Gunde Ninda Gudi Gantalu December 17th Episode: మనోజ్ కు మరో సమస్య.. ఒక్కటైన సత్యం, ప్రభావతి.. బాలుకి అవమానం..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంట్లో జరుగుతున్న ప్రతి పరిణామాలన్నిటికి మనోజే కారణమంటూ ప్రభావతి అతడిని నిలదీస్తుంది. ఈ క్రమంలో మనోజ్ నోరు జార్చి, "నన్ను లాభం కోసమే కన్నావా?" అంటూ మాట్లాడటం ప్రభావతి మనసును ముక్కలుచేస్తుంది. తన కోసం చేసిన త్యాగాలు, కడుపులో దాచుకున్న బాధలు, ఒక ఆడపిల్లను ఒట్టి చేతులతో పంపించిన సంఘటనలన్నీ గుర్తుచేస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయినా మనోజ్‌లో ఎలాంటి పశ్చాతాపం కనిపించకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.
ఇక హాల్‌లో మీనాను పనిమనిషిలా ఆర్డర్ చేయడాన్ని గమనించిన సుశీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇకపై ప్రతి దంపతులు తమ టిఫిన్ తామే చేసుకోవాలంటూ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఇంటిల్లిపాది వంటగదిలోకి దిగుతుంది. సత్యం-ప్రభావతి మధ్య ఉద్రిక్తత, మనోజ్-రోహిణి తడబాటు, శృతి-రవి సరదా క్షణాలు అన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. చివరికి భర్తభార్యలు ఒకరికి ఒకరు తినిపించుకోవాలన్న సుశీలమ్మ ఐడియాతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక సమస్యలు కొంత తగ్గడంతో బాలు కొత్త కారు కొనాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఎపిసోడ్ చివర్లో మనోజ్‌కు వచ్చిన సీల్డ్ లెటర్ కొత్త ఉత్కంఠను రేపుతుంది. "నీ చుట్టూ ఉన్నవారితో సమస్యలు వస్తాయి" అనే హెచ్చరిక ఆసక్తికరంగా మారింది. ఇక బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బుధవారం ఎపిసోడ్ లో మనోజ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి లెటర్ రాయడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఆ లెటర్ వల్ల మనోజు భయపడటం, రోహిణి ఆందోళనకు లోనవుతుంది. అయితే ఆ లెటర్ ఎవరు రాశారు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలో మనోజ్ ఇప్పటికే తనకు పీకల వరకు కష్టాలు ఉన్నాయని, ఇప్పుడు ఈ లెటర్ రూపంలో మరిన్ని కష్టాలు వస్తాయా? అని బాధపడతాడు. ఇక రోహిణి ఆ లెటర్ ఎవరు పంపించారని, తెగ బాధపడుతుంది. ఈ క్రమంలో మొదట తన బాయ్ ఫ్రెండ్ దినేష్ పై సందేహపడుతుంది. కానీ, దినేష్ జైల్ లో ఉన్నాడు. అతడు పంపించే అవకాశం లేదు లేదా ఇంకెవరైనా వ్యక్తి పంపారా? అనేది సందేహాత్మకంగా మారింది.
ఇదిలా ఉంటే బాలు.. తన కొత్త కార్లు తీసుకొని ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో మీనాను ఆటపట్టించాలని భావిస్తాడు. తాను తన రెండో పెళ్ళాంతో వచ్చానంటూ మీనాకు కాల్ చేస్తాడు. కానీ, మీనా మాత్రం బాలు తనని ఆటపట్టిస్తున్నాడని అర్థం చేసుకొని, మీకు, మీ రెండో పెళ్ళానికి హారతి ఇవ్వడానికి వస్తున్నట్టు చెబుతోంది. వచ్చేటప్పుడు అత్తమామల్ని కూడా తీసుకొస్తా ఘనంగా స్వాగతం చెప్తా అంటూ బాలుకి రివర్స్ పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఇంట్లో వారికి అదే స్టైల్ లో చెప్పడంతో మొదట కంగారుపడతారు.'బాలు మీనాకు అన్యాయం చేశాడా?' అంటూ షాక్ అవుతారు.
వెంటనే మీనా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. బాలు రెండో కారు కొనుక్కొని వచ్చారు. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, బాలు కొత్త కారును తీసుకవచ్చారనీ, వివరంగా చెప్పడంతో సంతోషపడతారు. ఈ క్రమంలో ప్రభావతి కాస్త నోటి దూల తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ, సుశీలమ్మ ఉండడంతో వెనక్కి తగ్గుతుంది. మీనా.. బాలు కొత్త కారుకు పూజ చేసే, హారతిస్తుంది. ఈ క్రమంలో సుశీలమ్మ కారు తాళాలను మీనా చేతితో ఇప్పిస్తుంది. దీంతో ప్రభావతి కాస్త అసూయపడుతుంది. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న సుశీలమ్మ.. అమ్మ, నాన్న గుడికి తీసుకు వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది.
అయితే.. వారిద్దరి మాత్రమే తీసుకవెళ్లడానికి మరో కారణం కూడా ఉంది. అలాగేనా వారు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారని సుశీలమ్మ భావిస్తుంది. ఆ విషయాన్ని మీనా ఇన్ డైరెక్టుగా బాలుకి చెబుతోంది. దీంతో బాలు అర్థం చేసుకొని, తన ప్లాను ఇంప్లిమెంట్ చేస్తాడు. రోడ్డు బాగున్న.. ర్యాష్ గా కార్ డ్రైవ్ చేస్తూ.. ఒకరి మీద ఒకరు పడేలా చేస్తాడు. ఏంట్రా నీలా నడుపుతున్నావని తన తండ్రి ప్రశ్నించగా, రోడ్డంతా ఇరుగ్గా.. గుంతలుగా ఉందంటూ అబద్ధం చెప్తాడు. ఈ క్రమంలో సత్యం.. ప్రభావతి పడుతున్న ఇబ్బందులు గమనించి, తన చేతిని పట్టుకొమ్మని చెప్తాడు. దీంతో ప్రభావతి, సత్యంను పట్టుకుని కూర్చుంటుంది.
ఇలా బాలు తన తల్లిదండ్రులను తన రష్ డ్రైవింగ్ తో ఒకటి చేస్తాడు. మొత్తానికి ప్రభావతి, సత్యం కథ సుఖాంతంగా మారుతుంది. ఇక మరోవైపు.. శృతి బామ్మతో కలిసి ముచ్చటిస్తుంది. ఈ సమయంలో బామ్మ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను చూపిస్తూ బాలు ఆరోజు ఎవరు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని, రియల్ గా బాలు గ్రేట్ అని శృతి అంటుంది. సుశీలమ్మ కూడా వాడు మాత్రమే తన మనసులో అర్థం చేసుకున్నాడని అంటుంది. ఈ క్రమంలో సుశీలమ్మ ప్రైస్ గిఫ్టుగా.. శృతికి రవి చిన్ననాటి ఫోటోలు చూపిస్తుంది. ఆ ఫోటోలో రవి సిగ్గుబిళ్ళతో ఉండడం చూసి ఆశ్చర్యపోతోంది.
ఆ ఫోటోతో రవిని ఆటపట్టిస్తుంది. ఇలా రవి, శృతి కాస్త రొమాంటిక్ మోడ్ లో ఉంటారు. ఇంతలోనే బాలు, మీనా ఇంటికి చేరుకుంటారు. అయితే.. ఎవరు ఊహించని విధంగా సత్యం ప్రభావతి నవ్వుతూ ఇంట్లోకి వస్తారు. కారు ఎక్కేంతవరకు ఎడ మొకం పెడముఖంగా ఉన్నవారు.. చిలకా గోరింకల్లా మారడం చూసి షాక్ అవుతారు. సుశీలమ్మ కూడా త్వరగానే మారారని ఆశ్చర్య పోతుంది. ఈ సమయంలో మీనా తన మామయ్య మెడకు స్టిక్కర్ అంటుకోవడం గమనిస్తుంది. ఆ విషయాన్ని అందరి ముందు చెబుతుంది.
దీంతో ప్రభావతి సిగ్గు పడుతుంది. ఒసేయ్ అందరి ముందు ఈ విషయం చెప్పాలా? నా సిగ్గు తీసావ్ కదా.. బాలు గాడు డ్రైవింగ్ సరిగ్గా చేయకపోయేసరికి.. మా ఆయనకు మీద పడ్డ.. ఆ సమయంలో అలా అంటూ సిగ్గుపడుతుంది. దీంతో బాలు.. మా ఆవిడ కూడా అదే కారులో ఉంది కదా.. నా మీద ఎందుకు పడలేదు అంటూ అని ప్రశ్నించగా.. ప్రభావతి సిగ్గుతో తలదించుకుంటుంది. ఈ క్రమంలో సత్యం స్టిక్కర్ తీసి.. ప్రభావతి చేతికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ, సుశీలమ్మ మాత్రం.. స్టిక్కర్ ను సత్యంను పెట్టమంటుంది. ఇలా మొత్తానికి మనోజ్ తో విడిపోయిన సత్యం, ప్రభావతి బాలు వల్ల కలిసి పోతారు.
అప్ కమింగ్ ఎపిసోడ్లో.. బాలు చెల్లెలి మౌనిక, తన భర్త సంజీవ్ తో కలిసి ఓ పార్టీకి వెళ్తుంది. అదే పార్టీకి.. కస్టమర్ తీసుకువెళ్లినా బాలు. తన చెల్లెలు చూసి సంతోషపడతాడు. మౌనికతో మాట్లాడాలని దగ్గరికి వెళ్తాడు. అయితే, ఈ విషయాన్ని సంజు దూరంగా గమనిస్తాడు. ఆ విషయాన్ని మౌనిక కూడా గమనించి.. తన అన్నయ్యతో మాట్లాడితే.. సంజు కోప్పడతాడని, బాలును దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ, బాలయ్య విషయాలన్నీ అర్థం కాక.. మౌనిక తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే.. అది విఐపి పార్టీ కావడంతో సెక్యూరిటీ వచ్చి.. ఏం జరుగుతుంది అని అడుగుతారు. తాను తన చెల్లితో మాట్లాడుతున్నానని చెప్పగా.. మౌనిక మాత్రం వారెవరో తనకు తెలియదని, ఇక్కడినుండి వెళ్లగొట్టండి అంటూ చెబుతుంది. దీంతో బాలుని బాడీగార్డ్స్ పార్టీ నుండి నెట్టి వేస్తారు. దీంతో బాలు మనసు ముక్కలవుతుంది.


Click it and Unblock the Notifications











