Gunde Ninda Gudi Gantalu December 24th Episode: లక్ష కోసం పోరాటం.. విజేతలుగా ముళ్లకంప- పూలగంప?

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ మొత్తం 'బెస్ట్ కపుల్స్ కాంపిటీషన్' చుట్టూనే తిరుగుతుంది. లక్ష రూపాయల ప్రైజ్ మనీ అన్న మాటతో ఇంట్లో ప్రతి జంటలోనూ ఆశలు మొదలవుతాయి. మొదటిగా మనోజ్-రోహిణి మధ్య ఈ పోటీపై చర్చ జరుగుతుంది. లక్ష రూపాయల ప్రైజ్ మనీ వినగానే మనోజ్‌కి దుర్బుద్ధి పుడుతుంది. ఎలాగైనా ఆ డబ్బు గెలవాలని డిసైడ్ అవుతాడు. అయితే రోహిణి తనకు వర్క్ ఉందని, పోటీలో పాల్గొనలేనని తేల్చి చెబుతుంది. మనోజ్ మాత్రం కాన్ఫిడెన్స్‌గా 'మనం గెలుస్తాం'అంటూ బ్రతిమలాడతాడు. చివరికి మనోజ్ మాటలకు కరిగిన రోహిణి ఓకే చెప్పడంతో..లక్ష రూపాయలు తనకు వచ్చినట్టు మనోజ్ ఊహల్లో తేలిపోతాడు. ఇక మరోవైపు శృతి ఈ పోటీ గురించి ఆలోచిస్తూ రవిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. 'బెస్ట్ కపుల్స్ అంటే మనమే'అంటూ ఉత్సాహంగా మాట్లాడినా.. రవి మాత్రం 'మనమిద్దరం టామ్ అండ్ జెర్రీలాగే ఉంటాం'అంటూ సెటైర్ వేస్తాడు.

బ్యూటీతో పాటు బలం కూడా కావాలన్న మాటలతో ఇద్దరి మధ్య సరదా గొడవ జరుగుతుంది. ప్రభావతి మాత్రం లక్ష రూపాయలు వదులుకోలేక సత్యంను ఒప్పించే పనిలో పడుతుంది. సత్యం మొదట నిరుత్సాహపరిచినా, ప్రభావతి పట్టుదల ముందు చివరకు ఒప్పుకుంటాడు. దీంతో ప్రభావతి ఆనందంతో ఎగిరిగంతేస్తుంది. బాలు-మీనా కూడా పోటీ గురించి మాట్లాడుకుంటారు. బాలు మొదట సందేహపడినా, 'మన బంధమే మన బలం'అన్న మీనా మాటలతో ఉత్సాహం పొందుతాడు. ఆ డబ్బులతో రూమ్ కట్టుకుందామని ఇద్దరూ కలలు కంటారు. ఇక అసలు ట్విస్ట్.. అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు పోటీకి రెడీ అవుతారు. మనోజ్-రోహిణి, సత్యం-ప్రభావతి, బాలు-మీనా అందరూ వేర్వేరు అబద్ధాలతో ఇంటి నుంచి బయలుదేరతారు. హోటల్‌లో రవి-శ్రుతి రిసెప్షన్ కౌంటర్‌లో కూర్చుని రిజిస్ట్రేషన్లు తీసుకుంటుండగా, ఒక్కొక్క జంట ఎంట్రీ ఇస్తూ షాక్‌లు ఇస్తుంది. ఇలా రహస్యాలతో, అనుమానాలతో, ఉత్కంఠతో ఆసక్తికరంగా ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 582 December 24th 2025 here is full story

బుధవారం ఎపిసోడ్ కూడా 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చూట్టు తిరిగింది. ఈ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన సత్యం-ప్రభావతి అందులో పాల్గొనేవారి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీనాక్షి-రంగా కూడా పోటీకి రాయడం, వారి వేషధారణ చూసి షాక్ అవుతారు. అయితే, మీనాక్షి వారిని చూసి చూడనట్టుగానే అక్కడనుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ, ప్రభావతి మాత్రం మీనాక్షిని గుర్తుపట్టి మరి పిలుస్తుంది.'ఏంటి వదిన మీరు కూడా కాంపిటీషన్ కి వచ్చారా?' అని ప్రశ్నించగా.. 'మీరు మాత్రం చూడ్డానికి వచ్చారా;' అని బదిలిస్తుంది ప్రభావతి. 'లక్ష అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు.. మీరు కూడా అందుకే వచ్చారు కదా .. పదండి వెళ్దాం' అంటుంది మీనాక్షి. ఇలా కలిసి కాంపిటీషన్ కి వెళ్తారు. వారిని చూసిన రవి-శృతి షాక్ అవుతారు.

ఈ సమయంలో శృతి 'ఏంటి అత్తయ్య.. ఒక మాట కూడా చెప్పలేదు. నిన్న అడిగితే.. ఈ వయసులో పోటీలు అవసరమా? అన్నట్లు ఉన్నారు' అని ప్రశ్నించగా.. వెంటనే మీనాక్షి 'లక్ష అంటే ఎవరు కాదంటారమ్మా.. అందుకే వచ్చాను' అంటుంది. 'సరేలెండి.. ఇందులో సైన్ చేసి.. లోపటికి వెళ్ళండి' అంటారు శ్రుతి. 'తీరా లోపల వెళ్లి చూసే సరికి అక్కడ మనోజ్- రోహిణి కనిపిస్తారు. వెంటనే ప్రభావతి వారి దగ్గర వెళ్తుంది.'ఏరా మనోజ్ ఇక్కడికి వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు' అని ప్రభావతి ప్రశ్నించగా.. 'నువ్వు మాత్రం గుడికి వెళ్తున్నా అంటూ ఇక్కడికి రాలేదా?' అని ఎదురు ప్రశ్నిస్తాడు.'అంతా లక్ష మహిమ' అంటాడు సత్యం.

ఆ తర్వాత బాలు-మీనాలు కూడా ఎంట్రీ ఇస్తారు. కాంపిటీషన్ వచ్చి తన తమ్ముడు రవికి ఫోన్ చేసి, తాను వచ్చిన విషయం చెబుతాడు. తాను ఎంట్రెన్స్ లోనే ఉన్నానని, తొందరగా రమ్మని చెప్తాడు రవి. ఈ సమయంలో కొందరు బాలు- మీనాలను చూసి ఎంతో ముచ్చటగా ఉన్నారో అని ప్రశంసిస్తారు. దీంతో బాలు రెచ్చిపోయి..మీనాను పట్టుకొని నడుస్తాడు. ఇక రిసెప్షన్ దగ్గరికి వెళ్లి.. రవిశ్రుతిలను కలుస్తారు. 'ఏరా చెప్పా పెట్టకుండా వచ్చావు?' అని ప్రశ్నించగా.. 'మా హోటల్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేస్తున్న ప్రోగ్రాం కదా.. అందుకే ముందే వచ్చేసా' అంటాడు.

'సరే.. మనోజ్-రోహిణి కూడా వస్తే బాగుండు' అని బాలు అనగా.. 'లోపల వెళ్తే అని తెలుస్తాయి.. ముందు లోపలికి రండి' అని రవి అంటాడు. 'ఏం జరిగింది రా' అని బాలు తిరిగి ప్రశ్నించగా.. 'ముందు లోపలికి వెళ్ళండి అన్నయ్య.. మీకే అర్థమవుతుంది' అని అంటాడు. తీరా లోపలికి వెళ్లి చూడగా..తన తల్లిదండ్రులు తోపాటు అన్న వదినలు మనోజ్ రోహిణి కూడా కనిపిస్తారు. దీంతో బాలు 'ఏంటమ్మా గుడికి వెళ్లడం అయిపోయిందా? ప్రదక్షిణాలు చేసావా? తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నావా? అంటూ వెటకారంగా అడుగుతాడు. తర్వాత మనోజ్ లో టార్గెట్ చేస్తూ..'ఏరా నీకు స్థాయికి సరిపోదు అన్నావు. ఇదేనా నీ పర్నిచర్ షాప్' అంటాడు. తరువాత 'ఏంటీ పార్లరమ్మ.. ఇదేనా నీ బ్యూటీ పార్లర్? లేదా ఇక్కడికి వచ్చే వారి ముఖాలకు రంగులు వేయడానికి వచ్చావా? అంటూ సెటైర్ వేస్తాడు. దీంతో రోహిణి వెటకారంగా మాట్లాడకు అంటుంది .

అయినా బాలు ఊరుకోకుండా.. మాటిమాటికీ సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇంతలోని కాంపిటీషన్ ప్రారంభిస్తుంది. మొదటి రౌండ్లో భాగంగా.. వచ్చిన దంపతులు తమ పరిచయం పరిచయం చేసుకుంటారు. ఇలా మొదటిగా మనోజ్ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు తాను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని తన పెద్ద పర్నిచర్ షాప్ ఉందని చెబుతారు. రోహిణి తాను మేకప్ ఆర్టిస్ట్ అని, తనకు పెద్ద బ్యూటీ పార్లర్ ఉంది అని చెబుతుంది. వెంటనే బాలు ఆ బ్యూటీ పార్లర్ ఎప్పుడో అమ్మేసావు కదా అంటూ రోహిణి గాలి తీసేస్తాడు. ఇక సత్యం ప్రభావతి జంట కూడా తమని పరిచయం చేసుకుంటారు. ఈ సమయంలో ప్రభావతి తాను పెద్ద క్లాసికల్ డాన్సర్ ని అని, తనకు డాన్స్ స్కూల్ ఉందని, తన డాన్స్ స్కూల్లో 100కు పైగా స్టూడెంట్స్ ఉన్నారని గొప్పలు చెబుతుంది.

దీంతో ఒక్కసారిగా అందరి షాక్ అవుతారు. పక్కనే ఉన్న బాలు సెటైర్ వేయడానికి ప్రయత్నించగా మీనా అడ్డుపడుతుంది. ఆ తర్వాత శృతి రవి జంట కూడా తమను పరిచయం చేసుకుంటారు. తాను హోటల్లో చెఫ్ గా పనిచేస్తున్నానని చెప్పగా.. వెంటనే వారు 'మా నలబీముడు వంటలు బాగా చేస్తాడు.. మీకు ఏమైనా ఆర్డర్ ఉంటే చెప్పండి' సెటైర్ వేస్తాడు. ఇక శృతి తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెబుతుంది. దీంతో బాలు 'టీవీలలో ఏడుపుగొట్టు సీరియల్ వస్తాయి కదా.. అందులో ఏడ్చేది ఈ అమ్మాయే' అంటూ పంచ్ వేస్తారు.

ఇక బాలు తాను టాక్సీ డ్రైవర్ అని, మీనా పూల వ్యాపారం చేస్తానని చెబుతారు. అయితే.. అంత ముందు జంటలు పరిచయం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొట్టగా.. బాలు, మీనా తమ గురించి చెప్పినప్పుడు ఎవరు కూడా చప్పట్లు కొట్టారు దీంతో బాలు కాస్త ఫీల్ అవుతాడు. దీంతో మీనా మనమేం దొంగతనం చేయడం లేదు కదా . మనం నీతిగా నిజాయితీగా బతుకుతున్న అది మనకు చాలు అంటుంది.

ఇక తర్వాత రౌండ్ ప్రారంభమవుతుంది. ఈ రౌండ్లో ఎవరి టాలెంట్ ఏంటో చూపించుకోవచ్చని చెబుతారు. ఇలా కొందరు పాటలు పాడగా, మరికొందరూ డాన్స్ చేస్తారు. ఈ కాంపిటీషన్లో రోహిణి.. తాను మగవారిని కూడా ఆడవారిగా ఐదు నిమిషాల్లో రెడీ చేయగలరని చెబుతుంది. సరే వచ్చే స్టేజ్ పై మీ టాలెంట్ ఏంటో చూపించండని యాంకర్ ఇన్వైట్ చేస్తుంది.దీంతో రోహిణి.. ఆ వ్యక్తిని ఐదు నిమిషాల్లో ఆడవారిగా మేకప్ వేసి చూపిస్తుంది దీంతో అక్కడున్న వారు ఆమె టాలెంట్ చూసి ప్రశంసిస్తారు. ఇక, శృతి తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ ను మిమిక్రీ కూడా చేయగలుగుతాను అంటుంది..సరే మీ టాలెంట్ ఏంటో చూపించండి అని ఆహ్వానిస్తారు. దీంతో శృతి తాను 'గయ్యాలి గంగావతి' అని సీరియల్ రాస్తున్నానని, అందులో అత్త కోడల పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని, వారి మధ్య జరిగే సంభాషణను అందరి ముందు మిమిక్రీ చేస్తూ అందరి ముందు ప్రదర్శిస్తుంది.

అయితే ఆ పాత్ర ప్రభావతిని పోలి ఉండటంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. బాలు మాత్రం శృతి చెప్పిన డబ్బింగ్ కు ఫిదా అవుతాడు. ఎగిరి గంతేస్తూ విజిల్ కొడతాడు. దీంతో ప్రభావతి కోపంగా చూస్తుంది. నీ గురించే అన్నట్లుగా బాలు సైగా చేస్తాడు. ఇక మీనా వంతు వస్తుంది. తాను చూడకుండా మూడు నిమిషాలలో మూడు మూరాల పూలు అల్లుతానని చెబుతుంది. దీంతో ప్రభావతి అది కూడా టాలెంట్ అయినా అంట కించపరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఉన్న యాంకర్ మాత్రం ఏదైనా టాలెంట్ అంటూ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తుంది. ఇలా నేటీ సీరియల్ ముగుస్తుంది.

ఇక అప్కమింగ్ ఎపిసోడ్ లో భార్యను భర్తలు ఎత్తుకొని కాంపిటీషన్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్ లో ప్రభావతిని సత్యం ఎత్తుకోలేక పోతాడు. అయితే.తనకు కుర్చీ సహాయం కావాలని కోరుతుంది. నిర్వాహకులు కుర్చీ ఏర్పాటు చేయగా.. దాని మీద ఎక్కే ప్రయత్నంలో ప్రభావతి జారి కింద పడుతుంది.అయితే ప్రభావతికి ఏమైనా జరిగిందా? ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో ఎవరు గెలిచారు? ఎవరి చేతిలోకి లక్ష రూపాయలు వచ్చాయి? అనేవి ఇంట్రెస్టింగ్గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X