Gunde Ninda Gudi Gantalu November 27th Episode: నిమ్మకాయ డ్రామా.. ప్రభావతి, మనోజ్‌లకు పక్షవాతం?

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సిరీయల్ బుధవారం ఎపిసోడ్‌లో సంజు-మౌనికల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. సంజు మౌనికపై చేయి చేసుకోవడం చూసిన బాలు ఆగ్రహంతో అతనిపై దాడి చేస్తాడు. ఎవరు అడ్డుకున్నా బాలు ఆగకపోవడంతో మౌనిక.. బాలు చెంపదెబ్బ కొడుతుంది. "మరోసారి ఇలా జరిగితే జన్మలో నీ ముఖం చూడను" అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. దీనిని అదునుగా సంజు.. మౌనికను వెంట తీసుకెళ్తాడు. ఇంటి చేరిన తర్వాత బాలు చేసిన పనికి అందరూ దూషిస్తారు. ప్రభావతి, "నీ వల్లే మౌనికకు కష్టాలు" అంటూ నోరు జారుతుండగా, మీనా ధైర్యంగా ఎదురు నిలుస్తుంది. "మౌనికను ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగారా?" అంటూ ప్రశ్నించడంతో కుటుంబంలో ఉద్రిక్తత పెరుగుతుంది.కానీ మీనా అసలు విషయాన్ని దాచిపెట్టి బాలు కోసం నిశ్శబ్దంగా ఉంటుంది.

సత్యం మాత్రం "సంజును కొట్టడం పెద్ద తప్పు" అంటూ పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇక ఇంటికి చేరుకున్న సంజు, మౌనికను మళ్లీ కొడతాడు. మణికంఠ కూడా పరోక్షంగా సంజుకే మద్ధతు ఇస్తూ, "పుట్టింటికి వెళ్తే తప్పు కాదు... కానీ మోసం చేసి వెళ్తే తప్పు" అంటూ బెదిరిస్తాడు. రెచ్చిపోయిన సంజు, మౌనికను ఇంటి నుంచి పంపేయాలని ప్రయత్నించగా, ఆమె తాను తప్పు చేశానని ఒప్పుకుంటూ "జీవితం చివరి వరకు ఇక్కడే ఉంటా" అని మాట ఇస్తుంది. పుట్టింటి వారితో మాట్లాడకూడదన్న కండిషన్ పెట్టడంతో మౌనిక బలవంతంగా అంగీకరిస్తుంది. సత్యం మౌనికకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. మౌనిక నిజం దాచిపెట్టి బాలు కారణంగా సంజు కోపం వచ్చిందని తప్పుడు కథ చెబుతుంది. మరోవైపు బాలు తన చర్యపై బాధపడి, "నేను ఏం తప్పు చేశాను?" అని మీనాను అడగగా, ఆమె, "మీరు కరెక్ట్‌గానే బుద్ధి చెప్పారు" అంటూ అతనికి ధైర్యం చెబుతుంది. ఇక గురువారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 563 November 27th 2025 here is full story

Courtesy: Jio hotstar

ఇక గురువారం ఎపిసోడ్‌లో బాలు తన చెల్లెలు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మీనా వచ్చి, 'మీరు అనవసరంగా బాధపడకండి.. మీరు చేసిన దానిలో తప్పేం లేదు.. ఏ అన్నయ్య కూడా తన చెల్లెలు కష్టం వస్తే.. చూస్తూ ఊరుకోడు. మీరు కూడా అలానే అంతే.. మీ ముందు మీ చెల్లెల్నీ కొట్టేసరికి మీరు కోపాన్ని ఆపుకోలేకపోయారు. ఎవరు ఏమన్నా నేను మాత్రం మీరు చేసిన దాన్ని సమర్థిస్తాను' అంటూ బాలోకి సపోర్ట్ గా నిలుస్తుంది మీనా. 'సరే కానీ ఈ సమస్యలు పడి నా నగల విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. గుడిలో మీ ఫ్రెండ్ చేత అసలు విషయాన్నీ బయట పెడతానని చెప్పారు. కానీ మీ ప్లాన్ అక్కడ కూడా ఫెయిల్ అయింది. ఇంతకీ నగలు వాళ్లే తీసి ఉంటారా? లేదా? మనమే అనుమానిస్తున్నామా అంటూ మీనా సందేహాపడుతుంది.

'ఎందుకు వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నావ్.. వాళ్ళు ఏనాడైనా మంచి పని చేశారా? వాళ్ళిద్దరూ చేసినవన్నీ కుట్రలు, కుతంత్రాలు. గతంలో చేసిన తప్పులను మర్చిపోయావా? అంటూ మీనా ను తిరిగి ప్రశ్నిస్తాడు బాలు. 'అలా అని కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ? అసలు నిజం బయటపడటం లేదు కదా.. ఒకవేళ నిజంగానే మనోజ్ ఆ నగలను తీసి ఉంటే.. మీ అమ్మ ఆ విషయాన్ని ఎన్నటికీ బయట పడనివ్వదు. ఒకవేళ మీ అమ్మనే తీసి ఉంటే.. జీవితంలో మనకు అసలు నిజం తెలియదు' అంటూ మీనా బాధపడుతుంది. దీంతో బాలు 'నువ్వు అనవసరంగా బాధపడకు.. ఎలాగైనా వారి చేత నిజం బయటపెట్టేస్తా.. అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది' అని అంటాడు.

మరుసటి రోజు ఉదయాన్నే బాలు.. మనోజ్ పార్క్ ఫ్రెండ్ మణికంఠ దగ్గరికి వెళ్తాడు. ఎలాగైనా అతనితో నిజం చెప్పించాలని భావిస్తాడు. ఈ క్రమంలో తాను కొత్త కార్ కొంటున్నానని, అందుకు రెండు లక్షల రూపాయలు తక్కువ పడ్డాయని, వీలుంటే రెండు లక్షలు సర్దుబాటు చేయమని అడుగుతాడు. 'వడ్డీ గురించి టెన్షన్ పడనవసరం లేదు.. నెలనెల వడ్డీ ఇస్తాను' అంటూ బాలు మణికంఠను రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో మణికంఠ 'నాకు లక్షలు లక్షలు అప్పు ఇచ్చే స్టేజ్ లో ఉంటే.. నేను ఇక్కడ కూర్చుంటాం.. రూపాయి.. రెండు రూపాయలకు లెక్కలు ఎందుకు రాసుకుంటాను?' అంటాడు. దీంతో బాలు 'ఊరుకోండి మొన్ననే కదా.. మనోజ్ కు మీరు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారట కదా..' అని మెల్లగా నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు.

'ఏంటి మీ అన్నయ్యకు నాలుగు లక్షలా...? ఆ ముఖం చూసి.. ఎవడైనా లక్షలు అప్పుగా ఇస్తారా..? నాలుగు నెలల క్రితం. 10,000 అప్పు ఇచ్చినందుకే నాకు చుక్కలు చూపించాడు.. అలాంటి మీ అన్నయ్యకు నేను ఎలా డబ్బు ఇచ్చానంటే నమ్మరు. అయినా నేను ఎవరికి కూడా లక్షకు మించి ఇవ్వను' అంటూ అసలు నిజాన్ని బయటపెడతాడు మణికంఠ. ఆ మాటలు విన్న బాలుకి అనుమానం మరింత బలపడుతుంది. వెంటనే మీనా ను కలిసి.. పార్కులో జరిగిన విషయాన్నంతా చెప్తాడు. దీంతో మీనా బాధపడుతుంది. 'ఎలా అసలు విషయం బయటపడుతుంది.. ఎలా నిజం రాబడుతారు? మనం ఏం చేసినా వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా' అని మీనా వాపోతోంది.

'నేను కూడా అదే విషయం గురించి బాధపడుతున్న.. ఎలాగైనా అసలు విషయాన్నీ బయట పెడతా.. 'అంటాడు బాలు. ఇందులో మీనాకు ఆలోచన వస్తుంది. తనకు తెలిసిన బాబా ఉన్నాడని.. అతడు అంజనం వేసి పోయిన వస్తువులను గుర్తుపడతాడని చెబుతుంది. కానీ తాను ఆ విషయాలను నమ్మనని అంటాడు బాలు. కానీ, మీనా చెప్పిన ఆలోచన ప్రకారం.. బాలు కొత్త ప్లాన్ తో ముందుకు వస్తాడు. బాలు తన కొత్త ప్రకారం.. షాప్ కు వెళ్లి.. నిమ్మకాయ, తాళ్లు, విభూది కనుక్కొని.. బాబా అవతారమెత్తుతాడు. కొత్త డ్రామా షురూ చేస్తాడు. మీనా నగల కోసం.. తాను వీరభద్ర స్వామి గుడిలో ఉన్న బాబాను కలిసానని, ఆ బాబా తనకు మంత్రించిన నిమ్మకాయను ఇచ్చాడు అంటూ తన డ్రామాలు షురూ చేస్తాడు.

'మన ఇంట్లో దోపిడీలు, దొంగతనాలు, మార్పిడిలు జరుగుతున్నాయని, మన ఇంట్లోనే మీనా నగలు తీసిన దొంగలు ఉన్నారని చెప్పాడని, ఈ క్రమంలో తనకు మంత్రించిన నిమ్మకాయను ఇచ్చారని, ఆ నిమ్మకాయకు ఎన్నో శక్తులు ఉన్నాయని బాలు.. చెబుతాడు. బాలు అంతతో ఆగకుండా.. 'ఆ నిమ్మకాయను ఇంట్లో పడితే. . 24 గంటల్లోపు నగలు తీసిన వారి కాళ్లు చేతులు పడిపోతాయని, శాశ్వతంగా అంగవైకల్యంతో బాధపడాల్సి వస్తుందంటూ భయపెడుతాడు. బాలు వత్తాసుగా శృతి.. 'అవును నిజమే.. ఆ వీరభద్ర స్వామి గుడిలో ఉన్న బాబా ఎంతో పవర్ పుల్.. మా ఇంట్లో కూడా మా వంట మనిషి ఉంగరాన్ని డ్రైవర్ తీస్తే.. ఆమె కూడా ఇలానే ఆ బాబా దగ్గరికి వెళ్లి మంత్రించిన నిమ్మకాయని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టింది. ఆ ఉంగరం తీసిన డ్రైవర్ కాళ్లు చేతులు పడిపోయాయి' అని చెప్పి మరింత భయపెడుతుంది.

దీంతో ప్రభావతి, మనోజ్ గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ విషయాన్ని గమనించడం బాలు.. 'మీరు ఎందుకు భయపడుతున్నారు.. ఒకవేళ నిజం చెప్పకపోతే మాత్రం 24 గంటల్లో.. కాళ్లు చేతులు పడిపోతాయి.. జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది' అంటూ మరోసారి వార్నింగ్ ఇస్తాడు. దీంతో పక్కనే ఉన్న శ్రుతి.. 'నగలు తీస్తేనే కదా భయపడేది.. అనవసరంగా మీరు ఎందుకు భయపడుతున్నారు? అని మనోజ్ ను ప్రశ్నిస్తోంది. తాను నిమ్మకాయ గురించి భయపడడం లేదని, బాలు చేసే క్షుద్ర పూజలను గురించి భయపడుతున్నానంటూ చెబుతాడు. ఆ తర్వాత బాలు.. ఆ నిమ్మకాయను తీసుకువెళ్లి పూజ గదిలో పెడతాడు. దీంతో తమకు ఏం జరుగుతుందోనని ప్రభావతి, మనోజ్ లు కంగారుపడుతారు.

తర్వాత బాలు.. వంట గదిలోకి వెళ్లి.. 'ఓం భేమ్ బుష్' అంటూ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. బాలు చేతులపై అనుమానం వచ్చిన మీనా.. 'నేను మొదట బాబా గురించి చెబితే నమ్మకం లేదన్నారు. ఇప్పుడేమో నిమ్మకాయ తీసుకువచ్చి పెట్టారు. ఇంతకీ ఏ బాబా దగ్గరికి వెళ్లారు' అని ప్రశ్నించగా.. తాను బాలానంద స్వామి దగ్గరికి వెళ్ళానని, ఆ స్వామికి ఎన్నో శక్తులు ఉన్నాయని.. మాయలను, మంత్రాలను, కుట్రలను బయట పెట్టే శక్తులు ఉన్నాయని బాలు అంటాడు. ఇంతకీ ఆ బాబాయ్ ఎక్కడుంటాడని మీనా ప్రశ్నించగా.. 'ఇక్కడే ఉన్నాడు.. నీ ముందే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కదా.. ఆ బాబా ఎవరో కాదు నేనే' అంటూ.. బాలు తన డ్రామా విషయాన్ని మీనాకు చెబుతాడు. ఇలా.. ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా నేటి సీరియల్ సాగింది.

ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో.. ఆ నిమ్మకాయను ఎలాగైనా బయటపడేయాలని ప్రభావతి, మనోజ్ ఇద్దరు ప్లాన్ వేస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు పూజ గదిలోకి వెళ్లి, నిమ్మకాయను తీసే ప్రయత్నం చేస్తారు. అయితే.. చీకట్లో ఒకరినొకరు తాగడంతో.. భయంతో అరుస్తారు. కట్ చేస్తే.. దీంతో వాళ్ళిద్దరికీ పక్షవాతం వచ్చినట్లు వీల్ చైర్ కు పరిమితం అవుతారు. వారికి పక్షవాతం వచ్చినట్టు చూపించారు. అయితే ఇది నిజమా? వారికి పడిన కలనో.. అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎపిసోడ్లు మరింత ఇంట్రెస్టింగ్ గా, రసవత్తరంగా సాగబోతున్నాయని అర్థమవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X