Gunde Ninda Gudi Gantalu December 18th Episode: బాలును గెంటేయించిన మౌనిక.. శృతి సంచలన నిర్ణయం..రవి ఆందోళన..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, రొమాన్స్ కలగలపి సాగింది. మనోజ్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి లెటర్ రావడం కథను కొత్త మలుపు తిప్పింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న మనోజ్‌కి ఈ లెటర్ మరింత భయాన్ని కలిగిస్తుంది. రోహిణి కూడా ఆందోళనకు లోనవుతుంది. మొదట తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్‌పై అనుమానం వచ్చినా, అతడు జైల్లో ఉండడంతో ఈ లెటర్ ఎవరు రాశారు అన్నది మిస్టరీగానే మిగులుతుంది.

ఇక మరోవైపు బాలు కొత్త కారు తీసుకొచ్చి మీనాను ఆటపట్టించే ప్రయత్నం చేస్తాడు. రెండో పెళ్లాంతో వచ్చానని చెప్పి భయపెట్టాలనుకున్నా, మీనా తెలివిగా రివర్స్ ఇస్తుంది. నిజం తెలిసిన తర్వాత ఇంట్లో ఆనందం నెలకొంటుంది. కారు పూజ సమయంలో సుశీలమ్మ మీనాకే తాళాలు ఇవ్వడంతో ప్రభావతి అసూయపడుతుంది. అయితే సుశీలమ్మ ప్లాన్ ప్రకారం బాలు తన తల్లిదండ్రులను కారులో తీసుకెళ్లి రష్ డ్రైవింగ్ చేసి, ప్రభావతి, సత్యంల మధ్య దూరం తగ్గుతూ క్రమంలో వారి మాటలు కలుస్తాయి. చివరికి వారు నవ్వుతూ ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రవి,శృతి మధ్య రొమాంటిక్ సీన్స్ ఎపిసోడ్‌కు క్యూట్ టచ్ ఇచ్చాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 578 December 18th 2025 here is full story

గురువారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా కొనసాగింది. తొలుత ప్రభావతి, సత్యం గొడవ క్లియర్ అయింది. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఈ సమయంలో సత్యం మెడకు అంటుకున్న బొట్టు బిల్లను చూసి.. 'మామయ్య మీ మెడకు ఏదో ఎర్రగా ఉంది.. చూశారా?' అని మీనా అనగా సత్యం తడుముకుంటాడు. ఆ విషయాన్ని ప్రభావతి గమనించి సిగ్గుపడుతుంది. అది తన బొట్టు బిల్లా.. దీంతో ప్రభావతి.. నా పరువు తీస్తావా ఏంటి ఝ అంటూ మీనాపై అరుస్తుంది. సుశీలమ్మ 'పార్క్ వెళ్లారా? గుడికి వెళ్లారా? అంటూ ప్రశ్నించడం కూడా హైలెట్ గా మారింది. తర్వాత ఆ స్టిక్కర్లు తీసి ప్రభావతికి పెట్టమంటుంది. 'సంసారం అన్నాక గొడవలు సహజం. ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకొని కాపురం కొనసాగించాలి. మరోసారి ఇలాంటి గొడవలు రాకుండా చూసుకోండి అని సూచిస్తుంది. మీరిద్దరూ మీ తప్పులు క్షమించుకొని కలిసిపోయారు. అది నాకు చాలా సంతోషం ఇక నేను వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్తా'అంటూ సుశీలమ్మ బయలుదేరుతుంది.

ఇదిలా ఉంటే సంజు ఓ పార్టీకి బయలుదేరుతాడు. ఈ సమయంలో తన తల్లి అడ్డుకొని.. 'నువ్వు వెళ్ళేది బ్యాచిలర్ పార్టీ కాదు.. ఫ్యామిలీ పార్టీ మౌనికను తీసుకువెళ్ళు 'అని సూచిస్తుంది. దీంతో సంజు.. 'దానికి ఇంట్లో చోటు ఇవ్వడమే ఎక్కువ.. పార్టీలు పబ్బులు అవసరమా..? దాన్ని వేసుకొని తిరగాలా ? అని ఎగతాళిగా మాట్లాడుతాడు. కానీ సంజీవ్ తల్లి మాత్రం..'మౌనికను ఇంట్లోనే బంధిస్తున్నావు.. కనీసం తన పుట్టింటి వారితో కూడా కలవనియడం లేదు. మన దగ్గర వారి పార్టీలకు కూడా తీసుకువెళ్లకపోతే.. మన మర్యాద పోతుంది' అని కన్విన్స్ చేస్తుంది. దీంతో సంజు తనకిష్టం లేకుండా మౌనికలో తీసుకువెళ్తాడు. పార్టీకి వెళ్లే ముందు.. తనతో అనవసరంగా మాట్లాడొద్దని, రిచ్ గా రాయల్ గా బిహేవ్ చేయాలని కొన్ని పద్ధతులు చెప్తాడు.

ఇక వారు వెళ్ళి పార్టీకి బాలు కూడా వస్తాడు. అక్కడ తన చెల్లిని చూసి సంబరపడతాడు. ఎలాగైనా మాట్లాడాలని లోపల వెళ్లాలని ప్రయత్నించగా.. అక్కడ మొదట వాచ్ మెన్ అడ్డుకొని.. 'ఇది గొప్పింటి వారి పార్టీ.. నీలాంటి వాళ్ళు రావద్దు.. ఇకనుండి వెళ్ళిపో 'అని అడ్డుకుంటాడు. దీంతో బాలు తన చెల్లెల్ని ఫోటో చూపించి.. లోపలికి వెళ్ళిపోతాడు. అయితే.. మౌనిక తన కారు దగ్గర తన పర్స్ పడే వేసుకోవడం బాలు గమనిస్తాడు. ఆ పర్సనల్ తీసుకొని తన చెల్లికి ఇవ్వడానికి వెళ్తాడు. ఈ క్రమంలో సంజు బాలుని గమనించి వీడు ఎందుకు వచ్చాడని ఆవేశంతో ఊగిపోతాడు. అయితే.. మౌనిక బాలు తో మాట్లాడుతుందా? లేదా? అనే విషయాన్నితెలుసుకోవానికి దొంగ చాటుగా అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు.

ఈ విషయాన్ని మౌనిక కూడా గమనిస్తూ ఉంటుంది. తన అన్నయ్యతో మాట్లాడాలని ఆరాటపడుతుంది. కానీ, సంజీవ్ కు ఇచ్చిన మాట ప్రకారం బాధతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతోంది. అయితే బాలుకి ఈ విషయాలు ఏమీ తెలియక.. తన చెల్లితో మాట్లాడాలని భావిస్తాడు. అంతకు ముందు.. గుడిలో జరిగిన సంఘటన వల్ల తనతో మౌనిక మాట్లాడడం లేదని, బాలు భావించి క్షమాపణ కూడా చెబుతాడు. అయినా మౌనిక మాత్రం నోరు విప్పదు. బాలు తన చెల్లి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతాడు. క్షమాపణ చెబుతాడు. కానీ మౌనిక తన బాధను దిగ మింగుతుంది.

అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్.. మౌనికని బాలు ఇబ్బంది పెట్టడం చూసి.. ఎవరు ఈ పార్టీకి నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారు? అని నిలదీస్తాడు. దీంతో బాలు..' ఆమె నా చెల్లెలు.. ఆమెతో మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను' అని చెబుతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ వెంటనే 'మేడం ఇతను మీ అన్నయ్యనా ?'అని ప్రశ్నించగా.. 'లేదు.. అతడు ఎవరో నాకు తెలియదు' అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలతో బాలు గుండె ముక్కలవుతుంది. తన సొంత చెల్లినే.. అలా మాట్లాడడం చూసి ఎమోషనల్ అవుతాడు.

ఇదిలా ఉంటే బాడీగార్డ్ బాలుని మెడలు పట్టుకొని గెంటివేయడం మరింత బాధాకరంగా మారుతుంది. మౌనిక కూడా ఆ విషయాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అవుతుంది. ఈ విషయాన్ని అంతా సంజు చాటుగా ఉంది గమనిస్తాడు. 'ఇప్పుడు తన ఈగో చల్లారింది, ఇకనుండి బాలుకి ప్రతిసారి అవమానాలు జరుగుతాయి. ఇది మొదలు' అంటూ సవాల్ చేస్తాడు.

ఇదిలా ఉంటే మరోవైపు శృతి రవి ల మధ్య పిల్లల గురించి డిస్కషన్ జరుగుతుంది. మొదట రవి.. శృతి దగ్గరికి వచ్చి బ్యాక్ నుండి హాగ్ చేసుకుంటాడు. కానీ శృతి మాత్రం ఆవేశంతో రవిపై చేయి చేసుకుంటుంది. దీంతో రవి కాస్త కంగారు పడతాడు..'ఏంటి అలా కొట్టావు అంటే.. నువ్వు ఇలా చేస్తే నిన్ను దగ్గర కూడా రానివ్వను'అంటూ వింతగా మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతుందో రవికి అర్థం కాదు.. దీంతో 'అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? అని వివరంగా అడిగే ప్రయత్నం చేస్తాడు. దీంతో శృతి.. తనకు పిల్లల్ని కనాలని కోరిక లేదని, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే నొప్పులను తాను భరించలేనని తన వల్ల కాదని తాను పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకున్న అంటూ తన డిసిషన్ ను రవికి చెబుతుంది.

దీంతో రవి షాక్ అవుతాడు. 'అమ్మతనం అనేది చాలా గొప్పది.. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్.. నీకు పిల్లలు వద్దా ' అని ప్రశ్నించగా.. 'పిల్లలు కావాలి.. కానీ, నేను పిల్లలను కనను. సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని పిల్లల్ని కందాం.. 'అంటూ తన ఆలోచనలు బయటపెడుతుంది. ఈ నిర్ణయానికి ఇంట్లో వారు ఎవరు ఒప్పుకోరని ముఖ్యంగా తన తల్లి ప్రభావతి అస్సలు ఒప్పుకోదని రవి తెగేసి చెప్తాడు. 'ఎవరు నిర్ణయంతో నాకు అవసరం లేదు.. నేను మాత్రం గర్భం దాల్చాలేను, పిల్లలు కావాలంటే సరోగసి ప్లాన్ చేసుకుందాం'చెబుతోంది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వడంతో రవి కంగారు పడతాడు. పైగా ఎక్కువ మాట్లాడితే దగ్గర కూడా రానని చెప్పడంతో బాధపడతాడు రవి.

ఇక మరోవైపు బాలు.. ఆలస్యంగా ఇంటికి చేరుకుంటాడు. పార్టీలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. బాలుని చూసి మీనా దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో బాలు పార్టీలో జరిగిన విషయాన్ని మీనాకు చెబుతాడు. తన చెల్లె చేతల వల్ల బాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తాడు. మీనా కూడా మౌనిక అలా ఎందుకు చేసిందని ఆలోచనలో పడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X