Gunde Ninda Gudi Gantalu December 12th Episode: సుశీలమ్మ పంచాయితీ..సత్యం పట్టుదల.. ప్రభావతి పరాభవం..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం కూడా రసవత్తరంగా సాగింది. తన అత్తను మామయ్యతో మాట్లాడించడానికి మీనా చాలాసార్లు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేసినా, ప్రభావతి మాత్రం మీనానే తమ కాపురాల మధ్య విభేదాలకు కారణమంటూ ఆమెపై మండిపడుతుంది. పక్కనే ఉన్న శృతి తన అత్త ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ 'మీనా క్షమించమని అడిగితే సమస్య ఇక్కడే ముగుస్తుంది'అని తెగేసి చెబుతుంది. ప్రభావతి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తిప్పికొట్టింది. శృతి స్పష్టంగా 'మీ తప్పే ఎక్కువ.. అయినా మీనా కోప్పడాల్సిన పరిస్థితి'అని చెప్పడంతో ఘర్షణ మరింత ముదిరింది. నగల విషయం పై కూడా శృతి నిలదీయగా, రోహిణి మాత్రం ప్రభావతిని సమర్థించుకునే ప్రయత్నం మాత్రమే చేస్తుంది.
మరోవైపు మీనా భావోద్వేగంగా 'ఏం చేసినా నా మీదే నింద వేస్తున్నారు'అంటూ బాధపడింది. ఇలా అత్త-కోడళ్ల సంఘర్షణ కొనసాగుతుండగా, రోహిణి ప్రభావతిని సమర్థించింది. ఇదిలా ఉంటే.. బాలు తన ఫ్రెండ్‌తో కలిసి కారు షోరూమ్‌కి వెళ్లి రెండు కార్లను సెలెక్ట్ చేశాడు. మీనా రాగానే కారు కొనాలని బాలు ఒత్తిడి చేసినా, ఇంట్లో ఉద్రిక్తతల నడుమ కారు కొనకూడదని మీనా చెప్పి వెనుదిరిగింది. ఇక ప్రభావతి మరోవైపు మీనాక్షి దగ్గర కోపంతో వెళ్లి మీనా,శృతి గురించి ఫిర్యాదులు చేస్తుంది. ముందుగా శృతిని కంట్రోల్‌లో పెట్టాలని కుట్ర పన్నడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా మారింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కుటుంబ కలహాలతో రసవత్తరంగా సాగింది.

బాలు కొత్త కారు కొనాలని ప్రయత్నించగా మీనా మాత్రం అందుకు నిరాకరిస్తుంది. ఇంట్లో గొడవలు సద్దుమణిగే వరకు కొత్త కారు గురించి ఆలోచించకని చెబుతుంది. దీంతో బాలు నిరాశతో వెనుతిరుగుతాడు. ఇక తన తల్లిదండ్రులు కలపడానికి ఓ ప్లాన్ వేస్తాడు బాలు. ఇది ఇలా ఉంటే శృతి.. డబ్బింగ్ లో భాగంగా.. ప్రెగ్నెన్సీ సీన్ కు వాయిస్ ఇస్తుంది. ఆ సమయంలో శృతి చాలా ఎమోషనల్ అవుతుంది.ఆ సిన్ పూర్తి కాగానే.. వెంటనే తన తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెబుతుంది. ఎందుకు చెబుతున్నావని శోభ అడగగా.. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి తల్లి కడుపు పడే కష్టాల గురించి తాను తెలుసుకున్నానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని అంటుంది. 'ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్.. ఏమైనా విశేషమా?' అని ప్రశ్నించగా..'అదేం లేదు.. మాకు కాస్త టైం కావాలని..' అని శృతి చెబుతుంది.
ఇక డబ్బింగ్ పూర్తిచేసుకుని శృతి ఇంటికి చేరుకుంటుంది. వచ్చి రాగానే డబ్బింగ్ సంబంధించిన విశేషాలను తన తోడికోడలతో పంచుకుంటుంది. ' ఒక లేడీ నొప్పులు పడే సీన్.. డెలివరీ అయ్యే సీన్.. ఆ సిన్ కు డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డారు. అరిచాను. ఏడిచాను. నిజంగా ఆడవారికి సిచువేషన్ చాలా పెయిన్ ఫుల్ కదా. నేను పిల్లలు కనాలి అనుకున్న. కానీ ఇంత భయంకరంగా ఉంటుందని, ఆడవారికి ఇదొక పునర్జన్మ అని తెలుసుకున్న' అంటూ శృతి ఎమోషనల్ అవుతుంది. పక్కనే ఉన్న రోహిణి..'ఇంతేనా దీనికి ఎందుకు భయపడుతున్నావ్.. మొదటి మూడు నెలలు వెలిల్లు వస్తాయి. పుల్లగా తినాలి అనిపిస్తుంది. వంట పోపు వాసన చూసిన వాంతులు అవుతాయి . మాటిమాటికి తినాలనిపిస్తుంది. పుల్లగా ఏదైనా రుచి చూడాలనిపిస్తుంది. కానీ, ఏది సహించదు. ఇక ఆరు నెలలు దాటితే.. నడవడం భారంగా ఉంటుంది. నడుస్తే భారంగా ఉంటుంది నడిస్తే ఆయాసం. నడుము నొప్పి కూర్చుంటే లేవు. లేస్తే కూర్చోలే. ఇక నొప్పులు మొదలైతే మాత్రం... 'అంటూ రోహిణి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే మార్పుల గురించి పూస గుచ్చినట్లు చెబుతోంది.
దీంతో శృతి, మీనా షాక్ అవుతారు. దీంతో వెంటనే శ్రుతి ఆగకుండా..'నువ్వే అనుభవించినట్లు చెబుతున్నావ్..'అని ప్రశ్నించగా.. రోహిణి తడబడుతుంది. 'లేదు లేదు..ఇవన్నీ మా క్లైంట్స్ చెప్పారు. ఆ విషయాన్ని మీతో చెప్పాను అంతే..' అంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మీనా మాత్రం రోహిణి నీ సందేహంగా చూస్తుంది. 'పిల్లల్ని కనడం అనేది ఒక వరం.. తల్లి కావడం అనేది భయపడే విషయం కాదు. అదొక అందమైన అనుభూతి. బిడ్డ కడుపులో పడ్డ నుండి ఎప్పుడు ఎప్పుడు బిడ్డ బయటకు వస్తుంది అనేది మధురానుభూతి.. ఆ బిడ్డను చూసిన మరుక్షణం.. పడ్డ బాధలన్నీ ఇట్టే మాయమవుతాయి. ఆ అనుభూతి గురించి బిడ్డలు కన్నతలలు మాత్రమే చెప్పగలరు' అంటుంది మీనా. దీంతో పక్కన ఉన్న రోహిణి బిడ్డల్ని కనాలంటే శృతి భయపడుతుంది. 'అబ్బో నేను మాత్రం పురిటి నొప్పులు పడను.. రవి పురిటి నొప్పులు పడితే.. నేను పిల్లలకింటాను' అంటూ శ్రుతి అందరినీ నవ్విస్తుంది.
ఇక బాలు తన తల్లిదండ్రులను కలిపే ప్రయత్నంలో భాగంగా.. సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి వివరంగా సుశీలమ్మకు చెప్తాడు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని బాలు అడగగా.. ఈ సమస్యను ముందే చెప్తే నేను మరోలా పరిష్కరించేదాన్ని.. ఆయన ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాలే అంటూ సుశీలమ్మ ఎంట్రీ ఇస్తుంది. అందులోనే మీనా ఎదురు వస్తుంది. 'వచ్చి రాగానే మంచి శకుని ఎదురు వచ్చింది.. అంతా మంచే జరుగుతుంది. ఏంటమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా.. నన్ను మర్చిపోయావా?' అంటుంది సుశీలమ్మ. దీంతో బాలు.. 'చిన్న సమస్య అని.. నీకు చెప్పలేదు' అని అంటాడు. మీనా కూడా 'మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అమ్మ.. మొన్ననే మీరు పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని వెళ్లిపోయారు. అంతలోనే ఈ సమస్య చెప్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అనిపించింది. అందుకే మేము ఈ సమస్యలో చెప్పలేదని వివరణ ఇస్తుంది' మీనా.
దీంతో సుశీలమ్మ..'ఏం మాట్లాడుతున్నావ్ మీనా.. నేను పుట్టిన రోజు వేడుకల్లో సంతోషంగా ఉంటే.. మీరు మాత్రం సమస్యలతో సతమతమవుతున్నారా? మీరు ఇక్కడ బాధపడుతూ ఉంటే.. నేను అక్కడ సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు?'అంటుంది. ఆయన మిమ్మల్ని కాదు అనాల్సింది. ఈ గొడవలకు కారణం.. నా కోడలు ప్రభావతిని అనాలి. ప్రభావతి .. ఒసేయ్ ప్రభావతి' అంటూ పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ మాట వినగానే.. ప్రభావతి ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వస్తుంది. 'ఏంటీ అత్తయ్య ఎందుకు వచ్చారు' అని అడుగుతుంది. 'నా కొడుకు ఇంటికి నేను వచ్చా.. నువ్వేంటి అడుగుతున్నావ్.. ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలిసింది.. వాటిని పరిష్కరించే వరకు నేను అస్సలు వెళ్ళాను' అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతికి షాక్ ఇస్తుంది.
'అసలు ఏమనుకుంటున్నావే నువ్వు. మీ సమస్య ఏంటి ? సమాధానం చెప్పు దిక్కులు ఎందుకు చూస్తున్నావ్' అంటూ ప్రభావతిని సుశీలమ్మ నిలదీస్తుంది. 'మీకు ఈ సమస్య ఎలా తెలిసింది?' అని ప్రభావతి ప్రశ్నించగా.. 'ఆ సమస్య ఎలా తెలిసిందని కాదు. ముందు నుండి మనోజ్ నిన్ను సమస్యల్లో పడేస్తాడని చెప్పాను. నువ్వు ఆ క్షణం అర్థం చేసుకోలేదు. ఏమన్నా అంటే.. వాడు నా ముద్దుల కొడుకు.. పెద్ద పెద్ద చదువులు చదివాడు. వారి డిగ్రీ పట్టాలను.. బోర్డు రాయించి బయట మేకులు కొట్టించి పెట్టావు. ఇప్పుడు వాడే నీకు మేకులా తయారయ్యాడు' అంటూ ప్రభావతికి క్లాస్ పీకుతుంది. 'వానికి వ్యాపారంలో నష్టం వచ్చింది.. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది' అంటూ ప్రభావతి తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుంది.
దీంతో సుశీలమ్మ కోపంతో 'వాడిని వెనుక తీసుకొని రాకు.. నాకు మండుతుంది. ఎవరైనా పిల్లల్ని ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. నువ్వు మాత్రం వాడిని పరమ శుంట తయారు చేసావు..'అంటూ ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే తన కొడుకు సత్యమును పిలుస్తుంది.కానీ సత్యం రాడు. 'ఏమైంది నా కొడుకు ఎక్కడ ఉన్నాడు?' అని ప్రభావతిని అడుగుతుంది. 'ఆయన దాబా పై ఉన్నారు' అని ప్రభావతి చెబుతోంది. దీంతో సుశీలమ్మ 'ఇక్కడ ఏం చేస్తున్నావ్.. వెళ్లి వాడిని పిలుచుకు రా.. వెళ్ళు..' అంటూ గేదెముతుంది. కానీ, ప్రభావం మౌనంగా అక్కడే నిల్చుంటుంది. దీంతో బాలు వారిద్దరు మాట్లాడుకోవడం లేదు అని అసలు విషయాన్ని బయటపడతాడు. దీంతో సుశీలమ్మ.. 'మరి వీరిద్దరూ యవ్వనంలో ఉన్న జంట కదా.. అందుకే ఒకరి మీద ఒకరు అలిగి మాట్లాడుకోవడం మానేశారు.. నేను వెళ్లి పిలుస్తాలే..'అని ప్రభావతికి చురకలేస్తుంది.
ఇక తన కొడుకునీ చూడ్డానికి సుశీలమ్మ దాబా పైకి వెళ్తుంది. సత్యం తన తల్లిని చూడగానే ఆశ్చర్యపోతాడు.'ఏంటమ్మా నువ్వు ఎప్పుడు వచ్చావు?' అని కుశల ప్రశ్నలు అడుగుతాడు. సుశీలమ్మ 'కోపంగా నువ్వు కూడా నాకు చెప్పొద్దు అనుకున్నావా రా?' అయినా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా. నాకు చెప్పేవారు ఎవరు లేరా ఉన్నావా.. అయినా నువ్వు ఏమైనా పాతికేళ్ల కుర్రానివి అనుకుంటున్నావా.. భార్యతో గొడవ పెట్టుకుని మాట్లాడకుండా ఉండడానికి' అంటూ తన కొడుకు సత్యం ను కడిగేస్తుంది. 'అలా కాదు అమ్మ.. మనోజును కాపాడాలని ప్రయత్నం.. మీనా నగలను దొంగతనం. ఆ నిందను నీమీద.. మీనా తల్లిపై వేసింది' అంటూ అసలు విషయాన్ని సత్యం చెబుతాడు. దీంతో ప్రభావతి మోసం గురించి సుశీలమ్మ తెలుసుకుంటుంది. సత్యం 'అన్ని విషయాలలో అడ్జస్ట్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా భరించాను ఇప్పుడు నేను భరించలేను' అని చెబుతాడు. 'ఈ వయసులో మీరు గొడవలు పడుతూ ఉంటే ఎలా రా..? పిల్లల ముందు మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరే గొడవలు పడితే ఎలా..అంటుంది సుశీలమ్మ.
'ముందు ప్రభావతిని క్షమించు..' వెళ్లి ప్రభావంతో మాట్లాడు..'అని సుశీలమ్మ చెబుతోంది. కానీ ప్రభావతి మీనాకు క్షమాపణ చెబితేనే తాను మాట్లాడతానని సత్యం అంటాడు. ఎందుకు ప్రభావతికి నాకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించగా.. ప్రభావతి తన తప్పు ఉన్నాగాని అహంకారంగా తన గాజులను తీసి మీ నా ముఖానికి వేసి కొట్టింది. అహంకారంతో ప్రవర్తించింది. అందుకే మీనాకు ప్రభావతి కచ్చితంగా చెప్పాలి అంటూ పట్టుదలతో కూర్చుంటాడు. ప్రభావతి చేసిన దారుణాలు తెలుసుకొని సుశీలమ్మ కూడా షాక్ అవుతుంది. ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో ప్రభావతి తన తప్పుడు అంగీకరిస్తుందా మీనాకు క్షమాపణ చెబుతుందా అనేది ఉత్కంఠ గా మారింది.


Click it and Unblock the Notifications











