Gunde Ninda Gudi Gantalu December 26th Episode: డ్రీమ్ హౌస్ కట్టిన బాలు,మీనా.. స్టేజ్‌పై రోహిణి కంటతడి..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ మొత్తం 'బెస్ట్ కపుల్ కాంబినేషన్' చుట్టూనే తిరిగింది. మొదటి రౌండ్‌లో శృతి తన డబ్బింగ్ టాలెంట్‌తో ఆకట్టుకోగా, రోహిణి మేకప్ స్కిల్స్ చూపించింది. ఇక మీనా వంతు రాగానే 'కళ్ళు మూసుకుని మూడు నిమిషాల్లో మూడు మూరల మల్లెపూలు అల్లుతాను' అంటూ ప్రకటించింది. దీనిపై ప్రభావతి ఎగతాళి చేసినా, మీనా స్టేజ్‌పైకి వచ్చి కళ్ళకు గంతలు కట్టి మూడు నిమిషాల్లో ఏకంగా నాలుగు మూరల మల్లెపూలు అల్లేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. యాంకర్ 'మీనా తన రికార్డులను తానే బ్రేక్ చేసింది' అంటూ ప్రకటించడంతో చప్పట్ల వర్షం కురిసింది.
దీనికి తగ్గట్టుగానే ప్రభావతి కూడా 'నేను డాన్స్ టీచర్‌ని' అంటూ భరతనాట్యం చేసి, వయసు ఒక సంఖ్య మాత్రమే అన్నట్టు తన ఎనర్జీ, గ్రేస్‌తో జ్యూరీతో పాటు ప్రేక్షకులను ఫిదా చేసింది. కోడలితో పోటీ పడుతూ ప్రశంసలు అందుకోవడంతో ప్రభావతి ఇమేజ్ మరింత హైలైట్ అయింది. రెండో రౌండ్ 'మనసులో మాట' కాంపిటీషన్ ఫన్నీ గా సాగింది. ఈ రౌండ్ లో మనోజ్-రోహిణి, శృతి-రవి, ప్రభావతి-సత్యం, బాలు-మీనా జంటలు చాకచక్యంగా ఆడి రౌండ్ క్లియర్ చేశారు. కానీ, మీనాక్షి-రంగా జంట ఎలిమినేట్ అయ్యింది. రంగా చేసిన సరదా కామెంట్ ఎపిసోడ్‌కు నవ్వులు పంచింది. ఇక మూడో రౌండ్‌లో భార్యను భర్త ఎత్తుకుని పువ్వు అందించే టాస్క్ ఉత్కంఠను పెంచింది. శృతి-రవి జంట విఫలమవ్వగా, మనోజ్-రోహిణి, బాలు-మీనా జంటలు విజయం సాధిస్తాయి. చివర్లో ప్రభావతి ప్రమాదవశాత్తూ కింద పడుతుంది.

శుక్రవారం ఎపిసోడ్ కూడా పూర్తిగా 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చుట్టూనే తిరిగింది. గురువారం ఎపిసోడ్ చివర్లో ప్రభావతి కుర్చీపై నుంచి పడిపోవడంతో మొదలైన ఉత్కంఠ... శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే కొనసాగింది. నడుము పట్టుకుని బాధపడుతున్న ప్రభావతిని చూసి అందరూ కంగారు పడుతుంటే, మీనా తన తోడికోడళ్ల సహాయంతో నాటు వైద్యం చేస్తూ నడుమును సెట్ చేస్తుంది. చికిత్స మొరటుగా ఉన్నప్పటికీ ప్రభావతి నడుము సెట్ అవడంతో ఆమె కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. నెమ్మదిగా ఇబ్బంది పడుతూ స్టేజ్ దిగుతుంది.
అయితే స్టేజ్ దిగిన వెంటనే బాలు తన తల్లి ప్రభావతిపై సెటైర్లు వేయడం మొదలుపెడతాడు. 'ఆ కుర్చీ అమ్మ బరువు మోయలేకపోయింది నాన్న... నాన్న మోసి ఉంటే ఆయన పరిస్థితి కూడా అంతే ఉండేది'అంటూ వ్యంగంగా మాట్లాడుకుంటారు. దీంతో ప్రభావతి బాలు మీద కసరుకుంటుంది. కానీ బాలు ఆగకుండా, "మీనా నడుము సెట్ చేసింది కాబట్టి సరిగ్గా ఉన్నావు... లేదంటే ముసలి దానిలా ఇంటికి వెళ్లాల్సి వచ్చేది'అంటూ మరింత సెటైరికల్ గా మాట్లాడతాడు. ఈ మాటలతో అక్కడ వాతావరణం కాస్త టెన్షన్‌గా మారుతుంది.
ఈ సంభాషణల మధ్య మీనాక్షి మాటలు మరింత వివాదాస్పదంగా మారాయి. 'నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది' అంటూ అనూహ్యంగా స్పందిస్తుంది. ఎందుకని అడిగితే, 'మనము గెలవకపోయినా పక్కవాళ్లు ఓడిపోతే వచ్చే సంతోషమే వేరు' అంటూ తన అంతరంగాన్ని బయటపెడుతుంది. ఆమె మాటలకు అందరూ షాక్ అవుతుంటే.. 'ఇంత రాక్షసత్వమా?' అని ప్రభావతి ప్రశ్నిస్తారు. దానికి మీనాక్షి, 'నువ్వు మాత్రం తక్కువ కాదు... నాకంటే ఎక్కువే' అంటూ ఎదురు దాడి చేస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ కాంపిటీషన్‌లో వాతావరణాన్ని వేడెక్కిస్తారు.
ఇదే సమయంలో మీనాక్షి 'మనకిక్కడ ఏం పని ఉంది? బయట కేజీ సేల్స్ నడుస్తున్నాయట... చీరలు కొనుకుందాం" అంటూ రంగాను బయటకు వెళ్లమని అంటుంది. దీంతో రంగా కోపంగా 'ఇంకోసారి చీరల మాట తీస్తే చీరేస్తా... ఎక్కువ మాట్లాడితే రోడ్డుమీదే విడాకులు ఇచ్చేస్తా... నీ వల్లే పాతికవేలు లాస్'అంటూ వార్నింగ్ ఇస్తాడు. రంగ మాటలతో మీనాక్షి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.ఈ సన్నివేశం ఎపిసోడ్‌కు కామెడీ టచ్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, కాంపిటీషన్‌లో లీడింగ్‌లో ఉన్న జంటలను జడ్జెస్ ప్రకటిస్తారు. అప్పటివరకు జరిగిన రౌండ్ల ఆధారంగా మనోజ్-రోహిణి జంట మొదటి స్థానంలో ఉండగా, శృతి -రవి రెండో స్థానంలో, మీనా-బాలు మూడో స్థానంలో ఉన్నట్టు వెల్లడిస్తారు. ఈ ప్రకటనతో పోటీ మరింత ఉత్కంఠగా మారుతుంది. తర్వాత మరో రౌండ్ ప్రారంభమవుతుంది. ఇందులో భార్యాభర్తలు ఒకరి జీతం గురించి మరొకరు చెప్పాలి. ముందుగా శృతి- రవి లను అడుగుతారు. శృతి చాలా క్లియర్‌గా, 'అతని జీవితం ఏంటో నాకు తెలియదు... మా మధ్య ఆ విషయం ఎప్పుడూ రాలేదు. నాకంటే తక్కువే సంపాదిస్తాడు'అని చెబుతుంది. రవి కూడా, 'నేను జీవితం గురించి ఎక్కువగా పట్టించుకోను' అంటూ ఓపెన్‌గా మాట్లాడతాడు. వీరి సమాధానాలు జడ్జెస్‌ను పెద్దగా ఆకట్టుకోవు.
తర్వాత మనోజ్-రోహిణి వంతు వస్తుంది. 'మీరు కరెక్ట్ ప్రశ్న అడగడం లేదు... నా జీవితం గురించి నేను ఎందుకు చెప్పాలి? నా సంపాదన గురించి అడగడానికి మీరు ఎవరు?' అంటూ మనోజ్ ఒక్కసారిగా జడ్జెస్‌కే ఎదురు ప్రశ్నలు వేశాడు. కానీ, జడ్జెస్ మాత్రం కచ్చితంగా చెప్పాలని ఒత్తిడి చేస్తారు.దీంతో మనోజ్ తన ఆదాయం గురించి చెప్పాల్సి వస్తుంది. 'నాకు ఫర్నిచర్ షాప్ ఉంది... కొత్తగా ప్రారంభించా... అన్ని ఖర్చులు పోగా నెలకు పదివేలు మిగులుతాయి'అని చెప్పడంతో జడ్జెస్ వ్యంగ్యంగా స్పందిస్తారు. 'నీ బిల్డప్ చూస్తే కోట్లలో సంపాదించినట్టు ఉంది... చివరకు పదివేలేనా?'అంటూ గాలి తీసేయడంతో మనోజ్ సైలెంట్ అయిపోతాడు.
ఇక బాలు-మీనా వంతు రాగానే సీన్ మారిపోతుంది. మీనా మాట్లాడుతూ, ' మా ఆయన కార్ డ్రైవర్... నెలకు యాభైవేల వరకు సంపాదిస్తాడు. నా బండి నుంచి ఇంటి ఖర్చుల వరకు అన్నీ ఆయనే చూసుకుంటాడు' అని చెబుతుంది. బాలు కూడా మీనా గురించి చెబుతూ, 'నా భార్య రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు సంపాదిస్తుంది. ఇంటి ఖర్చులు, నా కార్ ఈఎంఐ కూడా తానే కడుతుంది'అని నిజాయితీగా మాట్లాడతాడు. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పడంతో జడ్జెస్ బాగా ఇంప్రెస్ అవుతారు.
బ్రేక్ సమయంలో ముగ్గురు జంటలు తమ తమ ప్లాన్లు వేసుకుంటారు. జడ్జెస్‌ను ఇంప్రెస్ చేయాలని మనోజ్, రవి వ్యూహాలు రచిస్తుంటే... బాలు-మీనా మాత్రం, ' మనమిలాగే ఉంటే చాలు... ఎవరో బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు'అనుకుంటారు. తర్వాత 'మనసులో ఉన్నది' రౌండ్ ప్రారంభమవుతుంది. ఇందులో అన్యోన్యతపై ప్రశ్నలు వేస్తారు. శృతి-రవి తమ మధ్య గొడవలే రావని, రవి ఎప్పుడూ క్షమాపణ చెబుతాడని చెబుతారు. మనోజ్ మాత్రం,'నేను ఇప్పటివరకు రోహిణికి సారీ చెప్పలేదు'అంటూ మళ్లీ బిల్డప్ ఇస్తాడు.
అయితే బాలు- మీనా సంసారం గురించి మాట్లాడుతూ.. 'గొడవలు లేని సంసారం ఉప్పు కారం లేని వంటలాంటిది' అని బాలు చెబితే, మీనా 'చీకటి-వెలుగులు ఎలా ఉంటాయో... సంసారంలో కూడా గొడవలు కామన్. కానీ అవి సాయంత్రం లోపే పోవాలి'అంటూ సంసారానికి కొత్త నిర్వచనం ఇస్తుంది. జడ్జెస్ మరోసారి ఫిదా అవుతారు.
'నీ మనసు నాకు తెలుసు' మరో రౌండ్ నిర్వహించారు. ఈ రౌండ్‌లో భార్యాభర్తలు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ, మనసులో దాచుకున్న మాటలను బయటపెట్టాలి. ఈ టాస్క్ భావోద్వేగాలకు, సంబంధాల నిజాయితీకి అద్దం పట్టింది. మొదటగా మనోజ్-రోహిణి జంట స్టేజ్‌పైకి వచ్చింది. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడిన మనోజ్, 'నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నేను క్షమిస్తా. నువ్వు ఏ తప్పు కూడా నాతో దాచి పెట్టలేదన్న నమ్మకం నాకుంది'అని హృదయాన్ని తాకేలా మాట్లాడాడు. మనోజ్ మాటలకు రోహిణి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. స్టేజ్‌పైనే ఆమె కళ్ల నుంచి నీళ్లు జారాయి. 'నువ్వు నాకు దొరకడం కూడా నా అదృష్టమే'అంటూ మనోజ్‌ను హగ్ చేసుకుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులకే కాదు, జడ్జెస్‌కూ భావోద్వేగాన్ని కలిగించింది.
తర్వాత శృతి-రవి వంతు వచ్చింది. శృతి కాస్త హాస్యంగా 'మా ఆయన పిరికివాడు... ప్రతి దానికి భయపడతాడు'అంటూ రవిని టీజ్ చేసింది. దీనికి రవి కూడా నవ్వుతూ స్పందించి, 'శృతి నాకు దొరకడం నా అదృష్టం. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంటుంది'అన్నాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. రవి తన మనసులోని అసలు కోరికను బయటపెట్టాడు. 'మాది పెద్ద కుటుంబం. మేము నలుగురం. మాకు కూడా నలుగురు పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను'అని చెప్పాడు.
ఈ మాటలు వినగానే శృతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎలాంటి సంకోచం లేకుండా,'నాకు పిల్లలే వద్దు. నేను జీవితంలో పిల్లలను కనాలనుకోవడం లేదు'అంటూ స్టేజ్‌పైనే తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించింది. దీంతో ప్రేక్షకులు, జడ్జెస్ అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లల విషయంలో ఉన్న భిన్నాభిప్రాయాలతో శృతి-రవి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటల యుద్ధం పెరిగిపోవడంతో ఇద్దరూ అసహనంగా ఒకరినొకరు తిట్టుకుంటారు.
ఇక బాలు-మీనా వంతు రాగానే వాతావరణమే మారిపోయింది. ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ మౌనంగా మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుకున్న మాటలను బయటకు చెప్పాలని అడిగితే, మీనా 'మేము మాట్లాడుకున్నది బయటకు చెప్పడం ఎలా సాధ్యమవుతుంది?'అంటుంది. దీంతో జడ్జెస్ ప్రత్యేకంగా వారిద్దరికీ ప్రశ్నలు వేసి, సమాధానాలను బోర్డులపై రాయమన్నారు. ఇక్కడే బాలు-మీనా అన్యోన్యత పూర్తిగా బయటపడింది. ఒకరిని చూడకుండానే, ఏడు ప్రశ్నలకు ఏడు సమాధానాలు ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ప్రశ్నకు ఇద్దరి సమాధానాలు ఎలా ఇంత ఖచ్చితంగా ఒకేలా వచ్చాయో అని జడ్జెస్ ప్రశ్నించగా, బాలు చిరునవ్వుతో 'మా శరీరాలు వేరైనా... మా మనసు ఒక్కటే'అని చెప్పాడు. ఆ మాటలకు జడ్జెస్ పూర్తిగా ఫిదా అయ్యారు. ఇది ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.
అనంతరం చివరి రౌండ్‌ను ప్రకటించారు. ఈ రౌండ్‌లో భార్యాభర్తలు కలిసి తమ 'డ్రీమ్ హౌస్' నిర్మించాలి. అయితే కండిషన్ ఏంటంటే - ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు. మాటలు లేకుండా ఒకరి ఆలోచనను మరొకరు అర్థం చేసుకుని ఇల్లు నిర్మించాలి. ఈ రౌండ్‌లో మనోజ్-రోహిణి ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోలేక గందరగోళానికి గురయ్యారు. ఇద్దరి డ్రీమ్‌లు వేర్వేరుగా ఉండటంతో సరైన నిర్మాణం చేయలేకపోయారు. అదే పరిస్థితి శృతి-రవి జంటకూ ఎదురైంది. ఇప్పటికే పిల్లల విషయంలో వచ్చిన గొడవ ప్రభావం ఈ రౌండ్‌పై కూడా పడింది. కానీ, బాలు-మీనా మాత్రం మరోసారి తమ సమన్వయాన్ని నిరూపించారు. మాటలు లేకుండా, చూపులు, సంకేతాలతోనే తమ డ్రీమ్ హౌస్‌ను పర్ఫెక్ట్‌గా నిర్మించారు. ఈ ఉత్కంఠభరిత సన్నివేశంతో నేటి ఎపిసోడ్ ముగిసింది.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో బెస్ట్ కపుల్స్‌గా బాలు-మీనా పేరును జడ్జెస్ ప్రకటిస్తారు. లక్ష రూపాయల చెక్ చేతబట్టి బాలు -మీనా ఊరేగింపుగా ఇంటికి వస్తారు. అయితే ఈ విషయం ప్రభావతికి తెలియదు. తన పెద్ద కొడుకు, పెద్ద కోడలే విజేతలయ్యారని భావిస్తూ హారతి పళ్లెంతో బయటికి వస్తుంది. కానీ తీరా మీనా-బాలు బెస్ట్ కపుల్‌గా లక్ష రూపాయలు గెలుచుకున్నారని తెలిసి ప్రభావతి షాక్ అవుతుంది. ఈ పరిణామం ఇంట్లో ఎలాంటి కలకలం రేపుతుందో, ప్రభావతి ఎలా స్పందిస్తుందో చూడాలంటే ఇక వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











