Gunde Ninda Gudi Gantalu November 25th Episode: బాలు ప్లాన్ ఫెయిల్.. సంజూ నిజస్వరూపం.. మౌనిక సంసారం ముక్కలు!
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ పూర్తిగా ఉత్కంఠతో సాగింది. వ్యాపార నష్టాన్ని దాచిన మనోజ్‌ను రోహిణి ప్రశ్నిస్తూ, "నా పరువు ఎందుకు తీసావ్?" అని ఆవేదన వ్యక్తం చేసింది. తనను విడిచిపెడతుందేమో అన్న భయంతో నిజం చెప్పలేదని మనోజ్ ఒప్పుకున్నాడు. మరింత షాకింగ్‌గా తాను తన ఫ్రెండ్ దగ్గర లోన్ తీసుకోలేదని, అమ్మతో కలిసి మీనా నగలను అమ్మేసి, నాలుగు లక్షలు తెచ్చుకున్నానని చెప్పడంతో రోహిణి కంగారు పడింది. బాలు విషయం తెలిసితే ఇంట్లో రచ్చ చేయడం ఖాయమని ఆమె భయపడింది. ఇక శృతి తన ఇంట్లో జరుగుతున్న నిజజీవిత డ్రామాను ఆధారంగా చేసుకుని కొత్త సీరియల్ రాస్తుండటం రవిని షాక్‌కు గురి చేసింది.
"డబ్బింగ్ నా ఊపిరి... రైటింగ్ నా శ్వాస" అంటునే.. తన సీరియల్ కు"గయ్యాళి గంగమ్మ" అని టైటిల్ పెట్టడంతో రవి భయంతో ఆగమాగమయ్యాడు. మరోవైపు కార్తీక పౌర్ణమి కోసం ప్రభావతి, రోహిణి కలిసి వత్తులు తయారు చేస్తుంటే పూజ మహత్యాన్ని మీనా అందంగా వివరించింది. 365 వత్తులు వెలిగించడం నిత్య దీపారాధన పుణ్యంతో సమానం అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కుటుంబం మొత్తం పండుగకై కలిసి తయారవడం బాలును ఆశ్చర్యంలో ముంచింది. "ఇది మా ఇల్లేనా?" అంటూ సెటైర్ వేసాడు. ఇదే సమయంలో మౌనిక-సంజూ జంటలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. గుడిలో ఎవ్వరిని కలవకూడదని సంజూ వార్నింగ్ ఇచ్చాడు. పండుగ ఆనందంలో కుటుంబం ముందుకు సాగుతున్నా, మీనా నగల రహస్యం ఎప్పుడు బయటపడుతుందోననే భయం మాత్రం ఎపిసోడ్ మొత్తం కొనసాగింది. ఇక మంగళవారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలసి, సంతోషంగా శివాలయానికి వెళ్తారు. ఈ సమయంలో బాలుకి తన తాగుబోతు ఫ్రెండ్ కనిపిస్తాడు. వాడిని గమనించిన బాలు.. 'ఇలా ఆడుకోవడమేంట్రా..'అని అడగగా..'ఏం చేయమంటావ్ బాస్.. నా పెళ్ళాం కార్తీక పౌర్ణమి గుడికి తీసుకువచ్చింది. నాకేమో తాగండి బుర్ర పనిచేయదు' అంటూ తన గొడును వెల్లబుచ్చుతాడు. దీంతో బాలు ' నేను చెప్పినట్లు చేస్తే 100 రూపాయలు కాదు.. ₹1000 ఇస్తా'నని అంటాడు. దీంతో ఆ తాగుబోతు 'ఏం చేయమంటే అది చేస్తా చెప్పండి'అంటాడు. దీంతో మనోజ్ ను టార్గెట్ చేస్తూ.. వాడిచేత నిజం కక్కించాలి అని బాలు తన ప్లాన్ చెప్తాడు. దీనికి అంగీకరించిన తాగుబోతు.. దేవుడు తనకు పూనినట్లు పూనకంతో ఊగిపోతూ వస్తాడు.
అందరి ముందు మనోజ్ ను పట్టుకొని.. 'నీ గురించి అంతా తెలుసు.. అసలు గుడికి ఎందుకు వచ్చావు? నీలాంటి మోసగాళ్లకు ఈ గుడిలోకి ఎంట్రీ లేదు. మళ్లీ ఏం మోసం చేసావ్ ? ఏం మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నావ్.? అంటూ చితక బాదుతాడు. అంతటితో ఆగకుండా 'ఇంట్లో వారిని మోసం చేసేవని తెలుసు.. కన్న తండ్రి మోసం చేసావని నాకు తెలుసు.. చివరికి కట్టుకున్న దాన్ని మోసం చేసావని తెలుసు.. ఈ మధ్య కొత్తగా మరో మోసం చేశామని కూడా తెలుసు.. అది ఎంటో చెప్తావా? నన్ను చెప్పమంటావా? అంటూ ఒక్కొక్కటిగా మనోజ్ జాతకాన్ని బయటపడుతూ ఉంటాడు.
దీంతో ప్రభావతి తన బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన పడుతుంది. 'ఎవరైనా ఆపండి.. వాడు నా కొడుకుని చితక బాదుతున్నాడు.. చంపేసి ఎలా ఉన్నాడు' అంటూ అరుస్తోంది. దీంతో సత్యం 'ఏదో చెప్తున్నాడు కదా ఆగు' అని అడ్డుపడతాడు. కానీ ప్రభావతి మాత్రం అడ్డుపడి మనోజ్ ను కాపాడే ప్రయత్నం చేస్తుంది. దీంతో మనోజ్ తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటాడు. అసలు విషయం బయట పెట్టే లోపే.. తాగుబోతు భార్య అక్కడికి వచ్చి.. తాగడానికి డబ్బులు లేక.. ఇలా అడుకుంటున్నావా? నీ సంగతి చెబుతా అంటూ.. వాడిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. దీంతో ఒక్కసారిగా మనోజ్, ప్రభావతి ప్రాణాలు తిరిగి వస్తాయి. ' అవును..వాడు తాగుబోతు.. మనోజ్ ని ఎందుకు టార్గెట్ చేశాడు?' అని రవి సందేహం వ్యక్తం చేస్తాడు. దీంతో మీనా..' మీ అన్నయ్య అంతకు ఇదే గుడి ముందు అడుక్కునేవాడు.. ఆ పరిచయం కావచ్చు .. ఇలా' అంటూ దాటవేస్తుంది.
ఇక మరోవైపు..మౌనిక గుడికి బయలుదేరుతుంది. ఇంతలో సంజు అడ్డుపడి..'గుడికి వెళ్ళామా.. దర్శనం చేసుకున్నామా.. కోనేటిలో దీపాలు వదిలామా.. అన్నట్లుగానే ఉండాలి. ఏదైనా తేడా వస్తే.. నా చేతులు పనిచేస్తాయి.. పరిస్థితి మరోలా ఉంటుంది' అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో సంజు తల్లి అడ్డుపడి.. అనవసరంగా మౌనికను ఇబ్బంది పెట్టకు.. తనకు ఎలా నడుచుకోవాలో తెలుసు.. అని మౌనికని గుడికి పంపిస్తుంది. ఇంతలోనే నీలకంఠం ఎంట్రీ ఇచ్చి.. సంజుకు క్లాస్ పీకుతాడు. పెళ్ళాం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చెబుతాడు. తాను కూడా అలానే ఉన్నానని తన పెళ్ళాం తన మాట దాటడంటూ.. తాను చేసే టార్చర్ ను చెబుతాడు సంజూ.
దీంతో నీలకంఠం.. సంజూకు అడ్డుపడి.. నీ పెళ్ళాన్ని చెప్పకుండా బయట ఎన్నో కథలు పడుతుంది. నీకు తెలియకుండా.. గుడి అని చెబుతూ తన ఇంటికి వెళ్తుంది. బయట ఎన్నోసార్లు తన కుటుంబాన్ని కలిసింది అంటూ బామ్మ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సంజీవ్ కు చూపిస్తాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా.. సంజు ఆవేశంతో ఊగిపోతాడు. తన భార్య తనని మోసం చేసిందని, తనకు తగిన గుణపాఠం చెప్తా అంటూ గుడికి బయలుదేరుతారు.
ఇక మరోవైపు.. మౌనిక గుడికి చేరగానే అనుకోకుండా తన కుటుంబ సభ్యులు కనిపిస్తారు. దీంతో మౌనికకు ఇక్కడ లేని సంతోషం కలుగుతుంది. అందరు కలిసి కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత కోనేటిలో కార్తీకదీపం విడిచి ప్రత్యేక పూజలు చేస్తారు. 'కార్తీక పున్నమి నాడు ముత్తైదుకు వాయనం ఇవ్వడం సంప్రదాయం. ఈసారి ఎవరికి వాయనం ఇవ్వాలని అనుకుంటున్నా.. ఇంతలోనే నువ్వు వచ్చావు మా ఇంటి మహాలక్ష్మి నువ్వే.. అంటూ ప్రభావతి.. మౌనికకు వాయనం ఇవ్వాలని భావిస్తుంది. వెంటనే మీనాను పిలిచి వాయనం, తాంబూలాలు తీసుకురమ్మని చెబుతుంది.
ఇలా మౌనికకు వాయనం ఇస్తుండగా.. సరిగ్గా అదే సమయానికి సంజు ఎంట్రీ ఇస్తాడు. ఆ సన్నివేశానికి చూసి.. ఆవేశంతో ఊగిపోతాడు. ప్రభావతి ఇస్తున్న వాయనాన్ని కింద పడేస్తాడు. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. ఇదేనా ప్రతిసారి గుడికి అని నీ కుటుంబ సభ్యులు కలవడానికి వస్తున్నాం.. ఇదేనా నీ బాగోతం అంటూ మౌనికను ఇష్టం వచ్చినట్లు తిడతాడు. 'లేదండి నాకు తెలియదు.. ఇక్కడికి వచ్చాక వాళ్ళు కలిశారు' అంటుంది మౌనిక. కానీ సంజు మాత్రం.. మౌనిక మాటలను పట్టించుకోడు.
'ఇలా ఒక్కసారి కాదు.. మొన్నటికీ మొన్న బామ్మ పుట్టినరోజు అని నాకు అబద్ధం చెప్పి.. గుడికి అని చెప్పి చాలా సార్లు బయటికి వస్తోంది. మీరందరూ కలిసి నా భార్యను నా నుండి దూరంగా చేయాలనుకుంటున్నారు కదా.. ఈమధ్య తరచూ గుడి పేరు చెప్పుకొని ఇంట్లో నుండి బయటకు వస్తోంది.. మిమ్మల్ని కలవడానికి వస్తుందా? లేదా? ఇంకెవరైనా కావడానికి వస్తుందా?' అంటూ మౌనికపై నింద వేస్తాడు సంజు. అంతటితో ఆగకుండా మౌనికపై చేజేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా బాలు.. సంజును చితకబాతాడు. కుటుంబ సభ్యులందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా పండుగ పూట గుడిలో బాలు తన బావను కొట్టడం.. మరో గొడవకు దారితీస్తుంది.


Click it and Unblock the Notifications











