Gunde Ninda Gudi Gantalu December 22th Episode: మనోజ్ వింత ప్రవర్తన.. బెస్ట్ కపుల్ పోటీలో విజేతలు ఎవరంటే?
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠతో సాగింది. బాలు తన చెల్లెలు మౌనిక తనను పరాయివాడిలా చూసిన తీరు గుర్తు చేసుకుని లోపల లోపల కుమిలిపోతాడు. ఈ పరిస్థితిని గమనించిన మీనా అతనికి ధైర్యం చెబుతూ, మౌనిక ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తించలేదని ఓదారుస్తుంది. అయినప్పటికీ మీనా మనసులో మౌనిక ప్రవర్తనపై అనుమానం పెరుగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో సంజూ అసలు స్వరూపం బయటపడుతుంది. మౌనికతో హీనంగా మాట్లాడుతూ, బాలు బాధపడటం తనకు ఆనందమని చెప్పడం కలచివేస్తుంది. మీనా ఫోన్ చేసినా, సంజూ భయంతో మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం మీనాలో మరింత ఆందోళన పెంచుతుంది.
మరోవైపు అజ్ఞాత లెటర్ మనోజ్‌ను తీవ్ర భయానికి గురిచేస్తుంది. తల్లిని అనుమానించిన మనోజ్‌పై ప్రభావతి కోపంతో చేయి చేసుకోవడం కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతుంది. మరుసటి రోజు బాలు తన రెండో కారును తండ్రి సత్యం చేత రాజేష్ కి కిరాయికి ఇవ్వగా, మనోజ్ వెటకార వ్యాఖ్యలు చేస్తాడు. దీనికి మీనా ఘాటుగా సమాధానం ఇవ్వడంతో గొడవలు ముదురుతాయి. చివర్లో మనోజ్ జ్యోతిష్యుడిని ఆశ్రయించగా, అతడు చెప్పిన ప్రమాద హెచ్చరిక మనోజ్ భయాన్ని మరింత పెంచుతుంది. ఇలా ఉత్కంఠభరితంగా ఎపిసోడ్ ముగిసింది.

ఇక సోమవారం ఎపిసోడ్ లో మనోజ్ ఫ్రెండ్ తో కలిసి ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్ గురించి చెప్పి మనోజ్ ఆందోళన చెందుతాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు .. మనోజ్ క్యారెక్టర్ అర్థం చేసుకుని మరింత భయపడాలా చేస్తాడు. నీ చుట్టూ ఉన్న వారిని ఎవరిని నమ్మవద్దని, వారితో నీకు ప్రమాదం పొంచి ఉందని భయపెడుతాడు. అంతేకాదు తాను చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేస్తే.. భవిష్యత్తులో అడుక్క తినాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు. ఆ మాటలతో మనోజ్ మరింత ఆందోళన చెందుతాడు. దీంతో ఈ ముప్పు నుండి ఎలాగేనా తనని బయటపడేయాలని, ఆ జ్యోతిష్యున్ని పరిహారం కోరుతాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు తాను చెప్పినట్లుగా.. రోజుకో విధమైన రంగు దుస్తులను వేసుకోవాలని, ఆ రంగుల బట్టలే రక్షణ కవచంగా నిలుస్తాయని చెబుతాడు.
అలాగే తన చుట్టూ ఉన్న వారిని ఎవరిని కూడా నమ్మకూడదని, తన బట్టలను తననే పరిశుభ్రం చేసుకోవాలని సూచనలు ఇస్తాడు.ఇక స్వామిజీ చెప్పినట్లుగానే మనోజ్ చేస్తానని చెప్తాడు. వెంటనే చొక్కా తీసేసి కండువా కప్పుకుంటాడు. అదేవిధంగా ఇంటికి వెళ్లాడు. మనోజ్ అలా చూసిన వారందరూ షాక్ అవుతారు. తన వింత ప్రవర్తన చూసి ప్రభావతి షాక్ అవుతుంది. 'ఏంట్రా ఇలా చేస్తున్నావ్' అంటే తనకు జ్యోతిష్యుడు చెప్పాడని, అందుకోసమే ఇలా చేస్తున్నానని, తనని ఎవరో ముట్టుకోవద్దని చెబుతాడు. ఈ విషయాన్ని గమనించిన బాలు మనోజ్‌ని ఎగతాళి చేస్తాడు.
ఇదిలా ఉంటే బాలు తన కొత్త గది నిర్మాణం కోసం డబ్బులు జమ చేయాలని, ఒక కిడ్డీ బాక్సు ను ఇంటికీ తీసుకవస్తాడు. అది చూసి సత్యం ప్రశ్నించగా.. తాను నిర్మించే గది కోసం.. ఇందులో డబ్బులు జమ చేయబోతున్నామని, అందుకోసమే ఈ బాక్స్ తీసుకొచ్చానని చెబుతాడు. కానీ, ప్రభావతి మాత్రం బాలుని హేళన చేస్తుంది. ఇలా చేస్తే.. ఇంకో 20 సంవత్సరాలు అయినా.. ఆ గది కట్టలేరని, అయినా.. గుడి ముందు అడుక్క తినేవారిలా ఉంది' అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది. దీంతో బాలు ఆగ్రహంగా తన తల్లిని చూస్తాడు. మీనా కూడా ఆగ్రహంతో 'మాట్లాడే ముందు జాగ్రత్తగా చూసి మాట్లాడండి. కండ్లు కనిపించకపోతే మామయ్య గారి కళ్ళజోడు పెట్టుకుని చూడండి. అక్కడ ఉన్నది బాలు.. మనోజ్ కాదు. అంటూ చురకలాంటిస్తుంది.
ఇంతలోనే రోహిణి ఇంటికి చేరుకుంటుంది. అనవసరంగా తన భర్త గురించి తక్కువ చేసి మాట్లాడకండి అంటూ మీనాను హెచ్చరిస్తుంది. 'ఆ మాటలు మొదట గదిలోకి వెళ్లి మాట్లాడు మీ ఆయన చూస్తే.. నువ్వే ఆశ్చర్యపోతావ్.. ఆయన వేషం.. ఆయన కథ..'అంటుంది మీనా. దీంతో కంగారుగా రోహిణి తన బెడ్ రూమ్ లోకి వెళుతుంది. అక్కడ మనోజ్ శాలువా కప్పుకొని, దీక్ష చేస్తున్నట్లు కూర్చుంటాడు. ' ఏమైంది మనోజ్ .. ఇలా ఎందుకు చేస్తున్నావ్ 'అని ప్రశ్నించగా.. తాను ఓ జ్యోతిష్యం దగ్గరికి వెళ్లాననీ, జరిగిన కథ మొత్తం చెప్తాడు. ఇకపై ఇంట్లో వారిని ఎవరిని నమ్మని ఇన్ డైరెక్ట్ గా తనని (రోహిణి) కూడా నమ్మనని చెబుతాడు.
దీంతో రోహిణికి కోపం వస్తుంది. 'నువ్వు చదువుకున్న వాడివే కదా.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?' అని ప్రశ్నించగా.. 'చదువుకు ఆధ్యాత్మికకు చాలా తేడా ఉంది' అని బదులిస్తాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక రోహిణి తల పట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. మీనాక్షి ప్రభావతి దగ్గరికి వస్తుంది. సత్యం, ప్రభావతి కలిసిపోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెబుతోంది. అయితే.. ప్రభావతి మాత్రం ఆ క్రెడిట్ మొత్తం తనదేననీ కట్టు కథ చెబుతుంది. అది విన్న బాలు 'అంతాలేదు.. శీల డార్లింగ్ వచ్చి వారిద్దరిని కలిపింది'అని అసలు విషయాన్ని బయట పెడతాడు.
'అంటే ఇది అత్త దిద్దిన కాపురం' అంటూ మీనాక్షి కామెంట్ చేస్తుంది. 'అయినా ఇందులో చెప్పుకోకపోవడానికి తప్పేముంది? మీరిద్దరూ మాట్లాడకపోతే మీ అత్తయ్య వచ్చింది మిమ్ముల్నీ కలిపింది' అంటూ ప్రభావతిని అడగగా.. 'ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది ప్రభావతి. సత్యం అక్కడికి వచ్చి.. 'ఇలాంటి తప్పులు చేస్తుంది కాబట్టే.. ఈ జన్మలో ఇది మారదు' అనే ఉద్దేశంతో క్షమించి మాట్లాడుతున్న..' అంటాడు. దీంతో ప్రభావతి ముఖం మాడిపోతుంది.
ఇదిలా ఉంటే.. శృతి, రవి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో వారందరినీ హాల్లోకి రమ్మని పిలిచిస్తారు. 'ఏంటి? ఎప్పుడు లేనిది అందర్ని పిలుస్తున్నావ్?' అని మీనాక్షి అడగగా.. తన హోటల్లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో నిర్వహిస్తున్నారని, అందులో మన ఇంట్లో ఉన్న వారందరూ పాటిస్పేట్ చేస్తారని అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవచ్చాననీ, ఇష్టమున్నవారు ఫిలప్ చేయండి అని చెబుతాడు. 'అంటే మీ అమ్మానాన్న కూడా పాల్గొనవచ్చా?' అని మీనాక్షి ప్రశ్నించగా.. 'అవును.. ఏ వయసు ఉన్న వారైనా ఇందులో పాల్గొనవచ్చు' అని రవి బదులిస్తాడు. కానీ ప్రభావతి తనకు ఇష్టం లేదని తన పెద్ద కొడుకు మనోజ్ ఈ కాంపిటీషన్లో పాల్గొంటారని రోహిణి మనోజ్ ల జంట బెస్ట్ కపుల్స్ అని చెబుతోంది.
ఆ మాటలతో బాలుకి కోపం వస్తుంది. మరొకరు మాకు సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. మేము ఏంటో మాకు తెలుసు అంటూ చురకలేస్తాడు. ఇక మనోజ్ అయితే తన స్టేటస్కు తన లెవల్ కు ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్లో తాను పాల్గొనాలని చెబుతాడు. ఇలా పోటీలో పాల్గొనడానికి అయిష్టం చూపడంతో.. ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అని చెబుతుంది. దీంతో వెంటనే మనోజ్ 'ఏంటి? ప్రైస్ మనీ లక్ష రూపాయలా' అని షాక్ అవుతాడు. ప్రభావతి కూడా ఆ ప్రైజ్ మనీ వినగానే షాక్ అవుతుంది. బాలు మీనా మాత్రం.. లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు అంటే... ఊరికే ఇవ్వలేరులే.. అని సైలెంట్ అవుతారు. దీంతో మనోజ్ వారిని హేళన చేస్తాడు. వారు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోటీ నుండి తప్పుకుంటున్నాడని తక్కువ చేసి మాట్లాడుతాడు.
దీంతో మీనా ఆగ్రహంతో' అయినా ఏం ప్రశ్నిస్తారు? నాలుగు లక్షల రూపాయలు ఎలా వెతుకు వెళ్లాలని అడుగుతారా? 40 లక్షలు ఎలా మోసం చేయాలని ప్రశ్నిస్తారా..? తమ్ముని భార్య నగలు ఎలా ఎత్తుకెళ్లాలని అడుగుతారా..?' అంటూ దిమ్మతిరిగిపోయేలా రిప్లై ఇస్తుంది. దీంతో ఒక్కసారిగా మనోజ్ నోరు మూతపడుతుంది. అయినా ఇలాంటి కాంపిటీషన్లో పాటిస్పేట్ చేయమని బాలు మీనాలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక రోహిణి కూడా తనకు వర్క్ ఉందని ఇంత బిజీ షెడ్యూల్లో ఇలాంటి పోటీల్లో పాల్గొనడం తన వల్ల కాదని వెళ్ళిపోతుంది. కానీ మనోజ్ మాత్రం లక్ష రూపాయల ప్రైజ్ మనీ ని ఎలాగైనా సంపాదించాలని ఆ పోటీలో పాల్గొనాలని భావిస్తాడు.
ఈ క్రమంలో రోహిణి దగ్గరికి వెళ్లి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు మనోజ్. ఎలాగైనా ఈ పోటీలో పాల్గొనాలని తన టాలెంట్ తో ఈ కాంపిటీషన్లో లక్ష రూపాయలు గెలుస్తామని, తన గొప్పలను చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. 'బిజినెస్ బాగానే ఉంది కదా? ఇలాంటి పోటీలు మనకు అవసరమా? అని అడగగా.. 'లక్ష్మీదేవి వస్తున్నప్పుడు.. వద్దని చెప్పకూడదని అంటారు. దీంతో రోహిణి కూడా సరే ఆ పోటీలో పార్టిసిపేట్ చేద్దామని చెబుతోంది. ఇక మనోజ్ తనకే లక్ష రూపాయల ప్రైస్ మనీ వచ్చినట్లు భావిస్తాడు.
ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఒకరికి తెలియకుండా ఒకరు పాల్గొంటారు. మొదట మనోజ్ ఎవరికీ చెప్పకుండా కాంబినేషన్ కి వస్తాడు. ఆ తర్వాత సత్యం ప్రభావతి కాంపిటీషన్ కు చేరుకుంటారు. ఆ తర్వాత మీనా బాలు కూడా ఆ పోటీకి వస్తారు. ఇలా ఒకరికి చెప్పకుండా ఒకరు పోటీలో పాల్గొనడానికి రావడంతో కాస్త ఉద్రిక్తతలు నెలకొంటుంది. అయితే ఈ పోటీలో ఆదర్శ దంపతులు అనే అవార్డు ఎవరెవరిస్తుందో? ఆ ప్రైజ్ మనీ ఎవరికి అందుతుందో ? అనేది ఉత్కంఠగా మారింది. ఇక చూడాలి అప్ కమింగ్ సీరియల్ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..


Click it and Unblock the Notifications











