Gunde Ninda Gudi Gantalu November 17th Episode: బిగ్ సర్పైజ్.. సుశీలమ్మ లవర్ ఎంట్రీ.. బాలుకి రిటర్న్ గిప్ట్..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ లో సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలు ఆనందంగా సాగుతుండగా, బాలు కనిపించకపోవడంతో ఇంట్లో టెన్షన్ మొదలవుతుంది. బాలు రాకపోతే కేక్ కట్ చేయనని బామ్మ పట్టుదలగా చెబుతుంది. మనోజ్, ప్రభావతి బాలుపై సెటైర్లు వేస్తూ అవమానించే ప్రయత్నం చేస్తారు. అయితే మీనా తన భర్తను సమర్థించగా, సుశీలమ్మ కూడా మీనాను మెచ్చుకుంటుంది. గిఫ్టులు అందించిన తరువాత చివరకు బాలు ఎంట్రీ ఇస్తాడు. "నీ కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్" అంటూ బామ్మ కళ్లుమూయమని చెబుతాడు.

సుశీలమ్మ కళ్లుతెరిస్తే, ఆమె చిన్ననాటి స్నేహితులు సబ్బులు, రాజీ, సత్య ఒక్కొక్కరిగా వస్తారు. వారిని చూసి బామ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా పంపిన వీడియోలోని 'చివరి కోరిక' నెరవేర్చడానికే ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశానని బాలు చెబుతాడు. బాల్యం జ్ఞాపకాలు, పాత పాటలు, నవ్వులు ఇంటిని నింపేస్తాయి. అదే సమయంలో సత్యవతి మరో పెద్ద సర్ప్రైజ్ ఇస్తూ సుశీలమ్మ వన్‌సైడ్ లవర్ గోపాలాన్ని కూడా తీసుకొస్తుంది. గోపాలం ఎంట్రీతో బామ్మ సిగ్గుతో నవ్వుతుంది. ఈ సరదా మధ్య ఆమె పాత ప్రేమకథను అందరితో పంచుకుంటుంది. చివరకు బాలు చేసిన సర్ప్రైజ్‌కు కృతజ్ఞతగా, "నా నిజమైన గిఫ్ట్ నువ్వే బాలు" అంటూ ప్రత్యేక రిటర్న్ గిఫ్ట్‌ను అతనికే ఇస్తుంది.ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ లూక్కేయండి.

Gunde Ninda Gudi Gantalu serial episode 555 November 17th 2025 here is full story

Courtesy: Jio hotstar

పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాలు.. సుశీలమ్మ బాల్యస్నేహితులందరినీ ఒక దగ్గరికి చేర్చుతాడు. దీంతో బామ్మ సంతోషం ఆకాశాన్ని అంటుతుంది. తన చిన్ననాటి గుర్తులను నేమరు వేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో తన ఫ్రెండ్ సత్యవతి.. నేను కూడా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను అంటూ.. తన భర్త గోపాలం పిలుస్తోంది. అయితే గోపాలం ఒకప్పటి సుశీలమ్మ వన్ సైడ్ లవర్. అతన్ని చూడగానే సుశీలమ్మ సిగ్గుతో తలవంచుకుంటుంది. 'సుశీల బాగున్నావా?' అని గోపాలం తాత ప్రశ్నించగా.. సిగ్గుతో బాగున్నానంటూ బదిలిస్తుంది. ఇలా ఒకరినొకరు కుశల ప్రశ్నలు అడుక్కుంటారు. వీరిద్దరిని ఇలాగే వదిలేస్తే.. పార్క్ వెళ్లి పాడుకునే ఎలా ఉన్నారు అంటూ సత్యవతి సెటైర్ వేస్తోంది.

వీళద్దరి లవ్ స్టోరీ చెప్పండని శృతి క్యూరియాసిటీ గా అడుగుతుంది. దీంతో గోపాలం తన లవ్ స్టోరీని చెబుతాడు. తాను చిన్నప్పుడు సుశీలను ఇష్టపడే వాడినని, ఓ రోజు సుశీల బ్యాగులో లవ్ లెటర్ పెడితే.. అది నా పెళ్ళాం సత్యవతికి చేరింది. దీంతో మా ఇంట్లో వారు సత్యవతిని ఇచ్చి పెళ్లి చేశారంట. తన లవ్ స్టోరీ ని బయటపెడతాడు గోపాలం. ఈ విషయం నాకు మా శోభనం రోజు చెప్పాడని, ఈ కారణంగా మా శోభనం పదేళ్లపాటు జరగలేదని సత్యవతి చెబుతుంది. దీంతో ఇంట్లో నవ్వుల పువ్వులు పూస్తాయి.

మీ ఆయనను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చారు.. తప్పుగా అనిపించడం లేదా ఏంటి? అని కామాక్షి ప్రశ్నించగా.. ఈ వయసులో డూయేట్స్ పాడుకుంటారా? ఏంటి సెటైర్ వేస్తుంది. మొత్తానికి, సుశీలమ్మ తన బాల్యపు స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా తన స్నేహితులతో గడుపుతుంది. నా మనవడు నా బాల్యాన్ని దోసిట్లో తీసుకువచ్చాడు. ఒక్కసారైనా నా స్నేహితులను కలవాలని కోరికను నా మనవడు ఈరోజు తీర్చాడు. నా 75వ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు గుర్తుంది పోయేలా చేసాడు అంటూ సుశీలమ్మ ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత సుశీలమ్మ కేక్ కటింగ్ చేస్తూ తన కొడుకు సత్యం అని పిలుస్తోంది. దీంతో ప్రభావతి తనని పిలువ లేదని ఫీల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించిన సుశీలమ్మ.. నా కోడలు గుణవంతురాలు. భరతనాట్యం డాన్స్ టీచర్, ఏంటిది ఒకే తాటిపై నడిపిస్తున్న సమర్ధురాలు అంటూ పొగడ్తలతో ముంచేస్తుంది సుశీలమ్మ. దీంతో ప్రభావతి ఐస్ లాగా కరిగిపోతుంది. వెంటనే సుశీలమ్మ దగ్గరికి వెళ్లి.. గట్టిగా కౌగిలించుకుంటుంది. తర్వాత గోపాలం తాత కూడా వచ్చి , తన లవర్ సుశీల డార్లింగ్ కేక్ తినిపిస్తాడు. సుశీలమ్మ కూడా గోపాలం తాత కు కేక్ తినిపిస్తుంది. దీంతో గోపాలం తాత ఈ జన్మకు ఇది చాలు అంటూ ఎమోషనల్ అవుతాడు.

ఇలా అందరూ బామ్మకు కేక్ తినిపిస్తూ సంతోషంగా గడుపుతారు. ఇదే నా కుటుంబం 75 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా గడుపుతున్నానంటే కారణం వీళ్ళందరూ అని తన కుటుంబం గురించి చెప్పుకుంటుంది. ఈ క్రమంలో సుశీలమ్మ తన మనుమలు, మనమరాలు, వారు చేసే పనులను గురించి తన స్నేహితులతో గొప్పగా చెప్పుకుంటుంది. దీంతో తన స్నేహితురాలు.. 'నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మాకు కొడుకులు కూతుర్లు ఉన్నారు. కానీ, ఏ రోజు కూడా ఇలా పుట్టినరోజు వేడుకలు చేయలేదు. కనీసం ఫోన్ కూడా నాతో మాట్లాడడానికి వారికి సమయం లేదు’ అంటూ సుశీలమ్మ స్నేహితురాలు ఎమోషనల్ అవుతారు.

తన స్నేహితులతో. ఇంతలో మనవి కలుగ చేసుకుని బామ్మ మీ మనసుకి నచ్చిన గిఫ్ట్ ఇస్తే మీరు మళ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు ఏంటి అది అంటాడు. మన అందరిని ఒక దగ్గర చేర్చి జీవితంలో మర్చిపోలేని, పండుగలా మార్చాడు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మనసుకు నచ్చే బహుమతిని బాలు ఇచ్చాడు. అందుకే వాడికి రిటర్న్ గిఫ్ట్ ను బాలుకి ఇవ్వాలని భావిస్తున్నా అంటుంది సుశీలమ్మ.

దీంతో బాలు షాక్ అవుతాడు. నేనే గిఫ్ట్ ఇచ్చాను బామ్మ అనగా.. ఏ డబ్బుతో కొనలేనిది స్నేహం.. అలాంటి స్నేహితులందరినీ ఒక్క దగ్గర కలిపావ్. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. నా జీవితంలో మర్చిపోలేని బహుమతినిచ్చావు అంటూ సుశీలమ్మ తనకు వారసత్వంగా వచ్చిన బంగారు గొలుసును బాలుకు ఇస్తుంది. దీంతో ప్రభావతి, మనోజ్ నా మొఖం మాడిపోతుంది.

ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో. ప్రభావతి, మనోజ్ లా బాగోతం బయటపడినట్లు తెలుస్తోంది. బామ్మ పుట్టినరోజు వేడుకలు పూర్తికాగానే.. బాలు రెచ్చిపోతాడు. మీనాకు ఇచ్చిన గింటి నగలను తీసుకువచ్చి,ప్రభావతి ముందు పెడతాడు. దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. తనకేం తెలియనట్లు నటిస్తోంది. తల్లి, కొడుకులు కలిసి మీనా నగలను గింటినగలుగా మార్చారు అంటూ బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీనా కూడా తనకు మొదటి నుండి అనుమానం వస్తుందని, కానీ బామ్మ పుట్టినరోజు వేడుక ఉంది. కాబట్టి ఇంట్లో గొడవ జరగకూడదని తాము సైలెంట్ గా ఉన్నామని మీనా అంటుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. సత్యం ఈ విషయంలో ఎంటర్ అయ్యి.. ప్రభావతిని నిలదీస్తాడు. మరి ప్రభావతి నిజం ఒప్పుకుంటుందా? లేదా? మనోజ్ మరో కట్టు కథ అల్లుతాడా? అనేది వేచి చూడాలి. మొత్తానికి కమింగ్ అప్ ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X