Gundeninda Gudigantalu December 29th Episode: బాలు-మీనా విజయం.. మనోజ్-రోహిణి లకు అవమానం..
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చుట్టూనే తిరిగింది. పోటీ ప్రారంభంలోనే ప్రభావతి కుర్చీపై నుంచి పడిపోవడంతో నడుము పట్టుకుని బాధపడింది. ఆమె పరిస్థితి చూసి అందరూ కంగారు పడుతుండగా, మీనా తన తోడికోడళ్ల సహాయంతో నాటు వైద్యం చేసి ప్రభావతి నడుమును సెట్ చేసింది. చికిత్స కాస్త మొరటుగా ఉన్నప్పటికీ నడుము సెట్ కావడంతో ప్రభావతి ఊపిరి పీల్చుకుంది. అయితే స్టేజ్ దిగే సమయంలో ఆమె ముఖంలో నొప్పి స్పష్టంగా కనిపించింది. స్టేజ్ దిగిన వెంటనే బాలు తన తల్లి ప్రభావతిపై సెటైర్లు వేయడం హైలైట్‌గా నిలిచింది. ఇదే సమయంలో మీనాక్షి'మనం గెలవకపోయినా పక్కవాళ్లు ఓడిపోతే వచ్చే ఆనందమే వేరు' అంటూ చేసిన కామెంట్స్‌తో వాతావరణం మరింత హీట్ ఎక్కింది.
తర్వాత జడ్జెస్ లీడింగ్‌లో ఉన్న జంటలను ప్రకటించగా, మనోజ్-రోహిణి తొలి స్థానంలో, శృతి- రవి రెండో స్థానంలో, బాలు-మీనా మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలు ఒకరి జీతం గురించి మరొకరు చెప్పాల్సిన రౌండ్‌లో మనోజ్ జడ్జెస్‌తో మాటల యుద్ధం చేయడం హైలైట్‌గా నిలిచింది. అయితే బాలు-మీనా వంతు రాగానే సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకరిపై ఒకరు నమ్మకంతో సమాధానాలు చెప్పడం జడ్జెస్‌ను ఆకట్టుకుంది. చివరి 'డ్రీమ్ హౌస్' టాస్క్‌లో చూపులు, సంకేతాలతోనే ఇల్లు నిర్మించి తమ అన్యోన్యతను చాటారు. "మా మనసు ఒక్కటే" అన్న బాలు మాటలు ఈ ఎపిసోడ్‌కు అసలైన హైలైట్‌గా నిలిచాయి.

Courtesy: jiohotstar
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ మొత్తం 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' ఫైనల్ రౌండ్ చుట్టూనే తిరిగింది. ఈ ఫైనల్ రౌండ్‌లో భాగంగా జడ్జెస్ అన్ని జంటలకు ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే... తమ డ్రీమ్ హౌస్‌ను నిర్మించడం. ఈ టాస్క్‌లో ప్రతి జంట తమ ఆలోచనలను, ఒకరిపై ఒకరికి ఉన్న అవగాహనను, దాంపత్య బంధాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇదే ఈ రౌండ్‌కు అసలైన టెస్ట్‌గా మారింది. మొదటగా మనోజ్ - రోహిణి జంట టాస్క్ పూర్తి చేసింది. "మీరేం కట్టాలని అనుకున్నారు?" అని జడ్జెస్ అడగ్గా, మనోజ్ ధీమాగా "నేను పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టాలని అనుకున్నాను" అని చెబుతాడు. అయితే వెంటనే రోహిణి విరుచుకుపడుతుంది. "డూప్లెక్స్ కట్టడానికి టైం సరిపోలేదు. కనీసం కాంపౌండ్ వాల్ కూడా పూర్తిగా కట్టలేకపోయాం" అంటూ మనోజ్‌పై అసహనం వ్యక్తం చేస్తుంది. ఇద్దరి మధ్య సమన్వయం లోపించిందన్న విషయం అక్కడికక్కడే స్పష్టమవుతుంది.
తర్వాత రవి - శృతి జంటను ప్రశ్నిస్తారు. వారు "మేము పెద్ద విల్లా కట్టాలని అనుకున్నాం. కానీ డిజైన్ విషయంలో ఇద్దరికీ ఒకే అభిప్రాయం లేకపోవడంతో సైలెంట్‌గా ఉండిపోయాం" అని సమాధానం ఇస్తారు. ఈ మాటల్లోనే వారి రిలేషన్‌షిప్ స్టేజ్ కూడా బయటపడుతుంది. ఇంకా పూర్తిస్థాయి భార్యాభర్తలుగా కాకుండా లవర్స్‌లానే ఉన్నారన్న విషయం స్పష్టమవుతుంది. చివరగా బాలు - మీనా జంటను ప్రశ్నిస్తారు. ఈ సమయంలో మీనా ఎమోషనల్ అవుతుంది. "మాకు ఇంట్లో సపరేటుగా ఒక రూమ్ కూడా లేదు. మాకంటూ ఉన్నది ఒక్క రూమే. అందుకే మా కల... మాకోసం ఒక చిన్న రూమ్ నిర్మించుకోవడం. అందుకే పెద్ద భవనాల గురించి కాకుండా, మా జీవితానికి అవసరమైన ఒక్క రూమ్‌ని కట్టుకున్నాం" అని చెబుతుంది. బాలు కూడా అదే మాటకు సపోర్ట్ చేస్తూ, తమ ఇద్దరి ఆలోచనలు ఒకే దిశలో ఉన్నాయని చెబుతాడు. ఈ సమాధానం జడ్జెస్‌ను బాగా ఇంప్రెస్ చేస్తుంది.
ఈ రౌండ్ ముగిసిన తర్వాత జడ్జెస్ 'మా డిస్కషన్ తర్వాత ఫైనల్ విన్నర్‌ను ప్రకటిస్తాం' అని చెబుతారు. దీంతో పాల్గొన్న జంటల మధ్య ఉత్కంఠ నెలకొంటుంది. మనోజ్ మాత్రం 'ఈసారి ఖచ్చితంగా నేనే విన్నర్. లక్ష రూపాయలు నాకే వస్తాయి' అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తాడు. ఇక బాలు - మీనా మాత్రం ఫలితం ఏదైనా సరే, ఒకరు తమను బెస్ట్ కపుల్‌గా గుర్తిస్తే చాలని భావిస్తారు. కొంతసేపటికి జడ్జెస్ స్టేజ్‌పైకి వచ్చి ఫలితాలపై మాట్లాడటం మొదలుపెడతారు. ముందుగా మనోజ్ - రోహిణి గురించి వ్యాఖ్యానిస్తారు. 'మీరు చెప్పిన సమాధానాలు బాగున్నాయి. కానీ అవి హృదయం నుంచి కాకుండా, మమ్మల్ని మెప్పించడానికి చెప్పినట్లుగా ఉన్నాయి' అని జడ్జెస్ అంటారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. 'మీరు సరైన ప్రశ్నలు అడగలేదు' అంటూ జడ్జెస్‌పై తిరగబడతాడు. రోహిణి కూడా 'మేము బాగా సమాధానం చెప్పాం. మాకు ఎందుకు ప్రైజ్ మనీ ఇవ్వరు?' అంటూ ప్రశ్నిస్తుంది.
అప్పుడు జడ్జెస్ ఇంటర్వెల్ టైమ్‌లో వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలను వీడియోగా ప్లే చేస్తారు. ఆ వీడియోలో వీరిద్దరూ పోటీని ఎలా మేనేజ్ చేయాలో, జడ్జెస్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో మాట్లాడుకున్న తీరు బయటపడుతుంది. దీంతో ఒక్కసారిగా మనోజ్-రోహిణిల పరువు గాలిలో కలిసిపోతుంది. తర్వాత రవి - శృతి గురించి మాట్లాడుతారు. 'వీరిద్దరూ ఇంకా లవర్స్‌లానే ఉన్నారు. మీ గొడవలు టామ్ అండ్ జెర్రీలా ఉన్నాయి. స్వార్థం లేకుండా గొడవపడితే, త్వరలోనే మంచి కపుల్స్ అవుతారు'అని జడ్జెస్ అంటారు. దీనికి శృతి 'మేము ఇలాగే టామ్ అండ్ జెర్రీలా ఉండాలనుకుంటున్నాం' అని నవ్వుతూ చెబుతుంది. రవి కూడా జడ్జెస్ ఇచ్చిన జడ్జ్‌మెంట్‌కు రెస్పెక్ట్ ఇస్తానని అంటాడు.
చివరగా బాలు- మీనా గురించి మాట్లాడుతారు. 'వీరిద్దరూ పర్ఫెక్ట్ కపుల్స్. ప్రతి విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. మీనా భయపడినప్పుడు బాలు ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇలాంటి అవగాహన ఉంటే ఏ కాపురమైనా బాగుంటుంది. బెస్ట్ కపుల్‌కు వీరు కొత్త నిర్వచనం' అంటూ జడ్జెస్ ప్రశంసల వర్షం కురిపిస్తారు. అనంతరం ఈ కాంపిటీషన్‌లో బెస్ట్ కపుల్స్‌గా బాలు - మీనాలను ప్రకటిస్తారు. స్టేజ్‌పైకి పిలిచి అవార్డుతో పాటు లక్ష రూపాయల చెక్ అందజేస్తారు. ఈ సమయంలో బాలు అమాయకంగా 'క్యాష్ ఇస్తానన్నారు... ఏదో అట్ట ముక్క ఇచ్చారు' అని అనడంతో అందరూ నవ్వుతారు. 'మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా... అమౌంట్ ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది'అని జడ్జెస్ చెబుతారు. రవి కూడా 'ఇక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మా బాలు అన్నయ్య' అంటూ ప్రశంసిస్తాడు.
ఇదిలా ఉండగా ఓడిపోయిన మనోజ్ - రోహిణి అవమానంతో ఇంటికి చేరుకుంటారు. కానీ ప్రభావతి మాత్రం వాళ్లిద్దరే గెలిచారని అనుకుని హారతి ఇవ్వడానికి సిద్ధమవుతుంది. 'లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చారా చెక్ ఇచ్చారా?' అంటూ ప్రశ్నలు వేస్తుంది. చివరకు మనోజ్ ఓడిపోయిన విషయం చెప్పడంతో ప్రభావతి ముఖం వాడిపోతుంది. రవి - శృతి ఇంటికి చేరుకున్నప్పుడు కూడా ప్రభావతి లక్ష గురించి అడుగుతుంది. అంతలోనే బ్యాండ్ మేళం శబ్దం వినిపిస్తుంది. బాలు - మీనాలను వారి ఫ్రెండ్స్ ఊరేగింపుగా తీసుకొస్తారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభావతి షాక్ అవుతుంది. నచ్చకపోయినా, సత్యం బెదిరించడంతో బాలు - మీనాలకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది.
ఆ తర్వాత ప్రభావతి మనోజ్‌పై తీవ్రంగా మండిపడుతుంది. "ఎన్ని డిగ్రీలు ఉన్నా ఏం ప్రయోజనం?" అంటూ తిడుతుంది. లక్ష ఎందుకు రాలేదని అడిగితే, 'అక్కడ కొట్టుకునే జంటలకే ప్రైజ్ ఇచ్చారు' అంటూ రోహిణి సమాధానం ఇస్తుంది. దీనిపై ప్రభావతి "ఆ పూలమ్ముకునే దానికి, దాని మొగునికి రావడం నాకు జీర్ణం కావడం లేదు'అంటూ మీనా - బాలుపై ద్వేషం కురిపిస్తుంది. ఈ మాటలు బాలు వింటాడు. 'బయట ఏమైనా కొట్టుకుపోతున్నాయా?' అంటూ సెటైర్ వేస్తాడు. చెక్కును ఏం చేయాలన్న ప్రశ్నకు మీనా 'మన కట్టుకునే ఇంటికి గుర్తుగా పెట్టుకుందాం' అంటుంది. ప్రభావతి మాత్రం ' మెడదలో వేలాడదీసుకోండి'అంటూ కించపరిచే ప్రయత్నం చేస్తుంది. 'లక్షల సంపాదించడం మామూలు విషయమా?' అని మీనా అంటే, 'లక్షల మింగే వాళ్లు ఈ ఇంట్లోనే ఉన్నారు' అంటూ బాలు మనోజ్‌పై సెటైర్ వేస్తాడు.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఈ గొడవలు మరింత ముదిరేలా ఉన్నాయి. 'లక్ష రూపాయలకే ఇంత సంబరం ఎందుకు?' అంటూ మనోజ్, 'లక్ష గెలిచితే లక్షణవంతమైన కాపురమా?' అంటూ ప్రభావతి వెటకారాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవలపై కొత్త కోణంలో చర్చ మొదలవుతోంది. రానున్న ఎపిసోడ్స్‌లో ఈ కుటుంబంలో మరిన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











