Gunde Ninda Gudi Gantalu December 11th Episode: అత్తకు శ్రుతి వార్నింగ్.. మీనాతో బాలుకి నిరాశ.. శీలా ఎంట్రీ..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో బాలు కోసం డబ్బు సమకూర్చాలని రోహిణి, మనోజ్ ఇద్దరూ కళ్యాణి ఇచ్చిన డబ్బుల నుంచి రెండు లక్షలు తీసుకొని ఇంటికి వస్తారు. ఇంట్లో వారందరినీ పిలిచి బాలు చేతిలో ఇవ్వడానికి ప్రయత్నించగా, మనోజ్ మాత్రం తానే కష్టపడి సంపాదించానంటూ బిల్డప్ ఇస్తాడు. రోహిణి చేతిలో అంత డబ్బు చూసి అందరూ షాక్ అవుతారు. సత్యం 'మీ నాన్న జైలులో ఉన్నాడు కదా?'అని అడుగుతాడు. వెంటనే మనోజ్ 'మలేషియా మామయ్య పంపించాడు'అంటూ కొత్త కథ చెబుతాడు. బాలు మొదట డబ్బు తీసుకోకుండా నాలుగు లక్షలు కావాలని అంటాడు. చివరకు రోహిణి మిగిలిన డబ్బులు ఇస్తానని మాట ఇవ్వడంతో రెండు లక్షలు తీసుకుంటాడు. కానీ, వెళ్లే ముందు డబ్బు మీనాకే ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెబుతాడు.

తరువాత ప్రభావతి రోహిణిపై డబ్బులు సగం మాత్రమే ఇచ్చిందని కోపపడుతుంది. మనోజ్ కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. ఇక బాలు, మీనా కలిసి ఈ డబ్బుతో నగలు కొనకుండా కారు కొనుక్కుందామనుకుంటారు. మీనా ఐడియా బాలుకి నచ్చడంతో, ఇద్దరూ ఆనందపడతారు. మరోవైపు సత్యం మాత్రం ప్రభావతి గత తప్పులను గుర్తుచేసుకుంటూ, క్షమించడానికి కూడా ఓ హద్దు ఉంటుందని అంటాడు. బాలు ఏ విధంగైనా తల్లిదండ్రులను కలపాలని ప్రయత్నిస్తాడు. కానీ, ప్రభావతి, మీనా మధ్య మాటల దాడి జరగడంతో పరిస్థితి మళ్లీ చెడిపోతుంది. మరుసటి రోజు ఉదయం నగలపై మరోసారి పెద్ద చర్చ మొదలవుతుంది. శృతి నేరుగా మనోజ్, ప్రభావతి తప్పే అని చెబుతుంటే రోహిణి భయపడుతూ మాట తప్పించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 573 December 11th 2025 here is full story

Courtesy: Jio hotstar

గురువారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ముగ్గురు కోడలు కలిసి, అత్తయ్య మామయ్యను కలవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా ప్రభావతి దగ్గరికి వెళ్లి, మామయ్యతో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తుంది మీనా. దీంతో ప్రభావతి 'మొత్తానికి అనుకున్న సాధించింది. ఇప్పుడు సంతోషంగా ఉందా? నీ వల్లనే కాపురాలు కోల్పోతున్నయి' అంటూ మీనాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో పక్కన శృతి.. అత్త కోడలితో మాట్లాడే పద్ధతి కాదు. అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారో అత్తయ్య.. మీనాను క్షమించమని అడుగుతే.. ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది కదా' అంటూ మరోసారి రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో ప్రభావతి 'నేనెందుకు క్షమాపణ చెప్పాలి' అంటూ ప్రశ్నిస్తుంది.

దీంతో శ్రుతి 'మీరు అన్ని చేశారు. అయినా ఇక్కడ కోప్పడాల్సింది మీనా' అంటూ శృతి తన అత్తయ్యకు వార్నింగ్ ఇస్తుంది. 'అవి మీనా నగలు కాదు. మన ఇంటి నగలని ఇచ్చా అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, శృతి మాత్రం తగ్గకుండా.. 'అలాంటప్పుడు మీ నగలు ఇచ్చి ఉండొచ్చు కదా..? మీనాకు చెప్పకుండా నగలు ఎందుకు దొంగతనం చేశారు?' అంటూ నిలదీస్తుంది. అది గొడవకు దారితీస్తుందని భావించిన రోహిణి.. ముందు మామయ్య గురించి మాట్లాడమంటుంది. దీంతో మీనా 'మీరు ఒక్కసారైనా మామయ్యతో మాట్లాడి చూడండి' అంటుంది.

ప్రభావతి చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్లుగా ' ఇది మీనా ప్లాన్ కాదా? నీ వేషాలు నాకు తెలియదా? నాక్కూడా మీ మామయ్య లాగా కోపం ఉంది' అంటుంది. దీంతో పక్కనే ఉన్న శృతి..'అంత గారాబం అవసరం లేదు.. బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట.. మీనాకు క్షమించమని అడగండి . ఆటోమేటిక్గా మామయ్య మీతో మాట్లాడుతాడు' అంటుంది శృతి. దీంతో ప్రభావతి కోపం ఆకాశాన్ని అంటుంది 'ఇదంతా మీనా ప్లాన్.. ప్రకారం నడిపిస్తుందా? అందుకే శృతిని రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకు వచ్చిందా? అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో మీనా..'నేనేం మాట్లాడినా? ఏం చేసినా? అంతా నాదే తప్పు అన్నట్లుగా ఎందుకు చూస్తున్నారు? అయినా మీ ఇద్దరి కలపడానికి నేను ప్రయత్నిస్తున్న.. అనవసరంగా నా మీద లేనిపోని నిందలు వేయొద్దు' అంటూ మీనా ఎమోషనల్ అవుతుంది.

మరోసారి శృతి.. 'మీరు మాట్లాడితే మాట్లాడండి.. లేకపోతే లేదు.. అనవసరంగా మీనాపై నిందలు వేయకండి' అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి మాత్రం తన అత్తయ్యను సపోర్ట్ చేస్తూ..'మీరు ఎవరికీ క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. కానీ మామయ్యతో మాట్లాడడానికి ప్రయత్నించండి' అంటుంది. ఇక మరోవైపు.. బాలు తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి కార్ షోరూమ్ కు వెళ్తాడు. అక్కడ కార్లను చూసి రెండు కార్లను సెలెక్ట్ చేస్తారు.ఆ రెండు కార్లు తెగ నచ్చేస్తాయి. దీంతో తన ఫ్రెండ్ రాజేష్.. ఏంట్రా రెండు కార్లు కొంటావా? అని ప్రశ్నించగా.. బాలు 'నువ్వు ఇంకో దానికి డబ్బులు ఇస్తానంటే..తీసుకుంటా..?'అని రిప్లై ఇస్తాడు. ఇలా కాదు.. మీనా వస్తే తానే కార్లను సెలెక్ట్ చేస్తుంది. వెంటనే బాలు మీనాకు ఫోన్ చేసి.. త్వరగా కార్ల షోరూమ్ కు రమ్మని ఫోన్ చేస్తాడు. దీంతో మీనా కార్ సెలెక్ట్ చేయడానికి వెళుతుంది.

ఇక మరోవైపు ప్రభావతి నిప్పులు కక్కుతూ కోపంగా మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. వెళ్లి వెళ్ళగానే మీనా పై కారాలు మిరియాలు నూరుతుంది. దీంతో మీనాక్షి.. మళ్లీ మీ ఆయనతో గొడవ జరిగిందా? అంటూ ఆరా తీస్తుంది. 'ఆయన మాట్లాడితే కదా గొడవ చేరడానికి.. నేను ఎటు వెళ్తే.. ఆయన అటు వెళ్తున్నారు. కనీసం ముఖం కూడా చూడక లేదు' అంటూ బాధపడుతుంది. శ్రుతి వల్ల సమస్యలు వస్తున్నాయని, తన మాటకు ఎదురు చెబుతుంది. రోహిణి నాకు నెల నెల 5000 రూపాయలు ఇస్తాను. కానీ, ప్రతి రూపాయి కూడా ఇవ్వలేదు. దానితో ఒక్క పైసా లాభం లేకపోగా.. పైగా అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. నాకే ఎదురు చెబుతుంది. ఇంత డబ్బు ఉంటే ఏం లాభం. రోహిణికి కోట్ల ఆస్తి ఉంది. ఈ రోజైనా చాలా ప్రవర్తించిందా? నాకు అందరు కోడల కంటే రోహిణి అంటేనే చాలా ఇష్టం అంటోంది. దీంతో మీనాక్షి ఇంతేనా నేను తీసుకొచ్చిన సంబంధం కదా? అంటూ మీనాక్షి గొప్పలు చెబుతుంది.

ముందు శృతిని దారిలో పెట్టాలి. ఆ తర్వాత అందరూ నా కంట్రోల్లోకి వస్తారు అంటూ ప్రభావతి తన కన్నింగ్ ఐడియాను మీనాక్షికి చెబుతుంది. ఇక మరోవైపు మీనా.. బాలు చెప్పిన కార్ల షోరూంకి వెళ్తుంది. అక్కడ బాలు కార్లను చూపించి, అందులో బెస్ట్ వన్ సెలెక్ట్ చేయమంటాడు. దీంతో మీనాక్షి ఒక కారును సెలెక్ట్ చేసే.. ఒకటి తనకు బాగా నచ్చిందని చెబుతుంది. మరి తీసుకున్నామ అని బాలు అడగగా.. ఎప్పుడు అవసరం లేదు.. ఇంట్లో గొడవలు జరుగుతుండగా.. మనం కారు తీసుకుంటే బాగోదు అంటుంది. 'ఇప్పుడు తీసుకుంటే కార్స్ షోరూం ఓనర్ మనకు గుడ్డు వీల్ కింద డిస్కౌంట్ ఇస్తాడు. తక్కువ దొరికే మన కారు వస్తుంది.'అని బాలు మీనాను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో మీనా ఇంట్లో జరిగిన విషయాన్ని మొత్తం చెబుతోంది. 'అనవసరంగా మీరు వారిని కలవడానికి ప్రయత్నం చేయకండి. నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాడు. మా అమ్మకు తను చేసిన తప్పు తెలియాలి' అని అంటారు. కానీ మీనా మాత్రం అనవసరంగా మనం కార్ తీసుకొని వెళ్తే ఆ సంతోషం కాస్త విషాదంగా మారుతుంది. తరువాత కార్ తీసుకుందాంలే అని బాలుని కన్వీనస్ చేసి కార్ తీసుకోకుండా బయటకు వెళ్లారు.

ఇక అప్ కమింగ్ సీరియల్.. బాలు తన తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన బామ్మ సుశీలమ్మను ఇంటికి రప్పిస్తాడు. ఆమెకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పేసేయ్ ఆ సమస్యను పరిష్కరించమని చెబుతాడు. దీంతో ప్రభావతి ప్రభావతి సత్యం పిలిచి పంచాయతీ పెడుతుంది. ఈ పంచాయతీలో ప్రభావతిని కడిగిపారేస్తుంది. సత్యం మాత్రం... మీకు మీ నాకు ఇద్దరికీ క్షమాపణ చెబితే మాత్రమే మాట్లాడుతాడు అంటూ భీష్మంచి కూర్చుంటాడు. మరి ప్రభావతి తన పంతాన్ని పక్కన పెడుతుందా? మీనాకి సారీ చెప్తున్నా? అనేది అప్కమింగ్ సీరియల్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X