాడు, తర్వాత రవి తాను నీకోసం స్పెషల్ గా బర్త్డే కేక్ చేశానని, నెక్స్ట్ తన బేకరీ లో కూడా ఈ కేకును ప్రారంభించబోతున్నానని చెప్తాడు. తర్వాత శృతి వచ్చి బామ్మ మీ కోసం స్పెషల్ గిఫ్ట్ అంటూ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తుంది. తనకు ఆపరేటింగ్ రాదు కదా అని బామ్మ అనడంతో.. నేర్పిస్తా కంగారు పడకు అమ్మ అని బదిలీస్తుంది. తర్వాత ప్రభావతి కూడా నేను కూడా ఓ గిఫ్ట్ తెచ్చాను అత్తయ్య మీకోసం పెద్ద టీవీ తీసుకున్న అని.. మీనాక్షి తెచ్చిన పాత టీవీని తన అత్తయ్యకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ తర్వాత మీనా అమ్మ పార్వతి చీరను గిఫ్ట్ తీసుకువస్తుంది.

ఆ గిఫ్ట్ ను సుమతితో ఇప్పిస్తుంది. ఇది 200 లా.. 300లా అంటూ హేళన చేస్తుంది. ఇక రోహిణి నువ్వేం గిఫ్ట్ తెలీదా అని మీనాక్షి అడగగా.. నేను బామ్మకు మేకప్ చేశా.. నీదే అందరికంటే బెటర్ ఖర్చులేని పని అంటూ ఓ చురుక అంటిస్తుంది. ఇక లేటవుతుంది మేము వెళ్ళిపోతున్నాం అని పార్వతి, సుమతి వెళ్ళిపోతారు. ఇప్పుడైనా కేక్ కట్ చేయండి అందరికీ ఆకలి వేస్తుందని ప్రభావతి ఒత్తిడి చేస్తుంది. 'నా మనవడు వచ్చేంతవరకు నేను కేక్ కట్ చేయను.. కావాలనుకుంటే మీరే తినండి ' అని బామ్మ భీష్మించి కూర్చుంటుంది. ఇంతలోనే బాలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు. 'మీనా నేను తెచ్చే గిఫ్ట్ ఎవరు ఊహించనిది. అందుకే ప్రతి క్షణం గుర్తుండిపోయేలా వీడియో తీయు' అని చెబుతాడు. దీంతో ఇంట్లో వారు కూడా షాక్ అవుతారు ఇంతకీ బాలు ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడు అని ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉంటారు.

ముందుగా బామ్మ చిన్ననాటి స్నేహితురాలు సుబ్బులు (సుబ్బలక్ష్మి)నీ తీసుకువచ్చి చూపిస్తాడు. దీంతో సుశీలమ్మ ఫిదా అయిపోతుంది. తన చిన్ననాటి జ్ఞాపకంలోకి వెళ్లిపోతుంది. ఆ సర్ప్రైజ్ తో ఆగకుండా బాలు మరో సర్ప్రైజ్ ఇస్తాడు. బామ్మ మరో చిన్ననాటి స్నేహితురాలు అయినా రాజ్యలక్ష్మి (రాజి) కూడా పిలుస్తాడు. దీంతో సుశీలమ్మ ఆనందానికి అంతులేకుండా పోతుంది. బాలు అందరితో ఆగకుండా బామ్మ మరో స్నేహితురాలైన సత్య (సత్యవతి)ని కూడా తీసుకువచ్చి ఆశ్చర్యపరుస్తారు. ఇలా భామ చిన్ననాటి స్నేహితులను తీసుకువచ్చి బామ్మకు మరచిపోలేని గిఫ్ట్ అందిస్తాడు బాలు. ఈ విషయాలు నీకెలా తెలుసురా ..? అని బాలుని అడగగా.. నాకు మీనా చెప్పింది అని అసలు ట్విస్ట్ బయటపెడతాడు.

ఉదయం వేళ బామ్మ తన చివరికి కోరికను మీనాకు చెప్పడంతో.. మీనా ఆ విషయాన్ని బాలుకి చెప్పి ఆ కోరికను నెరవేర్చమని అంటుంది. అలా బాలు బామ్మ చివరి కోరికను నెరవేర్చి పుట్టినరోజు నాడు ఎవరు ఊహించలేని విధంగా గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటుంది. బామ్మ స్నేహితురాలైన సత్య కూడా ఎవరు ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఇస్తుంది. బామ్మ లవర్ గోపాలం ను బర్త్డే పార్టీకి తీసుకువస్తుంది. వాస్తవానికి గోపాలం.. సుశీలమ్మని ఇష్టపడతాడు. కానీ, సుశీలమ్మ ఈరోజు కూడా అతన్ని చూడదు. చివరికి గోపాలం.. సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. మొత్తానికి బామ్మ వన్ సైడ్ లవ్ స్టోరీ కూడా బయటపడుతుంది. ఇలా బామ్మ 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించగా.. బాలు ఎవరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి. బామ్మ మనసును గెలుచుకుంటాడు. మరి బామ్మ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X