Gunde Ninda Gudi Gantalu December 16th Episode: ప్రభావతి మనసు ముక్కలు.. సుశీలమ్మ ప్లాన్.. మరో గండంలో మనోజ్‌..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ ఎపిసోడ్‌లో కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతలు, బాధ్యతల అంశాలు తీవ్రంగా బయటపడతాయి. ప్రభావతి ఆగడాలను సత్యం సుశీలమ్మకు వివరించడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినా, ఇప్పుడే క్షమాపణల కోసం పట్టుబట్టడం సరైంది కాదని, చివరికి ఒంటరిగా మిగిలిపోయేది సత్యమేనని సూచిస్తూ ప్రభావతితో మాట్లాడమని చెబుతుంది. సత్యం మొండిపట్టు వీడకపోవడంతో సుశీలమ్మ కుటుంబ సభ్యులందరితో పంచాయతీ పెడుతుంది. ఇంటి ఇల్లాలిగా ప్రభావతి బాధ్యతగా వ్యవహరించాల్సిందని, సమస్యలను దాచకుండా భర్తతో కలిసి పరిష్కరించాలని గట్టిగా హెచ్చరిస్తుంది.

నగల విషయంలో తాను కావాలని చేయలేదని, మనోజ్ భయంతో ఆ తప్పు జరిగిందని ప్రభావతి వివరణ ఇస్తుంది. కానీ మోసాన్ని దాచిన తీరు సుశీలమ్మకు కోపం తెప్పిస్తుంది. చివరకు సత్యం, ప్రభావతి మాట్లాడుకోవాలని సూచిస్తుంది. మీనాపై నింద వేసినందుకు క్షమాపణ కావాలని సత్యం డిమాండ్ చేస్తాడు. ఇక్కడ పంతాలకు చోటులేదని సుశీలమ్మ స్పష్టత ఇస్తుంది. ఆ తర్వాత మనోజ్‌ను గట్టిగా మందలించి, నెలకు 50 వేల చొప్పున డబ్బు తిరిగి చెల్లించే బాధ్యత అతనిపైనే కాకుండా ప్రభావతిపైన కూడా వేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనోజ్ ఒప్పుకుంటాడు. చివరికి ఈ గొడవలు ప్రభావతి మనసును ముక్కలు చేస్తాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 576 December 16th 2025 here is full story

మంగళవారం ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా కొనసాగింది. ఇంట్లో జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ నువ్వే కారణమని మనోజ్ ను ప్రభావతి నిలదీస్తుంది. దీంతో మనోజ్ ' నన్ను లాభం కోసమే కన్నావా? నేను పని చేసి పెడితే.. తీరా కూర్చోని తిందాం అనుకుంటున్నావా? అంటూ నోరు జారుతాడు. దీంతో ప్రభావతి మనసు ముక్కలవుతోంది. ' లాభం కోసమే నేను కన్నానా? లాభం కోసమే నిన్ను ప్రేమించానా..? లాభం కోసమే మిగతా వాళ్ల మిగతా వాళ్ళ నోట్లో మట్టి కొట్టానా? నీకోసం ఎన్ని ఎన్ని తప్పులు చేశాను రా అని భాదపడుతుంది

'నీ తప్పులను అన్ని క్షమిస్తూ.. నా కడుపులో దాచిపెట్టుకున్న.. ఒక ఆడపిల్లను కూడా ఒట్టి చేతులతో పంపించా నీకోసం.. బాలు గాడు ఎన్నిసార్లు నిన్ను నీ తప్పులను ఎత్తి చూపిన నీకే సపోర్టుగా నిలిచాను. రవి గాడు వాడి బతుకు వాడు చూసుకుంటున్నాడు. అందరినీ పక్కనపెట్టి.. నీకోసం ఇంత చేస్తే.. నీ సంపాదన తిని కూర్చోవడానికి అంటావా..? సుభాష్ రా.. నిన్ను కన్నందుకు నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నందుకు నాకు మంచి బిరుదు ఇచ్చావు.. ఏ స్థాయికి దిగజార్చవో.. నిజంగా దేవుడున్నాడు.. నాకు ఈ గది పెట్టాల్సిందే..' అంటూ తన బాధను వ్యక్తం చేస్తుంది ప్రభావతి.

ఆయన మనోజ్ మాత్రం.. కాస్త పశ్చాతాపం కూడా చూపెట్టకుండా.. నన్ను కన్న తర్వాత బాలు గాడిని తినకుండా ఉండాల్సిందే అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. దీంతో ప్రభావతి మరింత ఆవేదనకు లోనవుతుంది. బాలు గాడికి ఏం ఇచ్చాను రా.. పొద్దున లేస్తే గొడ్డు లాగా కష్టపడతాడు. వాడిపై సవతి ప్రేమ చూపించినట్లు ఇప్పటికి దూరం పెడుతున్నా కదా.. ఏ రోజైనా వాణ్ణి తల్లిగా చూశానా రా? నా ప్రేమ మొత్తం నీకే ధార పోసాను కదా..' ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అక్కడి తో ప్రభావతి ఆగకుండా ' ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావ్ రేపు మేం మంచాన పడితే.. కనీసం గంజి నీళ్లు అయినా పోస్తావా? అంటూ ప్రభావతి ప్రశ్నిస్తుంది.'ఇక ఏం చేస్తావో తెలియదు.. మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేయ్.. వాళ్ళు ఊరుకున్నా గాని నేను మాత్రం అస్సలు ఊరుకోను..' అంటు హెచ్చరించిస్తుంది. మనోజ్ మాటలు విన్న రోహిణి కూడా చీ కొట్టి వెళ్ళిపోతుంది. ఇక హాల్లోకి వచ్చి.. మీనాను పిలిచి టీ కావాలి అని ఆర్డర్ వేస్తుంది. ఇలా ఒక్కొక్కరు వచ్చి మీనా.. టిఫిన్ చేసావా ? కాఫీ పెట్టావా? అంటూ పనిమనిషిలా ఆర్డర్ వేశారు. ఈ విషయాన్ని గమనించిన సుశీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది

'ఒక్కతే కాఫీలు.. టిఫిన్లు.. చేసి పెట్టాలా.. ఇకనుండి ఎవరి భర్తకు వారే టిఫిన్లు చేసి పెట్టాలి. ప్రతి పనికి మీనాను పిలవడం మానేయండి. ఆడవారికి మగవారి టిఫిన్ చేస్తారు సరే.. ఆడవారికి టిఫిన్ ఎవరు ఇస్తారు అని బాలు ప్రశ్నించగా.. భార్యభార్తలు కలిసి ఎవరి టిఫిన్ వేసుకోమని, ఆర్డర్ వేస్తుంది సుశీలమ్మ. అలా మొదటగా సత్యం,ప్రభావతి కలిసి వంట గదిలో దోశలు వేయడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో ప్రభావతి, సత్యంతో మాట్లాడడానికి ప్రయత్నించగా.. మరోసారి మాట్లాడితే మూతికి వాత పెడతా అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రభావతి సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత మనోజ్, రోహిణి.. కూడా కింద మీద పడుతూ దోశలు వేసుకుంటారు. ఇక శృతి, రవిలు ఇద్దరు వంటగదిలోకి నానా తంటాలు పడుతారు. ఈ సమయంలో శృతికి దోశలు వేయడం రాకపోతే.. రవి దోశలు వేసిస్తాడు.

ఇక మీనా, బాలలు కూడా దోశలు వేసుకుంటారు. కానీ ఈ సమయంలో మీనాకు చురుకు అంటడంతో బాలు మీనాకు జాగ్రత్త చెప్తాడు. వారు ముచ్చట్లో పడి దోష మాడుతున్న విషయాన్ని మరిచిపోతారు. ఆ తర్వాత మళ్లీ వేరే దోశలు వేసుకొని వస్తారు. ఇలా.. ఎవరికి వారే సొంతంగా దోశలు వేసుకుని డైనింగ్ హాల్లోకి కూర్చొని తినడం ప్రారంభిస్తారు. ఇంతలో సుశీలమ్మ మరో కొత్త ఫిట్టింగ్ పెడుతుంది. మీరు వేసుకున్న దోశలు.. మీరు తినడం కాదు.. భర్తకుభార్య.. భార్యకు భర్త.. కలిసి తినిపించుకోవాలి అంటుంది.
ఇలా సత్యం ప్రభావతిని కలపడానికి సుశీలమ్మ ప్రయత్నిస్తుంది. కానీ, ఆ ప్రయత్నం మాత్రం సఫలం కాదు. దీంతో బాలుని పిలిచి వీరిని గుడికి తీసుకువెళ్ళు రా అని సలహా ఇస్తుంది. ఏది ఏమైనా సుశీలమ్మ ఐడియాతో ఇంటిల్లిపాది సంతోషంతో గడుపుతారు.

ఇక ఇంట్లో సమస్యలు కాస్త పరిష్కారం కావడంతో బాలు.. కొత్త కారు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయాన్ని మీనాకు చెప్పడంతో మీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీంతో బాలు కొత్త కారు కొనడానికి హుషారుగా వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మనోజ్ ఆఫీసులో బాధపడుతూ ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి సీల్డ్ కవర్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది తెరిచి చూసేసరికి అందులో ఓ లెటర్ ఉంటుంది. అందులో 'నీ చుట్టూ ఉన్న వారితో నీకు సమస్యలు వస్తాయి జాగ్రత్త' అంటూ ఓ హెచ్చరిక జారీ చేసినట్లు ఉంటుంది. దీంతో మనోజ్ మరింత కంగారు పడతాడు. ఇప్పటికే పీకల వరకు కష్టాలు ఉన్న తనకు ఈ లెటర్ ఏంటి అని అయోమయంలో పడతాడు. ఇంతలోనే రోహిణి కూడా అక్కడి చేరుకుంటుంది. ఆ లెటర్ చూసి రోహిణి కూడా కంగారుపడుతుంది. ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారు? అనే ఉత్కంఠతో సీరియల్ ముగుస్తుంది.

ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో బాలు తన కొత్త కారుని తీసుకొని ఇంటికి వస్తారు. అందులో తన తల్లిదండ్రులను ఎక్కించుకొని గుడికి తీసుకువెళ్తారు. అయితే, ఎడ మొఖం.. పెడముఖంగా కూర్చుంటారు. వారిద్దరిని కలపడానికి. కారును రాష్ గా నడుపుతూ వారిని కంగారు పడతారు. దీంతో ప్రభావతి సత్యం చేతి పట్టుకొని కూర్చుంటుంది. ఇలా తెలియకుండానే ఒకరినొకరు మాట్లాడించుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రభావతి స్టిక్కర్.. సత్యం షర్టు కనిపిస్తోంది. 'ఇంతకీ మీరు పార్కుకు వెళ్లారా? గుడికి వెళ్లారా? అని సుశీలమ్మ అడుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X