Gunde Ninda Gudi Gantalu December 9th Episode: రోహిణికి 4 లక్షలు ఎలా వచ్చాయి? మనోజ్ బిజినెస్ సీక్రెట్ ఏంటీ?

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ లో కుటుంబ కలహాలు మళ్లీ తీవ్రమయ్యాయి. శృతి తల్లి శోభ గుడిలోకి రావడంతో, ప్రభావతిని బంగారు గాజుల విషయంలో ఇబ్బంది పెడుతారు. 'గాజులు అమ్మేశారా? తాకట్టు పెట్టారా?' అంటూ ప్రభావతిని శోభ నిలదీస్తారు. మీనాక్షి విషయం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, శోభ సైటెర్స్ కు ప్రభావతి అవమానంతో బాధపడుతుంది. ఇదిలా ఉంటే సత్యం పార్క్‌లో తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకునే తీరు గమనించి, మనోజ్ విషయంలో తానే తప్పు చేశానన్న విచారం వ్యక్తం చేస్తాడు. బాలు, మనోజ్‌ తప్పులకు ప్రభావతే ప్రోత్సాహమిచ్చిందని చెబుతాడు.

ప్రభావతి చేసిన తప్పులకు సత్యం ఎమోషనల్ అవుతారు. బాలు,మీనాలకు క్షమాపణ చెప్పడం చూసి మీనా ఆశ్చర్యపడుతుంది. ప్రభావతి చేసిన తప్పుకు మీనానే బాధపడుతోందని చెప్పి, ఇకపై ఆమెను క్షమించనని సత్యం స్పష్టంగా చెబుతాడు. ఈ మాటలు గోడ చాటున విన్న ప్రభావతి విషయంలో అసలు తన తప్పు లేదన్నట్లు.. తిరిగి మీనాపై నిందలు వేస్తుంది. ఇక రాత్రి బాలు, మీనా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చూపిస్తారు. మరుసటి రోజు మీనా అందరికీ టిఫిన్ సిద్ధం చేస్తుంటే, ప్రభావతి మళ్లీ అవహేళన చేస్తుంది. రోహిణి, మనోజ్‌ను బయట తినమని లాకెళ్లిపోవడానికి ప్రయత్నించగా, మీనా గట్టిగా నిలబడి, గతంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వకపోయినా ఇలాంటి పంతాలు పెట్టుకోవడం సరికాదని వార్నింగ్ ఇస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 571 December 9th 2025 here is full story

మంగళవారం ఎపిసోడ్ కూడా రసవత్తరంగా సాగింది. మీనా టిఫిన్ చేసి అందర్నీ తినడానికి పిలుస్తుంది. రోహిణి మాత్రం తాను తినాలని బయట తింటామని బిల్డప్ ఇస్తుంది. దీంతో మీనా 'డబ్బులు ఎక్కువ అయ్యాయా.. అనవసరంగా బిట్టు చేయకండి. అందరి కోసం పూరీలు చేశాను' అంటుంది. 'మమ్మల్ని అవమానించడానికి ఇలా చేస్తున్నావా' అని రోహిణి అనగా.. 'నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఎవరిపై కోపం లేదు. లెక్కలు తీయాలనుకుంటే.. అందరి చిట్టా బయట పెడతా' అని గట్టిగా మాట్లాడుతుంది. దీంతో మనోజ్ 'ఏంటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావ్ 'అంటాడు. తమ్ముడు భార్యతో మాట్లాడే ముందు కాస్త ఆచితూచి మాట్లాడమని మీనా అంటుంది.

దీంతో రోహిణి తనకు నచ్చకున్న టిఫిన్ చేయడానికి వెళుతుంది. ప్రభావతి కూడా ఇష్టం లేకుండానే టిఫిన్ చేయడానికి వెళ్తుంది. ఇంతలోనే బాలు, సత్యం, రవి, శృతి కూడా టిఫిన్ చేయడానికి వస్తారు. అయితే.. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రభావతిని చూసిన సత్యం 'తనకు వారితో తినాలనిపించడం లేదని, అనవసరంగా తనని ఇబ్బంది పెట్టవద్దని అంటారు. కానీ, ఇంట్లో జరుగుతున్న విషయాలను గమనిస్తూ తనలో తాను బాధపడతాడు. అక్కడ ఉండడం సరికాదని మనశ్శాంతి కోసం తన ఫ్రెండును కలవడానికి బయటకి వెళ్తాడు.అయితే బయటికి వెళ్లే ముందు.. మీనాకు మాత్రమే 'తాను బయటకు వెళ్తున్నా 'అని చెప్పి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన రవి.. 'ఏంటమ్మా.. నాన్న, నువ్వు మాట్లాడుకోవడం లేదా.. అని ప్రశ్నించగా.. 'ఆయనే నాతో మాట్లాడాలని లేదు' అంటుంది ప్రభావతి.

శృతి వెంటనే'మామయ్య కాబట్టి మాట్లాడకుండా సరిపెట్టారు. అదే సిచువేషన్ లో మరొకరు ఉంటే.. నెత్తి మీద సూట్కేస్ పెట్టి మిమ్మల్ని బయటకు గెంటేసేవారు.. ఆ విషయంలో సంతోషించండి' అంటుందిజ దీంతో ప్రభావతి మొఖం మాడిపోతుంది. వెంటనే రోహిణి ప్రభావతి ఏం తప్పు చేయనట్లుగా ఈ విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చూస్తున్నావు? అంటుంది. దీంతో శృతి.. 'నువ్వెందుకు వారిని వెనకేసుకుని వస్తున్నావ్..? ఇది క్రైమ్ అంటుంది' దీంతో ప్రభావతి ఏం మాట్లాడాలో అర్థం కాక.. టిఫిన్ తినడం మానేసి.. మధ్యలోనే లేసి వెళ్ళిపోతుంది.

దీంతో మీనా బాధపడుతుంది. 'నువ్వు అనవసరంగా బాధపడకు. నగలు ముంగినోడే సిగ్గు శరం లేకుండా పందిలా తింటున్నాడు. వాడి వల్లనే అమ్మతో నాన్న మాట్లాడడం లేదన్న విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు' అంటాడు బాలు. దీంతో రోహిణికి ఎక్కలేని కోపం వస్తుంది.'సిగ్,గు శరం లేకుండా పందిలా తింటున్నావా ? 'అంటూ మనోజ్ ను కూడా లాకెళ్తుంది. ఇక్కడ మనోజ్ మాత్రం తప్పు చేశాను అనే ఫీలింగ్ కాస్త కూడా లేకుండా.. వారి మాటలు పట్టించుకోకుండా తింటాడు. ఇలా అందరూ సూటిపోటి మాటలు అనడంతో ప్రభావతి, రోహిణి మనసు గాయపడుతుంది.

ఇదిలా ఉంటే.. మీనా శృతిని పిలిచి 'ఇంటికి గుట్టు బయట పెట్టొద్దని.. ఎక్కడ జరుగుతున్న విషయాలను మీ ఇంట్లో అస్సలు చెప్పకూడదని అంటుంది. శృతి ఎందుకు అని ప్రశ్నించగా.. 'జీవితాంతం నువ్వుండేది అత్తవారింట్లోనే.. కాబట్టి, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం సారి కాదు. ఒక్కసారి పరువు పోతే మళ్ళీ తిరిగి రాదు'అంటుంది మీనా. దీంతో సరేలే అని శృతి కూడా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని ప్రభావతి చాటుగా వింటుంది.

ఇక కట్ చేస్తే.. మనోజ్ తన షాప్ లో బాధపడుతూ కూర్చుంటాడు. తన వల్లనే సమస్యలు వచ్చాయని రోహిణికి చెబుతాడు. 'అనవసరంగా ఇబ్బంది పడకు. బిజినెస్ సెక్యూరిటీ కోసం దాచిపెట్టిన డబ్బులు ఉన్నాయి కదా.. కల్పన ఇచ్చిన డబ్బులో నుండి తీసి ఆ డబ్బుల్ని ఇంట్లో వచ్చేద్దాం .. అనవసరంగా సమస్యలు నెత్తి మీద పెట్టుకుని బాధ పడాల్సిన అవసరం లేదు' అని రోహిణి సలహా ఇస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఆ సలహా తనకి ఇష్టం లేదని, వారికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని రోహిణిని ప్రశ్నిస్తాడు. 'నీలాగా సిగ్గు, శరం లేకుండా ఉండడం నావల్ల కాదు. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా..'అంటుంది రోహిణి. మరోవైపు మీనా అత్తమామలను ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉంటుంది. బాలు మాత్రం నువ్వు అనవసరంగా బాధపడకు.. తూర్పు పడమర కలపడం కరెక్ట్ కాదు. అనవసరంగా ఇబ్బంది పడకు.. టైం వస్తే వాళ్లే కలుస్తారు అంటాడు బాలు.

అప్ కమింగ్ ఎపిసోడ్లో..'శృతి నాలుగు లక్షల రూపాయలను తీసుకొని ఇంటికి వస్తోంది. వెంటనే బాలుని పిలిచి.. ఆ డబ్బులు తన మామయ్యకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సత్యం అనుమానం వచ్చి.. ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించగా.. మా నాన్న పంపించాడు అంటుంది. దీంతో బాలుకి అనుమానం వస్తుంది. జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు ఎలా పంపించగలుగుతారు? అని నిలదీస్తాడు. దీంతో రోహిణి కంగారుపడుతుంది. అసలు విషయాన్ని బయట పెడతారా? కల్పన ఇచ్చి డబ్బులు ఇవేననీ, తమ బిజినెస్ సీక్రెట్ చెబుతారా ? అనేది ఉత్కంఠగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X