Gunde Ninda Gudi Gantalu December 8th Episode: రొమాన్స్ లో బాలు,మీనా.. 4 లక్షలతో రోహిణి.. మీనాకు సత్యం అన్యాయం

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రభావతి మీనా ముఖానికి గాజులు విసరడంతో ఇంట్లో ఉద్రిక్తత పీక్స్‌కి చేరుతుంది. మీనా ఏ తప్పూ చేయకపోయినా నిందలు తన మీద పడుతుండటంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు, సత్యం వెంటనే మీనాకు సపోర్ట్ ఇస్తూ ప్రభావతి చేసిన దాంట్లో తప్పే ఉందని సూచిస్తారు. మనోజ్‌ గతంలో చేసిన అప్పులు, ఇప్పుడు నగలు అమ్మి తీసుకున్న డబ్బుల గురించి బాలు ప్రశ్నించగా, మనోజ్ నిర్లక్ష్యంగా స్పందిస్తాడు. రోహిణి మాత్రం 4 లక్షలు తానే ఇస్తానని మాట ఇవ్వడంతో పరిస్థితి కొంచెం తగ్గినా, మనోజ్,రోహిణి మధ్య మరో వాదన తలెత్తుతుంది.ఇక మీనా మనస్తాపంతో ఒంటరిగా ఏడుస్తుండగా, బాలు -శృతి ఆమెను ఓదార్చుతారు.

ఇదిలా ఉండగా మీనాక్షి-ప్రభావతి కలిసి గుడికి వెళ్తారు. అక్కడ మీనాక్షి గాజుల విషయం మళ్లీ ప్రస్తావించగానే ప్రభావతి దుష్టంగా స్పందిస్తుంది. మీనాకు క్షమాపణ చెప్పమన్న సూచనను ప్రభావతి పూర్తిగా తిరస్కరిస్తూ "చచ్చినా క్షమాపణ చెప్పను" అని మొండిగా అంటుంది. అక్కడికి శృతి తల్లి శోభ రావడంతో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ప్రభావతి చేతుల్లో గాజులు లేవని గమనించిన శోభ "ఇంట్లో మరో గది కట్టడానికి గాజులు అమ్మేశారా?" అంటూ నేరుగా ప్రశ్నిస్తుంది. శోభ మాటలకు ప్రభావతి ఒక్కసారిగా షాక్‌కి గురవుతుంది. ఇక ప్రభావతి ఏ సమాధానం చెప్పి తప్పించుకుంటుందో-ఈ ఎపిసోడ్ చివరి క్షణాలు ఉత్కంఠగా సాగనున్నాయి. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 570 December 8th 2025 here is full story

సోమవారం ఎపిసోడ్ లో శృతి తల్లి శోభ కావాలని ప్రభావతిని టార్గెట్ చేస్తుంది. 'మీ చేతికి గాజులు లేవు ఏం చేశారు? పైన గది కట్టడానికి, ఆ గాజులను అమ్మి వేశారా? లేక తాకట్టు పెట్టారా? అని ప్రశ్నిస్తుంది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాక ప్రభావతి నీళ్లు మింగుతుంది. కానీ, పక్కనున్న మీనాక్షి తన కూడా ఏం తెలియనట్లు 'నేను కూడా ఇప్పుడే చూస్తున్నా.. వదిన గాజులు ఎక్కడ పెట్టావ్? స్నానం చేసేటప్పుడు ఎక్కడైనా మర్చిపోయావా? అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది.

ప్రభావతి పరిస్థితిని గమనించిన శోభ' ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగవచ్చు కదా.. ఫ్రీగా నాలుగైదు లక్షలు ఇచ్చేదానిని కదా?' అంటూ శోభ హేళనగా మాట్లాడుతుంది. వెంటనే పక్కన ఉన్న మీనాక్షి 'మీ ఇంట్లో డబ్బులు కాసే చెట్లు ఉన్నాయా? డబ్బులు ఫ్రీగా ఇస్తా అంటున్నారు? ' అని కౌంటర్ వేస్తోంది. వెంటనే ప్రభావతి 'ఆ గుర్తు వచ్చింది స్నానం చేసేటప్పుడు గాజులను తీసి పక్కకు పారేశా' అంటుంది. వెంటనే శోభ 'మీ ఇంట్లో బంగారం కాసే చెట్లు ఉన్నాయా ఏంటి? బంగారాన్ని తీసుకోవడం ఏంటి? అమ్మేశారా? తాకట్టు పెట్టారు? సరేలే మీరేం చేస్తే మాకేంటి.? కానీ బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉట్టి చేతులతో రాకండి..మీకు పిల్లనిచ్చామంటే మాకు పరువు తక్కువ' అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది.

ఈ సమాధానంతో ప్రభావతి తల పట్టుకుంటుంది. 'ఇంట్లో శృతి కౌంటర్ వేస్తే.. బయట వాళ్ల తల్లి ఎన్కౌంటర్ చేస్తుంది' అంటూ బాధపడుతుంది. 'ఈ గొడవకు కారణం మీనా.. అది చేసిన చేష్టల వల్ల నాకు ఈ బాధలు వచ్చాయి' అంటూ ప్రభావతి మరోసారి నోరు పారేసుకుంటుంది. దీంతో మీనాక్షి.. 'పాపం నీకేం తెలియదు.. అంతా చేసేది చేసి, ఇప్పుడు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావా?'అంటూ సెటైర్ వేస్తోంది.

ఇక కట్ చేస్తే.. సత్యం హాల్‌లో కూర్చోని ఆలోచిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన బాలు 'ఏమైంది నాన్న?' అని ప్రశ్నిస్తాడు. 'ఏం లేదు.. ఇప్పుడే పార్కు కు వెళ్లి వచ్చాను. అక్కడ తల్లిదండ్రులు తన పిల్లలు గురించి తీసుకుని శ్రద్ధను గమనించాను. అందరూ విషయంలో నేను గెలిచాను. కానీ, మనోజ్ గాడి విషయంలో ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాను'అని బాధపడతాడు. దీంతో బాలు 'అనవసరంగా బాధపడకండి నాన్న.. అమ్మనే వాడు తప్పు చేసిన ప్రతిసారి వాడిని వెనకేసుకొస్తుంది. వాడి తప్పును సమర్ధించుకుంటూ రావడం వల్లనే ఈ రోజు ఇలా తయారయ్యాడు. అది మొదట్లోనే చేసి ఉంటే.. ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు'అంటూ క్లారిటీ ఇస్తాడు.

అయినా సత్యం మాత్రం దానికి ఏదో తప్పు చేసినట్లు భావిస్తాడు. ప్రభావతి చేసిన తప్పుకు బాలు, మీనాలకు క్షమాపణ చెప్తాడు. దీంతో మీనా షాక్ అవుతుంది. 'మీరు ఇలా చేయడం సరికాదు మామయ్య..'అంటుంది. దీంతో సత్యం ఎమోషనల్ అవుతాడు 'నేను నిన్ను కోడలుగా తెచ్చి.. నీకు న్యాయం చేశానని అనుకున్న, కానీ, ప్రభావతి లాంటి అత్తనిచ్చి.. ప్రతిరోజు నరకమను భావించేలా చేస్తున్నా..ఈ విషయంలో మాత్రం.. అన్యాయమే చేశా'నంటూ సత్యం బాధపడతారు. దీంతో బాలు కూడా 'అనవసరంగా అలా మాట్లాడొద్దు నాన్న' అంటూ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

'లేదురా నగలు తీసినాడు.. మీ అమ్మపై నాకు మనసు చచ్చిపోయింది. ఇన్నేళ్ల కాపురంలో ఏం చేసినా భరించుకుంటూ వచ్చా.. కానీ, మీనా నగలు దొంగతనం చేసి ఏం తెలియనట్లు నడిపించా? ఆ తప్పును క్షమించను. పైగా ఆ తప్పును మీనా తల్లి పై, నా తల్లిపై నింద వేయడం.. జీవితంలో అసలు క్షమించను. మీ అమ్మను క్షమిస్తే.. నేరాలకు నేను ఊపిరి పోసినట్లు అవుతుంది' అంటూ కరాకండిగా చెప్పేస్తాడు సత్యం. అయితే ఈ విషయాన్ని ప్రభావతి గోడ చాటున ఉంది వింటుంది. 'ఇంకా అక్కడే ఉంటే.. బాగోదని, తనకు ఏ తప్పో తెలియనట్లుగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది.

ప్రభావతి రావడంతో సత్యం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. తనకు మనశ్శాంతి కావాలి అంటూ పై గదిలోకి వెళ్ళిపోతాడు. దీంతో ప్రభావతి 'నీ కడుపు చల్లారిందా?' అంటూ మీనాపై నిందలు వేస్తోంది. ఇంతలోనే బాలు కోపంతో మాట్లాడడానికి ముందుకు వస్తాడు. కానీ, మీనా అడ్డుపడి వద్దు అని చెప్తుంది. దీంతో బాలు సైలెంట్ గా అక్కనుండి వెళ్ళిపోతాడు. 'ఇటు ఇంట్లో ప్రశాంతతలేదు.. అటు గుడిలో ప్రశాంతతలేదు.. ఛీ నా బతుకు' అంటూ బాధపడుతుంది.

కట్ చేస్తే.. దాబాపై పడుకోవడానికి మీనా ఏర్పాటు చేస్తాను. ఇంతలోనే బాలు వచ్చి రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. మాటలో మాటగా 'ఇంతా జరిగిన నీకు కోపం రావట్లేదా?' అని అడుగుతాడు. 'మన ఇంటి గుట్టు మనం బయట పెట్టుకోవడం సరికాదు' అంటూ బాలుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో మీనాకు ఓ సందేహం వస్తుంది. మన ఇద్దరి మధ్య ఇలానే గొడవలు జరుగుతే.. నాతో మాట్లాడకుండా ఉంటారా? అంటూ మీనా ప్రశ్నిస్తుంది. దీంట్లో బాలు.. 'దగ్గరికి రా చెప్తా అంటూ మీనాను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, మీనా మాత్రం బాలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మీనా.. జారిపడటం.. బాలు పట్టుకోవడం.. అలా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి పోతారు.

ఇక మరసటి రోజు ఉదయం.. మీనా వంట గదిలో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. ఇంతలో ప్రభావతి వచ్చి ఎలాగైనా మీనాను అవమానించాలని ప్రయత్నిస్తోంది. 'ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావ్..? నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందని సంతోషంగా ఉన్నావా..? ఇంతకీ తినడానికి ఏం చేస్తున్నావ్ ?అంటూ అడుగుతుంది. 'మనందరి కోసం పూరి చేస్తున్న..' అంటూ మీనా నిదానంగా సమాధానం చెబుతుంది. 'పూరీలు చేసుకో.. పండగ చేసుకో.. ఎవరికి పెట్టకుండా తిను.. నీ మాటలు నీ చేష్టలు.. నాకు తెలియదా.. నువ్వు దేనికోసం కత్తి లాంటి దానివి..'అంటూ మాట జారుతుంది ప్రభావతి. అయినా మీనా మాత్రం శాంతంగా సమాధానం ఇస్తుంది. మీరు కోపంగా ఉన్నట్టున్నారు హాల్లో కూర్చుని కాపీ తెచ్చి ఇస్తా అంటూ సైలెంట్గా సమాధానం ఇస్తుంది.

కానీ ప్రభావతి మాత్రం నీ కాఫీ వద్ద నీ చేత్తో చేసే వంట వద్దు.. అంటూ వెళ్ళు హలో కూర్చుంటుంది. ఇంతలో మనోజ్ రోహిణి ఇద్దరు ఆఫీస్‌కి వెళ్లడానికి బయలుదేరుతారు. వారిని గమనించిన మీనా..'పూరి చేశాను. టిఫిన్ చేసి వెళ్లిపోండి' అంటుంది. దీంతో రోహిణి 'మాకేం అవసరం లేదు. బయటే తింటాం.. అయినా బాలుకి డబ్బులు ఇవ్వలేదని అవమానించడానికి పిలుస్తున్నావా ?'అంటూ రోహిణి తేడాగా మాట్లాడుతుంది.

దీంతో మీనా.. 'ఎన్ని రోజులు బయట తింటారు? ఈరోజు తింటారా? రేపు కూడా బయట తింటారా? ఆయన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? గతంలో మామయ్యకి ఇవ్వాల్సిన 40 లక్షల ఇప్పటికీ ఇవ్వలేదు? ఈ నాలుగు లక్షల రూపాయలు కూడా ఇస్తారని నమ్మకం లేదు అనవసరంగా లేనిపోని పంతాలు పట్టింపులు పెట్టుకోవద్దు. సైలెంట్ గా వచ్చి తిని పోండి అంటుంది మీనా. మనోజ్ తినడానికి ముందుకు వచ్చిన.. రోహిణి మాత్రం తమ బయట తింటాం అంటూ మనోజ్‌ను లాకెళ్తోంది.

ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో.. రోహిణి ఎవరు ఊహించిన విధంగా ట్విస్ట్ ఇస్తుంది. బాలు ఇవ్వాల్సిన నాలుగు లక్షలను తీసుకువచ్చి అందరి ముందు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సత్యం ఎంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఎవరు ఇచ్చారు? అంటూ ఆరా తీస్తాడు. దీంతో రోహిణి 'మా నాన్న పంపించాడు?' అంటూ గర్వంగా చెబుతోంది. వెంటనే బాలు.. 'మీ నాన్న జైల్లో ఉన్న డబ్బు పంపిస్తాడా ? ఇకనుండి వచ్చింది ఏం చేశావుఝ అంటూ నిలదీస్తాడు. దీంతో రోహిణి కంగారుపడుతుంది. మరి ఇలాంటి సమాధానాలు చెప్తుందో బాలు ప్రశ్నలను ఎలా తిప్పి కొడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X