Gunde Ninda Gudi Gantalu December 1st Episode: నిమ్మకాయ మహిమ.. మనోజ్,ప్రభావతీల గుట్టురట్టు..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సిరీయల్ శుక్రవారం ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. బాలు తెచ్చిన మంత్రించిన నిమ్మకాయకు నిజంగా ఏదో పవర్ ఉందని ఇంట్లో అందరూ నమ్ముతారు. మీనా కూడా అదే భావనలో ఉండగా, బాలు నిజం చెబుతాడు "ఆ నిమ్మకాయ నేనే కొన్నాను, ఎలాంటి స్వామీజీ ఉండరు. దొంగతనం బయటపడేందుకు స్కెచ్ వేసాను" అని. మీనా ఆనందంగా అతనిని ప్రశంసిస్తూ, వెంటనే శ్రుతి, రవి దగ్గరికి వెళ్లి నిజం చెబుతుంది. "స్వామీజీ మీ బాలు అన్నయ్యే రవి..." అని చెప్పగానే, శ్రుతి కూడా అంగీకరిస్తూ "నిజమే... బాలు స్కెచ్ వేశాడు కదా, దొంగ దొరికిపోతాడు" అని నమ్మకం వ్యక్తం చేస్తుంది.

అంతకుమాత్రం మనోజ్, ప్రభావతి మాత్రం భయంతో వణికిపోతున్నారు. చేతులు, ముఖం వంకరపడుతున్నాయంటూ మంత్రం తమపై పడిందని అనుకుంటూ ఒకరికి మరొకరు గుసగుసలాడుతుంటారు. ఆ వేళ రోహిణి గదిలోకి వచ్చి, "బాలు భయపెట్టడానికి చెప్పాడు అంతే" అంటూ వారిని మందలించి ధైర్యం చెప్పి వెళ్లిపోతుంది. కొంత శాంతి వచ్చినా భయం పూర్తిగా తొలగదు. రాత్రి వారు ఇద్దరూ ఒకే భయంకరమైన కలతో నిద్రలేస్తారు. కదలలేని స్థితిలో వీల్ చెయిర్‌లో ఉన్నట్టుగా, భయంతో హాల్లోకి పరుగెత్తి, అక్కడే ఉన్న నిమ్మకాయలను చూసి "ఇవే శాపం" అని గుసగుసలాడుతుంటారు. చివరికి భయం తట్టుకోలేక ప్రభావతి కామాక్షీకి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, భయంతో మాటలు అడ్డగోలుగా వచ్చి పూర్తిగా వివరించలేక తడబడిపోతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 565 December 1st 2025 here is full story
Courtesy: Jio hotstar

బాలు తెచ్చిన 'మంత్రించిన నిమ్మకాయ'ను పూజా గదిలో పెట్టగానే, ప్రభావతి,మనోజ్‌ల గుండెల్లో గుబులు మొదలవుతుంది."ఇదే మన బాగోతం బయటపెట్టేదేమో?" అనే భయం వాళ్లలో మొదలవుతుంది. రాత్రి ఎవరికి కనిపించకుండా ఒక్కోక్కరుగా పూజ గదిలోకి వెళ్లి ఆ నిమ్మకాయను తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ,భయంతో "ముట్టుకుంటేనే ఏదో జరుగుతుందేమో?" అని ధైర్యం చెయ్యలేరు. ఇలాంటి ఆందోళనలో ఉన్న ప్రభావతి, మీనాక్షికి ఫోన్ చేస్తుంది. "బాలు తీసుకున్న నిమ్మకాయ వల్ల ఏదైనా జరుగుతుందా?" అని ఏడవడం మొదలు.మీనాక్షి మాత్రం మాట మార్చేస్తుంది. "నాకు తెలిసిన బాబా ఉన్నాడు... ఎన్నో మహిమలు చేశారు. ఆయన దగ్గరకు వెళ్లే పరిష్కారం చెబుతాడు" చెబుతుంది. దీంతో ఈ మాటలు విన్న ప్రభావతి ఒకింత ఊరటతో పడుకుంటుంది.

మరుసటి రోజు తెల్లవారుజామున.. స్వామీజీ దగ్గరికి వెళ్లడానికి మనోజ్ రెడీ అవుతాడు. తెల్లవారుజామునే మనోజ్ స్నానం చేసి సిద్ధం అవుతాడు. ఇది చూసి రోహిణి "ఇంత ఉదయాన్నే ఎక్కడికి?" అని అడుగుతుంది. మనోజ్ తడబడుతూ మీనాక్షి పిన్ని ఇంటికి అమ్మ వెళ్తుందని, తానూ రావాలని చెప్పారంటాడు. రోహిణి వెంటనే "నేనూ వస్తాను, పార్లర్ అపాయింట్మెంట్ ఉంది" అంటుంది. గట్టెక్కేందుకు మనోజ్ మాట మార్చుకుంటూ "నేను అటువైపు కాదు... ఇంకో చోటికే." అని తప్పించుకుంటాడు. మరోవైపు.. హాల్‌లో ప్రభావతి ఆత్రుతగా మనోజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ వాక్ నుంచి వచ్చిన సత్యం.. ఇంత తెల్లవారుజామున బయటకు రెడీ అవుతున్న ప్రభావతిని చూసి షాక్ అవుతాడు. ఏం చెప్పాలో అర్థం కాని ప్రభావతి, అటుగా వెళ్లే మీనాను పిలిచి "నీళ్లు కావాలి" అంటూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

బాలు కూడా అదే సమయంలో హాల్లోకి వస్తాడు. "ఇంత తెల్లవారకే ఏటు బయలుదేరుతున్నారు... ఏదైనా ముఖ్యమైన పనేమో?" అని ఎదురు ప్రశ్న. ప్రభావతి "బయటకొద్దాను ముందు ప్రశ్నించకూడదని తెలియదా ?'అంటూ సమాధానాన్ని దాటేసే ప్రయత్నం చేస్తుంది. దానికి బాలు "అందుకే బయలుదేరే ముందే అడుగుతున్నాను" అని సెటైర్ వేస్తాడు. ఇంతలోనే మనోజ్ రెడీ అయి దిగొస్తాడు.బాలు ఎక్కడికి అని అడిగితే.. మనోజ్ "మీనాక్షి పిన్ని ఇంటికి... తరువాత ఫంక్షన్." అని చెబుతాడు. అయితే.. అంతకుముందు ప్రభావతి.. హాస్పిటల్ కు వెళ్తున్నామని చెప్పడం.. మనోజ్ ఫంక్షన్ కు వెళ్తున్నామని చెప్పడంతో బాలుకి ఎక్కడో తేడా కొడుతుంది.

అసలు మీనాక్షి అత్తకు ఏమైందని ప్రశ్నించగా..ప్రభావతి 'తలనొప్పి' అని చెప్పగా.. మనోజ్ మాత్రం 'కడుపునొప్పి' అని పొంతన లేని సమాధానం ఇస్తారు. దీంతో బాలు అనుమానం మరింత ఎక్కువవుతుంది. అక్కడే ఉంటే తమ బాగోతం ఇక్కడ బయట పడుతుందోనని ప్రభావతి.. మనోజ్ ను తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తుంది.

స్వామీజీ దగ్గరకు వెళ్లి.. బాలుపై చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ, ఆ స్వామీజీ మాత్రం అందరి దగ్గర అబద్దాలు చెప్పినట్టు తన దగ్గర కూడా అబద్దాలు చెప్తున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో ప్రభావతి 'మనోజ్ వ్యాపారంలో నష్టపోతే.. బాలు భార్య మీనా నగలను అమ్మేసి, ఆ నష్టాన్ని భర్తి చేశాను. ఆ నగల విషయాన్ని బయట పెట్టడానికి.. బాలు మంత్రించినా నిమ్మకాయను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు' అని అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఇంతలోనే మనోజ్.. బాలు తెచ్చిన నిమ్మకాయలో అంతా పవర్ ఉందా? లేదా తమను భయపెట్టడానికి ఆ నిమ్మకాయను తీసుకోవచ్చాడా? అని స్వామిజీని ప్రశ్నించగా.. ఆ స్వామీజీ కోపంతో..'మూర్ఖుడా? బాలు తీసుకువచ్చిన నిమ్మకాయలో చాలా పవర్ ఉంది. నిమ్మకాయ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో.. అదే నిమ్మకాయ మంత్రించి ఇస్తే రసం పిండినట్టు శరీరం చచ్చుబడిపోతుంది' అంటూ స్వామి కూడా భయపెడుతాడు.

స్వామిజీ మాట్లాలు విన్న ప్రభావతి మరింత ఆందోళనకు లోనవుతుంది.ఎలాగైనా ఆ సమస్య నుండి బయటపడేమని ప్రాధేయపడుతుంది. దీంతో స్వామీజీ కూడా ఓ మంత్రించిన నిమ్మకాయను ఇస్తాడు. బాలు తెచ్చిన నిమ్మకాయ ప్రక్కన పెట్టమని సూచిస్తాడు. అలా స్వామిజి ఇచ్చిన నిమ్మకాయను తీసుకొని మనోజ్,ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. బాలు తెచ్చిన నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అని చెప్పడంతో దాన్ని చూస్తూ ప్రభావతి భయపడుతుంది. స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయను.. బాలు నిమ్మకాయ దగ్గర పెట్టడానికి టెన్షన్ పడుతుంది. ఎలాగోలా స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయను అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ నిమ్మకాయ జారి కింద పడిపోవడంతో మనోజ్ ఒక్కసారి షాక్ అయ్యి
కింద పడిపోతాడు.

దీంతో ప్రభావతి నీళ్ళు చల్లి మనోజ్ ను లేపుతుంది. అనవసరంగా కంగారు పడకు.. స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయ అక్కడ పెట్టుమని చెబుతోంది. దీంతో మనోజ్ టెన్షన్ టెన్షన్ గా స్వామి ఇచ్చిన నిమ్మకాయను బాలు నిమ్మకాయ పక్కన పెడతాడు. అయితే ఈ విషయాన్ని బాలు గమనించి..నీకు చూపిస్తాడు. తాను చెప్పినట్లు వినమని, బాలు కొత్త ప్లాన్ ను అమలు చేస్తాడు. తన ప్లాన్ లో భాగంగా ఇంట్లో వారందరినీ బయటకు తీసుకువచ్చి.. కొత్త నిమ్మకాయ గురించి బయట పెట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో తమ భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతాడు.

ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో.. అర్థరాత్రి వేళ బాలు తీసుకువచ్చిన నిమ్మకాయను మనోజ్, ప్రభావతి ఇద్దరు కలిసి బయటపడేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఒకసారి గా ఇంట్లో లైట్స్ ఆన్ చేస్తాడు. దీంతో మనోజ్ అరవడంతో ఇంట్లో వాళ్లు అంతా హాల్ లోకి వస్తారు. ఈ క్రమంలో సత్యం ఆ విషయాన్ని గ్రహించి, మనోజ్ ను నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపడతాడు.ఇలా ఉత్కంఠ భరితంగా నేటి ఎపిసోడ్ సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X