Gunde Ninda Gudi Gantalu November 28th Episode: నిమ్మకాయ మహిమ! ప్రభావతి, మనోజ్ కి పక్షవాతం

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సిరీయల్ గురువారం ఎపిసోడ్ పూర్తిగా బాలు-మీనా భావోద్వేగాల చుట్టూ తిరిగింది. బాలు తన చెల్లెలు విషయంపై బాధపడుతుండగా.. మీనా అతనికి ధైర్యం చెబుతుంది. "ఏ అన్నయ్య అయినా తన చెల్లెలు కష్టంలో పడితే ఊరుకోడు" అంటూ బాలు చేసిన పనిని సమర్థిస్తుంది. కానీ నగల విషయంలో నిజం బయటపడకపోవడం, గుడిలో బాలు ఫ్రెండ్ చేసిన ప్రయత్నం విఫలమవడం ఆమెను కలవరపెడుతుంది. మనోజ్, ప్రభావతిలపై పూర్తి అనుమానంతో ఉన్న బాలు, గతంలో వాళ్లు చేసిన కుట్రలను గుర్తుచేస్తూ మీనాను నమ్మించగానికి ప్రయత్నిస్తాడు. కానీ మీనా "నిజం బయటపడటం లేదు" అంటూ ఆలోచనలో పడుతుంది.

మరుసటి ఉదయం బాలు కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతాడు. మనోజ్‌కి దగ్గరైన మణికంఠను కలసి, "కొత్త కార్ కొంటున్నాను... రెండు లక్షలు అవసరం" అని నిజం రాబట్టాలని ప్రయత్నిస్తాడు. మణికంఠ వెంటనే స్పందించి "మీ అన్నయ్యకు నేను లక్షలు లక్షలు అప్పు ఇచ్చానా?" అంటూ నవ్వుకుంటూ.. తాను 10,000 ఇచ్చినా తిరిగి పొందటానికి తిప్పలు పడ్డానని చెబుతాడు. దీంతో మనోజ్ అసలు డబ్బు తీసుకోలేదని బాలు అర్థం చేసుకుంటాడు. అనుమానం మరింత బలపడడంతో మీనాకి విషయం చెబుతాడు. "ఎలా నిజం బయటపడుతుంది?" అంటూ మీనా ఆవేదన చెందుతున్నప్పుడు, ఆమెకు బాబా ఆలోచన గుర్తుకు వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 564 November 28th 2025 here is full story

బాలు ఈ ఆలోచనను విస్తరించి.. తాను "బాబా మంత్రించిన నిమ్మకాయ" తీసుకొచ్చానని ప్రకటిస్తాడు. "ఇంట్లో దొంగ ఉన్నారు.. 24 గంటల్లో నిజం చెప్పకపోతే వారి చేతులు, కాళ్లు పడిపోతాయి" అంటూ ప్రభావతి-మనోజ్‌లను భయపెడుతాడు. శృతి కూడా కథలో కలిసిపోయి డ్రామాను మరింత రక్తిగట్టిస్తుంది. దీంతో ప్రభావతి, మనోజ్ గుండెల్లో గుబులు మొదలవుతుంది. బాలు పూజగదిలో నిమ్మకాయను ఉంచి, వంటగదిలో మంత్రాలు చదవడం మొదలుపెడతాడు. మీనాకు సందేహం రాగానే "నేనే బాలానంద స్వామి.. నిజం బయట పెడతా" అంటూ తన డ్రామా అసలు ఉద్దేశాన్ని చెబుతాడు.

ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో మనోజ్ బాగోతాన్ని బయట పెట్టడానికి, మంత్రించిన నిమ్మకాయ డ్రామా ఆడుతున్నానీ బాలు చెబుతాడు. అయితే .. నిజంగానే మనోజ్ నిజాన్ని బయటపెడతాడా? అని మీనా ప్రశ్నించగా.. చిన్నప్పటినుండి ఇలాంటి విషయాలలో భయం ఎక్కువ. ఎలాగైనా వాడు నిజం బయటపెడుతాడని బాలు నమ్మకం వ్యక్తం చేస్తాడు. మరోవైపు.. ప్రభావతి, మనోజ్ లు నిమ్మకాయ గురించి ఆలోచిస్తూ భయపడుతాడు. బాలు చెప్పినట్టు తనకు మనకు ఏమైనా జరుగుతుందోనని అపోహపడతాడు. ఆ కంగారుతో అరుస్తారు.

దీంతో రోహిణి వచ్చి.. 'మీకేం కాలేదు.. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు నీకు కూడా అలానే ఉన్నట్లుంది. అనవసరంగా టెన్షన్ పడకండి. సైలెంట్ గా వెళ్లి పడుకోండి' అంటూ వాళ్లకు ధైర్యం చెబుతుంది. ప్రభావతి సైలెంట్ గా వెళ్లిపోయిన.. మనోజ్ మాత్రం తనకి ఏదో జరుగుతుందని ఆందోళన చెందుతాడు. 'మీరు ఇలానే చేస్తే.. మీరే దొంగల అనే విషయం ఇంట్లో వారందరికీ తెలుస్తోంది. అనవసరంగా కంగారు పడకండి' అని మనోజ్ కు ధైర్యం చెబుతుంది రోహిణి.

'అయినా బాలు ఏ రోజైనా గుడికి వెళ్లాడా? అసలు దేవుడిని నమ్ముతాడా..? బయట షాప్ లో ఓ నిమ్మకాయ తీసుకొచ్చి డ్రామా ఆడుతున్నాడు. అనవసరంగా మీరు కంగారు పడకండి. మీకు ఏం జరగదు. ఆ నిమ్మకాయ మిమ్ములను ఏం చేయలేదు? మీ భయమే మీ శత్రువు' అంటుంది రోహిణి. అయినా మనోజ్ మాత్రం భయంతో గజగజవణుకుతాడు. 'నువ్వు ఇంత పిరుకోడిని అని ఎప్పుడు అనుకోలేదు.. నీ భయమే నిన్ను పట్టిస్తుంది. అనవసరంగా ఆలోచించి కంగారు పడకు.. ఏం కాదు' అంటుంది రోహిణీ.

కానీ మనోజ్ మాత్రం..తన బాగోతం ఎక్కడ బయటపడుతోందననీ,తనతో ఉండమని ప్రాధేయపడతాడు. దీనితో రోహిణి 'సరేలే.. నేను ఇక్కడికి వెళ్ళను సైలెంట్ గా పడుకో' అని చెప్తుంది.మరోవైపు.. శృతి,రవి ఇద్దరు ఇంట్లో జరుగుతున్న సన్నివేశాల గురించి మాట్లాడుతుంటారు. ఇంతలో మీనా వాళ్ళ రూమ్‌కి వస్తుంది. మనోజ్, ప్రభావతి బాగోతాన్ని బయట పెట్టడానికి బాలు మంత్రించి నిమ్మకాయ డ్రామా ఆడుతాడని అసలు విషయం చెబుతుంది.

మరోవైపు .. మనోజ్ తనకు పక్షవాతం వచ్చినట్లు.. ఇంట్లో వాళ్ళందరూ తనని హీనంగా చూస్తున్నట్లు కల గంటాడు. ఆ భయంతో నిద్రలో ఉలిక్కిపడతాడు. ఆ విషయాన్ని రోహిణికి చెబుతూ బాధపడతాడు. 'అనవసరంగా భయపడకు.. నీకేం కాలేదు కావాలంటే అద్దంలో చూడు.. అనవసరంగా కంగారు పడి అసలు నిజం నువ్వే బయట పెట్టేలా ఉన్నావు'అని రోహిణి అంటుంది. ఏదైనా ఉంటే తాను చూసుకుంటా అంటూ ధైర్యం చెప్పిన మనోజ్ మాత్రం కంగారు పడుతూనే ఉంటాడు. దీంతో రోహిణి.. ' నా నిద్ర చెడగొట్టకు.. ఇక్కడి నుంచి వెళ్ళిపో.. దొంగతనం చేసే ముందు తప్పు చేసే ముందు భయం ఉండాలి.. ఇప్పుడు భయపడి ఏం లాభం ఇకనుండి వెళ్ళిపో అని' చీదరించుకుంటుంది.

దీంతో ఎలాగైనా ఆ నిమ్మకాయను ఇంట్లో నుండి తీసి పడేయాలని నిర్ణయించుకొని, మనోజ్ పూజ గదిలోకి చేరుకుంటాడు. అప్పటికే తన ప్రభావతి కూడా పూజగదిలో నిమ్మకాయ నువ్వు చూస్తూ భయపడుతుంది. తనకు కూడా పక్షవాతం వచ్చినట్లు.. ఇంట్లో వాళ్ళు తనని హీనంగా చూస్తున్నట్లు కల వచ్చిందని ప్రభావతి చెప్తుంది. ఆ సన్నివేశాలు చూడడానికి నవ్వు తెప్పించే ఎలా ఉన్నా.. ప్రభావతి, మనోజ్‌ల ఫ్యూచర్ మాత్రం అర్థమవుతుంది. ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేమని మనోజ్ తన తల్లిని బ్రతిమాలాడగా.. వెంటనే కామాక్షికి ఫోన్ చేస్తుంది. బాలు తీసుకువచ్చిన నిమ్మకాయ గురించి చెబుతుంది. ఆ సమస్య నుండి తమను బయటపడేవని, ఏదో ఒక పరిష్కారం ఆలోచించమని ప్రాదేయపడుతుంది.

ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో.. ప్రభావతి, మనోజ్ ఇద్దరు కలిసి మంత్రించిన నిమ్మకాయను ఇంట్లో నుండి బయట పడేయాలని ప్లాన్ చేస్తారు. ప్రభావతి ధైర్యం చేసి ఆ నిమ్మకాయను తీసుకొని బయటికి వెళుతుంది. ఇందులో బాలు వచ్చి ఇంట్లో లైట్స్ అన్ చేస్తాడు. దీంతో కంగారుపడి మనోజ్ అరవడం. ఇంట్లో వాళ్ళు అందరూ హాల్లోకి రావడం. ఈ క్రమంలో నిమ్మకాయ విషయాన్ని బాలు బయటపెడ్డటం. అలాగే మీనా బంగారం గురించి సత్యం అడగడం. ఈ క్రమంలో మనోజ్ తాను చేసిన తప్పులో తన తల్లి ప్రభావతి సపోర్టు కూడా ఉందని అసలు విషయాన్ని బయటపెడతాడు.ఇలా సీరియల్ ఉత్కంఠగా సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X