Gunde Ninda Gudi Gantalu November 26th Episode: బాలుని కొట్టిన మౌనిక.. ఇక పుట్టింటికి దూరమైనట్టేనా?
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సిరీయల్ మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠతో సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి శివాలయానికి చేరుకున్నారు. గుడి బయట బాలు తన తాగుబోతు ఫ్రెండ్‌ను చూసి, "ఓ పనికిరాని వాడిలా ఎందుకు తిరుగుతున్నావ్?" అని అడుగుతాడు. "నా భార్య కార్తీక పౌర్ణమి నాడు గుడికి తీసుకువచ్చింది... తాగితేనే బుర్ర పనిచేస్తుంది" అంటాడు. ఈ మాట విన్న బాలు మనోజ్‌ను టార్గెట్ చేసే ప్లాన్ చెప్పి "నా మాట వింటే ₹1000 ఇస్తా" అని డీల్ కుదురుస్తాడు. తరువాత అతను దేవుడు పూనినట్లు ఊగిపోతూ మనోజ్ దగ్గరకు వెళ్లి అందరి ముందు దుమ్మెత్తిపోస్తాడు. "నీ మోసాలు అన్నీ తెలుసు... ఇంట్లో మోసం చేశావు... తండ్రిని మోసం చేశావు... ఇప్పుడు కొత్త మోసం ఏంటో చెప్పాలా?" అంటూ గట్టిగా అడుగుతాడు. ఇలా మనోజ్ జాతకం చదివేస్తాడు. ప్రభావతి అడ్డుకురాగా సత్యం ఆపేయమంటాడు. ఇదే సమయంలో తాగుబోతు భార్య వచ్చి అతడిని లాగిపోవడంతో మనోజ్ ఊపిరి పీల్చుకుంటాడు.
ఇంకో వైపు మౌనిక గుడికి బయలుదేరుతుండగా సంజు ఆమెను బెదిరిస్తాడు. "గుడి పేరుతో బయట తిరిగితే పరిస్థితి మరోలా ఉంటుంది" అని హెచ్చరిస్తాడు. ఈ క్రమంలో నీలకంఠం ఎంట్రీ ఇచ్చి.. సంజూ క్లాస్ పీకుతూ మౌనికపై అనుమానాలు పెడతాడు. మౌనిక గుడికి అని చెప్పి, తన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తుందని, బామ్మ పుట్టిన రోజు వేడుకల ఫోటోలు చూపిస్తాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక సంజు ఆవేశంతో గుడికి వెళ్లాడు. మౌనిక గుడికి చేరాక తన కుటుంబాన్ని చూసి సంతోషిస్తుంది. పూజలు పూర్తయ్యాక ప్రభావతి వాయనం ఇవ్వాలని ముందుకు రావడంతో అందరూ ఆనందంగా చూస్తున్నారు. అదే సమయంలో సంజు అక్కడికి వచ్చి ఆ వాయనాన్ని కింద పడేస్తాడు. "ఇదేనా బాగోతం" అంటూ మౌనికను నిందిస్తాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా చేతి చేసేందుకు ప్రయత్నించగా బాలు జోక్యం చేసుకుని సంజును చితక బాదాడు. పండుగ పూట గుడిలోనే ఘర్షణ మళ్లీ మరో తూపానుకు తెరలేపింది. ఇక బుధవారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
బుధవారం ఎపిసోడ్ కూడా రసవత్తరంగా సాగింది. సంజు.. మౌనికపై చేయి చేసుకోవడంతో ఆగ్రహానికి లోనైనా బాలు.. సంజుని చితకబాలుతాడు. ఎవరు అడ్డుకున్న బాలు ఆగకపోవడంతో సమస్య మరింత పెద్దదవుతోందానని, సంజును ఇంకేమైనా చేస్తాడేమోనని మౌనిక తన అన్నయ్య బాలు పై చేయి చేసుకుంటుంది. అందరి ముందు బాలు చెంప పడగొడుతుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. మరోసారి ఇలా జరిగితే.. జన్మలో నీ మొఖం చూడను అంటూ బాలుకి వార్నింగ్ ఇస్తుంది. ఇదే అదునుగా భావించిన సంజు.. 'చూశారా బాలు నిజస్వరూపం.. మీ ఇంటి అల్లుడు మీదనే చేయి చేసుకుంటాడా? అంటూ మౌనికను కోపంగా అక్కడినుండి తీసుకొని బయలుదేరుతారు.
ఇక ఇంటికి చేరుకున్న తర్వాత బాలుని అందరూ తప్పుపడతారు. ఇక ప్రభావతి అయితే.. ఇష్టం వచ్చినట్లు బాలుని తిడుతుంది. 'నీవల్లే నీ చెల్లికి కష్టాలు వస్తున్నాయి. వారి సంసారాన్ని కావాలని నువ్వే ముక్కలు చేస్తున్నావ్..' అంటూ నోరు జారుతుంది. దీంతో ఆగ్రహానికి లోనైన మీనా..'మీరు ఎప్పుడైనా మౌనికకు ఫోన్ చేసి బాగున్నారా? తన సంసారం గురించి ఎప్పుడైనా అడిగారా?' అంటూ ఎదురుప్రశ్నిస్తుంది.దీంతో అందరూ షాక్ అవుతారు.'మౌనిక అక్కడ కష్టాలు పడుతుందా.. నీకేమైనా చెప్పిందా.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్..?'అంటూ ప్రభావతి, మనోజ్ అడుగుతారు. ఇక్కడ నిజం చెప్తే బాలు.. సంజును ఏమైనా చేస్తాడోననీ, తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని భయం కొద్ది నిజం దాచిపెడుతోంది మీనా. కావాలంటే మీరే ఫోన్ చేసి.. తన బాగోగులు అడగండి అంటుంది.
కానీ ప్రభావతి మాత్రం 'తన కూతురు కోటేశ్వరాలు.. తనకు అన్ని సుఖాలు ఉన్నాయి. బాలు వల్లనే అన్ని కష్టాలు వస్తున్నాయి కావాలని వాడు తన చెల్లెలి సంసారాన్ని ముక్కలు చేస్తున్నాడు' అంటూ బాలుపై నిందా వేస్తుంది ప్రభావతి. దీంతో సత్యం అడ్డుపడి.. 'అనవసరంగా మాటలు జారకు. ఏ అన్న కూడా తన చెల్లెలి కాపురంలో నిప్పులు పోయాడు. బాలు కూడా అంతే.. వాడే తన చెల్లి పెళ్లికి కట్నం కానుకలు ఇచ్చాడు. బాలుకి తన చెల్లి అంటే ఎంత ప్రేమలో నాకు తెలుసు. కానీ, ఏంటి అల్లుడు పై చేయి చేసుకోవడం మాత్రం తప్పు.. ఈ విషయంలో బాలుని సమర్ధించలేను. సంజీవని కొట్టడం బాలు చేసిన పెద్ద తప్పు అని ఈ సమస్యను ఇక్కడితో ఆపితే బాగుంటుంది'అంటూ సత్యం చెబుతాడు. ఇలా ఇంటి వాళ్ళందరూ తాను చేసింది తప్పు అని చెప్పడంతో బాలు తనలో తాను బాధపడతాడు. మీనా కూడా దాచి తప్పు చేస్తున్నానా అంటూ తనలోని తాను బాధపడుతుంది.
ఇక మరోవైపు.. సంజు ఇంటికి చేరుకుని మౌనికపై చేయి చేసుకుంటాడు. ఇంతలో తన తండ్రి మణికంఠ వచ్చి.. 'ఏంట్రా ఏం చేస్తున్నావ్? అలా కొడతారా ?అంటూ ఇన్ డైరెక్ట్ గా సంజీవ్ కు సపోర్ట్ ఇస్తాడు.'మీరు చెప్పింది కరెక్ట్ డాడీ.. ఇది గుడికి అని చెప్పి తన ఫ్యామిలీని కలవడానికి వెళ్ళింది. నన్ను అవమానించిన బాలుని కలవడానికి వెళ్ళింది' అంటూ మౌనికపై మరోసారి చేయి చేసుకుంటాడు.
దీంతో మణికంఠం' ఏంటమ్మా ఇలా చేస్తున్నావ్.. చెప్పిన మాట వింటావు అనుకున్నా.. పుట్టింటికి వెళ్ళడం తప్పు కాదు.. మెట్టినింటి వాళ్ళని మోసం చేసి వాళ్ళింటికి వెళ్ళడం తప్పు.. మమ్ములను మోసం చేసినవాళ్లు ఎవరైనా సరే వాళ్ళని దూరం పెట్టాలి.. మీ ఇంట్లో ఉప్పు తిన్న విశ్వాసంతోనైనా కరెక్ట్ గా ఉండాలి' అంటూ మణికంఠ బెదిరిస్తాడు.
దీంతో సంజు మరింత రెచ్చిపోతాడు..'నువ్వు ఇక్కడే ఉండి.. మీ ఇంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు 'అంటూ మౌనిక బ్యాగు తీసుకువచ్చి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో మౌనిక..' తాను చేసింది తప్పేనని ఇంకోసారి తన కుటుంబ సభ్యుల్ని ఎవరిని కలవాలని , చచ్చేంత వరకు ఇదే నా ఇల్లు ఇక్కడే ఉంటా' అంటూ మాట ఇస్తోంది. దీంతో సంజు ఈగో సాటిస్ఫై అవుతుంది. 'మరోసారి ఎక్స్ట్రా చేస్తే.. నీ తాళి ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది' అంటూ మౌనికకు వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు వచ్చినా గాని వారితో మాట్లాడవద్దని, కనీసం వారికి ఫోన్ కూడా చేయవద్దని సంజు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో మౌనిక కూడా ఇకపై తన పుట్టింటి వారికి కాల్ చేయనని అందరి ముందుమాట ఇస్తుంది.
మరోవైపు.. సత్యం తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి వచ్చి ఒకసారి మౌనికకు ఫోన్ చేసి మాట్లాడమని చెబుతోంది. ఇలా సత్యం తన కూతురికి ఫోన్ చేస్తాడు. అయితే మౌనిక ఫోన్ రింగ్ కావడంతో. సంజు మొదట ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఒప్పుకోడు.. దీంట్లో అనవసరంగా ఈ గొడవను పెద్దది చేయకండి, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాలు ఇక్కడికి వస్తాడు అంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో సంజు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తాడు.
ఇలా ప్రభావతి మాట్లాడుతూ బాలుకు దూరంగా ఉండమని వాడితోనే నీకు కష్టాలు వస్తున్నాయని చెబుతుంది. ఆ మాటలకు ఆగ్రహానికి లోనైన సత్యం.. ప్రభావతి నుండి ఫోన్ లాక్కొని.. పరిస్థితి ఎలా ఉంది అల్లుడు కోపంతో ఏమైనా అన్నాడా అని భయంతో ఫోన్ చేశానని అసలు విషయం చెప్తాడు సత్యం. కానీ మౌనిక జరిగిన విషయాన్ని దాచిపెట్టి.. తాను బాగున్నారని సంజీవ్ కి తాను అంటే చాలా ప్రేమ అని. కేవలం బాలు వల్లనే సంజు అలా ప్రవర్తించాడు అంటుంది.
ఇక మౌనిక ఫోన్ పెట్టగానే..'బాలుకి దూరంగా ఉండకపోతే.. మీ ఇంట్లో మీ నాన్న ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది' అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక మరోవైపు.. బాలు తన చెల్లి గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. అందరూ తననే ఎందుకు తప్పుపడుతున్నారు? అని బాధపడతారు. 'ఇంతకీ నేను ఏం తప్పు చేశాను' అంటూ మీనాను ప్రశ్నించగా.. 'మీరు ఏం తప్పు చేయలేదు.. కరెక్ట్ గానే బుద్ధి చెప్పారు'అంటూ బాలుకి మద్దతుగా నిలుస్తుంది మీనా.
ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్లో.. బాలు మనోజ్ ఫ్రెండ్ ని కలసి తనకు నాలుగు లక్షల అప్పు కావాలి అని అడుగుతాడు.. తన దగ్గర అంత డబ్బు లేదని ఈ మధ్య ఎవరికీ అప్పులు ఇవ్వడం లేదని చెబుతాడు. దీంతో బాలు మనమే కదా మా అన్నయ్యకు నా లక్షలు ఇచ్చావు నాకు ఇస్తే ఏంటి బ్రో అని ప్రశ్నించడం. అందుకు మీ అన్నయ్య ముఖం చూసి ఎవడైనా డబ్బులు ఇస్తాడా అంటూ స్పష్టం చేయడంతో అసలు నిజం బయటపడుతుంది.
అలాగే ఈ విషయాన్ని ఎలాగైనా బయటపెట్టాలని బాలు.. కొత్త ప్లాన్ తో ఇంటికి వెళ్తాడు. మీ నాన్నగారు తీసిన వల కాళ్లు చేతులు పడిపోతాయి అని ఓ బాబా తనకు నిమ్మకాయ ఇచ్చాడని ఆ నిమ్మకాయ చూపించి ఇంట్లో భయపడతాడు. ఇప్పటికైనా నిజం చెప్తారా ప్రభావతి నోరు విప్పుతోందా మనోజ్ తన మోసాన్ని బయట పెడతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications











