Gunde Ninda Gudi Gantalu December 23th Episode: ఆదర్శ దంపతుల పోటీ.. లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఎవరి చేతికి?
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్‌లో ఆసక్తికర మలుపులు చోటుచేసుకున్నాయి. అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్‌తో ఇప్పటికే ఆందోళనలో ఉన్న మనోజ్, తన ఫ్రెండ్‌తో కలిసి ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లడం కీలక మలుపుగా మారింది. లెటర్ విషయం చెప్పగానే, మనోజ్ క్యారెక్టర్‌ను గమనించిన జ్యోతిష్యుడు అతడిని మరింత భయపెట్టాడు. "నీ చుట్టూ ఉన్న వారిని ఎవరినీ నమ్మొద్దు... నీకు ప్రమాదం పొంచి ఉంది" అంటూ హెచ్చరించాడు. అంతేకాదు, తన మాటలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అడుక్కోవాల్సి వస్తుందన్న మాటలతో మనోజ్ భయాన్ని రెట్టింపు చేశాడు. ఆ ముప్పు నుంచి బయటపడేందుకు పరిహారం కోరగా, రోజుకో రంగు దుస్తులు ధరించాలని, అదే రక్షణ కవచమని జ్యోతిష్యుడు సూచించాడు. బట్టలను తనే ఉతుక్కోవాలని, ఇతరుల స్పర్శకూ దూరంగా ఉండాలని చెప్పాడు. జ్యోతిష్యుడి మాటలను నమ్మిన మనోజ్, చొక్కా తీసేసి కండువా కప్పుకుని ఇంటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రభావతి ప్రశ్నించగా "స్వామీజీ చెప్పాడు" అంటూ ఎవరు ముట్టుకోవద్దని చెప్పాడు. ఈ వింత ప్రవర్తనను చూసి బాలు మనోజ్‌ను ఎగతాళి చేశాడు.
ఇదిలా ఉంటే.. బాలు కొత్త గది నిర్మాణం కోసం కిడ్డీ బాక్స్ తీసుకురావడం మరో గొడవకు దారి తీసింది. ప్రభావతి అతడిని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రోహిణి, భర్త గురించి మాట్లాడొద్దని హెచ్చరించినా, బెడ్‌రూమ్‌లో మనోజ్ శాలువాతో దీక్షలా కూర్చుని ఉండటం చూసి షాక్ అయింది. జ్యోతిష్యుడి మాటలన్నీ చెప్పిన మనోజ్, ఇన్‌డైరెక్ట్‌గా రోహిణినీ నమ్మనని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. మరోవైపు, సత్యం, ప్రభావతి కలయికపై మీనాక్షి, బాలు మధ్య సంభాషణలు ప్రభావతిని ఇబ్బంది పెట్టాయి. చివరగా శృతి-రవి ప్రకటించిన "బెస్ట్ కపుల్ కాంపిటీషన్" ఇంట్లో మరో చిచ్చు రేపింది. మొదట నిరాకరించిన మనోజ్, ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అని తెలిసిన వెంటనే షాక్ అయ్యాడు. మీనా ఇచ్చిన ఘాటు రిప్లైతో నోరు మూసుకున్నా, చివరకు అదే లక్ష రూపాయల కోసమే రోహిణిని కన్విన్స్ చేసి పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకోవడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.

మంగళవారం సీరియల్ మొత్తం 'బెస్ట్ కపుల్స్ కాంపిటీషన్'గురించి చర్చ జరుగుతుంది. ఒకరు తెలియకుండా పోటీ గురించి చర్చించుకుంటారు. ఇలా ముందుగా మనోజ్- రోహిణి మధ్య డిస్కషన్ జరుగుతుంది. వాస్తవానికి ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అనగానే మనోజ్ కు దుర్బుద్ధి పుడుతుంది. ఎలాగైనా ఆ లక్ష రూపాయలను గెలుచుకోవాలని భావిస్తాడు. అయితే రోహిణి తనకు వర్క్ ఉందని, తాను పాటిస్పేట్ చేయలేనని తెగేసి చెప్తుంది. కానీ, మనోజ్ కాన్ఫిడెన్స్ గా 'మనం గెలుస్తాం' అని చెబుతాడు. కానీ, మనోజ్ మీద నమ్మకం లేకపోవడంతో తాను పాటిస్పేట్ చేయలేనని రోహిణి చెబుతుంది. దీంతో మనోజ్ రోహిణినీ బ్రతిమలాడుతాడు . ఎలాగైనా ఈ కాంపిటీషన్లో గెలిచి తీరుతామని నమ్మకం చెబుతాడు. దీంతో రోహిణి కూడా ఓకే చెబుతుంది. ఆ మాటతో మనోజ్ తనకి లక్ష రూపాయల ప్రైజ్ మనీ వచ్చినట్లు ఊహల్లో తేలిపోతాడు.
ఇక మరోవైపు శృతి కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 'ఏంటి తెగ ఆలోచిస్తున్నావు?' అని రవి అడగగా.. 'మనం కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటే ఎలా ఉంటుంది? ఇలాంటి కాంపిటీషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రైజ్ మనీ లక్ష రూపాయలు కదా .. పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. మనం కూడా పాల్గొద్దాం ' రవిని రిక్వెస్ట్ చేస్తుంది శృతి. దీంతో రవి 'మనం ఇంట్లోనే టామ్ అండ్ జెర్రీ లా ఉంటాం.. మనల్ని బెస్ట్ కపుల్స్ అంటే ఎవరైనా నమ్ముతారా' అంటూ సెటైర్ వేస్తాడు. 'అయినా కాంపిటీషన్ అంటే బ్యూటీ కాదు.. బలం కూడా ఉండాలి'అంటాడు. దీంతో శృతి 'నాకెం తక్కువ. నా కూడా బాడీ.. బలం ఉంది. చూసుకుందామా? అంటూ రవితో పోట్లాడుతుంది శృతి.
ఇదిలా ఉంటే.. ప్రభావతి కూడా ఎలాగైనా బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొనాలని భావిస్తుంది. లక్ష రూపాయలు అస్సలు వదులుకోవద్దని తెగ ఆరాటపడుతుంది. అయితే.. సత్యంను ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. ఇక ధైర్యం చేసి ఆ విషయాన్ని తన భర్త సత్యంకు చెబుతోంది. దీంతో సత్యం 'ఆదర్శ దంపతులు అంటే.. ఆదర్శ భావాలున్న దంపతులు అని అర్థం.. మనకు అలాంటి మంచి లక్షణాలు లేవులే.. అనవసరంగా ఆలోచించకు' అని నిరుత్సాహపరుస్తాడు. కానీ, ప్రభావతి 'మనకెంతక్కువ.. పాతిక సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నాం కదా.. మనల్ని మించిన ఆదర్శ దంపతులు ఉంటారా?' అంటూ సత్యంకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది.
'నీకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అన్న నుండి ఈ దుర్బుద్ధి పుట్టింది కదా' అని నేరుగా ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి 'లక్ష రూపాయలు అంటే ఎవరైనా వదులుకుంటారా?' అని బదిలిస్తుంది. 'అయినా నీ గురించి తెలిసిన ఎన్ని రోజుల నుండి కాపురం చేస్తున్న చూడు.. నేను నిజమైన ఆదర్శ భర్తని..'అంటూ సెటైర్ వేస్తాడు. దీంతో ప్రభావతి 'మీరు ఎన్నైనా చెప్పండి. మనం కచ్చితంగా కాంపిటీషన్లో పాల్గొందాం' అని ప్రభావతి రిక్వెస్ట్ చేస్తుంది. ఎంత చెప్పినా ప్రభావతి వినకపోవడంతో..'నీ ముచ్చట నేనెందుకు కాదంటాను.. సర్లే పాల్గొందాం' అంటాడు. దీంతో ప్రభావతి ఎగిరిగంతేస్తుంది.
మన వైపు బాలు మీనాలు కూడా బెస్ట్ కపుల్ పోటి గురించి మాట్లాడుకుంటారు. అయితే బాలు మాత్రం కాస్త సందేహపడతాడు. అక్కడికి పెద్ద పెద్ద వారు వస్తారు కదా.. వారి ముందు మనం గెలవగలమా? అని అనుమానపడతాడు. దీంతో మీనా 'ఆ పోటీకి కావాల్సింది డబ్బు కాదు.. బంధం.. మనిద్దరం అందరికంటే బెస్ట్ కపుల్స్ మీకేమైనా సందేహం ఉందా?' అని బాలుని అడగగా.. మనకంటే మించిన బెస్ట్ కపుల్స్ ఎవరు ఉంటారు' అని మీనాకు జోష్ ఇస్తాడు. ఆ డబ్బులతో మనం రూమ్ కట్టుకుందామని మీనా అనగా.. 'ఈ పోటీలో పాల్గొనడానికి ధైర్యం ఇచ్చిన నీకు థాంక్స్.. ఎలాగైనా ఈ పోటీలో గెలిచి సత్తా చాటుదాం' అని బాలు అంటాడు.
ఇక రోజు ఒకరికి తెలియకుండా ఒకరు పోటీకి సిద్ధమవుతారు. ముందుగా మనోజ్, రోహిణి కంటే ముందుగా సిద్ధమవుతాడు. ఇంట్లో వారికి చెబుదామా? రోహిణి ప్రశ్నించగా.. 'అవసరం లేదు.. మనం రెగ్యులర్ గా వెళుతున్నట్లు వెళ్లిపోదాం' అని అంటాడు. మరోవైపు ప్రభావతి సత్యం కూడా కొత్త పెళ్లి కొడుకు.. పెళ్లి కూతుర్ల రెడీ అవుతారు. వాస్తవానికి సత్యంకు ఆ పోటీలో పాల్గొనడం ఇష్టం లేకపోయినా.. ప్రభావతి కోసం పాల్గొనడానికి అలా రెడీ అవుతాడు. బాలు మీనా కూడా ఓ రెంజ్ లో రెడీ అవుతారు. అయితే.. బాలు మీనా కోసం హాల్ లో వెయిట్ చేస్తుండగా.. తన తల్లిదండ్రులు, మనోజ్-రోహిణి డ్రెస్సింగ్ చూసి ఆశ్చర్యపోతాడు.'ఏంటి ఈ వేషాలు.. ఎటు వెళ్తున్నారు?'అని ప్రశ్నించగా..'తాము డ్యూటీకి వెళ్తున్నాం'అని మనోజ్ చెప్పుతాడు. తన తల్లి ప్రభావతి..తాము గుడికి వెళ్తున్నామని అబద్ధం చెపుతుంది. అయితే.. వారి డ్రెస్ ను చూసి బాలుకి అనుమానం వస్తుంది. వీరు కూడా కచ్చితంగా పోటీలో పాల్గొనడానికి వెళ్తున్నారని అర్థం చేసుకుంటాడు.
ఇక రవి వాళ్ళ హోటల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. కాబట్టి..రవి ముందుగానే అక్కడికి చేరుకుంటాడు. అయితే..కాంపిటీషన్ నిర్వహణలో కాస్త ఇబ్బంది కావడంతో రవి, శృతి వారికి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో వారిద్దరూ రిసెప్షన్ కౌంటర్లో కూర్చుంటారు. అలా పోటీలో పాల్గొనే వారి పేర్లను నమోదు చేసుకుంటూ ..పోటీదారులను రిసీవ్ చేసుకుంటారు. మొదటిగా మనోజ్- రోహిణి వస్తారు. కౌంటర్ లో రవి-శ్రుతిని చూసి షాక్ అవుతారు.
'ఏంటి..? నిన్న నైట్ అడిగితే రానన్నారు. ఇప్పుడేమో వచ్చారు?' అని శృతి అడగగా. 'మీరు కూడా రాను అన్నారు కదా..?' అని తిరిగి రోహిణి ప్రశ్నిస్తుంది. 'మీ లెవెల్ కు తగ్గ పోటీ కాదు కదా అన్నయ్య' అని రవి అనగా.. 'రోహిణి రిక్వెస్ట్ చేస్తే.. ఈ పోటీకి వచ్చాను' అని అబద్ధం చెబుతాడు. సరేలే గాని రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళండి అని చెబుతాడు. తర్వాత ఈ పోటీకి సత్యం- ప్రభావతి కూడా చేరుకుంటారు. ఈ సమయంలో మీనాక్షి -రంగా కూడా ఈ పోటీకి వస్తారు. చెప్పకుండా రావడం, వారి డ్రెస్సింగ్ చూసి సత్యం షాక్ అవుతాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పోటీలో పాల్గొంటారు.


Click it and Unblock the Notifications










