Gunde Ninda Gudi Gantalu December 3rd Episode: ప్రభావతి పాపాల జాబితా.. వీడిపోయిన సత్యం, ప్రభావతి..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్‌లో ఎలాగైనా నగల దొంగలను బయటపెట్టాలనే బాలు కొత్త ప్లాన్ వేస్తాడు. 'బిపిఎల్-బాలు ప్రీమియర్ లీగ్' అంటూ మొదలైన ఈ స్కెచ్‌లో ముందుగా మనోజ్ గది తలుపు తడతాడు. తలుపు తెరిచి ఎవరూ లేరని చూసి మనోజ్ నిర్లక్ష్యంగా తలుపు తెరిచి ఉంచేస్తాడు. ఇదే బాలు అవకాశంగా నిమ్మకాయకు దారం కట్టి మనోజ్ వైపు విసరడంతో, అది తనను వెంటాడుతున్నట్లు భావించిన మనోజ్ భయంతో బాల్కనీకె పరుగులు తీస్తాడు. గుండెల్లో వణుకుపుడుతుంది. ఏదో ఆపద వచ్చిందని తల్లికి కాల్ చేస్తాడు.హాల్‌లోకి పిలిచి, ప్రభావతితో మనోజ్ తన భయాన్ని చెబుతాడు.నిమ్మకాయను బయటకు విసిరేసి సమస్య ముగుస్తుందని వారు నమ్ముతారు.
అదే సమయంలో బాలు లైట్ వేస్తాడు. ఒక్కసారిగా భయపడిన ప్రభావతి కథ అల్లినా, బాలు ' అప్పుడు నగలు మింగారు, ఇప్పుడు నిమ్మకాయలు కూడా మింగేస్తారా? అంటూ నిలదీస్తాడు. చేతిలో ఉన్న నిమ్మకాయ బయటపడగా.. తన ప్లాన్ నిజాన్ని చూపించేందుకే అని బాలు చెబుతాడు. మనోజ్, ప్రభావతి మీదున్న అనుమానాలు బలపడుతాయి. ఈ క్రమంలో మనోజ్ ను సత్యం నిలదీస్తాడు. మనోజ్ చివరికి నిజం చెబుతాడు. బిజినెస్ నష్టం కారణంగా నగలు అమ్మేసినట్టు, తల్లి సహకరించినట్టు ఒప్పుకుంటాడు. బాలు ఆగ్రహంతో తల్లి-కొడుకులు కలిసి చేశారా? అని ప్రశ్నించగా, శ్రుతి కూడా 'ముందే అనుమానం ఉంది, ఇప్పుడు నిజం బయటపడింది' అంటుంది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
మీనా నగల విషయం బట్టబయలు కావడంతో ఇంట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. ఇంతకాలం దాచుకున్న నిజం ఒక్కసారిగా బయటపడటంతో అందరి ప్రభావతి,మనోజ్‌లను అసహించుకుంటారు. మీనా తనకున్న బాధను ఆపుకోలేక, "ఎన్ని రోజులు మనోజ్ తప్పును నాకు తెలియకుండా కప్పిపుచ్చారు అత్తమ్మా, ఎందుకు? మేము అన్నీ గమనించాం, మీ నటన చాలైంది... మీరు మహానటి'అని మండిపడింది. ఇంతలో రోహిణి తన భర్త మనోజ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. " మా ఆయన వల్ల తప్పు జరిగింది, మనమే అర్థం చేసుకోవాలి" అని ముందుకు వచ్చింది. కానీ ఆ మాటతో శృతి రగిలిపోయి.. 'ఇలాంటి వాడితో నేను చచ్చినా కాపురం చేయను, ఎప్పుడో వదిలేసి వెళ్లేదాన్ని. నువ్వు ఇంతగా అండగా ఉంటే నీకు ముందే అన్నీ తెలిసినట్టే'అంటూ ధాటిగా నిలదీస్తుంది.
ఈ ఒక్క ప్రశ్నకు రోహిణి తడబడుతూ "రెండు రోజుల క్రితమే తెలిసింది" అనాల్సి వచ్చింది. దీంతో బాలు కోపం మరింత పెరుగుతుంది. 'అయితే నువ్వూ వాళ్లలాగేనే... అందరూ తోడు దొంగలే'అంటూ బిగ్గరగా అరిచాడు. ఇతరుల నిందలు తనపై పడనివ్వకుండా రోహిణి నిలబడ్డది. "మోసపోవడం తప్పు కాదు... కానీ ఒకరి వస్తువులను తెలియకుండా తీసుకోవడం దొంగతనమే" అని ప్రభావతిని మీనా ప్రశ్నించింది. ప్రభావతి మాత్రం "నీకు కావాల్సింది నగలే అయితే నేనే చేస్తా" అని చెప్పింది. ఆ మాటకే ఆగకుండా "అవి నా అత్తగారు చేయించిన నగలు. నీ నగల్ని ముఖానా పడేస్తా" అని నిర్లక్ష్యంగా చెబుతుంది.ఆ అవమానానికి సత్యం ఇక మౌనం వహించలేదు.
అతడు ఒక్కసారిగా విరుచుకుపడుతాడు 'మనోజ్ ఇలా మారడానికి కారణం నువ్వే' అని ప్రభావతి సూటిగా దాడి చేశాడు. 'వాడి తప్పును కప్పిపుచ్చడానికి ఎన్ని ఘోరాలు చేశావ్? ముందుగా మీనా తల్లిని దొంగలుగా ఆరోపించారు. తర్వాత నా తల్లి గీటినాలు చేయించిందని పుకార్లు పుట్టించారు. నువ్వు పక్కపాములా... నీలాంటి దానితో నేను ఎలా సంసారం చేశానో నాకు ఆశ్చర్యం. నీలాంటి వాడిని భార్యగా పిలిచినందుకు నా మీద నేనే అసహ్యంగా ఫీలవుతున్నాను. ఈ రోజు నుంచి 'ఏమండీ' అనే మాట పిలవకు. మన బంధం... ఇప్పుడే తెగిపోయింది అని తేల్చి చెబుతాడు. దీంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు.
అవమానంతో ప్రభావతి అక్కడి నుంచి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. అందరూ వేడుకుంటారు అయినా తలుపు తీయదు. దీంతో మనోజ్ తన తండ్రి సత్యం దగ్గరకు వచ్చి. వంగి 'క్షమించండి'అంటాడు. సత్యం మాత్రం 'నాకు సంబంధం లేని వాళ్ల గురించి మాట్లాడవద్దు'అంటాడు. బాలు పక్కనే చేరి 'అమ్మను క్షమించండి.' అని అడుగుతాడు. సత్యం ముఖంలో ఆగ్రహం కొట్టేంచినట్టు కనిపిస్తోంది. అదంతా నటన. సంబంధం లేని వారిని నేను పట్టించుకోను. అనే తేగేసి చెబుతాడు. రోహిణి కూడా 'అత్తయ్యను క్షమించండి...'అంటూ ప్రాదేయపడుతుంది.
సత్యం 'నా దగ్గర అంత పెద్ద మనసు లేదు' అని సమాధానమిస్తాడు. బాలు చివరిగా 'ఒక్కసారి అమ్మను క్షమిస్తే?' అని అడగగా.. సత్యం 'కొడుకు చిన్న తప్పు చేస్తే తల్లిగా దండించాలి. గజదొంగగా మారినప్పుడు క్షమించడం సరికాదు. ప్రభావతి పాపాల జాబితాను సత్యం ఒక్కొక్కటిగా బయటపెడతాడు. '40 లక్షలు దొంగిలించిన మనోజ్‌కి నువ్వే వెనకేసుకొచ్చింది. హనీమూన్ డబ్బు దొంగతనం.. మీనా తమ్మునిపై మోపింది.ఉద్యోగం లేని వాడికి క్యారేజీలు కట్టి డబ్బులు ఎగరేసింది. వ్యాపారంలో ఫెయిల్ అయిన తర్వాత.. మీనా నగలు అమ్ముకునేలా చేసింది. తర్వాత ఆ తప్పును మీనా తల్లిమీద, మా అమ్మ మీద నెట్టింది. ఇలా తప్పులు మీద తప్పులు చేసిన మీ తల్లిని... ఒకరి జీవితం పాడు చేస్తే... క్షమాపణ అనే పదానికి విలువుండదు.నేను ఇంట్లో ఉంటానా? గుడిలో పడుకుంటానా? అది నా ఇష్టం' అని సత్యం తెగేసి చెబుతాడు.
మీనా 'అత్తమ్య ఏమైనా చేసుకుంటుందోనని భా ఏం చేసామో... మన కోసం తగులుకున్నాడు' బాలు ఆమె భుజం తట్టి 'అనవసర టెన్షన్ వద్దు. మా అమ్మ ఇలా నాటకాలు చంపింది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని.' అని మీనాను కూల్ చేస్తాడు. అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో సత్యం ఉదయం ఇంట్లోకి నిశ్శబ్దంగా వస్తాడు. మీనా అతని ముందు మోకాళ్ళపై పడుతుంది. "అత్తయ్య తరఫున నేను క్షమాపణ కోరుతున్నాడు' సత్యం . అంతలోనే ప్రభావతి బయటకు వస్తుంది.సత్యం ఒక్క చూపు కూడా చూడడు. 'నాకు ప్రశాంతత కావాలి.' అంటూ దారిని తీయకుండా వెళ్లిపోతాడు. రోజురోజుకు సత్యం - ప్రభావతి మధ్య దూరం పెరుగుతుంది. వారిని కలపడానికి బాలు, మీనాలు ప్లాన్ వేస్తారు.


Click it and Unblock the Notifications











