Gunde Ninda Gudi Gantalu December 15th Episode: నెలనెల 50 వేలు.. మనోజ్‌కు చుక్కలే.. సత్యంకు ప్రభావతి క్షమాపణ
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో డ్రామా పూర్తిగా పీక్‌కు చేరింది. కొత్త కారు కొనాలన్న బాలూ ఆలోచనకు మీనా అడ్డుపడుతుంది. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న గొడవలు సర్దుమణిగిన తర్వాతే కారు తీసుకోవాలని స్పష్టంగా చెబుతుంది. దీంతో నిరాశకు గురైన బాలు వెనుదిరుగుతాడు. అయితే సమస్యలను అలాగే వదిలేయకుండా, తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఓ కొత్త ప్లాన్ వేస్తాడు. ఇదే సమయంలో డబ్బింగ్ స్టూడియోలో శృతి ప్రెగ్నెన్సీ సీన్‌కు వాయిస్ ఇస్తూ తీవ్రంగా ఎమోషనల్ అవుతుంది. ప్రతి తల్లి పడే బాధను అర్థం చేసుకుని వెంటనే తన తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెబుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని చెబుతుండగా, రోహిణి మాత్రం ప్రెగ్నెన్సీ కష్టాలను డీటెయిల్‌గా వివరిస్తుంది.
ఆమె మాటలు విని మీనా, శృతి షాక్ అవుతారు. శృతి ప్రశ్నించడంతో రోహిణి తడబడుతూ 'క్లయిట్స్ చెప్పారని' కవర్ చేస్తుంది. ఇక బాలు తన ప్లాన్ ప్రకారం సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసుకున్న సుశీలమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభావతి, మనోజ్‌ల వల్ల వచ్చిన సమస్యలపై గట్టిగా క్లాస్ తీసుకుంటుంది. తర్వాత సత్యాన్ని కలిసిన సుశీలమ్మ, నిజాలు విని షాక్ అవుతుంది. సత్యం ఇక సహించలేనని చెప్పడంతో, సుశీలమ్మ అందరూ కలిసి ఉండాలని సూచిస్తుంది. అయితే సత్యం మాత్రం ముందు ప్రభావతి మీనాకు చేసిన అవమానాలకు క్షమాపణ చెప్పాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తాడు.

సోమవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ప్రభావతి ఆగడాలను సత్యం.. సుశీలమ్మకు పూస గుచ్చినట్టు చెబుతాడు. దీంతో సుశీలమ్మ షాక్ అవుతుంది. అయినా..ప్రభావతి గురించి తెలుసు ఇన్ని రోజులు భరించావ్ కాదా.. ఇకపై కూడా భరించాల్సిందే.. అయినా క్షమాపణలు చెప్పించడానికి ఇది సమయం కాదు.. అంటూ సుశీలమ్మ సర్థి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా ఒంటరిగా మిగిలిపోయేది నువ్వేరా.. వెళ్లి తనతో మాట్లాడరా. అని సుశీలమ్మ సూచిస్తుంది. కానీ, సత్యం మాత్రం మొండిపట్టుపడుతాడు. దీంతో సుశీలమ్మ ' ప్రభావతి గురించి తెలుసు కదా.. నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే వెళ్లి ప్రభావతి మాట్లాడు..' అంటుంది.
తర్వాత సుశీలమ్మ కిందికి వచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి పంచాయతీ పెడుతుంది. 'నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి.. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా.. దానిని అందరితో మాట్లాడి పరిష్కరించాలి. కానీ, మనోడికి వాడు తప్పు చేస్తే.. వాడిని వెనకేసుకొని రావడం ఏమైనా బాగుందా? అని సూచిస్తుంది సుశీలమ్మ. కానీ ప్రభావతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. దీంతో సుశీలమ్మ 'నిన్నే అడిగేది' అంటూ నిలదీస్తుంది. 'ముఖ్యంగా ఇంట్లో మంచైనా చెడైనా.. నీ భర్తతో చర్చించి నిర్ణయాలు తీసుకో.. అంటూ హెచ్చరిస్తుంది.
దీంతో ప్రభావతి 'నేను కావాలని చేయలేదు. మనోజ్ గాడు మోసపోయి .. రోహిణి దూరమవుతుందని భయంతో నగలు ఇచ్చారు. కానీ, వాడు ఆ నగలను అమ్మేసి నాకు చెప్పలేదు'అంటూ తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుంది. అత్తకు సపోర్టుగా రోహిణి 'ఇందులో తప్పు మొత్తం మనోజ్ దే' అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో సుశీలమ్మకు మరింత కోపం వస్తుంది. 'మోసాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచాలని ప్రయత్నం చేశారు తప్ప.. సమస్యలు పరిష్కరించలేదు కదా. సరే జరిగింది.. ఏదో జరిగింది.. సత్యం, ప్రభావతి మీరిద్దరూ మాట్లాడుకోండి. అనవసరంగా గొడవలు వద్దు'అని సుశీలమ్మ సూచించింది.
దీంతో సత్యంతో తన ఆవేదనను చెబుతూ.. 'నాకు కోపం ఎక్కడ వచ్చిందంటే? నగలు విషయం తెలుసు. అయినా తెలియకుండా..ఆ నిందను నీపై, మీనాపై వేయడం నాకు నచ్చలేదు. అందుకు మీ ఇద్దరికీ ప్రభావతి క్షమాపణ చెప్పాలి అంటూ సత్యం డిమాండ్ చేస్తాడు. దీంతో ప్రభావతి 'మీరు మా అత్తయ్య, కాబట్టి..మీకు క్షమాపణ చెబుతారు. కానీ, మీనాకు క్షమాపణ చెప్పలేను. కానీ, సత్యం మాత్రం ప్రభావతి క్షమాపణ చెబితేనే ఇంట్లో ఉండాలి' అంటూ మరోసారి తన డిమాండ్ చెప్తారు. దీంతో సుశీలమ్మ..'కోడల ముందు కొడుకుల ముందు నా కోడలు విలువ తగ్గిస్తానని, ఎలా అనుకున్నావు? ఇక్కడ మీనా క్షమాపణ కోరలేదు. పంతాలు పట్టింపులకు ఇది సమయం కాదు. సంసారంలో సర్దుకుపోవాలి చెప్పడానికి నేను వచ్చాను' అంటూ క్లారిటీ ఇస్తుంది.
దీంతో బాలు మీరు ఇలా అయితే మాట్లాడుకోరు. అంటు గదిలో పంపిస్తాడు. కానీ, అక్కడ కూడా వారు మాట్లాడుకోరు. దీంతో సుశీలమ్మ ' సరేరా పొరపాటులు అందరూ చేస్తారు. తరువాత మనోజ్ దగ్గరకు పిలిచి, చెంప పగలకొడుతుంది. 'ఏ ప్రభ.. నీ పెంపకం తప్పు.. నీ వల్లనే మనోజ్ చెడిపోయాడు.ఒక కొడుకుని ఒకలాగా.. ఇంకో కొడుకుని ఇంకొకలాగా పెంచి.
నీ కాపురానికి నువ్వే చిచ్చు పెట్టుకున్నావు. ఈరోజు ఇంతమంది ముందు నువ్వు దోషుల నిలబడ్డావు. సరే నీ వైపు తప్పులున్నాయి కాబట్టి' సత్యంకు క్షమపణ చెబుమంటుంది. దీంతో ప్రభావతి 'నేను వాడి మీద ప్రేమతో చేశాను తప్ప నాకు. ఎవరిని మోసం చేయాలని ఉద్దేశం లేదు' అంటూ ప్రభావతి ముసలి కన్నీరు కారుస్తుంది.
దీంతో సరే సరే క్షమించాను లే.. అంటూ సత్యం ప్రభావతిని క్షమిస్తాడు. 'ఇంట్లో చాలా సమస్యలకు నువ్వే కారణం. ఇకనుండి అయినా బుద్ధిగా ఉంటూ' అంటూ మనోజ్ కు సుశీలమ్మ వార్నింగ్ ఇస్తుంది. వాడికి బాధ్యతలు తెలిసి రావాలంటే.. మా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి అంటూ బాలు కొత్త ఫిటింగ్ పెడతాడు. 'ఏంట్రా వాడు అంత డబ్బులు ఒకసారి ఇలా తీరుస్తాడు' అని సుశీల అడగగా.. 'ఒక్కసారి కాదు వాయిదాల పద్దతిలో నెలకు 50 వేలు ఇస్తే సరిపోతుంది అంటాడు. అయితే.. ఆ నిర్ణయాన్ని రోహిణి తిరస్కరిస్తుంది. ప్రభావతి కూడా మనోజ్ పై ఒత్తిడి తీసుకువస్తుంది. నెల నెల 50 వేల రూపాయలు ఇస్తారని ఒప్పుకో.. అంటుంది.
దీంతో మనోజ్ మొదట ఒప్పుకోకపోయినా.. అందరూ తిట్టే సరికి తప్పని పరిస్థితుల్లో నెల నెల 50 వేల రూపాయలు ఇస్తాననీ ఒప్పుకుంటాడు. దీంతో సుశీలమ్మ.. తన కోడలు ప్రభావతి కూడా భారం ఉండేలా..'వాడు నెల నెల 50 వేల రూపాయలు ఇచ్చే విధంగా.. నువ్వే బాధ్యత తీసుకోవాలి' అంటూ కొత్త పిట్టింగ్ పెడుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక సరే అంటుంది ప్రభావతి. ఇక మనోజ్ రోహిణీలు రూమ్ లోకి వెళ్తారు. 'ముగ్గురు కోడళ్ళు చేయలేని పని ఆ అమ్మమ్మ గారు చేశారు. అత్తయ్యని మావయ్యని కలిపారు' అంటు రోహిణి.
నెలనెల 50 వేలు.. ఎలా కట్టాలని మనోజ్ ప్రశ్నించగా.. 'నిద్రపోకుండా షాప్ ని రన్ చేయి, డెవలప్ చేసి లాభాలు తెచ్చిపెట్టి నిన్ను నువ్వు ప్రూ చేసుకో.. లేదంటే నిన్ను బాలు అమ్మేస్తాడు ' అని సూచిస్తుంది. 'వాళ్లు అనడం ఏమో గాని.. వాళ్ళను అడ్డం పెట్టుకొని.. నువ్వు తిట్టడం మాత్రం బాగోలేదు' అంటూ మనోజ్ ఫీల్ అవుతాడు. ఇంతతో ప్రభావతి రూంలోకి వస్తుంది. 'అందరినీ పక్కనపెట్టి నీ మీద ప్రేమ చూపిస్తే..అందరి ముందు దోషిలా నిలబెట్టావ్ ' అని ప్రభావతి బాధపడుతుంది. ఆ తరవాత రోహిణి తో మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించేది నువ్వు.. మీ నాన్నను అడిగి డబ్బులు సమకూర్చు ' అంటుంది ప్రభావతి.
దీంతో మనోజ్ ఆయన జైల్లో ఉన్నాడు కదా.. ఇప్పుడు ఎలా సహాయం చేస్తాడంటూ మాట జారితాడు. 'మీరు షాప్ పెట్టడానికి మీ మామయ్య సహాయం చేయలేదా.. ఈ సమస్య తీరడానికి కూడా ఆయన ఏదో ఒక దారి చూపుతాడు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి' అంటుంది. 'ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో సరిగా ఉండు.. నిన్ను కన్నందుకు నాకు.. నిన్ను చేసుకున్నందుకు రోహిణికి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏం జన్మ రా నీది అంటూ చి కొడుతుంది. దీంతో మనోజ్ ఒక్కసారిగా.. 'నిన్ను ఏమనాలి.. నేను సంపాదించి పెడితే.. తిని కూర్చుంటున్నావ్ గా..' అంటూ మాట చేరుతాడు. దీంతో ప్రభావతి మనసు ముక్కలవుతుంది.


Click it and Unblock the Notifications











