Gunde Ninda Gudi Gantalu November 20th Episode: 4 లక్షల మోసం వెలుగులోకి ..మనోజ్‌పై చెయ్యి చేసుకున్న సత్యం

Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ లో కవరింగ్ నగల వివాదంతో మరోసారి ఇంట్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గిల్టీ నగలను మీనానే మార్చి ఉండొచ్చని అనడంతో మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభావతి తన తప్పును ఒప్పుకోకుండా, విషయాన్ని సుశీలమ్మపై మళ్లించేందుకు ప్రయత్నించడంతో సత్యం కూడా ఆగ్రహించాడు. ఈ సమయంలో బాలు.. రెండు రోజుల్లో నిజం బయట పెడతానంటూ ఒట్టు పెట్టి వెళ్లిపోవడం డ్రామాను మరింత హైపెంచింది. ఇక మనోజ్-ప్రభావతి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రభావతి అతనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ "నీ వల్లనే సమస్యలు వస్తున్నాయి" అని ఎమోషనల్ అయింది. మీనా కోపంతో ఊగిపోగా, బాలు ఆమెను శాంతింపజేస్తూ మనోజ్, అమ్మ తీసారు నగలు అని చెప్పాడు. అయితే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పడంతో మీనా మరింత అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన మొత్తానికి నిజం బయట పెట్టే ప్లాన్ చేసిన బాలు-మీనా శృతి, రవితో కలిసి నకిలీ నగల షాప్ నుంచి ఫోన్ చేసినట్లు నటించి మనోజ్ నిజం చెప్పించే ప్రణాళిక వేస్తారు. ఇదిలా ఉండగా మనోజ్ షాప్‌లో రోహిణికి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తాడు. ఇదే సమయంలో చింటూ ఫోన్ చేస్తాడు. ఇంకా గురువారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu November 20th Episode
Courtesy: Jio hotstar

సీరియల్ ప్రారంభంలోని రోహిణి తన తల్లి సుగుణమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది. అనవసరంగా చింటూతో ఫోన్ చేయించొద్దని, ఈ విషయం మనోజ్ కు తెలిస్తే, తాను ప్రాబ్లం లో పడతానని వార్నింగ్ ఇస్తుంది. దీంతో తన తల్లి'నీలాగా చింటూ గాడు మమకారం చంపుకోలేడు.వాడు తన తల్లి కోసం ఆరాటపడుతున్నాడు. మరో వారంలో చింటూ బర్త్డే ఉంది' రమ్మని పిలుస్తుంది. దీంతో రోహిణి తనకు వీలైతే వస్తానని లేకపోతే డబ్బులు పంపిస్తానని చెబుతోంది. దీంతో కోపానికి లోనైనా సుగుణమ్మ.. 'ఎవరికి కావాలి? నీ డబ్బు.. చింటూ గానికి నీ ప్రేమను పంచితే చాలు.. వీలైతే రా.. లేకపోతే లేదు..' అంటూ ఫోన్ కట్ చేస్తుంది. దీంతో రోహిణి ఎలాగైనా ఆలోచిస్తుంది.

ఇక మరోవైపు బాలు పథకం ప్రకారం.. శృతి కవరింగ్ జ్యూవెలరీ షాప్ నుండి ఫోన్ చేస్తున్నట్లు మనోజ్ కి ఫోన్ చేస్తుంది. తమ షాప్ లో కవరింగ్ నగలు తీసుకున్నందుకు తాము బెనిఫిట్స్ ఇస్తున్నామని, ఇంట్రెస్ట్ ఉంటే తమ ఆఫర్ ను యాక్సెప్ట్ చేయమని, వీలు కాకపోతే.. అడ్రస్ పంపిన రిటర్న్ గిప్ట్ పంపిస్తామని చెబుతుంది శృతి.దీంతో మనోజ్ ముందుగా ఆఫర్లకు టెంప్ట్ అవుతాడు. కానీ, ఇప్పటికే ఇలాంటి ఆఫర్ల పేరుతో చాలాసార్లు మోసపోయాననీ, ఇదేదో తనని మోసం చేసే ప్లాన్ లాగా ఉందనీ భావిస్తాడు. అయినా.. తాను కవరింగ్ నగలు కొన్నట్లు ఎవరికీ తెలియదు.. ఇది ఏదో పథకం లాగా ఉందని మనోజ్ బాగా ఆలోచిస్తాడు.

తెలివిగా తాను ఎక్కడ కవరింగ్ నగలకు లేదని, అనవసరంగా తనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని, మరోసారి ఇలాంటి పనులు చేస్తే.. పోలీస్ కంప్లైట్ ఇస్తానంటూ వార్నింగ్ ఇస్తూ ఫోన్ కట్ చేస్తాడు. ఇలా శృతి- బాలు లు అమలు చేసిన ప్లాన్ విఫలమవుతుంది. కానీ, మనోజ్ మాట్లాడిన తీరును బట్టి కచ్చితంగా నగలను మాయం చేసింది మనోజ్ అని ఫిక్స్ అవుతాడు బాలు. ఇక ఎలాగైనా ఆ నగల విషయాన్ని బయట పెట్టాలని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సడన్ గా మీనాక్షి అత్తయ్య గుర్తుకొస్తుంది. తన తల్లి ప్రతి విషయాన్ని మీనాక్షి అత్తయ్యతో షేర్ చేసుకుంటుందని. కచ్చితంగా ఈ విషయం కూడా మీనాక్షి అత్తయ్యకు తెలిసి ఉంటుందని ఆమెని మాటల్లో పెడితే అసలు విషయం బయట పడుతుందని బాలు అంటాడు. దీనికి మీనా కూడా అంగీకరిస్తుంది.

తనకు కవరింగ్ నగల షాప్ నుంచి కాల్ వచ్చిన విషయం మనోజ్ తన తల్లికి చెబుతాడు. అసలు విషయాన్ని గ్రహించిన ప్రభావతి ఇది ఖచ్చితంగా బాలు పనే అంటుంది. 'నా మాట విని తొందరగా ఆ నగలు తీసుకువచ్చిపెట్టు.. లేదంటే లాస్ట్ టైం మీ నాన్న డబ్బులు తీసినందుకే ఇల్లంతా ఉడికించుకుంటూ కొట్టాడు. ఈసారి వాడి పెళ్ళాం నగలు తీసావ్.. ఊరంతా ఊరికించుకుంటూ కొడతాడు' అంటూ మనోజ్ కు ప్రభావతి హెచ్చరిస్తుంది. దీంతో మనోజ్ తన బాగోతం ఎక్కడ బయట పడుతుందని కంగారు పడతాడు. తనని భయపెట్టవద్దని ప్రాధేయపడతాడు. అలాగే ఈ విషయం రోహిణికి ఎక్కడ తెలిసిపోతుందోనని మనోజ్ టెన్షన్ పడుతాడు.

దీంతో ప్రభావతి' నీకు ఎటు వెళ్లిన సమస్యలు తప్పవు ఒకటే మార్గం.. తొందరగా డబ్బులు రెడీ చేసి..నగలు తీసుకరా' అంటుంది. తన బిజినెస్ సరిగా జరగడంలేదనీ, ఒకటిగా ఆరా అమ్మినా.. రోహిణి లెక్కలు అడుగుతుందని మనోజ్ తన గోడు చెప్పుకుంటాడు. కానీ, ప్రభావతి మాత్రం'సమస్యలు గురించి కాదు పరిష్కార మార్గాల గురించి ఆలోచించు. నీతో చేతులు కలిపాను అని తెలిస్తే మీ నాన్న నన్ను చంపేస్తాడు. ఇలాగైనా ఆ డబ్బులు అరేంజ్ చేసి ఆ నగలు తీసుకుని రా' అని ప్రభావతి ప్రాధేయపడుతుంది. దీంతో మనోజ్ ఈ సమస్య నుండి ఇలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాడు.

మరోవైపు బాలు, మీనాలు తమ ప్లాన్ ప్రకారం.. మీనాక్షి ఇంటికి వెళ్తారు. ముందుగా తాము తెచ్చిన పండ్లు ఇచ్చి కుశల ప్రశ్నలు అడుగుతారు. మెల్లగా మాటల్లో పెట్టి కవరింగ్ నగల విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తారు. తన మాటల్లో తడబాటు చూసి బాలు మీనాలు కచ్చితంగా కవరింగ్ నగల గురించి తెలిసి ఉంటుందని ఫిక్స్ అవుతారు. దీంతో బాలు మీనాక్షిని సెంటిమెంట్ తో కొడతాడు. 'తనకు ప్రతి విషయంలో మీనాక్షి అత్తయ్య ఎంతగానో సపోర్ట్ ఇస్తుందని, తన తల్లి ఎప్పుడైనా కోప్పడ్డ మీనాక్షి అత్తయ్యని తనకు సపోర్టుగా నిలిచేదని, మీనాక్షి అత్తయ్య అంటే తనకు చాలా ఇష్టమని, తన బాగు కోరే వారిలో అత్తయ్య ఉంటుందంటూ బాలు పొగడ్తలతో ముంచేత్తుతాడు. దీంతో మీనాక్షి కూల్ అవుతుంది. ఈ సమయంలో మెల్లగా కవరింగ్ నగల గురించి బాలు అడుగుతాడు. బాలు - మీనా పరిస్థితి అర్థం చేసుకున్న మీనాక్షి ఆ నగల విషయాన్ని బయట పెట్టాలని భావిస్తుంది. 'ఆ నగలు మీ అమ్మని తీసుకుంది..' అనేలోపే ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది.

మీనాక్షి ఇంట్లో.. బాలు, మీనాలను చూసి ప్రభావతి కంగారుపడుతుంది. 'ఏంటి మీరు ఇలా వచ్చారు? ఏం చేస్తున్నారు? అని అడుగుతుంది. దీంతో బాలు 'ఏ రాకూడదా? దారిలో పండ్లు కొన్నాం.. మీనాక్షి అత్తయ్యకు ఇద్దామని వచ్చాం.. అంటాడు బాలు. 'ఆమెకు కొనడం రాదా? ఆమె ఏమైనా పేషెంటా.. ఆ పరామర్శించడానికి వచ్చారా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. దీంతో మీనా అక్కడ ఉంటే గొడవ జరుగుతుందని, బాలుని తీసుకుని బయటికి వచ్చేస్తుంది. అయితే.. బాలు వచ్చేముందు ఆ విషయం మర్చిపోకు అత్తయ్య అని మెలిక పెట్టి వస్తాడు. దీంతో ప్రభావతి ' ఏంటి ఆ విషయం.. వాళ్లు దేని గురించి అడిగాడు?' అని ఆరాధిస్తుంది. దీంతో మీనాక్షి వాళ్ళు కవరింగ్ నగల గురించి అడగడానికి వచ్చారని, కాస్త లేట్ అయితే, తన నోటి నుండి అసలు విషయం బయటపడేదని చెబుతుంది.

దీంతో ప్రభావతి గుండెజారిపోయినట్లు అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే.. తన భాగవతం బయటపడేదనీ, ఇంట్లో ఈ విషయం తెలిస్తే తన గుండె ఆగిపోయేదని ప్రభావతి టెన్షన్ పడుతుంది. ఇక మీనా బాలు బయటికి వచ్చి ప్లాన్ మిస్ అయింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా .. అసలు విషయం బయటపడేది. అసలు టైం కు మా అమ్మ వచ్చింది 'అని బాలు బాధపడతాడు. 'ఏం టెన్షన్ పడకండి నిజం.. ఎప్పుడైనా బయటపడుతుంది. ఈరోజు కాకపోతే మరో రోజు' అంటుంది మీనా. ఇంతలో బాలు ఫ్రెండ్ రాజేష్ ఫోన్ చేస్తాడు. 'మన స్టాండ్ దగ్గరలో మెగా సెల్ ఆఫర్ పడింది, పైగా ఫర్నిచర్ 50% డిస్కౌంట్ ఇస్తున్నారు, నేను బీరువా కొనాలనుకుంటున్నా.. సెలక్షన్ కోసం రా' అని రాజేశ్ రిక్వెస్ట్ చేస్తాడు. బాలు మొదట తాను రాలేనని చెప్తాడు. కానీ మీనా వెళ్ళమనడంతో రాజేష్ తో కలిసి బాలు షాపింగ్ వెళ్తాడు.

ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో ఫర్నిచర్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ అసలు విషయం బయటపడిందని. వ్యాపారంలో 4 లక్షలు మనోజ్ మోసపోయాడని, ఆ 4లక్షలు కవర్ చేసుకోవడానికి మీనా నగలు అమ్మడంటూ అసలు విషయాన్ని బయట పెడతాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సత్యం.. మనోజ్ పై చేయి చేసుకుంటాడు. అయితే.. ప్రభావతి నిజము ఒప్పుకుంటుందా.. మనోజ్ తన తప్పిదాన్ని బయటపెడతాడా? అనేది ఉత్కంఠగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X