Gunde Ninda Gudi Gantalu November 18th Episode: ప్రభావతి బాగోతం బట్టబయలు.. మనోజ్ మోసం వెలుగులోకి..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్‌లో బాలు సుశీలమ్మ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆమె బాల్య స్నేహితులందరిని ఒకచోటికి చేర్చి ప్రత్యేక వేడుక ఏర్పాటు చేస్తాడు. అనుకోని సర్ప్రైజ్‌తో సుశీలమ్మ ఆనందానికి హద్దులు ఉండవు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఎమోషనల్ అవుతుంది. ఈ వేడుకలో ఆమె స్నేహితురాలు సత్యవతి భర్త గోపాలం కూడా వస్తాడు. అతను ఒకప్పుడు సుశీలమ్మకు వన్ సైడ్ లవర్ అయిన విషయం బయటపడటంతో ఇంట్లో నవ్వుల పువ్వులు పూస్తాయి. వారి లవ్ స్టోరీ చెప్పమని శృతి అడగగా, గోపాలం సుశీలకు రాసిన ప్రేమలేఖ తప్పుగా సత్యవతికి చేరి ఆమెతోనే పెళ్లి అయ్యిందని చెబుతాడు.
ఈ విషయం పెళ్లి రాత్రే తెలిసి "శోభనం పదేళ్లు జరగలేదు" అంటూ సత్యవతి నవ్వు తెప్పిస్తుంది. కేక్ కటింగ్ సమయంలో సుశీలమ్మ తన కోడలు ప్రభావతిని ప్రశంసిస్తూ కౌగిలించుకుంటుంది. తర్వాత సుశీలమ్మ గోపాలంకు కేక్ తినిపించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతలో బాలు ఇచ్చిన సర్ప్రైజ్ తన జీవితంలో అందుకున్న గొప్ప బహుమతి అంటూ సుశీలమ్మ భావోద్వేగానికి లోనవుతుంది. "డబ్బుతో కొనలేని స్నేహాన్ని తిరిగి ఇచ్చావు" అంటూ తన వారసత్వ బంగారు గొలుసును బాలుకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తుంది. దీంతో ప్రభావతి-మనోజ్ షాక్ అవుతారు. మొత్తానికి సుశీలమ్మ పుట్టిన రోజు వేడుక ఒక పండుగలా మారుతుంది. ఇంకా మంగళవారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
తన పుట్టినరోజు వేడుకను మర్చిపోలేని జ్ఞాపకం గా మార్చినందుకు బాలు మీనాలకు తన తరతరాలుగా వస్తున్న బంగారు ఆభరణాన్ని గిఫ్ట్ గా ఇస్తుంది సుశీలమ్మ. దీంతో ప్రభావతి, మనోజ్, రోహిణిల ముఖం మాడిపోతుంది. 'ఆభరణాన్ని ప్రతి సంవత్సరం మన ఊర్లోని గుడిలో పూజ చేయించాలని, ఈ ఆభరణాన్ని తనకు తన అత్తయ్య.. వాళ్లకు వాళ్ల అత్తమ్మ ఇచ్చిందని, ఇలా తరతరాలుగా వస్తున్న మన వంశ గౌరవం ఇది.. మీ చేతుల్లో పెడుతున్న.. దీన్ని పెట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు' బామ్మ అంటుంది. ఆ రిటర్న్ గిఫ్ట్ ను చూస్తూ మీనా సంతోషపడుతుంది. ఇంతలోనే బాలు వచ్చి ఎన్నాడు లేనిది మీనా బంగారం చూసి మురిసిపోతుందా? అంటాడు బాలు. 'కాదు.. ఇది బామ్మ ఇచ్చిన గౌరవం, ప్రేమ..' అని మీనా గర్వంగా చెప్తుంది.
ఈ కానుక దక్కడానికి కారణం నువ్వే అంతా నీ వల్లనే, బామ్మ కోరికలు నువ్వు చెప్పకపోయి ఉంటే.. నేను బామ్మా స్నేహితురాలను తీసుక వచ్చేవాడిని కాదు అని మీనా ను ప్రశంసిస్తాడు బాలు. బామ్మ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఇద్దరూ భావిస్తారు. ఇంతకీ నకిలీ బంగారం విషయం బాలుకు గుర్తు వస్తుంది. బామ్మ ఊరేళ్లదాకా..ఇంట్లో పెద్ద యుద్ధమే జరగబోతుంది. జీవితంలో అలాంటి పనిచేయకుండా వారికి బుద్ధి చెప్తా. మరోసారి అలాంటి తప్పు చేయాలంటే.. భయపడాలని బాలు అంటాడు. 'ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎలా ఉంటాడో?' అని మీనా టెన్షన్ పడుతుంది.
మరోవైపు.. మౌనిక తన ఇంటికి చేరుకోగానే సంజు.. 'ఎక్కడికి వెళ్లావు ?'అని ఆరా తీస్తాడు. తాను గుడి వెళ్లాను. సరే, కానీ భోజనం చేశారా? అని మౌనిక అడగగా.. 'నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ.. నా అనుమానం తీరాలి' అని ఆవేశంగా అంటాడు. దీంతో మౌనిక 'మీ అనుమానం ఏంటో అడగండి ' అంటుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? అని మరోసారి సంజీవ్ అడుగుతాడు. తాను గుడికి వెళ్లానని, అక్కడ పూజ జరిగిందని అంటుంది. 'లేదు మా అమ్మ అసలు నిజం చెప్పింది.. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లావు కదా' అని కన్పూజ్ చేస్తాడు. ఇంతలోనే సంజు తల్లి వచ్చి.. 'గుడికి వెళ్లాను అని చెప్పాను కదా.. మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తే వెళ్లిన చోటు మారుతుందా?' అని కవరింగ్ చేస్తుంది.
సరే ఇప్పటికి నా అనుమానం తీరింది. ఏదో ఒక రోజు దొరుకుతావు కదా అంటూ సంజు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. సంజీవ్ తల్లి.. ఫంక్షన్ ఎలా జరిగిందమ్మ అని అడుగగా.. చాలా బాగా జరిగింది అత్తయ్య నేను వస్తుంటే.. ఉండమని అందరూ రిక్వెస్ట్ చేశారు అంటుంది. ఫైనల్గా తన అత్తయ్యకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది.
ఇక మరుసటి రోజు బాలు తన బామ్మను బస్టాండ్ లో డ్రాప్ చేస్తాడు. ఆ సమయంలో సుశీలమ్మ బాలుని.. 'అసలు ఏమైంది? ఎందుకు డల్ గా ఉన్నావ్? నీకు మీనాకు ఏమైనా గొడవ జరిగిందా? లేదా మీ అమ్మ మిమ్మల్ని ఏమైనా అన్నదా?' అని పలు ప్రశ్నలు వేస్తుంది బామ్మ. కానీ, బాలు మాత్రం వాటిని దాటవేస్తూ అంత బాగానే ఉంది ఏం కాలేదు అనవసరంగా మాపై టెన్షన్ పెట్టుకోవద్దు' అని అంటాడు. అలా భామను ఊరికి పంపించిన బాలు ఇంటికి రాగానే తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. 'రావడం రావడంతోనే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లకుండా తాళం వేస్తాడు.
మనోజ్ రోహిణి ఇద్దరు బయటకు వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అసలు బాగోతాన్ని బయటపెడతా .. అని మనోజ్ ను నెట్టేస్తాడు బాలు. దీంతో రోహిణికి కోపం వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ అరుస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి చేరుకుంటారు. ఏం జరిగింది రా అని సత్యం అనగా ఈరోజు తల్లి కొడుకుల బాగోతాన్ని బయటపెడతా. వీళ్ళు చేసిన మోసాన్ని రెండు రోజులుగా ఓపిక పట్టి ఆగా.. అని బాలు ఆవేశంగా అంటాడు. దీంతో రవి అసలు ఏం జరిగిందన్నయ్య మళ్ళీ ఏం చేశారు నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. దీంతో బాలు ఆ నగలను తీసుకురమ్మని మీ నాకు చెప్తాడు. దీంతో మీనా కవరింగ్లను తీసుకువచ్చి ప్రభావతి ముందు పెడుతుంది. దీంతో తమ విషయం బయటపడిందని మనోజ్ కంగారు పడతాడు. వెంటనే తన తల్లి పక్కకు చేరుకుంటాడు.
దీంతో సత్యం.. ఏం చేసావ్ ప్రభావతి అనగా.. 'నేనేం చేశాను.. వానికన్నట్టే వీడిని కూడా కన్నా.. అదే నేను చేసిన పాపం' అంటుంది ప్రభావతి . 'బామ్మ పుట్టినరోజు నాడు ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని, అమ్మ దగ్గర మీనా నగలను తీసుకున్నాను. మీ ముందే ఆ నగలను తీసి ఇచ్చింది. ఆ విషయం మీరు కూడా చూశారు. ఆ నగలను తాకట్టుపెట్టి.. బామ్మకు గొలుసుకుందామని గోల్డ్ షాప్ కి వెళ్ళాం. అక్కడ ఈ నగలను పరిశీలించిన ఆ వ్యాపారి, ఇవి నకిలీ నగలని, మమ్మల్ని దొంగల్ని చూసినట్టు చూశారు. ఆ క్షణం మాకు తల తీసినట్లు అయ్యింది' అని బాలు ఎమోషనల్ అవుతాడు. 'మరి ఆరోజు ఎందుకు ఈ నిజాన్ని బయటపెట్టలేదు' అని సత్యం అడగగా.. 'బామ్మ పుట్టినరోజు నాడు అనవసరంగా గొడవలు ఎందుకని నేనే ఆపాను మామయ్య' అంటుంది మీనా.
దీంతో ప్రభావతి 'నాకేం తెలుసు.. నేను ఏ పాపం చేయలేదు.. మీనా ఇచ్చినాడే నాకు నకిలీ నగలు ఇచ్చి ఉండొచ్చు. ఈరోజు నా మీద లేనిపోని ఆ బండాలు వేస్తున్నారు. ఎన్నిసార్లు మీనా ఆ నగలు వేసుకొని తన పుట్టింటికి వెళ్లి రాలేదు. ఆ సమయంలోనే వాటిని కవరింగ్ నగలుగా మార్చొచ్చు'అని ప్రభావతి తన తప్పును కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీ నాకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది.
'ఇప్పటివరకు అత్తయ్య అనే గౌరవంతో మాట్లాడుతున్న.. అనవసరంగా నా పుట్టింటి మీద నిందలు వేయకండి’ అని మీనా వార్నింగ్ ఇస్తుంది. కానీ ప్రభావతి మాత్రం 'నువ్వు ఇచ్చినప్పుడే గింటినగలు ఇవ్వచ్చు. నువ్వు అనవసరంగా నామీద నిందలు వేయకని తన తప్పును కవరింగ్ చేస్తుంది. అసలు బాగోతాన్ని ఎలాగైనా బయటపెడతా అని బాలు అంటారు. దీంతో ప్రభావతి, మనోజ్ లో టెన్షన్ పడతారు. ఈ అప్ కమింగ్ ఎపిసోడ్లో బాలు, మీనా ఇద్దరు కలిసి రవి, శృతి లకు జరిగిన మోసాన్ని చెబుతారు. ఎలాగైనా నిజం రాబట్టాలని ప్లాన్ వేస్తారు.


Click it and Unblock the Notifications











