Gunde Ninda Gudi Gantalu December 4th Episode: మీనాకు క్షమాపణ సత్యం.. ప్రభావతి వెలివేత..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో మీనా నగల రహస్యం బయటపడిన క్షణం నుంచి ఇంట్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రభావతి, మనోజ్ తప్పును ఎంతకాలం దాచారో తెలుసుకున్న.. మీనా కోపంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ఇంతకాలం నటన చాలింది, మీరు మహానటి' అంటూ మండిపడింది. ఇదే సమయంలో రోహిణి తన భర్తను కాపాడేందుకు ముందుకువచ్చి 'మనోజ్ తప్పు చేశాడు... మనమే అర్థం చేసుకోవాలి'అని చెప్పడంతో శృతి చెలరేగి 'ఇలాంటి వాడితో నేను బ్రతకను. నువ్వు అండగా ఉన్నావంటే నీకే ముందే అన్నీ తెలిసినట్టే'అంటూ రోహిణిని నిలదీసింది. మాటల ఒత్తిడిలో రోహిణి 'రెండు రోజుల క్రితమే తెలిసింది'అని ఒప్పుకోవడంతో బాలు తట్టుకోలేక 'అయితే నీకూ తోడు దొంగ'అంటూ సూటిగా దాడి చేశాడు. మీనా కూడా అవమానాన్ని తట్టుకోలేక, ప్రభావతిపై 'తెలియక దొంగతనం చేయడం తప్పు, తెలిసీ చేయడం ఘోరం'అని ప్రశ్నించింది. ఈ సమయంలో సత్యం మొదటిసారి తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు.
ప్రభావతిని నేరుగా లక్ష్యంగా చేసుకొని 'మనోజ్ ఇలా మారడానికి కారణం నువ్వే.. నా తల్లి, మీనా తల్లిని దొంగలుగా ఆరోపించావు. కుటుంబాన్ని పాడుచేశావు'అని ఒక్కొక్క ఆరోపణను బయటపెట్టాడు. 'ఇప్పటి నుంచి నాతో 'ఏమండీ' అని పిలవకు... మన బంధం ఇక్కడికే ముగిసింది'అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అవమానంతో ప్రభావతి గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా... మిగిలిన కుటుంబ సభ్యులు వేడుకున్నా ఆమె తీయలేదు. మనోజ్, బాలు, రోహిణి ఒక్కొక్కరు సత్యం ముందుకు వచ్చి క్షమాపణ కోరితే కూడా అతను 'నా దగ్గర అంత పెద్ద మనసు లేదు'అంటూ నిరాకరించాడు. 'కొడుకు చిన్న తప్పు చేస్తే తల్లి మందలించాలి. కానీ గజదొంగకు క్షమాపణ అవసరం లేదు'అంటూ ప్రభావతి గత పాపాలన్నీ సత్యం బయటపెట్టాడు. 40 లక్షలు దొంగజేసిన మనోజ్‌కు అండ, మీనా ఆభరణాల అమ్మకం, హనీమూన్ డబ్బులు, తప్పుడు ఆరోపణలు... అన్నింటికీ మూలం ప్రభావతేనని ఆయన స్పష్టం చేశాడు.ఇక గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
ప్రభావతి అలక పాన్పు వేస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరు పిలిచినా.. బయటికి రాకుండా గదిలోనే కూర్చుంటుంది. దీంతో బాలు.. మీనాక్షికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. కానీ, ఆ విషయం ఎవరికీ చెప్పడు. ఒక్కొక్కరు ప్రభావతిని బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మనోజ్ *అమ్మకి ఏదైనా జరుగుతే నిన్ను విడిచి పెట్టారా' అని బాలుపైకి సీరియస్ అవుతాడు. దీంతో బాలు 'తేలికపోతే.. మీ ఆవిడను అడిగి చెప్పు..' అంటూ సెటైర్ వేస్తాడు. మనోజ్ అక్కడితో ఊరుకోకుండా 'మీ ఆవిడవి ఏడు వారాల నగలు..'అంటూ హేళనగా మాట్లాడుతాడు. దీంతో బాలు'ఒక గ్రామ్ బంగారమేనా... విడిచిపెట్ట' అంటూ వార్నింగ్ ఇస్తాడు.
దీంతో మనోజ్ బాలు కాలర్ పట్టుకుని 'ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్' అంటాడు. వెంటనే బాలు .. మనోజ్ చేతను పట్టుకొని మెలిపెడతాడు. పక్కనే ఉన్న రోహిణి 'ఏంటి బాలు రౌడీ లాగా ప్రవర్తిస్తున్నావ్'ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో మీనా ఇన్వాల్వ్ అయి'దొంగల కంటే రౌడీలు బెటర్.. మా ఆయన ఇంటి పరువును ఎప్పుడు కూడా రోడ్డుకీడ్చలేదు' అంటూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది. దీనికి తోడు శృతి కూడా 'బాలు చాలా లేట్ గా రియాక్ట్ అయ్యాడు.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది' అంటుంది.
ఇదిలా ఉంటే.. మీనాక్షి ఎంట్రీస్తోంది. రాత్రి నుండి గదిలోనే ఉన్న ప్రభావతిని బ్రతిమిలాడి కిందికి తీసుకువస్తుంది. సత్యం ముందు తీసుకువచ్చి 'కొడుకులు కోడళ్ళ ముందు మీరు గొడవ పెట్టుకోవడం ఏమైనా బాగుందా అన్నయ్య.. కొడుకు అసమర్ధుడైన లక్షల మింగినవాడైన.. వాడిని కాపాడ్డానికి ఈ పని చేసింది. ఇది తల్లి ప్రేమ' అంటూ సత్యం కు నచ్చజెప్పి ప్రయత్నం చేస్తుంది. రోహిణి ఎంట్రీ ఇచ్చి 'మా ఆయన తెలియకుండా చేశాడు' అంటుంది. దీంతో మీనాక్షి 'ఆ మాట అనడానికి సిగ్గుండాలి. వాడిని ఇలా వాడిని వెనకేసుకొస్తున్నందుకు నీకు సిగ్గుండాలి. ఈ డ్రామాకు సూత్రధారి.. పాత్రధారి.. మొత్తం మనోజ్.. పాపం మా వదిన మనోజ్ గాడిని కాపాడపోయి బాలు చేతికి చిక్కింది. బాలుకి తప్పు చేసి దొరికితే.. ఎందుకు బతికి ఉన్నాను దేవుడా అనేలా చేస్తాడు'అంటుంది.
అంతటితో ఆగకుండా సత్యం దగ్గరికి వెళ్లి.. 'అన్నయ్య 4లక్షలు మోసం చేసి వచ్చింది మనోజ్ గాడు. వాడు తల్లి కాళ్ళ మీద పడితే.. వాడిని కాపాడ్డానికి మీనా నగలు తాకట్టు పెట్టడానికి ఇచ్చింది. కానీ, మనోజ్ గాడు నగలు తాకట్టు పెట్టకుండా.. వాటిని అమ్మేశాడు. ఆరోజు బాలు, మీనా చేత నగలు కావాలని అడిగించారు. దీంతో ప్రభావతి కవరింగ్ నగలను ఇచ్చింది. ఈ తప్పంతా మనోజ్ గాడిదే..ప్రభావతి కావాలని ఏ తప్పు చేయలేదు' అంటూ ప్రభావతిని సమర్థిస్తుంది. దీంతో పక్కనే ఉన్న శృతి.. 'తెలుసు చేసినా.. తెలియక చేసిన తప్పు తప్పే.. తప్పు తెలిసినా కానీ పక్క వారిపై నిందలు వేయడం క్షమించరాని తప్పు' అంటూ బాంబు వేస్తుంది.
'అన్నయ్య ప్రభావతి గతంలో ఎన్నో తప్పులు చేసింది. వాటన్నిటిని కడుపులో దాచిపెట్టుకున్నారు. ఈ తప్పును కూడా దాచిపెట్టుకోలేవా ?'అంటూ ప్రభావతిని క్షమించమని ప్రాధేయపడుతుంది. దీంతో బాలు రియాక్ట్ అవుతూ 'ఏం మాట్లాడుతున్నావ్ అత్తయ్య.. ముందు మా అమ్మ తన తప్పుని క్షమించమని అడుగుతే కదా.. మా నాన్న క్షమించేది' అంటాడు. దీంతో మీనాక్షి 'అవును కదా.. వదిన నువ్వు తప్పులు మీద తప్పులు చేసావు.. కాబట్టి నువ్వే అన్నాను క్షమించమని అడుగు 'అంటూ ప్రభావతిని ముందుకు లాగుతుంది.
దీంతో సత్యం 'క్షమించడానికి నేనెవర్ని.. కుటుంబ సభ్యుల లిస్టులో నుండి ప్రభావతిని ఎప్పుడో తీసేసా.. అంతగా క్షమాపణ కోరేది ఉంటే మీనా ను క్షమించమని అడగాలి' అంటూ తెగేసి చెబుతాడు. దీంతో ప్రభావతి 'నేను ఈ పూల అమ్ముకునే దానికి క్షమాపణ చెప్పాలా? చచ్చినా చెప్పను' అంటూ మాట జారుతుంది. దీంతో మీనాక్షి 'మీనా పూలు మాత్రమే అమ్ముకుంది.. మీలాగా పక్క వారి నగలు అమ్ముకోలేదు. అడుగుతే తప్పేంటి.. క్షమాపణ చెప్పండి' అని ప్రభావతి కి క్లాస్ పీకుతుంది. వెంటనే సత్యం 'ప్రభావతి మీనాకు క్షమాపణ చెబుతుందా? లేదా? అంటూ ' ఆగ్రహంగా అడుగుతాడు.
కానీ, ప్రభావతి తాను ఏమి చేయనట్టు.. తనకు తప్పు తెలవనట్టు.. 'ఇదంతా బంగారం కోసమే చేసావు కదా.. నా కుటుంబం ముందు నా పరువు తీసావు కదా.. ఇగో తీసుకో.. 'అంటూ తన చేతికున్న గాజులను తీసి మీనా ముఖం పై విసిరేస్తుంది. దీంతో పక్కనే ఉన్న బాలు ఆగ్రహం కట్టలు పెంచుకుంటుంది. ఇంట్లో వారు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. 'ఇదే నా కన్నతల్లి కాకపోతే.. నేను మరోలా ప్రవర్తించేవాడిని..' అంటాడు. మనోజ్ ముందుకు రావడంతో 'పక్కవారి నగలు తీయడానికి సిగ్గు, శరం లేకుండా దొంగతనం చేసింది. కాకుండా రొమ్ము విరుచుకొని మాట్లాడుతున్నావా? ఏం బతుకు రా నీది.. అని మనోజ్ తిడతాడు బాలు.
ఆ గొడవలోకి ప్రభావతి రావాలని చూస్తోంది. దీంతో బాలు.. 'నోరెత్తకు.. కన్నతల్లి అని కూడా చూడను.. నా భార్య ముఖం మీద నగలు విసిరేస్తావా.. నువ్వు అసలు తల్లివేనా..'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సత్యం కూడా 'ఎదిగిన కొడుకుల ముందు కొట్టకూడదనే ఆగాను' అంటాడు. 'మీరు కొట్టిన తిట్టిన నేను మాత్రం మీ నాకు క్షమాపణ చెప్పను..' అని తెగేసి చెబుతోంది. దీంతో గొడవ మరింత పెద్దగా అవుతుందని భావించిన మీనాక్షి.. ప్రభావతిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది.
'క్షమించమని అడుగుతే ఏం పోతుంది. మనం సర్దుకుపోతే బాగుంటుంది'అని మీనాక్షి అనగా.. 'నేను చచ్చిన క్షమాపణ చెప్పను.. నాతో ఎవరు మాట్లాడకపోయినా నేను పట్టించుకోను. నాలుగు రోజులు పోతే.. ఆయన కోపం తగ్గుతుంది' అంటూ ప్రభావతి తెగేసి చెబుతోంది. ఇదిలా ఉంటే..శృతి తల్లి శోభ ఫోన్ చేసి తన కూతుర్నే పార్టీకి వస్తావా అడుగుతుంది. దీంతో శృతి మా ఇంట్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని తన ఇంట్లో జరిగిన విషయాన్ని చెబుతుంది. 'మీ ఆంటీ మనోజ్ ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తారా? మారారా?' అని శోభ అడుగుతుంది. దీంతో శృతి 'మా అత్తయ్య చేసిన తప్పు ఒప్పుకోకుండా తనదే కరెక్ట్ అని, తన గాజులను మీ నా ముఖం మీద విసిరేసిందని మొత్తం డ్రామాను పూసగొచ్చినట్లు చెబుతోంది. సర్లే నాకు డబ్బింగ్ టైం అయింది అని ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతుంది.
ఇక హాల్లో సత్యమును కూల్ చేయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. కానీ సత్యం మాత్రం 'ఇదిరా మీ అమ్మ.. ఇన్ని రోజులు భరించుకుంటూ వచ్చాను' అంటూ సత్యం తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. దీంతో శృతి రియాక్ట్ అవుతూ 'ఏంటో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య తప్పు చేసిన గాని.. క్షమించమని కోరడం లేదు పైగా తన తప్పును సమర్ధించుకుంటూ వస్తుంది ఏంటో అత్తయ్య..' అంటుంది. దీంతో పక్కనే ఉన్న రోహిణి.. 'దీనిలో అత్తయ్య తప్పు ఏమీ లేదు.. అంతా మనోజే చేశాడు' అంటూ ప్రభావతిని సమర్థిస్తుంది. దీంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది.. తప్పు చేసినవారే కాదు తప్పును సమర్ధించిన వారు కూడా శిక్ష అర్హులే... ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు అనవసరంగా మాటలు జారకు అని వార్నింగ్ ఇస్తాడు.


Click it and Unblock the Notifications











