Gunde Ninda Gudi Gantalu November 21th Episode: బాలు అరెస్ట్.. ఆధారాలతో పట్టుబడ్డ మనోజ్.. ప్రభావతి ట్విస్ట్..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌లో రోహిణి-సుగుణమ్మ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో చింటూ పట్ల మమకారం, రోహిణి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బాలు వేసిన ప్లాన్ ప్రకారం శృతి కవరింగ్ నగల షాప్ నుండి కాల్ చేసినట్టుగా నటిస్తుంది. మొదట ఆఫర్‌లు విన్న మనోజ్‌కి టెంప్టేషన్ వచ్చినా, గతంలో జరిగిన మోసాలు గుర్తొచ్చి వెనుదిరుగుతాడు. అతని మాట తీరు బాలు-మీనాలకు డౌట్‌ను మరింత బలపరుస్తుంది. ఇదే సమయంలో మనోజ్ తన తల్లి ప్రభావతికి కాల్ వచ్చిన విషయం చెబుతాడు. అసలు విషయం గ్రహించిన ప్రభావతి అతనిపై రెచ్చి పోయి వెంటనే నగలు తీసుకురమ్మని ఒత్తిడి చేస్తుంది. లేదంటే ఇంట్లో గొడవ జరగడం ఖాయమని భయపెడుతుంది. దీంతో మనోజ్ మరింత గాబరా పడుతాడు. రోహిణికి ఈ విషయం తెలిసిపోతుందేమోనని కలవరపడతాడు.
ఇక బాలు - మీనా మరొక ప్రణాళికతో మీనాక్షి ఇంటిని ఆశ్రయిస్తారు. పండ్లు ఇచ్చి, సెంటిమెంట్ చూపించి అసలు విషయం బయటికి రప్పించాలనుకుంటారు. మీనాక్షి మాటల్లో తడబాటు కనిపించిన బాలు నగల అంశాన్ని కచ్చితంగా ఆమెకు తెలుసని ఫిక్స్ అవుతాడు. నిజం బయటికి రాబోయేసరికి ప్రభావతి అక్కడికి చేరి ప్లాన్ మొత్తాన్ని పాడు చేస్తుంది. ఒక నిమిషం ఆలస్యమైనా అసలు విషయం బయటపడేదని మీనాక్షి చెప్పడంతో ప్రభావతి గుండె ధడధడలాడుతుంది. బాలు-మీనాల ప్లాన్ ఫ్లాప్ అయ్యిందనే నిరాశలో ఉన్న వేళ ఫ్రెండ్ రాజేష్ మెగా సెల్ ఆఫర్ గురించి చెబుతాడు. మీనా ప్రోత్సాహంతో బాలు రాజేష్‌తో షాపింగ్‌కు వెళ్తాడు. ఇంకా శుక్రవారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
బాలు తన స్నేహితుడు రాజేష్ తో కలిసి ఫర్నిచర్ షాప్ కు వెళ్తారు. అక్కడ ప్రతి వస్తువుపై 50% ఆఫర్ పెట్టడం చూసి, ఇచ్చే ఆఫర్లు డిస్కౌంట్లు చూసి ఆశ్చర్యపోతారు. దీంతో రాజేష్ తనకు నచ్చిన బీరువాను కొనుక్కుంటాడు. ఇంతలోనే పోలీసులు ఎంట్రీ అయి.. 'ఇదంతా దొంగ మాల్.. ఇతర షాపులలో దొంగతనం చేసి ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఎక్కడ వాళ్ళ అక్కడే ఉండండి. ఎవరు పారిపోవడానికి ట్రై చేయకండి' అని పోలీసులు హెచ్చరిస్తారు. తాము ఫర్నిచర్ కొనడానికి వచ్చామనీ, తాము ఎలాంటి తప్ప చేయలేదని చెప్పిన పోలీసులు నమ్మకుండా.. బాలు,రాజేష్ లను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు. పోలీసు స్టేషన్ లో కూడా తాము తప్పు చేయలేదని ఎంత బ్రతిమిలాడిన పోలీసులు నమ్మరు. పైగా దొంగలతో సహా బాలు,రాజేష్ లను కూడా లాకప్ లో వేస్తారు.
దీంతో ఆగ్రహానికి లోనైనా బాలు ఆ దొంగలను కొడతాడు. దీంతో రాజేష్ అడ్డుపడి 'అనవసరంగా వాళ్లతో గొడవ పడొద్దు పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు కదా అసలు విషయం బయటపడితే వాళ్లే మనల్ని విడిచిపెడతారు' అని బాలుని శాంతింపచేస్తాడు. ఇక పోలీసు తమ విచారణలో భాగంగా ఫర్నిచర్ షాప్ ఓనర్ లను పిలిపించి, ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనోజ్ కూడా పోలీసు స్టేషన్ కు వస్తాడు. దీంతో బాలు షాక్ అవుతాడు. అసలు పోలీస్ స్టేషన్ కు మనోజ్ ఎందుకు వచ్చాడో కంగారు పడుతాడు. కానీ, మనోజ్ వ్యవహరించే తీరు బట్టి .. తన అన్నయ్య కూడా దొంగల చేతిలో మోసపోయాడని అర్థం చేసుకుంటాడు.
మనోజ్ తన ఫర్నిచర్ కనిపించడం లేదని పోలీసులకు మొరపెట్టుకుంటాడు. అసలు ఏ వస్తువులు పోయాయని పోలీసులు అడగగా , తాను అమ్మిన వస్తువుల వివరాలను అన్నిటిని చెబుతాడు. ఈ విషయాన్ని అంతా సెల్ లో ఉన్న బాలు తన ఫోన్లో రికార్డ్ చేస్తాడు. దీంతో అసలు గుట్టు మొత్తం బయటపడుతుంది. తాము ఎంక్వయిరీ చేసి పంపిస్తామని, అయినా నాలుగు లక్షలు ఎలా మోసపోయావని అడుగుతారు. తాను మూడు లక్షల ఫర్నిచర్ అమ్మాయని, అందుకు నాలుగు లక్షల రూపాయలు వచ్చాయని, పైగా లాభం లక్ష రూపాయలు వచ్చాయని ఇంట్లో చెప్పానని చెప్పుతాడు. 'ఇలా మోసపోయా అనే విషయం ఇంట్లో చెప్పుకోలేము కదా' అంటూ తన గొడువెల్లబుచ్చుతాడుమనోజ్. దీంతో బాలుకి అసలు విషయం అర్థం అవుతుంది.
తన అన్నయ్య కూడా మోసపోయాడని, కానీ ఆ మోసాన్ని ఇంట్లో తెలియకుండా.. తన తల్లి , అన్న కలిసి తన భార్య నగలను మాయం చేశారని బాలు ఫిక్స్ అవుతాడు. ఇక ఎంక్వయిరీ పూర్తి కావడంతో బాలు రాజేష్ గారు పోలీసులు విడిచిపెడతారు. ఇక ఆ వీడియో ఇంట్లో చూపించాలని, తల్లి, కొడుకుల బాగోతాన్ని బయటపెట్టాలని ఇంటికి వస్తాడు బాలు. అలా రావడం రావడంతోనే గేటుకు, మెయిన్ డోర్ ను లాక్ చేస్తాడు. 'ఏంట్రా పట్ట పగలే గేట్లో చేశావు.. ఏం చేస్తున్నావ్ ?' అని సత్యం అంటాడు. ఓ కొత్త సినిమా ట్రైలర్ విడుదలైందనీ, అందరితో కలిసి చూద్దామని వచ్చానని అంటాడు.
ఇదేదో తేడాగా ఉందనీ మనోజ్ తనకు షాపులో పనుందని, తాను వెళుతున్నానని అక్కడినుండి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. దీంతో బాలు..'అన్నగారు మీరు లేకుండా నేను ఎలా ట్రైలర్ చూపించగలను. మీరు ఉండాలి కదా' అంటాడు. దీంతో ప్రభావతి 'వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్? వాడి పని వాడు చేసుకోనివ్వు.. వాడికి షాప్ లో వర్క్ ఉంది కదా..' అంటుంది. ఇంతలోనే మీనా వచ్చి.. 'అయినా మీరు మీ ఫ్రెండ్ తో కలిసి ఫర్నిచర్ షాప్ కి వెళ్లారు కదా.. ఆ విషయం చెప్పకుండా ఈ టైలర్ సంగతేంటి?' అని అంటుంది మీనా. ఫర్నిచర్ షాప్ కి వెళ్తేనే మన నగల విషయం బయటపడిందని, అక్కడ మెగా సేల్ 50% ఆఫ్ అని ఆఫర్లు ప్రకటించారు. ఈ విషయం మీకు ఏమైనా తెలుసా అన్నగారు అంటూ మనోజ్ ని అడుగుతాడు .
ఆ తర్వాత అమ్మగారు మీకేమైనా ఈ విషయం తెలుసా అని ప్రబావతిని వెటకారంగా ప్రశ్నిస్తాడు బాలు. దీంతో ప్రభావతి 'నేనేమైనా నీ పెళ్ళాం లాగా.. ఊరంతా బండి వేసుకుని తిరుగుతున్నానా?' అంటూ మీనా ను హేళన చేస్తుంది. దీంతో ఆగ్రహానికి లోనైన మీనా 'నేనేమైనా నీ కొడుకు లాగా బలాదూర్ తిరగడానికి.. పార్కులలో పల్లి తినడానికి వెళ్లలేదు. నా వ్యాపారం నేను చేసుకుంటున్నా.. ఎవరో నామీద అసూయపడి ఇంటి ముందు పెట్టుకున్న షాప్ ను తీసేపించారు' అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. 'సరేలే అమ్మ.. బాలు ముందు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు' అని అంటాడు సత్యం. 'లాస్ట్ టైం పార్లరమ్మ మన దగ్గరికి ఓ లక్ష రూపాయలు తీసుకువచ్చి... మా ఆయనకు లక్ష రూపాయల లాభం వచ్చింది' అని డబ్బా కొట్టింది కదా అంటాడు.
దీంతో శృతి 'అవును జీవితంలో మొదటిసారి మనోజ్ లక్ష రూపాయలు సంపాదించాడని అందరూ షాక్ అయ్యారు' అంటుంది. పక్కనే ఉన్న రవి కూడా 'అవును.. ఎప్పుడు మనోజ్ అన్నయ్య పోగొట్టడం గాని తెచ్చింది లేదని, నాన్న కూడా ఆరోజు అన్నారు' అని ఆనాటి విషయాన్ని గుర్తు చేస్తాడు. 'ఇంతకీ ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసా పార్లరమ్మ. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడే రిలీజ్ అయింది' అంటూ మనోజ్ పోలీస్ స్టేషన్లో మాట్లాడిన వీడియోను ఇంట్లో వారికి చూపిస్తాడు. దీంతో మనోజ్ బాగోతం ఇంట్లో వారందరికీ తెలిసిపోతుంది. 'మూడు లక్షల ఫర్నిచర్ పోయింది.. మరి నాలుగు లక్షలు ఎలా వచ్చాయి.. లక్ష రూపాయలు లాభం ఎలా వచ్చింది' అంటూ బాలు ఆరా తీస్తాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా సత్యం.. మనోజ్ ను దగ్గర పిలిచి చెంప చెల్లుమనిపిస్తాడు.
'అసలు బ్లాక్ మనీ ఎందుకు తీసుకున్నావు? ఆ డబ్బులు కూడా పోగొట్టావ్.. సరే మరి నాలుగు లక్షల రూపాయలు ఎలా తీసుకువచ్చావ్?' అంటూ నిలదీస్తాడు. దీంతో ప్రభావతి తన విషయం ఎక్కడ పడుతుందోననే భయంతో.. 'నాలుగు లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? అప్పు చేసావా? అప్పు చేసావా? నాకు తెలియకుండా అప్పు చేసావా? అంటూ మనోజ్ ను చితకబాదుతూ క్లూ ఇస్తుంది. తనకు ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. దీంతో మనోజ్ 'తాను తప్పు చేశానని, తన ఫ్రెండ్ దగ్గర నాలుగు లక్షల అప్పు చేశానని చెప్తాడు. ఇలా ప్రభావతి తన మోసాన్ని బయటపడకుండా కవరింగ్ చేస్తుంది.
దీంతో రోహిణి ఆయన ఏమైనా తప్పు చేశాడా? మోసపోయాడు. దానికి ఇంతలా అతి చేయాలా? అంటూ మనోజ్ ను వెనుక వేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆగ్రహానికి లోనైన సత్యం.. వాడు చేసిన తప్పు కాదు ? నిన్ను మోసం చేయడం తప్పు కాదా? ఇంట్లో అబద్ధం చెప్పడం తప్పు కాదా? 'అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో రోహిణి ముఖం వాడిపోతుంది. తలదించుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రభావతి తన టాలెంట్ తో ప్రస్తుతానికి నకిలీ నగల విషయాన్ని బయటపడకుండా వ్యవహరిస్తుంది. బాలు మాత్రం ఖచ్చితంగా మనోజ్ తన తల్లి ప్రభావతి ఇద్దరు కలిసి ఈ డ్రామా ఆడుతున్నారని, మనోజ్ ను కొట్టినట్లే కొట్టి వాడికి 4 లక్షలు అప్పు చేశానని చెప్పమని క్లూ ఇచ్చిందని అంటాడు బాలు. 'అన్నయ్య ఈ విషయాన్ని ఇలా బయట పెడతావు?' అని రవి అనగా.. చూడు నాలుగు రోజులలో అసలు విషయాన్ని బయట పెడతానని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో నేడు సీరియల్ ఎండ్ అవుతుంది.


Click it and Unblock the Notifications










