Gunde Ninda Gudi Gantalu November 19th Episode: మీనా, సుశీలమ్మపై ప్రభావతి నిందా.. బాలు మాస్టర్ ప్లాన్..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ లో బామ్మ పుట్టినరోజు వేడుకను మరపురాని ఘట్టంగా మార్చిన బాలు-మీనాలకు సుశీలమ్మ తరతరాలుగా వస్తున్న బంగారు ఆభరణాన్ని కానుకగా ఇస్తుంది. ఆ గౌరవాన్ని చూసి మీనా ఆనందంతో మురిసిపోతుంది. కానీ బాలు మాత్రం ఆభరణాల నకిలీ కథను గుర్తు చేసుకుంటాడు. బామ్మను బస్టాంప్ లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన వెంటనే బాలు.. తన తండ్రి సత్యం ముందు అసలు బాగోతాన్ని బయటపెడతానని ఆగ్రహంతో ఇంటి తలుపులు మూసేస్తాడు. మనోజ్-రోహిణి బయటకు వెళ్లకుండా ఆపి, మీనా చేతుల్లో ఉన్న ఆభరణాలను అందరి ముందు పెట్టిస్తాడు.

దీంతో మనోజ్, ప్రభావతి షాక్‌ అవుతారు. "బామ్మకు గొలుసు కొనాలనుకుని, మీనా ఆభరణాలు తీసి గోల్డ్ షాప్‌కి వెళ్ళాం. అక్కడ ఇవి నకిలీ అని చెప్పారు!" అని బాలు చెబుతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ప్రభావతి మాత్రం తప్పును మీనా మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. మీనా కూడా "అన్నీ ఓర్చి ఉన్నాం కానీ నా పుట్టింటి మీద నిందలు వేయొద్దు" అంటుంది. బాలు కూడా "బామ్మ కోసం నేను ఓపికపట్టా.. కానీ ఇక నిజం బయటపెడతా" అని వార్నింగ్ ఇస్తాడు. బాలు-మీనా కలిసి రవి, శృతి ముందుకు ఈ మోసాన్ని తీసుకెళ్తారు. అసలు నేరస్థులు ఎవరన్నది బయటపెట్టడానికి ప్లాన్ వేస్తారు. దీంతో ఇంట్లో పెద్ద కలవరమే రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా బుధవారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 557 November 19th 2025 here is full story

Courtesy: Jio hotstar

నకిలీ నగల గురించి ప్రభావతిని ప్రశ్నించగా.. మీనానే తనకు గిల్టీ నగలు ఇచ్చి ఉండొచ్చు అంటూ మీనాపై నింద వేస్తుంది. దీంతో మీనా కోపం ఆకాశాన్ని అందుకుంటుంది. 'మర్యాదగా మాట్లాడండి అత్తమ్మ.. లేకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది' అని వార్నింగ్ ఇస్తుంది. కానీ ప్రభావతి మాత్రం తనకు తప్పులేదు అన్నట్లు, ఆ తప్పు తాను చేయనట్లు వ్యవహరిస్తుంది. దీంతో మీనా 'మీకు మనస్సాక్షి ఉంటుంది కదా.. దానికి ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మాకు ఇతరుల సొమ్ము తినవలసిన అవసరం లేదు. ఇతరులను మోసం చేయాల్సిన అవసరం లేదు' అంటు పరోక్షంగా మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మీనా.

'ఏంటి తెగ మాట్లాడుతున్నావ్.. మీ ఇంట్లో మీ తమ్ముడు దొంగ కాదా.. నువ్వే నీ నగలను మార్చేసి ఉంటావు' అని మీనాపై ప్రభావతి మరోసారి నింద వేస్తుంది. దీంతో మీనా రెచ్చిపోతుంది. 'అనవసరంగా మా ఇంటి వారి గురించి మాట్లాడకండి. మీ పెద్ద కొడుకు దొంగ కాదా. మీ పెద్ద కోడలు దొంగ కాదా.. ఎన్నిసార్లు మాకు తెలియకుండా ఇంట్లో మోసాలు చేశారో మాకు తెలియదా' అంటూ మండిపడుతుంది. దీంతో ప్రభావతి టాపిక్ ను సుశీలమ్మ వైపు తిప్పుతోంది. 'మా అత్తగారు ఇచ్చినప్పుడే నీకు నకిలీ నగలను ఇవ్వవచ్చు లేదా ఆమె మోసపోవచ్చు' అంటుంది. దీంతో సత్యం 'ఏం మాట్లాడుతున్నావ్ అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?' అంటూ ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'లేదు.. లేదు.. మీ అమ్మ మోసం చేసిందని కాదు.. ఆమె మోసపోయి ఉండి ఉండొచ్చు కదా. ఆమె తెలియక అదే నగలను మీనాకు ఇచ్చి ఉండొచ్చు కదా' అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది ప్రభావతి.

దీంతో బాలు ఆగ్రహానికి లోనై 'రెండే రెండు రోజుల్లో అసలు నిజాన్ని బయట పెడతాను. మా అమ్మ మీద ఒట్టు' అంటూ బాలు ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనోజ్ తన తల్లి ప్రభావతి దగ్గరికి వెళ్లి .. 'సమస్యలు గట్టెక్కించినందుకు థాంక్స్' అంటాడు. ప్రభావతి మాత్రం 'నీవల్ల నా ప్రాణాలు పోయినట్లే ఉంది. చూసావు కదా.. సమస్యను మీనావల్ల ఇంటిదిక్కు.. మీ బామ్మ వైపు.. మళ్ళించాను. కాబట్టి, మనం బయటపడ్డాం.. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది' అని మనోజ్ ను ప్రభావతి తిడుతుంది.

ప్రభావతి అంతటితో ఆగకుండా.. 'నీ జీవితాంతం నన్ను ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి నువ్వు పుట్టావు. నీ జీవితంలో ఇప్పటివరకు ఏదైనా మంచి పని చేసావా..? నువ్వు చేసే ప్రతి పనికి నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. నిన్ను కొట్టాలా? తిట్టాలో? నాకు కూడా అర్థం కావడం లేదు. ఎన్ని అన్న దున్నపోతు మీద వాన పడినట్లు వ్యవహరిస్తున్నావు'అంటూ మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రభావతి.

'నా జీవితంలో ఎన్నో అబద్ధాలు ఆడాను. ప్రతి సమస్య నీతోనే వస్తోంది. నీవల్ల ఏదైనా ఒక రోజు గుండె ఆగిపోతుంది' అంటూ ప్రభావతి ఎమోషనల్ అవుతుంది. కానీ, మనోజ్ మాత్రం లైట్ గా తీసుకుంటాడు. 'నువ్వే నా ఫేవరెట్ అమ్మ. నువ్వు కాకపోతే నన్ను ఎవరు కాపాడుతారు?' అంటూ ప్రభావతిని బుజ్జగిస్తాడు. దీంతో ప్రభావతి ' అసలు విషయం బయటపడితే.. దొరికితే పరువు పోతుంది. ముఖం ఎవరికి చూపించుకోలేం. ఆ కవరింగ్ నగలను వెంటనే మార్చేసేయ్' అని మనోజ్ ను రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి.

మరోవైపు.. మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది. వంటింట్లో సామానును ఇష్టం ఉన్నట్లు పడేస్తుంది. దీంతో బాలు వెళ్లి మీనాను శాంతింప చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ,బాలునే క్లాస్ పీకుతుంది. 'కవరింగ్ నగలు గురించి తెలిసినప్పుడు .. వీర లెవల్లో రెచ్చిపోయారు. కానీ,అడిగి సమయానికి మాత్రం.. సైలెంట్ అయిపోయారు'అని బాలుని తిడుతుంది.'నీ కోపంలో అర్థం ఉంది. కానీ అది సమయం కాదు. ఆ నగలు తీసింది మనోజ్, మా అమ్మ అని నాకు తెలుసు' అంటాడు. 'మరి ఎందుకు మాట్లాడలేదు?' అని మీనా ప్రశ్నించగా..'కాస్త ఓపిక పట్టు.. సమయం కోసం వెయిట్ చేస్తున్న..' అంటాడు బాలు. కానీ, మీనా మాత్రం 'ముల్లును ముల్లుతోనే తీయాలి. చూశారు కదా ఎలాంటి సంబంధం లేని మా అమ్మగారిపై, బామ్మపై నాపై మీ అమ్మ నిందలు ఎలా వేసిందో. నేను మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోను. ఈ సంగతి ఏంటో తెలుస్తాను' అంటూ మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది.

దీంతో బాలు 'అనవసరంగా ఆవేశపడకు.. దీనికి ప్లాన్ ఉంది. ఆ నగలను ఏదో ఒక షాపు నుండి కొని ఉంటాడు. ఆ షాప్ నుండి ఫోన్ చేస్తున్నట్లు మాట్లాడి మనోజ్ ను పట్టుకోవాలి' అని తన ప్లాన్ ను మీనాకు చెప్తాడు బాలు. మరి మాట్లాడేది ఎవరు అని ప్రశ్నించగా.. ఇంకెవరున్నారు మన డబ్బింగ్ చెప్పే శృతి ఉంది కదా అంటాడు. వెంటేనే బాలు శృతికి ఫోన్ చేసి రెస్టారెంట్ కి రమ్మంటాడు. బాలు చెప్పినట్లుగా శృతి రవి రెస్టారెంట్ కు వస్తుంది. ఇలా బాలు, మీనా, శృతి, రవి కలిసి నకీలి నగల విషయాన్ని చర్చిస్తారు. ఈ విషయాన్ని ఎలాగైనా బయట పెట్టాలని, నకిలీ నగల విషయాన్ని గురించి బాలు తన ప్లాన్ ని చెప్తాడు. దీంతో శృతి కూడా ఒప్పుకుంటుంది.

బాలు ప్లాన్ ప్రకారం..'నకిలీ నగల షాప్ నుండి మాట్లాడుతున్నట్లు మనోజ్ కు ఫోన్ చేసి.. ఆ ఆభరణాల గురించి ఫీడ్ బ్యాక్ అడగమంటాడు. అలా మనోజ్ అసలు విషయాన్ని బయట పెడతాడు కదా' అని అంటాడు. దీంతో శృతి కూడా ఓకే చెబుతోంది. కానీ రవి మాత్రం ఎక్కడ ప్లాన్ తేడా కొడుతుందో అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలి నువ్వు అనవసరంగా మాట్లాడకు తాను ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తా అంటుంది.

ఇక మరోవైపు.. రోహిణి మనోజ్ షాప్ కి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్లి చూశాక మనోజ్ గుర్రు పెట్టి పడుకుంటాడు. షాప్ కు వచ్చే కస్టమర్లను పట్టించుకోకుండా.. పడుకోవడం చూసి రోహిణి ఆగ్రహానికి లోనవుతుంది. దీంతో మనోజ్ డిప్పపై ఒక్కటేస్తుంది. వెంటనే మనోజ్ 'నాకు ఆ లక్షల గురించి తెలియదు.. నేను ఈ పాపం చేయలేదు' అంటూ కలవరిస్తాడు. దీంతో మనోజును నిద్రలేపి అసలు ఏంటి? నీకు ఆ నగలకు సంబంధం ఏంటి? అని ప్రశ్నిస్తుంది. కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఫోన్ వచ్చినట్లు కవరింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు రోహిణికి తన కొడుకు చింటూ నుండి ఫోన్ వస్తుంది. కలలో కనిపించావని, చూడాలని ఉంది అంటాడు. తాను త్వరలో వస్తానని మాట ఇస్తోంది. కానీ, తన తల్లితో మాట్లాడి.. అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు వాటితో ఫోన్ చెయ్యట్లేదు తన పరిస్థితిని అర్థం చేసుకోమని తన తల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో.. బాలు సాక్షాదారాలతో మనోజ్ బాగోతాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విషయాన్ని తెలుసుకున్న సత్యం ఎలా రియాక్ట్ అవుతాడు? ప్రభావతి తన మోసాన్ని బయటపెడుతుందా? తన తప్పును అంగీకరిస్తుందా? అనేది ఉత్కంఠ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X