Gunde Ninda Gudi Gantalu December 19th Episode: 200 కార్లు.. బాలు కోసం మీనా శపథం.. ప్రమాదంలో మనోజ్..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒకవైపు సత్యం, ప్రభావతి కలయిక, మరోవైపు అన్నా-చెల్లెల్ల మధ్య తెగిన అనుబంధం, ఇలా ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. తొలుత సత్యం మధ్య అపార్థాలు తొలగి వారు మళ్లీ కలవడం ఎపిసోడ్‌కు హైలెట్ మారింది. సుశీలమ్మ మధ్యవర్తిత్వంతో సంసారం అంటే సర్దుబాటే అన్న సందేశం బలంగా నిలిచింది. బొట్టు బిల్లా సీన్ కాస్త హాస్యంతో పాటు వారి దగ్గరతనాన్ని సూచించింది. ఆ తర్వాత మౌనిక-బాలు ట్రాక్ పూర్తిగా ఎమోషనల్‌గా మారింది.

పార్టీ సీన్‌లో బాలు తన చెల్లితో మాట్లాడేందుకు తపనపడటం, మౌనిక పరిస్థితుల వల్ల అతడిని తిరస్కరించాల్సి రావడం గుండెను పిండేసేలా చూపించారు. "అతడు ఎవరో నాకు తెలియదు" అన్న మౌనిక మాటలు బాలు గుండెను ముక్కలు చేశాయి. సంజు ఈగో, ప్రతీకార భావన ఈ ట్రాక్‌ను మరింత హైలెట్ గా మారింది. అతని సవాలు రాబోయే రోజుల్లో మరింత సంఘర్షణకు సంకేతంగా మారాయి. ఇక శృతి-రవి ట్రాక్‌లో పిల్లల అంశంపై వచ్చిన చర్చ సీరియల్‌కు కొత్త మలుపు ఇచ్చింది. శృతి తీసుకున్న నిర్ణయం రవిని షాక్‌కు గురి చేయగా, వారి మధ్య గ్యాప్ పెరిగినట్లు చూపించారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ భావోద్వేగాలు, సంఘర్షణలు, రాబోయే డ్రామాను బలంగా ముందుకు నడిపించింది. ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 579 December 19th 2025 here is full story
Courtesy: Jio hotstar

శుక్రవారం ఎపిసోడ్ లో బాలు.. తన చెల్లెలు తనను తక్కువ చేసి మాట్లాడటం గురించి ఆలోచిస్తూ బాధపడతారు. ఈ సమయంలో మీనా బాలుకి ధైర్యం చెబుతూ..'మీ చెల్లి ఎప్పుడు మీకు దూరం కాదు.. అందరికంటే మీకే చాలా దగ్గరగా ఉంటుంది. అనవసరంగా మీరు ఎక్కువ ఆలోచించి బాధపడకండి. సంజు ఎక్కడినుండైన చూస్తూ ఉండే ఉండవచ్చు. అందుకే మీతో అలా మాట్లాడి ఉండుంటుంది. నీతో మాట్లాడితే ఏమైనా గొడవ జరుగుతుంది' అనే ఉద్దేశంతో అలా వ్యవహరించి ఉండొచ్చు' అంటూ బాలుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీనా కూడా మౌనిక గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతుంది. ఎందుకు మౌనిక అలా మాట్లాడింది? అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక మరోవైపు.. సంజూ 'చాలా హ్యాపీగా అనిపించింది. చెల్లెలు ముందు ఉన్న మాట్లాడలేక.. పరాయి దానిలా చూస్తూ ఉంటే.. చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఉంటే బాలు కుమిలి కుమిలి.. పోతుంటే అది కదా కావాల్సింది. ఇలాగే నన్ను సంతోష పెడుతూ.. ఈ ఇంట్లో ఏదో ఒక మూలన హ్యాపీగా పడుండు' అంటూ మౌనికతో హీనంగా మాట్లాడుతుంటాడు. ఇంతలోనే మీనా మౌనికకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని సంజూ గమనించి, ఫోన్ కట్ చేయమని చెప్తాడు. సంజు చెప్పినట్లుగానే మౌనిక ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. దీంతో మీనా కూడా కంగారు పడుతోంది. సంజు, మౌనికలకు ఏమైనా గొడవ జరిగిందా? అని బాధపడుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. మనోజ్ అజ్ఞాతవాసి రాసిన ఆ లెటర్ గుర్తుకు వస్తుంది. నిద్ర పట్టక ఆ లెటర్ పట్టుకొని కూర్చోండి పోతాడు. ఈ సమయంలో తన తల్లి ప్రభావతికి ఫోన్ చేసి గార్డెన్లోకి రమ్మని పిలుస్తాడు. 'మళ్లీ ఏం సమస్య తీసుకొచ్చావ్?' అని ప్రభావతి ప్రశ్నించగా..ఫస్ట్ గార్డెన్ లోకి రమ్మని తన తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు మనోజ్. 'మళ్లీ ఏం పెంట తీసుకొచ్చాడు. ఈ సమస్య వచ్చి పడిందో?' అని ఆందోళనతో ప్రభావతి గార్డెన్ లోకి వెళ్తుంది. అక్కడ మనోజ్ తన తల్లికి ఆ లెటర్ చూయించి, అసలు విషయాన్ని చెబుతాడు. ప్రభావతి మాత్రం ఆ లెటర్ ను లైట్ గా తీసుకుంటుంది. 'నీవల్ల ఇంట్లో వారందరికీ సమస్యలు వస్తాయి.. కానీ, నీకు సమస్య తెచ్చేవారు ఎవరున్నారు?' అంటూ రివర్స్ ప్రశ్నిస్తుంది.

దీంతో ఇన్ డైరెక్ట్ గా తన తల్లిని అనుమానిస్తాడు మనోజ్. దీంతో ప్రభావతి.. మనోజ్‌ను చితకబాదుతోంది. 'నీ ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తా.. నువ్వే నన్ను ఎంత మాట అంటావా..? అనినిలదీస్తుంది. 'ఈ విషయం నీ భార్యతో అని ఉండి ఉంటే.. మెడలో ఉన్న తాళి తీసి, నీ మొఖాన కొట్టి వెళ్లిపోయేది. పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా సైలెంట్ గా వెళ్లి పడుకో.. అనవసరంగా ఆలోచించకు' అని ప్రభావతి సూచిస్తుంది.

ఇక మరుసటి రోజు ఉదయం.. బాలు తన ఫ్రెండ్ రాజేష్ ను ఇంటికి పిలుస్తాడు. తన రెండో కారును తన తండ్రి సత్యం చేత కిరాయికి ఇప్పిస్తాడు. దీంతో రాజేష్.. 'నాకు చాలా గర్వంగా ఉంది రా.. మన బ్యాచ్లో ఎవరికి సొంత కారు లేవు. నీకు మాత్రం రెండు కార్లు ఉన్నాయి. ఇలానే రెండు వందల కార్లు కొని, పెద్ద బిజినెస్ మాన్ అయిపో.. అంటూ బ్లెస్ చేస్తాడు. దీంతో పక్కనే ఉన్న మనోజ్.. 'ఎవడు పడితే వాడు బిజినెస్ మాన్ అవలేడమ్మా.. అలా కావాలంటే ఓ స్టేటస్ ఉండాలి'అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో మీనాకు కాలుతుంది. 'స్టేటస్ ఎలా వస్తుంది. నాలుగు లక్షల పర్నిచర్ మోసపోతే వస్తుందా? నాలుగు లక్షలు ఎవరికి ఇచ్చి మోసపోతే వస్తుందా? నాలుగు లక్షల కోసం ఇతరుల బంగారం అమ్ముకుంటే వస్తుందా ?అంటూ సెటైరికల్ గా మాట్లాడుతుంది.

దీంతో రోహిణి 'అన్నదమ్ములు అన్నాక ఏదైనా మాట్లాడతారు మాట్లాడుకుంటారు. మధ్యలో నువ్వు ఎందుకు కలగజేసుకుంటున్నావు' అని మీనాపై ఫైర్ అవుతుంది. ఈ సమయంలో ప్రభావతి కూడా మనోజ్ కు సపోర్ట్ గా మాట్లాడుతోంది. 'వాడికి చూస్తే బాలుకి అసూయ పడుతున్నట్లు ఉంది అందుకే ఇలా మాట్లాడుతుంది' అంటుంది. 'ఎవరేం మాట్లాడినా.. ఎవరేమో అంతే అసూయపడిన మీరు మాత్రం పైకి ఎదుగుతారు' అంటూ మీనా బాలుకి సపోర్టుగా నిలుస్తుంది. 'అవునవును బొమ్మ కార్లు కొంటారులే' అంటూ ప్రభావతి మాట జారుతుంది. దీంతో మీనాకు ఎక్కలేదు ఆగ్రహం పొడుచుకోవస్తుంది.

'ఏం మాట్లాడారు. మరోసారి మాట్లాడండి. బొమ్మ కార్లు కొంటామో.. నిజం కార్లు కొంటామో మీకు అర్థమవుతుంది. ఏదో ఒక రోజు మా ఆయన..' అంటూ చిటికెలు వేస్తూ శపథం చేసే ప్రయత్నం చేస్తుంది మీనా. దీంతో వెంటనే బాలు అడ్డుపడి..'వద్దు వద్దు ఇప్పటికే రెండు పనులు పెండింగ్ లో ఉన్నాయి.. అవి అయిపోయిన తర్వాత అప్పుడు శపథం చేదువులే.. ఇప్పుడు మాత్రం కాస్తా సైలెంట్ గా ఉండు అంటాడు. ఈ సమయంలో సత్యం.. ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ' ఏదైనా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఏ తల్లి కూడా తన కొడుకులను ఎక్కువ తక్కువ చూడదు.. నువ్వు మాత్రం ప్రయోజకుడైన కొడుకును దూరం పెట్టి.. దద్దమ్మ లాంటి కొడుకులు నెత్తిన పెట్టుకున్నావ్.. నీకే తెలియాలి'అంటూ సత్యం చీ కోడుతాడు.

రోహిణి కూడా .. 'ఏదైనా అనాలనిపిస్తే నన్ను అనండి.. కానీ ఎవరితో పడితే వారితో మాట్లాడితే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది. అనవసరంగా అందరి ముందు పరువు తీసుకోకండి' అని రోహిణి మనోజ్ బుద్ధి చెబుతుంది. కానీ మనోజ్ మాత్రం 'ఇవన్నీ నాకు అలవాటే.. కొత్త ఏం కాదు.. అయినా ఆ లెటర్ ఎవరు రాశారు? నా చుట్టూ ఉన్న వాళ్ళవల్లే ఈ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నాకు ఈ రాజేష్ కూడా చాలా సంవత్సరాలుగా తెలుసు.. ఇతని వల్ల ఏమైనా సమస్య నాకు రావచ్చా? అని రోహిణిని అడగగా.. 'నువ్వు అనవసరంగా పిచ్చిపిచ్చి ఆలోచన పెట్టుకుని, వింత చేష్టలు చేయకు' అని హెచ్చరిస్తుంది.

అయినా మనోజ్ మాత్రం.. 'నాకు ప్రమాదం తెచ్చే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒకరున్నారు'అంటూ వెళ్ళిపోతాడు. తీరా కట్ చేసి చూస్తే.. మనోజ్ తన పార్క్ ఫ్రెండ్ తో కలిసి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకు వచ్చిన లెటర్ ను చూపించి, పరిష్కారం చెప్పమని బ్రతిమిలాడుతాడు. దీంతో జ్యోతిష్కుడు మనోజ్ భయాన్ని క్యాష్ చేసుకుంటాడు.' నీ త్వరలో ఓ పెద్ద ప్రమాదం రాబోతుంది. నేను చెప్పినట్లుగా చెయ్.. ప్రతిరోజు వివిధ రంగుల బట్టలు వేసుకో.. ఆ బట్టలే నీకు ఎదుటివారి నుండి రక్షణ కవచంగా మారుతాయి. నా మాట కాదని పట్టించుకోకుండా ఉంటే.. గుడిమెట్ల వద్ద అడక్కతినాల్సిన పరిస్థితి వస్తుంది' అంటూ హెచ్చరిస్తాడు. దీంతో మనోజ్ ఒకసారి కంగు తింటాడు. ఇలా సిరీయల్ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X