Gunde Ninda Gudi Gantalu December 25th Episode: రొమాన్స్‌లో మునిగిన కపుల్స్.. నడుము విరగొట్టుకున్న ప్రభావతి
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో మొత్తం 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చుట్టూనే తిరిగింది. ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన సత్యం-ప్రభావతి ముందుగానే అక్కడికి చేరుకొని ఇతర జంటలను గమనిస్తుంటారు. అదే సమయంలో మీనాక్షి-రంగా కూడా పోటీలో పాల్గొనడం చూసి వారు షాక్ అవుతారు. మొదట మీనాక్షి అక్కడినుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించినా, ప్రభావతి గుర్తుపట్టి మాట్లాడటంతో చివరకు కలిసి కాంపిటీషన్‌కు వెళ్తారు. వీరిని చూసిన రవి-శృతి ఆశ్చర్యపోతారు. ఇదే సమయంలో మనోజ్-రోహిణి కూడా అక్కడ కనిపించడంతో కుటుంబ సభ్యుల మధ్య సెటైర్లు మొదలవుతాయి. ముఖ్యంగా బాలు ఎంట్రీతో పరిస్థితి మరింత వేడెక్కుతుంది. గుడికి వెళ్లానని చెప్పి వచ్చిన తల్లి ప్రభావతిని వెటకారంగా అడగడం, మనోజ్ ఫర్నిచర్ షాప్, రోహిణి బ్యూటీ పార్లర్‌పై పంచులు వేయడంతో వాతావరణం టెన్షన్‌గా మారుతుంది.
తర్వాత కాంపిటీషన్ మొదటి రౌండ్‌లో జంటల పరిచయాలు జరుగుతాయి. మనోజ్ తనను తాను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌గా పరిచయం చేసుకుంటే, రోహిణి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పుకుంటుంది. సత్యం-ప్రభావతి జంటలో ప్రభావతి తన డాన్స్ స్కూల్ గురించి గొప్పలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బాలు-మీనాల పరిచయానికి మాత్రం ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో బాలు ఫీల్ అవుతాడు, అయితే మీనా నిజాయితీగా బతుకుతున్నామన్న మాటలతో అతడిని ఓదారుస్తుంది. రెండో రౌండ్‌లో టాలెంట్స్ ప్రదర్శన జరుగుతుంది. రోహిణి ఐదు నిమిషాల్లో మేకప్ చేసి అందరినీ మెప్పిస్తే, శృతి డబ్బింగ్ మిమిక్రీతో నవ్వులు పూయిస్తుంది. చివరగా మీనా తన పూల అల్లే నైపుణ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతుంది. ఇలా ఆసక్తికర మలుపులతో ఎపిసోడ్ ముగిసింది.

గురువారం ఎపిసోడ్ కూడా బెస్ట్ కపుల్ కాంబినేషన్ చుట్టూ తిరిగింది. మొదటి రౌండ్‌లో శృతి తన డబ్బింగ్ టాలెంట్‌తో ఆకట్టుకోగా, రోహిణి తన మేకప్ స్కిల్స్‌ను ప్రదర్శించింది. ఇక మీనా వంతు వచ్చేసరికి... 'కళ్ళు మూసుకొని మూడు నిమిషాల్లో మూడు మూరల మల్లెపూలు అల్లుతాను' అంటూ ధైర్యంగా చెప్పింది. దీనిపై ప్రభావతి 'ఇది చిన్నప్పటి నుంచే చేస్తున్న పనే కదా, ఇందులో కొత్తేముంది?' అంటూ ఎగతాళి చేసింది. కానీ యాంకర్ మాత్రం 'ఏదైనా టాలెంట్‌నే... స్టేజ్‌పైకి వచ్చి చూపించండి' అంటూ మీనాను ప్రోత్సహించింది.
కళ్ళకు గంతలు కట్టి మీనా మూడు నిమిషాల్లో ఏకంగా నాలుగు మూరల మల్లెపూలు అల్లేసరికి... స్టేజ్ మొత్తం షాక్! 'మీనా తన రికార్డులను తానే బ్రేక్ చేసింది' అంటూ యాంకర్ ప్రకటించడంతో ప్రేక్షకుల నుంచి చప్పట్ల వర్షం కురిసింది. ప్రభావతి మాత్రం కుళ్లుకుంటూ కనిపించింది. ఇక తానే తక్కువ కాదని నిరూపించేందుకు ప్రభావతి 'నేను డాన్స్ టీచర్‌ని... భరతనాట్యం చేస్తా' అంటూ స్టేజ్‌పైకి వెళ్లింది.
వయసు ఉన్నప్పటికీ కోడలితో పోటీ పడుతూ ప్రభావతి చేసిన క్లాసికల్ డాన్స్ ఆడియన్స్‌తో పాటు జ్యూరీ మెంబర్స్‌ను కూడా ఫిదా చేసింది. స్టేజ్‌పై అడుగులు వేస్తున్న ప్రతి క్షణం ఆమె ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నట్టుగా, తన కోడలితో సమానంగా డాన్స్ చేసి ప్రశంసలు అందుకోవడంతో ప్రభావతి ఇమేజ్ మరోసారి హైలైట్ అయ్యింది. జ్యూరీ మెంబర్స్ కూడా 'ఇంత ఎనర్జీ, గ్రేస్ నిజంగా ఆశ్చర్యం' అంటూ ఆమెను మెచ్చుకున్నారు.
ఇక రెండో రౌండ్‌గా వచ్చిన 'మనసులో మాట' కాంపిటీషన్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చింది. ఈ రౌండ్‌లో ఒకరు సైగలు చేస్తే, మరో వ్యక్తి అవేంటో గుర్తించాలి. ముందుగా మనోజ్-రోహిణి జంట పాల్గొని తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మనోజ్ చేసిన ఇమిటేషన్లకు రోహిణి ఇచ్చిన ఫన్నీ రియాక్షన్స్ స్టేజ్ మొత్తాన్ని నవ్వులతో నింపాయి. చివరికి సరైన సమాధానాలు చెప్పి వారు రౌండ్ క్లియర్ చేశారు. ఆ తర్వాత శృతి-రవి జంట కూడా చాకచక్యంగా ఆడుతూ సమాధానాలు చెప్పి విజయం సాధించారు. అలాగే ప్రభావతి-సత్యం, బాలు-మీనా జంటలు ఎలాంటి తడబాటు లేకుండా అవలీలగా ఈ రౌండ్‌ను పూర్తి చేసి తదుపరి దశకు చేరుకున్నారు.
అయితే మీనాక్షి-రంగా జంటకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. రంగా ఎంతగా ఇమిటేట్ చేసినా, మీనాక్షి సమాధానం చెప్పలేకపోయింది. టైమ్ లిమిట్ ముగియడంతో వారు ఎలిమినేట్ అయ్యారు. దీంతో నిరాశ చెందిన రంగా 'ఇంతదానికి పాతికవేలు ఖర్చు పెట్టించావు?' అంటూ అసహనం వ్యక్తం చేయడం ఎపిసోడ్‌కు సరదా టచ్ ఇచ్చింది. మొత్తం మీద ఈ రౌండ్ హాస్యం, పోటీ, భావోద్వేగాలతో నిండిపోయింది.
ఇక మూడో రౌండ్‌లో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. ఈ రౌండ్‌లో భార్యను భర్త ఎత్తుకోవాలి. ఆ సమయంలో భార్య పై నుంచి వేలాడుతున్న పువ్వును నోటితో పట్టుకుని భర్తకు అందించాల్సి ఉంటుంది. శక్తి, సమన్వయం, ఓపిక... ఈ మూడు అంశాలే ఈ టాస్క్‌లో కీలకంగా మారాయి. మొదటగా శృతి-రవి జంట స్టేజ్‌పైకి వచ్చారు. ప్రారంభంలో ధైర్యంగా కనిపించిన రవి, శృతిని ఎత్తుకున్న కొద్దిసేపటికే ఆమె బరువు మోయలేక మధ్యలోనే వదిలేశాడు.
ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయిన శృతి కిందకు దిగిపోవడంతో టాస్క్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో శృతికి తీవ్ర కోపం వచ్చింది. 'ఈ కాస్త బరువు కూడా మోయలేవా?' అంటూ స్టేజ్‌పైనే రవిని గట్టిగా తిట్టేసింది. ఈ పరిణామంతో శృతి-రవి జంట కాంపిటీషన్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చింది.
ఆ తర్వాత మనోజ్-రోహిణి జంట పోటీలోకి దిగారు. రోహిణి కాస్త బరువుగా అనిపించినా, లక్ష రూపాయల ప్రైజ్ మనీ గెలవాలన్న పట్టుదలతో మనోజ్ వెనకడుగు వేయలేదు. చాలా కష్టపడి రోహిణిని ఎత్తుకొని, ఆమె పువ్వును పట్టుకునేలా సహాయం చేశాడు. చివరికి ఇద్దరూ కలిసి టాస్క్ పూర్తి చేయడంతో ఈ రౌండ్‌లో విన్నర్‌గా నిలిచారు. తర్వాత బాలు-మీనా వంతు వచ్చింది. బాలు ఎంతో సులభంగా మీనాను ఎత్తేయగా, మీనా కూడా చాకచక్యంగా పువ్వును నోటితో పట్టుకొని బాలుకు అందించింది. వీరి సమన్వయం చూసి జడ్జెస్ కూడా ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో ఈ జంట మధ్య రొమాంటిక్ ఫిల్ కనిపించింది. ఇంతటితో ఆగకుండా ప్రభావతి కూడా 'మేము కూడా పోటీలో పాల్గొంటాం' అంటూ ముందుకు వచ్చింది.
అయితే జ్యూరీ మెంబర్స్ దగ్గరకు వెళ్లి, 'నా భర్తకు ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగింది. అందుకే నేను కుర్చీపై నుంచి పువ్వులు పట్టుకునే ప్రయత్నం చేస్తాను' అని రిక్వెస్ట్ చేసింది. హెల్త్ కండిషన్‌ను దృష్టిలో పెట్టుకొని జ్యూరీ స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. పోటీ ప్రారంభమైన తర్వాత ప్రభావతి కుర్చీపై ఎక్కి పువ్వును అందుకునే ప్రయత్నం చేస్తుండగా, ఆ క్షణంలో సత్యం తుమ్మాడు. దాంతో ప్రభావతి ఒక్కసారిగా తడబడిపోయి కుర్చీపై నుంచి జారి కింద పడింది.
'అమ్మో దేవుడా... నా నడుము విరిగిపోయింది' అంటూ ఆమె గట్టిగా అరవడంతో అందరూ కంగారు పడ్డారు. ఇంటిల్లిపాది స్టేజ్‌పైకి పరుగులు తీస్తారు. ప్రభావతి నొప్పితో విలవిలలాడుతుండగా, మీనా తన తోటి కోడళ్లతో కలిసి నాటు వైద్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఉత్కంఠభరిత సన్నివేశంతోనే ఆ రోజు సీరియల్ ముగిసింది.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌పై ఉత్కంఠ .. ఇప్పుడు అందరి మదిలో ఒకే ప్రశ్న ప్రభావతి నడుము సెట్ అవుతుందా? ఫైనల్ రౌండ్‌లో బాలుమీనా, మనోజ్-రోహిణి జంటలు తలపడనున్నాయి. డ్రీమ్ హౌస్ టాస్క్‌లో అందరూ పెద్ద పెద్ద ఇళ్ల కలలు చెబుతుంటే, బాలు మాత్రం తాను పడుతున్న ఇబ్బందులను చెప్పుతూ సింగిల్ బెడ్‌రూమ్ కోరికను వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. చివరికి లక్ష రూపాయలు ఎవరి చేతికి వెళ్తాయి? బెస్ట్ కపుల్‌గా ఏ జంట నిలుస్తుంది? అన్నది ఉత్కంఠంగా మారింది.


Click it and Unblock the Notifications










