Gunde Ninda Gudi Gantalu December 2nd Episode: బాలు ప్రీమియర్ లీగ్.. చితకబాదిన సత్యం.. మనోజ్, ప్రభావతి బోల్డ్

Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్‌లో బాలు తెచ్చిన "మంత్రించిన నిమ్మకాయ" పూజా గదిలో ఉంచిన నాటి నుంచే ప్రభావతి-మనోజ్‌ల గుండెల్లో భయం మొదలైంది. రాత్రిళ్లు ఒక్కొక్కరుగా పూజా గదిలోకి వెళ్లి నిమ్మకాయను తొలగించాలని ప్రయత్నించినా, "ముట్టుకుంటే సమస్య వస్తుందేమో" అనే భయంతో ఏమీ చేయలేకపోయారు. గాని ఆందోళనలో ఉన్న ప్రభావతి, మీనాక్షికి ఫోన్ చేసి "ఈ నిమ్మకాయ వల్ల ఏదైనా జరుగుతుందా?" అని ఏడుస్తుంది. మీనాక్షి మాత్రం స్వామిజీ దగ్గరకు వెళ్లాలని సూచిస్తుంది. తరువాత రోజు తెల్లవారుజామునే మనోజ్ స్వామిజీని కలవడానికి సిద్ధమవుతాడు. ఇంట్లో రోహిణి, సత్యం, బాలు ప్రశ్నలు అడగగా ప్రభావతి మనోజ్‌లు పొంతనలేని సమాధానాలు చెబుతారు. అబద్ధాలు చెప్పడాన్ని గుర్తించిన బాలు, వారి ప్రవర్తనను అనుమానంతో గమనిస్తాడు. చివరికి ప్రభావతి మనోజ్‌ను తీసుకొని స్వామిజీ వద్దకు వెళ్తుంది.

స్వామిజీ ముందే బాలు గురించి చాడీలు చెప్పాలనుకున్నా, అతను కోపంతో "ఇంట్లో ఎలా అబద్ధం చెప్తావో ఇక్కడా అలా చెప్తున్నావు" అంటూ వారిని నిలదీస్తాడు. ప్రభావతి చివరికి నిజం చెప్తుంది. మనోజ్ నష్టాలను పూడ్చేందుకు మీనా నగలను అమ్మేసిన విషయం బయట పడుతుందనే భయంతో నిమ్మకాయపై భ్రమ పడుతున్నట్టు ఒప్పుకుంటుంది. స్వామిజీ కూడా భయపెట్టేలా "మంత్రించిన నిమ్మకాయ రసం శరీరాన్ని చచ్చుబడిస్తుంది" అంటాడు. పరిష్కారంగా మరో మంత్రించిన నిమ్మకాయను ఇచ్చి, బాలు నిమ్మకాయ పక్కన పెట్టమంటాడు. ఇంటికి వచ్చాక నిమ్మకాయ పెట్టేలోపే అది కింద పడిపోవడంతో మనోజ్ షాక్ అవుతాడు. ప్రభావతి పట్టుపట్టి స్వామి నిమ్మకాయను పక్కన పెడుతుంది. ఇదంతా గమనించిన బాలు, కొత్త ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతాడు. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 566 December 2nd 2025 here is full story
Courtesy: Jio hotstar

మంగళవారం ఎపిసోడ్ లో బాలు ఎలాగైనా నగల దొంగల గుట్టును బయటపెట్టాలనే సంకల్పంతో కొత్త స్కెచ్ వేస్తాడు. అదే 'బిపిఎల్ - బాలు ప్రీమియర్ లీగ్'. తన ప్లాన్ ప్రకారం ముందుగా మనోజ్ గది తలుపు తడతాడు. ఒక్కసారిగా తలుపు తట్టడంతో ఉలిక్కిపడిన మనోజ్ డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ బయట ఎవరూ ఉండరు. ఎవరైనా కావాలనే డిస్టర్బ్ చేస్తున్నారని భావించి తలుపు తెరిచి పెట్టేస్తాడు. ఇదే బాలు కోసం గోల్డెన్ ఛాన్స్. గదిలోకి వెళ్లి నిమ్మకాయకు దారం కట్టి, దానిని మనోజ్ వైపు విసిరేస్తాడు. ఆ నిమ్మకాయ మనోజ్‌ను వెంబడిస్తూ వస్తున్నట్లు కనిపించడంతో అతను ఆందోళన చెందుతూ బాల్కనీలోకి వెళ్తాడు. అక్కడ పెద్దగా అరుపులు వినిపించడంతో జడుసుకుని గదిలోకే పరుగెత్తుకుంటూ వస్తాడు. "నిమ్మకాయ దెబ్బకు నా గుండె జరిపోలా ఉంది" అని భయపడి తన తల్లి ప్రభావతి కి కాల్ చేసి వెంటనే హాల్‌కి రావాలని చెబుతాడు.

హాల్‌లోకి వచ్చిన ప్రభావతితో మనోజ్ తన భయాన్ని వెలిబుచ్చుకుంటాడు. "నా పాపం పండింది అమ్మా... నా పాపంలో నీకు కూడా షేర్ ఉంది. మన కాళ్లు చేతులు పడిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయ్" అంటూ గగ్గోలు పెడతాడు. ప్రభావతి కూడా ఏదో దారి కనిపించాలని, ఈ నిమ్మకాయను ఎలాగోలా తీసి పారేస్తే సమస్య పరిష్కారమవుతుందని నమ్ముతుంది. ధైర్యం కూడదీసుకుని నిమ్మకాయను బయటపడేసే సమయానికి బాలు తన ప్లాన్‌లో తదుపరి స్టెప్‌కి వెళ్తాడు. ఇంట్లో ఉన్న వారందరినీ పిలిచి "లైట్ వేస్తాను" అని అంటాడు. దీంతో ప్రభావతి-మనోజ్‌లకు చెమటలు పట్టిస్తాయి. అందరి ముందు తాము దొరికిపోతామన్న భయంతో ఒకరిని ఒకరు చూస్తుంటారు. తప్పించుకునే ప్రయత్నంలో ప్రభావతి ఒక కథ అల్లుతూ బాలును మోసం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ బాలు మాత్రం గట్టిగా నిలదీస్తాడు.

"నగలు మింగింది చాలదా? ఇప్పుడు నిమ్మకాయలను కూడా మింగేస్తున్నారా?" అని సూటిగా అంటాడు బాలు. వెంటనే సత్యం .. దగ్గరికి రమ్మని.. చేతులో ఏముందని ప్రభావతిని నిలాదీస్తాడు. దీంతో నిమ్మకాయలు తీసినట్టు అర్థం అవుతుంది. ఇదే సరైన సమయం అని బాలు నిజం బయటపెడతాడు "నేను ఏ స్వామి దగ్గరికి వెళ్ళలేదు. మీ నిజాన్ని బయట పెట్టడానికి నిమ్మకాయ డ్రామా ఆడాను" అని చెప్పేస్తాడు. దీంతో ప్రభావతి, మనోజ్‌ల బాగోతం బయటపడినట్టు అవుతుంది. బాలు మరింత కోపంగా మాట్లాడుతాడు. "మనిషి పుట్టుక పుట్టలేదా? నా భార్య నగలు కావాల్సి వచ్చాయా? ఇప్పటికే 40 లక్షలు మింగావు కదా...?" అంటూ మనోజ్‌పై దాడి చేస్తాడు.

అదే సమయంలో రోహిణి మనోజ్‌కు సపోర్ట్‌గా నిలబడి బాలు మాటలను కౌంటర్ చేస్తుంది. దీంతో బాలు కూడా ఆగ్రహం అదుపు చేసుకోలేకుండా "వాడికీ నోరు ఉంది కదా! ఏది పడితే అది మీకు వచ్చా?" అంటూ వారిని నిలదీస్తాడు. మనోజ్ తప్పించుకునే ప్రయత్నంలో సైలెంట్‌గా ఉండాలని చూస్తాడు. కానీ బాలు అతన్ని పట్టుకుని "నగలు తీసింది నువ్వే కదా?" అని నిలదీస్తాడు. మనోజ్ బిజినెస్ నష్టం గురించి అబద్ధాల ముసుగులో మాట్లాడుతాడు. "పార్కులో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు" అని ఓ కథ చెబుతాడు. బాలు వెంటనే రివర్స్ కర్డ్ వేస్తాడు. "వాడొక్క రూపాయి కూడా నీకు ఇవ్వలేదని నాకు తెలుసు. నేను నీ వర్క్ ఫ్రెండ్‌ను అడిగాను."అంటాడు. దీంతో మనోజ్ మళ్ళీ మాట మార్చి "వాడే ఇచ్చాడు" అని అంటాడు."అయితే ఇప్పుడే ఫోన్ చేసి నిజం చెప్పించు" అంటాడు బాలు. దీంతో మనోజ్ ముఖం మాడిపోతుంది.

ఇక మీనా కూడా "ఫోన్ చేసి నాలుగు లక్షలు తీసుకున్నట్లు చెప్పించు" అని అంటుంది. ప్రభావతి తన కొడుకును కాపాడేందుకు మధ్యలోకి వచ్చి "వాడిపై అనవసరంగా నింద వేస్తున్నావు" అంటూ మీనాను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీనా మాత్రం ఒక్క మాట కూడా వదలదు. "నా నగలు మీ దగ్గర భద్రంగా ఉంటాయి అనుకున్నాను. నకిలీ చేసారు. నిజం అడిగితే నా మీద ఆపాదించావా?" అని ప్రభావతిని నిలదీస్తుంది. మరింత దూకుడుతో " నా నగలు ఎవరు తీసారో ఇద్దరిలో ఒకరు చెప్పండి" అంటుంది. దీంతో ప్రభావతి ఆగ్రహంతో మీనా పై చేయి చేసుకోబోయే సరికి సత్యం అడ్డుకుని ఆమెను తోసేస్తాడు.

ఇంటి కోడలిపై చేయి చేసుకుంటావా? అని సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనోజ్ కాపాడేందుకు ప్రభావతి ముందుకు వస్తే "వాడు ఏం తప్పు చేయలేదు" అని వాపోతుంది. కానీ సత్యం ఒక్కసారిగా మండిపడి "ఒక్క మాట మాట్లాడి చూస్తే చీరేస్తా" అని హెచ్చరిస్తాడు. వెంటేనే "చెప్పరా నగలు తీసింది నువ్వేనా?" అని మనోజ్‌ను నిలదీస్తాడు. చివరికి ఒత్తిడిని తట్టుకోలేక మనోజ్ అసలు నిజం బయటపడతాడు "నేనే నగలు తీశాను" అని ఒప్పుకుంటాడు. ఇంట్లో ఒక్కసారిగా షాక్. సత్యం కోపంతో ఊగిపోతాడు. "దొంగతనం చేశావా? అదీ నీ ఇంట్లో?" అని అరిచేస్తాడు. ఇంతవరకు దాచిన నిజాన్ని మనోజ్ చెబుతాడు' బిజినెస్‌లో నష్టం వచ్చి డీలర్‌కి నాలుగు లక్షలు ఎలాగైనా కట్టాలనుకున్నాడు. తల్లిని సహాయం అడగా మీనా నగలు ఇచ్చింది. మొదట నగలను తాకట్టు చేద్దాని ప్రయత్నించా.. కానీ సరిపోయేంత డబ్బు రాకపోయే సరికి ఆ నగలు అమ్మేసా.. తనకు అమ్మ కూడా సహాయం చేసింది' అని ఒప్పుకుంటాడు.

దీంతో బాలు రెచ్చిపోతాడు "ఇప్పుడు చెప్పండి నాన్న, ఏం చేయాలో మీరు. తల్లి-కొడుకులు కలిసి చేశారు కదా?" అని ప్రశ్నిస్తాడు. ప్రభావతి రెచ్చిపోతూ "అరేయ్ బాలు!" అని అరిస్తుంది. పక్కనే ఉన్న శ్రుతి మాత్రం ప్రశాంతంగా "అనవసరంగా ఆవేశపడకండి. మీకు మాట్లాడే హక్కు లేదు. మా అందరికీ ముందే అనుమానం ఉంది" అని చెబుతుంది. "మాట షాప్ నుండి ఫోన్ చేస్తున్న నేనే ఫోన్ చేశా. అప్పుడు దొరకలేదు. ఇప్పుడు నిమ్మకాయతో అసలు నిజం బయటపడింది" అని ఘాటుగా చెబుతుంది. ఈ మాటలతో రోహిణి, ప్రభావతి, మనోజ్ ముఖం మాడిపోతుంది.

తదుపరి ఎపిసోడ్ లో సత్యం పంచాయతీ పెడతాడు. "మీనా కు క్షమాపణ చెప్తేనే ఈ ఇంట్లో ఉండనిస్తాను. లేదంటే ఇంటి బయటకు వెళ్లాలి" అని వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి మాత్రం ఓర్పు కోల్పోయి "ఈ పూల అమ్ముకునే దానికి నేను క్షమాపణ చెప్పాలా? ఇదంతా బంగారం కోసమే చేశావు కాదా?" అంటూ చేతికి ఉన్న గాజు తీసి మీనా ముఖానికి విసిరేస్తుంది. దీంతో బాలు మండిపోతాడు. "తల్లి అని కూడా చూడను... ' అని ప్రభావతి పై తన కోపాన్ని చూపిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X