Gunde Ninda Gudi Gantalu December 10th Episode: మనోజ్ గుట్టు బయటపడుతుందా? రోహిణిపై మీనాకు మరో అనుమానం ?
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ లో బాలు-ప్రభావతి నగల సమస్య ఇంట్లో కలహాలకు కారణమవుతూనే ఉంది. మీనా పూరీలు చేసి అందర్నీ టిఫిన్‌కి పిలిస్తే రోహిణి 'బయట తింటాం'అంటూ బిల్డ్ అప్ ఇచ్చింది. దీనికి మీనా 'డబ్బులు ఎక్కువ అయ్యాయా?'అంటూ నిలదీస్తుంది. దీనిపై రోహిణి 'మమ్మల్ని అవమానించడానికి ఇలా చేస్తున్నావా'అనగా మీనా గట్టిగా 'నాకు ఎవరిపై కోపం లేదు... లెక్కలు తీయమంటే అందరి చిట్టా బయటపెడతా'అని తేలికగా చెప్పేసింది. మనోజ్ కౌంటర్ కొట్టడంతో మీనా ఆగ్రహించింది. ఇది చూసి రోహిణి, ప్రభావతి వంటకు వెళ్లగా సత్యం మాత్రం డైనింగ్ వద్ద వాళ్లతో కూర్చోకుండా బయటికి వెళ్ళిపోతాడు.
ఈ విషయంలో రవి, శృతి కూడా తమదైన సూటి మాటలు చెప్పడంతో ప్రభావతి మనస్తాపానికి గురై టిఫిన్ మానేసి వెళ్లిపోతుంది. మీనా ఈ వ్యవహారంపై శృతిని హెచ్చరిస్తూ 'ఇంటి వ్యవహారాలు బయట చెప్పొద్దు'అని చెప్పింది. ఈ విషయాన్ని ప్రభావతి గమనించి మరింత మనస్తాపం చెందుతుంది. ఇక మనోజ్ తన షాప్‌లో బాధపడుతుండగా రోహిణి 'కల్పన ఇచ్చిన డబ్బు తీసుకురావాలి'అని చెబుతుంది. అయితే మనోజ్ మాత్రం 'సిగ్గు శరం లేకుండా డబ్బు అడగలేను'అంటాడు. మరోవైపు.. మీనా ఈ పరిస్థితిని సరిచేయాలని ప్రయత్నిస్తుంటే.. బాలు 'తూర్పు పడమర కలవవు... టైమ్ వచ్చినప్పుడు వాళ్లే కలుస్తారు'అంటూ సర్దిచెప్పాడు.

Courtesy: Jio hotstar
బుధవారం ఎపిసోడ్ కూడా రసవత్తరంగా సాగింది. బాలుకి డబ్బు ఇవ్వాలని, కళ్యాణి ఇచ్చిన డబ్బులు నుండి రెండు లక్షల రూపాయలు తీసుకుని రోహిణి, మనోజ్ ఇంటికి వస్తారు.వచ్చి రాగానే ఇంట్లో వారందరినీ పిలిచి, అందరి ముందు బాలుకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక మనోజ్ మాత్రం తాను కష్టపడి డబ్బులు తెచ్చినట్లు బిల్డప్ ఇస్తాడు. రోహిణి తన బ్యాగులో నుండి డబ్బు తీయడం చూసి అందరూ షాక్ అవుతారు. వెంటనే ప్రభావతి 'ఇంత డబ్బు ఎలా వచ్చింది' అని రోహిణి అడుగుతుంది. 'ఈ డబ్బును మా నాన్న పంపించాడు' అంటుంది. దీంతో సత్యంకు అనుమానం వస్తుంది. 'మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా.. ఈ డబ్బులు వచ్చింది' అని అడుగుతాడు. వెంటనే బాలు ' జైలు లో కూడా బ్యాంకులో ఉండవచ్చు నాన్న' అంటూ సెటైర్ వేస్తాడు. వెంటనే మనోజ్ 'మలేషియా మామయ్యతో పంపించాడు' అని బిల్డప్ ఇస్తాడు.
ప్రభావతి రియాక్ట్ అవుతూ..'అంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పావా? ఇంట్లో జరుగుతున్న విషయాలను చెప్పావా? అంటూ కోప్పడుతుంది. 'లేదు.. కుటుంబ విషయాలు చెప్పాలేదు.. ఈ రచ్చ నేను ఎందుకు చెప్తాను' అంటుంది. దీంతో సత్యం ఆ డబ్బులను తీసుకోమ్మని చెబుతాడు. కానీ, మా బాలు మాత్రం 'నాకు అవసరం లేదు.. మొత్తం నాలుగు లక్షలు ఇస్తే నేను తీసుకుంటా..రెండు లక్షలు ఇచ్చి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా ' అంటాడు. ఈ సమయంలో రోహిణి నేను మిగితా డబ్బులను ఇస్తానని మాట ఇవ్వడంతో బాలు రెండు లక్షలను తీసుకోవడానికి ముందు వస్తాడు.
ఆ తరువాత రోహిణితో సత్యం మాట్లాడుతూ 'మనోజ్ చేసిన తప్పులను, ప్రభావతి ఆడిన నాటకాలను మర్చిపోయి.. ఇలా వారి తప్పులను సమర్ధించుకుంటూ వెళ్తే.. చేసేటప్పుడు చేసుకుంటూ వెళ్తారు. క్షమించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. వాటిని మరిచి, అతిగా ప్రవర్తించకూడదు. ఈ విషయాలను గుర్తు పెట్టుకో'మని సత్యం అంటారు. దీంతో పక్కనే ఉన్న మనోజ్ ' సరే నాన్న.. మరోసారి ఇలా చేయను' అంటూ తన తండ్రితో మాట కలిపే ప్రయత్నం చేస్తాడు. దీంతో సత్యంకు ఎక్కడలేని కోపం వస్తుంది.'సిగ్గు లేకపోతే సరి.. మీ మోకాలను చూడాలంటేనే చిరాకు వేస్తుంది. ఛీ నీ బతుకు చెడ' అని ప్రభావతి,మనోజ్ ని ఇద్దరిని తిడుతాడు. ఇక బాలు బయటికి వెళ్తూ.. 'రెండు లక్షల రూపాయలను మీనా చేతికిచ్చి వెళ్తాడు. వెళ్లే ముందు జాగ్రత్తగా బీరువాలో పెట్టి చూసుకోమని' చెప్తాడు.
ఇక తర్వాత ప్రభావతి రోహిణి తో మాట్లాడుతూ..'ఏంటమ్మా ఇలా చేశావు.. అడిగిందానికి నాలుగు లక్షల అడుగుతే.. సెట్ అవుతుంది కదా.. చూసావా సగం డబ్బులు ఇచ్చిన వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో..'అంటుంది.రోహిణి 'నాన్న బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేశారు కదా.. అందుకే కొంత అమౌంట్ మాత్రమే పంపించారు' అంటుంది. దీంతో ప్రభావతి 'సరేలే ఏం చేస్తావ్.. మొత్తం డబ్బులు ఇచ్చేంతవరకు వాడితో ఇలా మాటలు పడాల్సిందే' అంటూ వెళ్లిపోతుంది.ఇక మనోజ్..'రోహిణి దగ్గరికి వెళ్లి.. అనవసరంగా రెండు లక్షలు ఇచ్చావు' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు. 'ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే.. నేనే నిన్ను అమ్మేస్తా' అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మనోజ్ మాత్రం తాను తప్పు చేసినట్లు కొంత కూడా బాధపడ్డాడు.
ఇక బాలు మీనా దగ్గరికి వచ్చి.. 'ఉదయం త్వరగా లెవ్వు.. మనం బయటికి వెళ్లి రెండు లక్షల రూపాయలతో నగలు కొందాం' అని చెబుతాడు.కానీ, మీనా మాత్రం.. తనకు నగలు ఇష్టం లేదని, ఆ డబ్బుతో మరొక కారు తీసుకుందామని చెబుతోంది. దీంతో బాలు కూడా ఆశ్చర్యపోతారు. 'నగలు తీసుకుంటే వాటితో వచ్చేది ఏమీ లేదు. నాకు వేసుకోవాలని ఆశ కూడా లేదు. ఆ డబ్బుతో కొత్త కారు తీసుకుంటే.. డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో పైన గది కట్టుకోవచ్చు' అంటుంది. మీనా ఐడియా బాలుకు తెగ నచ్చేస్తుంది. ' సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం' అంటూ మీనా ను హగ్ చేసుకుంటాడు. 'సరేగాని మామయ్య అత్తయ్యను ఎలాగైనా కలపండి' అంటుంది. దీంతో బాలు తన తండ్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.
'అనవసరంగా హల్లో ఎందుకు పడుకుంటున్నారు నాన్న' అని ప్రశ్నించగా.. 'నేను ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నా.. ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు' అని బదులిస్తాడు సత్యం. ఆల్రెడీ రెండు లక్షల రూపాయలు ఇచ్చారు కదా నాన్న.. ఇంకా ఇప్పటికి ఎందుకు అంటాడు బాలు. దీంతో సత్యం 'నాకు డబ్బులు సమస్య కాదు.. మీ అత్తయ్య వ్యక్తిత్వం. ఈరోజు డబ్బు ఉంటుంది.. రేపు వెళ్తుంది' అంటాడు సత్యం. కానీ, బాలు మాత్రం 'మీరు ఇక్కడ పడుకోవడం నాకు నచ్చడం లేదు నాన్న.. గదిలోకి వెళ్లి పడుకోండి. అమ్మ గురించి కొత్తగా మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు ఇలా చేసింది. ఇప్పుడు ఎందుకు క్షమించరు 'అంటాడు బాలు. దీంతో సత్యం తనకు మాత్రం ఇక్కడనే పడుకుంటా గదిలో వెళ్లి మీ అమ్మను చూడలేను అంటాడు.
ఇంతలోనే ప్రభావతి దిండు పట్టుకుని కిందికి వస్తుంది. 'నేనొక్కదాన్నే గదిలో పడుకోలేను. నాకోసం ఇతరులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు' అంటుంది. దీంతో బాలు.. తన తండ్రిని నచ్చజెప్పి గదిలోకి పంపిస్తాడు. అయితే సమయంలో మీనా..తన అత్తయ్య ప్రభావతిని కూడా గదిలోకి వెళ్ళమని చెప్తుంది. కానీ ప్రభావతి మాత్రం.. 'నీవల్లే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు సంతోషంగా ఉంది కదా..' అంటూ మాట జారుతుంది. దీంతో మీనా 'మీకు నచ్చినట్లు చేసుకోండి.. మీకు నచ్చిన దగ్గర పడుకోండి నాకేంటి 'అని వెళ్ళిపోతుంది. దీంతో ప్రభావతి చేసేది ఏం లేక గదిలోకి వెళ్లలేక.. హాల్లోని ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంది.
ఇక మరుసటి రోజు ఉదయం తోడికోడలు అందరూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. ఈ సమయంలో మరోసారి నగల చర్చ వస్తుంది.' అత్తయ్య అనవసరంగా మీనాపై ఆ బండారు వేస్తుంది. కానీ, తప్పు వాళ్ళిద్దరూ చేశారు. నగలు ఇచ్చింది అత్తయ్య.. వాటిని తాకట్టు పెట్టింది మనోజ్.. ఇందులో తప్పేముంది. అనవసరంగా మీనాపై ఎందుకు కోపడుతున్నారు. మామయ్య ప్లేస్ లో నేనుంటే.. ఎప్పుడు వాళ్లను ఇంట్లో నుండి పంపించేదాన్ని' అంటుంది శృతి. దీంతో రోహిణి ఒక్కసారిగా కంగారు పడుతుంది. అది చూసిన శృతి..'ఏంటి నువ్వు కూడా తప్పు చేసావా? అలా కంగారు పడుతున్నావ్ అనగా.. 'లేదు నాకు వారితో ఎలాంటి సంబంధం లేదు' అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇక మరసటి రోజు ఎపిసోడ్లో.. శృతి డబ్బింగ్ లో భాగంగా.. డెలివరీ సీన్ కు డబ్బింగ్ చెప్తుంది. ఇంటికి వచ్చి డబ్బింగ్ సంబంధించిన విషయాలు తన తోడికోడలైన రోహిణి, మీనాలకు చెబుతుంది. ఈ సమయంలో రోహిణి డెలివరీ సమయంలో ఆడవారిలో జరిగే మార్పులను పూసకొచ్చినట్లు వివరిస్తుంది. దీంతో శృతి ,మీనా షాక్ అవుతారు.నువ్వు ఇంతలా చెబుతున్నావ్.. ఎప్పుడైనా బిడ్డకు జన్మనిచ్చావా.. నువ్వే ఆ బాధను అనుభవించినట్లు చెబుతున్నావు అంటుంది శృతి. దీంతో ఒకసారి రోహిణి షాక్ అవుతుంది. కానీ, మీనాకు మాత్రం కొత్త సందేహాలు మొదలవుతాయి.


Click it and Unblock the Notifications










