Gundeninda Gudigantalu December 30th Episode: రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రోహిణి.. చింటూ విషయం బయటపడిందా?

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ మొత్తం 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' ఫైనల్ రౌండ్ చుట్టూనే సాగింది. ఈ ఫైనల్ టాస్క్‌గా జడ్జెస్ అన్ని జంటలకు తమ డ్రీమ్ హౌస్ నిర్మాణం చేయాలని సూచించారు. ఈ టాస్క్ ద్వారా జంటల మధ్య అవగాహన, ఆలోచనల సమన్వయం, దాంపత్య బంధం ఎంత బలంగా ఉందో పరీక్షించారు. ముందుగా మనోజ్- రోహిణి జంట తమ టాస్క్ పూర్తి చేసింది. పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టాలని అనుకున్నానని మనోజ్ చెప్పగా, రోహిణి వెంటనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంపౌండ్ వాల్ కూడా పూర్తిగా కట్టలేకపోయామని మండిపడింది. ఈ దశలోనే వీరిద్దరి మధ్య సమన్వయం లోపించిందని స్పష్టమైంది. ఆ తర్వాత రవి-శృతి జంట "మేము పెద్ద విల్లా కట్టాలని అనుకున్నాం కానీ డిజైన్ విషయంలో ఒకే అభిప్రాయం లేక సైలెంట్‌గా ఉండిపోయాం" అని చెప్పడంతో, వీరిద్దరూ ఇంకా లవర్స్ స్టేజ్‌లోనే ఉన్నారనే విషయం బయటపడింది.

చివరగా బాలు-మీనా జంట మాటలు అందరినీ కదిలించాయి. 'మాకంటూ ఒక చిన్న రూమ్ కూడా లేదు. అందుకే మా కల ఒక్క రూమ్ కట్టుకోవడమే' అంటూ మీనా భావోద్వేగంగా చెప్పగా, బాలు అదే ఆలోచనకు మద్దతిచ్చాడు. ఈ సమాధానం జడ్జెస్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. ఫలితాల సమయంలో మనోజ్-రోహిణి జంట మమ్మల్ని మెప్పించడానికి మాట్లాడారని జడ్జెస్ వ్యాఖ్యానించడంతో, ఇంటర్వెల్‌లో చేసిన వారి ప్లానింగ్ వీడియో బయటపడింది. దీంతో వీరిద్దరి పరువు పోయింది.చివరికి జడ్జెస్ బాలు-మీనా జంటనే బెస్ట్ కపుల్ గా ప్రకటించి లక్ష రూపాయల చెక్ అందజేశారు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ప్రభావతి వీరిపై కించపరిచే వ్యాఖ్యలు చేసినా, బాలు తన సెటైర్లతో ధీటుగా సమాధానం ఇచ్చాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో బాలు-మీనా జంట దాంపత్యానికి కొత్త నిర్వచనం ఇచ్చారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Gunde Ninda Gudi Gantalu serial episode 586 December 30th 2025 here is full story

Courtesy: jiohotstar

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ మరోసారి హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' ఫలితాల అనంతరం మొదలైన ఉద్రిక్తతలు ఈ ఎపిసోడ్ మొత్తం కొనసాగాయి. ముఖ్యంగా బాలు- మీనా గెలుపును తట్టుకోలేకపోయిన మనోజ్, రోహిణి, ప్రభావతిల మాటలు పరిస్థితిని మరింత విషమం చేశాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే మనోజ్ నోట జారిన మాటలు కలకలం రేపాయి. 'వాళ్లిద్దరూ ప్రాడు పని చేసి గెలిచారు'అని బాలు -మీనాలను అవమానించేలా మాట్లాడుతాడు. దీనికి మీనా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 'అవును, మీరు చెప్పాలి దాని గురించి'అంటూ మనోజ్ గతంలో చేసిన తప్పులను గుర్తు చేసింది. ముఖ్యంగా 40 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం, నగలు అమ్ముకున్న విషయం ప్రస్తావించడంతో రోహిణి కోపంతో ఊగిపోయింది. 'ఏంటి ఇలా ఎగిసిపడుతున్నావు?'అంటూ మీనా ప్రశ్నించడంతో రోహిణి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది.

ఇక ప్రభావతి కూడా మనోజ్-రోహిణిలకు మద్దతుగా మాట్లాడింది. దీంతో మనోజ్ మరింత రెచ్చిపోయి, 'జడ్జిలకు బాలు గారి గురించి సరిగ్గా తెలియదు. అందుకే లక్ష రూపాయలు గెలిచారు' అంటూ ఎద్దేవా చేశాడు. ఈ సమయంలో సత్యం రంగంలోకి దిగాడు. 'అనవసరంగా గొడవలు వద్దు. బాలు పోటీలో గెలిచాడు. లక్ష రూపాయలు సంపాదించుకున్నారు. ఇంతటితో ఆపేయండి'అంటూ హెచ్చరించాడు. అయితే ప్రభావతి ఊరుకోలేదు. 'లక్ష గెలవగానే లక్షణమైన కాపురం అవుతుందా?' అంటూ బాలు -మీనాలను మరోసారి అవమానించింది. దీనికి మనోజ్ కూడా తోడై, 'వీళ్లు వారానికోసారి గొడవపడతారు. వాళ్లను ఆదర్శ జంట అంటారా? మంచి దంపతులు అంటే అండర్‌స్టాండింగ్ ఉండాలి. మమ్మల్ని చూడండి, మేము ఎప్పుడైనా గొడవ పడినట్టు చూశారా?'అంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో బాలు 'నువ్వు ఎన్ని మింగినా పార్లరమ్మ భరిస్తూనే ఉంది. జైలు నుంచి డబ్బులు తీసుకొచ్చి మరీ నిన్ను పోషించింది. నువ్వు మింగిన ప్రతిదీ ఆమె మీద వేసుకొని తీరుస్తుంది. ఇంకా నువ్వు ఎలా గొడవ పడతావు? ఇద్దరికిద్దరు పెద్ద కేడీలు అని మార్కులు వేసిన వారే చెప్పారు' అంటూ మనోజ్‌ను నిలదీశాడు. ఈ మాటలకు అక్కడున్నవారంతా నిశ్శబ్దమయ్యారు. మీనా కూడా బాలుకి మద్దతుగా, 'చిన్న చిన్న గొడవలు ఉంటేనే సంసారం'అంటూ చురకలు వేసింది. బాలు మరింత ముందుకు వెళ్లి, 'సంసారంలో గొడవలే లేవంటే భార్యాభర్తల మధ్య ఏవో రహస్యాలు ఉన్నట్లే. ఏదో ఒక రోజు అవి బయటపడితే చచ్చినట్టు క్షమించుకోరు'అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. దీంతో రోహిణి ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయింది.

ఇది గమనించిన ప్రభావతి వెంటనే రోహిణి దగ్గరకు వెళ్లి, 'కాంపిటీషన్‌లో ఏం జరిగింది? జడ్జెస్ ఏం ప్రశ్నించారు?'అంటూ ఆరా తీసింది. రోహిణి మాత్రం ఏమీ తెలియనట్టు మాట్లాడి, 'మీరు దీని గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు?'అంటూ రివర్స్‌గా ప్రశ్నించింది. కానీ ప్రభావతి అక్కడితో ఆగలేదు. 'భార్యాభర్తల మధ్య గొడవలు లేవంటే మీ ఇద్దరి మధ్య దాపరికాలున్నాయన్నట్టేనా'అంటూ రోహిణిని నిలదీసింది. ఒకరినొకరు మోసం చేసుకుంటున్నట్లుగా మాట్లాడడంతో రోహిణి తెలివిగా తప్పించుకుంది. 'ఇన్నేళ్లు కాపురం చేస్తున్నాం. ఈ విషయం మీకే తెలియాలి'అంటూ ప్రభావతినే ప్రశ్నించింది. అయినప్పటికీ రోహిణి వాలకం ప్రభావతికి అనుమానాలు కలిగించింది.

మరోవైపు బాలు లక్ష రూపాయల చెక్ తన తండ్రి సత్యంకి ఇవ్వాలనుకుంటాడు. 'మీకు ఇస్తా నాన్న'అని చెప్పగా, "నువ్వు కష్టపడి సంపాదించుకున్నది నాకు ఎందుకురా'అంటూ సత్యం నిరాకరిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం దీనిని తప్పుగా అర్థం చేసుకొని, 'మనం కాంపిటీషన్‌లో ఓడిపోయాం కాబట్టే ఎద్దేవా చేస్తున్నారు'అంటుంది. దీనిపై సత్యం ఘాటుగా స్పందిస్తూ..'ప్రపంచంలో అన్నీ బాగానే ఉన్నా నీకు మాత్రం ఎందుకు తప్పుగా కనిపిస్తాయి?'అని ప్రశ్నిస్తాడు.బాలు ఉద్దేశంగెలుపును ప్రశంసించడమే. వాడి ప్రేమ నాకు చాలు. లక్ష రూపాయలు నాకు అవసరం లేదు" అంటాడు. అంతేకాదు, 'ఆ డబ్బులతో మీ కోసం ఒక రూమ్ కట్టుకోండి. రూపాయి కూడా వేరే దానికి ఖర్చు పెట్టొద్దు' అంటూ స్పష్టంగా చెబుతాడు.

ఈ సమయంలో ప్రభావతిపై సత్యం విరుచుకుపడిన తీరు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. 'స్కూటీ కొన్నవాడు లక్ష సంపాదించగలిగినవాడు రూమ్ కట్టలేడా? 40 లక్షలు ఎత్తుకెళ్లినవాడు, నగలు అమ్ముకున్నవాడు నీకు గొప్పగా కనిపిస్తున్నాడా?' అంటూ మనోజ్‌ను టార్గెట్ చేస్తూ ప్రభావతిని గట్టిగా తిడతాడు. 'మనస్ఫూర్తిగా లక్ష ఇవ్వాలనుకున్న బాలు నీకు కొడుకులా కనిపించడం లేదా?'అంటూ ప్రశ్నిస్తాడు. ఇంతలో మనోజ్ అక్కడికి వచ్చి, 'నేను ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చాను. అదే వాళ్ల బుర్రకు ఎక్కలేదు'అంటూ వింతగా మాట్లాడతాడు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రభావతి పుట్టినప్పటి నుంచి మనోజ్ చేసిన మోసాల చిట్టాను బయటపెడుతుంది. దీనికి మనోజ్ పూర్తిగా సైలెంట్ అయిపోతాడు.

ఆపై 'జడ్జెస్ ఏమన్నారు? భార్యాభర్తల మధ్య గొడవలు లేవంటే సీక్రెట్స్ ఉన్నాయా? నువ్వు రోహిణి దగ్గర ఏమైనా దాస్తున్నావా?' అంటూ ప్రభావతి నిలదీస్తుంది. ఈ మాటలకు కోపగించిన మనోజ్, 'బాలు లాగా నువ్వు కూడా నన్ను నిలదీస్తున్నావా?'అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ప్రభావతికి మనోజ్ - రోహిణి ఇద్దరూ ఏదో దాస్తున్నారన్న అనుమానం బలపడుతుంది.

ఇదిలా ఉండగా, రోహిణి తన గదిలో కూర్చొని కాంపిటీషన్‌లో ఓడిపోయినందుకు బాధపడుతుంది. మనోజ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ, 'ఇంకా వేరే కాంపిటీషన్లు వస్తాయి. తప్పకుండా గెలుస్తాం' అంటాడు. కానీ రోహిణి, 'బాలుకు రావాల్సిన లక్ష మనకు రావాల్సింది'అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. జడ్జెస్‌కు బ్రెయిన్ లేదని, బాలు-మీనా మాటలకు ఫిదా అయి గెలిపించారని మండిపడుతుంది. అయితే మనోజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ.. 'నా లైఫ్‌లో నువ్వే బెస్ట్ పర్సన్. పెళ్లికాకముందు నేను లివింగ్ రిలేషన్‌లో ఉన్నా నన్ను క్షమించావు. నా తప్పులన్నిటిని భరించావు. నన్ను బిజినెస్‌మాన్‌గా మార్చావు'అంటూ ప్రశంసలు కురిపిస్తాడు.

దీనికి రోహిణి, 'అది మీ నాన్న డబ్బుతో స్టార్ట్ చేసిన బిజినెస్. అందులో నా క్రెడిట్ ఏముంది?'అని ప్రశ్నిస్తుంది. వెంటనే మనోజ్, 'డబ్బుతో పాటు ఐడియాలు కూడా కావాలి. ప్రతి విషయంలో నువ్వే నాకు తోడున్నావు. నువ్వే నా బెస్ట్ వైఫ్'అంటూ మళ్లీ ప్రేమ కురిపిస్తాడు. ఇద్దరూ తమను తాము బెస్ట్ కపుల్స్ అని సమర్థించుకుంటారు. మరోవైపు రవి-శృతి మధ్య పిల్లల అంశంపై మరో గొడవ చెలరేగుతుంది. శృతి కెరియర్ గురించి మాట్లాడుతూ, 'ఆడవారి మాటలను అర్థం చేసుకోరా?' అంటూ రవిపై ఎగిసిపడుతుంది. రవి గొడవ వద్దని సైలెంట్ అవుతాడు. చివరికి పిల్లల విషయాన్ని ఇకపై మాట్లాడనని మాట ఇస్తాడు.

ఇక బాలు - మీనా హాల్లో సరదాగా మాట్లాడుకుంటూ రిలాక్స్ అవుతారు. అయితే అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో మరో షాకింగ్ ట్విస్ట్ కనిపించనుంది. రోహిణి తన కొడుకు బట్టలు కొనడానికి షాప్‌కు వెళ్లగా, అదే షాప్‌కు ప్రభావతి - మీనాక్షి వస్తారు. షాప్‌కీపర్ "మీ కొడుకు చాలా మంచి బట్టలు తీసుకున్నారు" అని చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'కొడుకు ఏంటి?' అంటూ రోహిణిని నిలదీయడంతో, ఈ ట్రాక్ మరింత ఉత్కంఠగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X