Gunde Ninda Gudi Gantalu November 24th Episode: పెళ్లాంతో తన్నులు తిన్న మనోజ్.. ప్రభావతిపై శ్రుతి సీరియల్.

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: బాలు, రాజేష్‌లు ఫర్నిచర్‌ షాప్‌కి వెళ్లారు. అక్కడ ప్రతి వస్తువుపై 50% ఆఫర్‌ చూసి ఆనందపడతారు. రాజేష్ వెంటనే ఒక బీరువా కొనేస్తాడు. కానీ అసలు పరిస్థితి అప్పుడే మారుతుంది. పోలీసులు అక్కడికి దూసుకువచ్చి, "ఇవి దొంగ మాల్... ఇతర షాపుల నుంచి దొంగిలించిన వస్తువులు" అని చెబుతారు. తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా, పోలీసులు నమ్మక బాలు,రాజేష్‌లను కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. లాకప్‌లో బాలు కోపంతో దొంగలను కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. కానీ రాజేష్, "ఇంక్వయిరీ జరగనివ్వు... నిజం బయటపడితే మనం బయటపడ్తాం" అంటూ అతన్ని శాంతింపజేస్తాడు. ఇంతలో ఫర్నిచర్‌ షాప్‌ యజమానులను విచారిస్తున్న పోలీసుల వద్దకు మనోజ్ కూడా వస్తాడు. దీంతో బాలు షాక్ అవుతాడు. అయితే..మాట్లాడే తీరు విని మనోజ్ కూడా ఈ దొంగల చేతిలో మోసపోయాడని అర్థం చేసుకుంటాడు.

తాను అమ్మిన ఫర్నిచర్‌ కనిపించడం లేదని మనోజ్ ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు ఏ వస్తువులు పోయాయో అడుగుతుండగా, బాలు సెల్‌లో కూర్చుని తన ఫోన్‌తో మొత్తం రికార్డ్ చేస్తాడు. విచారణ అనంతరం ఇద్దరినీ విడుదల చేస్తారు. ఇంటికి వచ్చిన బాలు అందరినీ ఒకేచోట చేర్చి "కొత్త సినిమా ట్రైలర్" అని నటిస్తూ మనోజ్ పోలీస్‌ స్టేషన్‌లో చెప్పిన వీడియోను చూపిస్తాడు. సత్యం కోపంతో మనోజ్ చెంపపై కొడతాడు. ప్రభావతి అసలు విషయం బయటపడకుండా "నాలుగు లక్షలు అప్పు చేసావా?" అని క్లూ వేసి కాపాడుతుంది. మనోజ్ అబద్ధం చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. రోహిణి సపోర్ట్ చేయగా, సత్యం ఆమెపై కోప్పడుతాడు. ఈ కలకలం మధ్య నకిలీ నగల విషయం తాత్కాలికంగా కప్పిపుచ్చబడినా, బాలు మాత్రం నిజం బయటపడే వరకు ఆగబోమని నిర్ణయించుకుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 560 November 24th 2025 here is full story

Courtesy: Jio hotstar

సోమవారం ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా రోహిణి కోపంతో మనోజ్‌ను రూంలోకి రమ్మని క్లాస్ పీకుతుంది. 'ఎందుకు మోసం చేసావ్? వ్యాపారంలో నష్టపోయానని ఎందుకు చెప్పలేదు? అందరి ముందు నా పరువు తీసావు కదా.. ఏ మొహం పెట్టుకొని ఇంట్లో తిరగాలి?' అంటూ ఎమోషనల్ అవుతుంది. దీంతో మనోజ్'నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావో అని, నన్ను విడిచి వెళ్ళిపోతావో? అని భయంతో ఈ విషయాన్ని నీకు చెప్పలేదు. కానీ నేను వ్యాపారంలో మోసపోయినట్లు మా అమ్మకు తెలుసు' అంటాడు. దీంతో రోహిణి షాక్ అవుతుంది. 'ఏంటి మీ అమ్మకు ఈ విషయం ముందే తెలుసా?' అని తిరిగి ప్రశ్నిస్తుంది. 'అవును మా అమ్మకు ఆ రోజే చెప్పాను. కానీ, అందరి ముందు నన్ను కాపాడానికి.. ఈ రోజు నన్ను కొట్టింది' అని అసలు విషయాన్ని బయట పెడతాడు.

'మీ అమ్మకు చెప్పినప్పుడు కనీసం నాకు చెప్పాలని అనిపించలేదా?' అని రోహిణి అంటుంది. 'నువ్వు ఏమీ అనను అంటే మరో విషయం చెప్తా'నని మనోజ్ అంటాడు. 'మరో ట్విస్ట్ ఏంటి? ఇంకా ఏం మోసం చేసావ్?'అని అడుగుతుంది రోహిణి. 'నేను నా ఫ్రెండ్ మణికంఠ దగ్గర నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకోలేదు' అంటాడు. దీంతో రోహిణి మరింత కంగారు పడుతుంది. 'మరి ఆ డబ్బులు ఎలా వచ్చాయి?' అంటూ మనోజ్ ను నిలదీస్తుంది. దీంతో మనోజ్'మా అమ్మ , నేను ఇద్దరం కలిసి.. మీనా నగలను కాజేసాం.. వాటిని అమ్మేసి నాలుగు లక్షలు తీసుకువచ్చాను' అని అసలు విషయాన్ని బయటపెడుతాడు.

దీంతో సొంతింట్లోనే దొంగతనం చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రోహిణి. 'కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావ్ .. మీనా డబ్బుతో బతుకుతున్నట్లు చేస్తున్నావ్.. నా పరువు మొత్తం తీసావ్.. అంటూ రోహిణి బాధపడుతుంది. 'అంత మా అమ్మ చూసుకుంటుంది' అని మనోజ్ సింపుల్ గా చెబుతాడు. 'బాలుకి ఈ విషయం తెలిస్తే మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు' అని రోహిణి కంగారు పడుతుంది. అయితే ఈ విషయం తనకు చెప్పినట్లు అత్తయ్యకు చెప్పకంటూ రోహిణి రిక్వెస్ట్ చేస్తుంది.

మరోవైపు శృతి.. తన ఇంట్లో జరుగుతున్న విషయాలను ఆధారంగా చేసుకుని సీరియల్ రాస్తుంది. ఈ విషయాన్ని గమనించిన రవి ఏం చేస్తున్నావ్ ? అని ప్రశ్నించగా.. 'మన ఇంట్లో పాత్రలతో అందమైన తెలుగు డైలీ సీరియల్ రాస్తున్నా.. అడుగడుగునా దిమ్మ తిరిగిపోయే ట్విస్టులు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు' అంటూ వీర లెవల్ చెబుతుంది. డబ్బింగ్ చెప్పడం మానేస్తావా? అని రవి ప్రశ్నించగా.. 'డబ్బింగ్ నా ఊపిరి.. రైటింగ్ నా శ్వాస' అంటూ ఓ రేంజ్ లో కట్టింగ్ ఇస్తోంది.

'సరేలే.. ఇంతకీ సీరియల్ టైటిల్ ఏంటి? అని రవి ప్రశ్నించగా..'గయ్యాళి గంగమ్మ'అంటుంది. ఆ టైటిల్ వినగానే రవి షాక్ అవుతాడు. 'ఈ పేరు తెలిస్తే నిజంగానే మా మమ్మీ గయ్యాళిగా మారుతుంది' రవి అంటాడు. 'ఇప్పుడేమైనా తక్కువనా.. రోజు మీనా ను రాచీరంపాన పెట్టడం లేదా? అని ప్రభావతి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. 'వద్దు అనవసరంగా గొడవలు జరుగుతాయి.. టైటిల్ మార్చు' అంటాడు రవి.. 'పార్లర్ మింగిన పెళ్ళాం.. లక్షల మింగిన మొగుడు' అంటూ మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ చెబుతుంది. దీంతో రవి మరింత కంగారు పడుతాడు. అనవరసంగా గొడవలు క్రియేట్ చేయకు.. మనం ప్రశాంతంగా ఉన్నాం కదా.. అంటాడు.

అయినా.. శృతి మాత్రం డేరింగ్ అండ్ డేసింగ మాట్లాడుతుంది. మీ నాన్న గల విషయం మీ అమ్మకు తెలియదా.. నాకు తెలుసు మీ అమ్మ మనోజ్ ఇద్దరు కలిసి మీనా నగలను మోసం చేశారని ఏదో ఒక రోజు బాలు మాత్రం ఈ విషయాన్ని కచ్చితంగా బయటపెడతాడని ఆరోజు ఇంట్లో రణరంగమే అంటుంది. సరేలే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రవి అక్కనుండి వెళ్ళిపోతారు.

ఇక మరోవైపు. ప్రభావతి రోహిణి కలిసి.. కార్తీక పౌర్ణమి పూజ కోసం ఒత్తులు తయారు చేస్తూ ఉంటారు. వారిద్దరిని శృతి చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇంట్లో కుటీర పరిశ్రమ పెట్టారా? అంటూ అడుగుతుంది. 'ఈరోజు కార్తీక పౌర్ణమి అందుకే 365 వొత్తులు తయారు చేస్తున్నాం.. ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తే.. ప్రతి రోజు దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది' అని ప్రభావతి అంటుంది. దీంతో శృతి 'అంటే రోజు దీపం వెలిగించిన అవసరం లేదా? పూజ చేయాల్సిన అవసరం లేదా? అంటూ దిమ్మ తిరిగిపోయే ప్రశ్న అడుగుతుంది.

ఆ ప్రశ్నలకు ప్రభావతి సమాధానం చెప్పలేక తడబడుతుంది. ఇంతలోనే మీనా ఎంట్రీ ఇచ్చి.. 'మనం 365 రోజులు పూజ చేయకపోవచ్చు .. మన వ్యక్తిగత కారణాలవల్ల కానీ, మరి ఇతర సమస్యలతో గానీ, సంవత్సరం లోని అన్ని రోజులు దీపం వెలిగించకపోవచ్చు. ఇలా 365 వత్తులు వెలిగించడం వల్ల నిత్య దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది' కానీ రోజు దీపారాధన చేయకూడని అర్థం కాదు' అంటూ కార్తీక పౌర్ణమి ఔన్నత్యాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఆ తరువాత అత్త కోడలు అంతా కలిసి వత్తులు చేస్తూ పండుగ మహత్యాన్ని గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. ఇంతలోనే బాలు ఏంటి ఇస్తాడు. ఎన్నడూ లేని విధంగా ముగ్గురు కోడలు అత్త కలిసి పనిచేయడం చూసి షాక్ అవుతాడు.. ఇంతకీ ఇది మా ఇల్లు అయినా అంటూ ఆశ్చర్యపోతాడు. ఏంటి సంగతి అని ప్రశ్నించగా..'ఈరోజు కార్తీక పౌర్ణమి.. గుడిలోకి వెళ్లి పూజలు చేయాలి. మీరు ఉపాసన ఉండాలి' అంటూ మీనా కండిషన్లు పెడుతుంది. 'మీ పూజలకు మమ్ములను బలి చేస్తారా?' అంటూ బాలు సెటైర్ వేస్తాడు.'ఈరోజు పూజ చేస్తే పుణ్యం వస్తుంది' అని మీనా అంటుంది. 'పుణ్యం మాట దేవుడు ఎరుగు గాని.. మన నగలు తీసిన దొంగ బయటపడితే అదే చాలు' అంటూ పంచవేసి వెళ్తాడు.

ఇక మరోవైపు మౌనిక గుడికి ఎక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆ విషయాన్ని గమనించిన సంజూ మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్? ఏంటి కొత్త చీర కట్టావ్? అంటూ వెటకారంగా ఎగతాళిగా మాట్లాడుతాడు. ఈ విషయాన్ని గమనించిన సంజు తల్లి అనవసరంగా 'మౌనిక ను ఇబ్బంది పెట్టకు. ఈరోజు ఆలుమగలు కలిసి కోనేట్లో దీపాలు వదిలితే పుణ్యం వస్తుంది. మంచి జరుగుతుంది' అంటుంది. దీంతో సంజు కోపంతో'ఎవరికి పుణ్యం జరుగుతుంది. ఎవరికీ మంచి జరుగుతుంది.నేను దాన్ని పెళ్లి చేసుకున్న రోజే దానికి మంచి జరిగింది' అంటాడు. 'నువ్వు అలా అనుకుంటున్నావా?' అంటూ సంజు తల్లి సెట్టేరికల్ గా మాట్లాడుతుంది. దీంతో సంజూ 'నువ్వు నన్ను పెళ్లి చేసుకొని బాధపడుతున్నావా? సంతోషంగా లేవా? అంటూ మౌనికను నిలదీస్తాడు. దీంతో తన సంతోషంగానే ఉన్నాను అంటూ బదిలిస్తుంది మౌనిక.దీంతో సంజు తల్లి 'అనవసరంగా మౌనికను ఇబ్బంది పెట్టకు.. ఒక మనిషి లాగా ఆలోచించు..' అంటుంది. గుడికి మాత్రమే అయితే వెళ్ళు కానీ.. అక్కడికి వెళ్లాక బాలుని కలవడం కానీ, మీ ఇంటి వాళ్లతో మాట్లాడడం గాని చేస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తాడు సంజు.

మరోవైపు.. ప్రభావతి ఫ్యామిలీ మొత్తం కలిసి గుడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. ప్రభావతిని కొత్త చీరలో చూసి.. 'ఇంతేనా ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నావ్' అంటూ కాస్త రొమాంటిక్ గా మాట్లాడుతాడు. దీంతో ప్రభావతి సిగ్గు మొగ్గలేస్తోంది. అంతలోనే మీనా, రోహిణి, శృతి కూడా రెడీ అయి కిందికి వస్తారు. వాళ్లు కూడా 'అత్తయ్య ఈరోజు చాలా అందంగా ఉన్నారు. మీరు నాచురల్ బ్యూటీ అంటారు. ఇక మీనా అయితే.. ఏకంగా దిష్టి చుక్క పెట్టేస్తుంది. తన అందం గురించి కోడళ్ళు పొగిడేసరికి ప్రభావతి మురిసిపోతుంది.

ఆ తర్వాత బాలు, రవి, మనోజ్ కూడా గుడికి వెళ్లడానికి పంచలు కట్టుకొని.. మరి హీరోలా ఎంట్రీ ఇస్తారు. ఈ సమయంలో బాలును మీనా చూసి.. 'మా ఆయన బాలరాజు లా ఉన్నాడు' అనగా.. 'మరి రవి ఎలా ఉన్నాడు' అని శృతి అడుగుతుంది 'మీ ఆయన నలభీమరాజు' అంటూ కితాబ్ ఇస్తుంది మీనా. దీంతో రోణిహి 'మా ఆయన మాత్రం ఈరోజు మన్మధ రాజు లాగా కనిపిస్తున్నాడు' అంటూ అంటుంది. ఇలా కుటుంబమంతా సంతోషంగా కార్తీక పౌర్ణమి నాడు గుడికి వెళ్లడానికి సిద్ధమవుతారు.

ఇకఅప్ కమింగ్ ఎపిసోడ్లో గుడిలో మౌనిక మన ఫ్యామిలీని కలవడం, అందరు కలిసి పూజలు చేయడం, కోనేటిలో దీపాలు వదలడం జరుగుతుంది. అయితే ఇంతలో మౌనికపై అనుమానంతో సంజు గుడికి రావడం. వాళ్ళు చేస్తున్న పూజను డిస్టర్బ్ చేయడం, మౌనికపై చేయి చేసుకోవడం, తన చెల్లి చేయి చేసుకోవడంతో బాలు కోపంతో.. సంజుపై దాడి చేస్తాడు. ఇలా మొత్తనాకి చాలా రసవత్తరంగా సాగింది నేటీ సిరీయల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X