Gunde Ninda Gudi Gantalu December 5th Episode: సత్యం, ప్రభావతీల బంధం తెగిపోయినట్లేనా? బాలు మీనాల ప్లాన్ ఏంటీ?
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌లో ఇంట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రభావతి గదిలోకి వెళ్లి అలుగుతుంది. ఎంత పిలిచినా రాలేకపోవడంతో బాలు.. మీనాక్షిని ఇంటికి రమ్మని పిలిచాడు. ఇదే సమయంలో ప్రభావతిని బయటికి తీసుకురావాలని ప్రయత్నించిన మనోజ్ 'అమ్మకి ఏదైనా అయితే నిన్ను విడిచిపెట్టను'అంటూ బాలుపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా మరింత రూఢీగా 'మీ ఆవిడవి ఏడు వారాల నగలు మరీ'అంటూ హేళన చేశాడు. దీంతో బాలు, మనోజ్ ల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడతారు. ఇంతలో రోహిణి బాలు ప్రవర్తనను తప్పుపట్టగా, మీనా గట్టిగా కౌంటర్ ఇస్తూ మనోజ్, ప్రభావతి చేసిన దొంగతనాల్ని బయటపెడుతుంది.
ఇక మీనాక్షి ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. మనోజ్ నాలుగు లక్షలు మింగడంతో ప్రభావతి మీనా నగలు ఇచ్చి కాపాడిందని, ప్రభావతి అజ్ఞానంగా కాకుండా జాగ్రత్తగా కవరింగ్ నగలు ఇచ్చిందని చెప్పింది. ఇదే సమయంలో ప్రభావతి మీనా ముఖంపై గాజులు విసరడంతో బాలు కట్టలు తెంచుకున్నాడు. పరిస్థితి అదుపు చేయడానికి ప్రభావతిని మీనాక్షి గదికి తీసుకెళ్తుంది.క్షమాపణ కోరమని చెప్పినా ప్రభావతి మొండి వైఖరి విడిచిపెట్టలేదు. హాల్లో సత్యం తన ఆవేదన వ్యక్తం చేస్తుండగా, రోహిణి ప్రభావతిని సమర్థించడంతో బాలు మరింత కోపంతో 'తప్పు చేసినవాళ్లు మాత్రమే కాదు, సమర్థించే వాళ్లూ శిక్షలకు అర్హులు' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం కుటుంబం కలతచెందిన ఈ ఘర్షణ ఇంటి వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది. ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
ప్రభావతి తన గాజులను మీనా ముఖానికి వేసి కొట్టడంతో ఇంట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారుతుంది. ఈ క్రమంలో మీనా నేనేం తప్పు చేశానంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో బాలు 'అనవసరంగా ఆలోచించకు.. మా అమ్మ తప్పు బయటపడింది. కాబట్టి..అలా ప్రవర్తించింది' అంటూ మీనాకు సపోర్టుగా నిలిచే ప్రయత్నం చేస్తాడు బాలు. 'మీనా అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కానీ, మీనా చేసేది ఏ రోజు కూడా మీ అమ్మకు నచ్చదు.. అది ఎందుకో తెలియదు అంటాడు' సత్యం. ఇక సత్యం 'మనోజ్ ను టార్గెట్ చేస్తూ.. ఏరా నా కడుపులో చెడ్డ పుట్టావు. మీ అమ్మ సపోర్టు ఉంది నీకు.. ఏ రోజైనా నీ తమ్ములపై దొంగతనం నింద వేశారు ఎవడైనా.. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావ్.. జన్మలో మారవా? అయినా నీ వెనక ఉండే నడిపిస్తుంది కదా మీ తల్లి.. ఏం బతుకు రానిది' అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
దీంతో బాలు 'వాడు ఎందుకు మారుతాడు నాన్న.. అమ్మ సపోర్ట్ ఉన్నన్ని రోజులు వాడు ఇలానే ఉంటాడు. ఆనాడు 40 లక్షలు.. ఈరోజు నాలుగు లక్షల కోసం మీనా నగలు అమ్మేశాడు.. మొత్తం 44 లక్షలు. ఈ డబ్బులు మొత్తం ఎప్పుడు ఇస్తావు?' నిలదీస్తాడు బాలు. 'ఆ డబ్బులు ఇప్పట్లో ఇవ్వలేదు.. నా దగ్గర అంత డబ్బు లేదు..' అని మనోజ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. కానీ బాలు మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ హెచ్చరిస్తాడు. దీంతో రోహిణి 'ఆ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను' అని మాట ఇస్తుంది. దీంతో బాలు 'మొన్నటి వరకు మనోజ్ గాడు ఇస్తా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇస్తానని మరో వాయిదా చెప్తున్నావా' అంటాడు బాలు. దీంతో రోణిహి తనకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతుంది. 'ఒక అవకాశం ఇచ్చి చూడరా బాలు..' అని రోహిణి తరుపున సత్యం మాట్లాడుతాడు. దీంతో బాలు సరే అంటూ గొడవ చేయకుండా వెళ్ళిపోతాడు.
మరోవైపు.. మీనాక్షి, ప్రభావతి గొడవ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో రోహిణి, మనోజ్ లు గాజులు తీసుకుని గదిలోకి వస్తారు. 'నువ్వు చేసిన పని ఎంతటి దారితీసిందో ఒక్కసారైనా ఆలోచించావా..' అంటుంది మీనాక్షి. రోహిణి చేతిలో గాజులు చూసిన ప్రభావతి'నేను భిక్ష వేసిన గాజులను ఎందుకు తీసుకోవచ్చావ్ ' అంటూ రోహిణిపై మండిపడుతుంది ప్రభావతి. 'మీనా కూడా తిరిగి ఇచ్చేసింది. వారికి నేను డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నా.. మనోజ్ వల్ల మొదలైన మనోజ్ సమస్యతోనే ముగిసిపోవాలి' అంటుంది రోహిణి.
'నీ సంగతి సరే.. మీ అమ్మ పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ల సంసారంలో నేనెప్పుడూ మీ నాన్నను అలా చూడలేదు. ఏ గొడవ జరిగినా మరో క్షణంలో మీ నాన్న మరిచిపోయేవాడు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మరలా ఉంది' అని మనోజ్ ను ప్రశ్నిస్తుంది మీనాక్షి. పక్కనే ఉన్న రోహిణి కూడా 'మామయ్య కోపం తగ్గాలంటే మీరు కచ్చితంగా వెళ్లి మాట్లాడాల్సిందే..' అంటుంది. కానీ, ప్రభావతి మాత్రం అసలు తగ్గేది లేదు అన్నట్టు తాను తప్పే చేయనట్లు వ్యవహరిస్తుంది. అయినా నా మనసు బాగోలేదు బయటికి వెళ్దాం కామాక్షి అంటుంది. ఇదిలాఉంటే.. 'అందరి ముందు నువ్వు డబ్బు ఎందుకు ఇస్తాననీ ఒప్పుకున్నావ్ ? అమ్మ నగలతో సరి పెడితే అయిపోయేది కదా.. అనవసరంగా ఒప్పుకున్నావు' అని రోహిణిని తప్పు పడతాడు మనోజ్. దీంతో 'ఇక జన్మలో మారవా?' అంటూ రోహిణి చీకొట్టి వెళ్ళిపోతుంది.
మరోవైపు.. మీనా డాబాపై కూర్చుని ఏడుస్తుంది. మీనాను ఓదార్చడానికి బాలు, శృతి వస్తారు. 'నేనేం తప్పు చేశాను.. అందరూ ముందు నన్ను తప్పు పట్టింది. నా ముఖంపై గాజులు ఎందుకు విసిరేసింది?' అంటూ బాధపడుతుంది మీనా. 'తన తప్పు బయటపడింది కాబట్టి.. ఒకరిపై నెట్టి వేయకపోతే.. అందరు మా అమ్మను తప్పుపడతారు కదా.. అందుకే అలా చేసింది. అయినా నువ్వు ఎందుకు భాదపడతావు?' ఒక మాటకు రెండు మాటలు అంటే.. సైలెంట్ గా ఉంటుంది' అంటాడు బాలు.. 'అయినా మీనాక్షి అత్తమ్మ వచ్చింది కాబట్టి.. ఈరోజు గొడవ ఇంత పెద్దగా అయింది.. ఆకలైతే తానే రూమ్ లో నుండి అత్తయ్యనే బయటకు వచ్చేది' అంటుంది శృతి. మీనా తన బాధను విడిచిపెట్టి.. 'అత్తయ్య మామయ్య మాట్లాడుకోవడం లేదు వారిని ఎలా కలపాలి?' అంటూ బాధపడుతుంది.
దీంతో శృతి.. 'అది నీ ప్రాబ్లం కాదు.. అత్తయ్య వెళ్ళి క్షమాపణ చెబితే మామయ్య కూల్ అవుతాడు. కానీ, అత్తయ్య మాత్రం తాను తప్పు చేయనట్లు బెట్టు చేస్తుంది. అయినా నువ్వు ఎప్పుడు మారుతావు?' అంటూ శృతి అక్కడనుండి వెళ్ళిపోతుంది. బాలు కూడా నువ్వు అనవసరంగా వారి గురించి ఆలోచించకు అంటూ వెళ్ళిపోతాడు.
ఇక మీనాక్షి ప్రభావతి ఇద్దరు.. కలిసి గుడికి వెళ్తారు. ఈ సమయంలో ప్రభావతి చేతికి గాజులు కనిపించకపోయేసరికి.. 'మీనా నీ గాజులు నీకు తిరిగి ఇచ్చింది కదా.. గాజులు వేసుకుంటే.. ఏమవుతుంది' అంటుంది మీనాక్షి. 'నీకు అంతగా నా చేతులు చూడ బుద్ధి కాకపోతే.. నువ్వే ఓ నాలుగు గాజులు చేయించు' అంటూ సెటైర్ వేస్తోంది. దీంతో మీనాక్షి కూడా 'అత్తకు అన్నం పెట్టిన చేతిలో.. కోడలుకు సున్నం పెట్టే చేతులకు నేను ఎందుకు గాజులు చేపించాలి' అంటూ కౌంటర్ వేస్తోంది.
తరువాత 'నేను ఒక మాట చెప్తాను వింటావా అంటూ మీనాక్షి.. అందరూ చెప్పినట్లు మీనాకు క్షమాపణ చెబితే.. ఈ సమస్య ఉండదు కదా.. అనవసరంగా సమస్యను పెద్దగా చేస్తున్న అనగా..' ఏంటి నేను ఆ పూల అమ్ముకునే దానికి క్షమాపణ చెప్పాలా? చచ్చిన ఈ జన్మలో క్షమాపణ చెప్పను..'అంటూ బెట్టుకేసుకుని కూర్చుంటుంది. 'నువ్వు క్షమాపణ చెప్పకపోతే.. నువ్వే అందరికి దూరమవుతావు .. ఆ విషయాన్ని ఆలోచించుకో' అంటూ హెచ్చరిస్తుంది మీనాక్షి. 'నాతో ఎవరు మాట్లాడకపోయినా.. నేను పట్టించుకోను..' అంటూ తన నిర్ణయాన్ని తెగేసి చెబుతోంది. 'అవును నగలు నువ్వే తీస్తావ్.. ఆ నగలు ఇచ్చి కొడుక్కి తాకట్టు పెట్టుకొని చెబుతావు. వాడేమో ఆ నాగలు తాకట్టు పెట్టకుండా ఆమె కూర్చున్నాడు. ఆ తప్పును కవర్ చేయడానికి మీనా తల్లిపై నింద వేశారు.. పైగా మీ అత్త పై కూడా నింద వేసా.. తప్పుల మీద తప్పులు చేసిన ఈ భార్యనైనా భర్త క్షమిస్తాడా పోనీలే' అంటుంది మీనాక్షి.
ఇంతలోనే శృతి అమ్మ శోభ కూడా అదే గుడికి వస్తుంది. ఆమెను తప్పించుకోవడానికి ప్రభావతి ప్రయత్నిస్తుంది. కానీ, శోభ మాత్రం దగ్గరికి వచ్చి..వదిన గారు అంటూ మాట కలుపుతుంది.' మిమ్మల్ని చూస్తే ఏదో ఆందోళనలో ఉన్నట్లున్నారు.. ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా?' అంటుంది. పక్కనే ఉన్న మీనాక్షి 'ప్రభావతి ఇక్కడ ఉండగా ఇంట్లో గొడవలు జరుగుతాయా..?' అంటూ సెటైర్ వేస్తోంది.
'నేను అన్నది ఇంట్లో గొడవ జరిగితే గుడికి వచ్చారా అంటుంది. అదేం లేదు అని కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ప్రభావతి చేతులను చూసిన శోభ 'ఏంటి మీ చేతులకు ఏమైంది ? మీ చేతికి బంగారు గాజులు ఉండాలి కదా ఏమయ్యాయి? అని అడుగుతుంది. ఇంట్లో మరొ గది కట్టాలని భావిస్తున్నారు కదా.. గాజులు అమ్మి వేశారా అంటూ ఇన్ డైరెక్ట్ గా గొడవ గురించి ప్రస్తావిస్తుంది శోభ. దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. శోభకు ఈ సమాధానం చెప్పి తప్పించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications










