Gunde Ninda Gudi Gantalu December 31th Episode: రొమాన్స్‌లో బాలు.. మీనా ఓటమి.. రోహిణి బాగోతం బయటపడుతుందా?

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్‌లో బాలు- మీనా విజయం జీర్ణించుకోలేని మనోజ్,రోహిణి,ప్రభావతి తమ అక్కసు వెళ్లగక్కారు. ముందు మనోజ్ 'వాళ్లిద్దరూ ప్రాడు పని చేసి గెలిచారు' అంటూ బాలు-మీనాలను అవమానించడంతో గొడవ మొదలైంది. దీనికి మీనా ధీటుగా స్పందిస్తూ.. మనోజ్ గతంలో చేసిన తప్పులను గుర్తుచేసింది. 40 లక్షల వ్యవహారం, నగలు అమ్ముకున్న విషయం ప్రస్తావించడంతో రోహిణి కోపంతో ఊగిపోయి చివరకు సైలెంట్ అయ్యింది. ప్రభావతి కూడా మనోజ్-రోహిణిలకు మద్దతుగా నిలవడంతో మనోజ్ మరింత రెచ్చిపోయాడు. జడ్జెస్‌కు బాలు గురించి సరిగ్గా తెలియదని, అందుకే లక్ష రూపాయలు గెలిచాడని ఎద్దేవా చేశాడు. ఈ సమయంలో సత్యం రంగంలోకి దిగుతూ గొడవలు ఆపేయాలని హెచ్చరించాడు. అయితే ప్రభావతి 'లక్ష గెలవగానే లక్షణమైన కాపురమా?' అంటూ బాలు-మీనాలను మరోసారి కించపరిచింది. మనోజ్ కూడా తామెప్పుడూ గొడవపడలేదని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు.

దీనికి బాలు ఘాటుగా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మనోజ్ గతాన్ని ఎత్తిచూపుతూ, 'ఇద్దరికిద్దరు పెద్ద కేడీలు' అని, జడ్జెస్ అన్న మాటలను గుర్తు చేశాడు. మీనా కూడా 'చిన్న చిన్న గొడవలు ఉంటేనే సంసారం' అంటూ మద్దతిచ్చింది. ఇక బాలు 'గొడవలు లేవంటే రహస్యాలుంటాయి" అంటూ రోహిణిని ఇరకాటంలో పడేస్తాడు. ప్రభావతి ఈ మాటలను ఆసరాగా తీసుకొని రోహిణిని నిలదీస్తే.. ఆమె తెలివిగా తప్పించుకుంది. అయినా ప్రభావతికి అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు బాలు తన గెలుపు చెక్‌ను తండ్రి సత్యంకి ఇవ్వాలనగా, ఆయన నిరాకరిస్తూ ఆ డబ్బులతో రూమ్ కట్టుకోవాలని సూచించాడు. ఈ సందర్భంలో సత్యం ప్రభావతిపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. మనోజ్ వచ్చి తన తెలివైన సమాధానాల గురించి మాట్లాడినా, ప్రభావతి అతని మోసాల చిట్టాను బయటపెట్టడంతో అతడు సైలెంట్ అయ్యాడు. ఇదిలా ఉండగా రోహిణి ఓటమితో బాధపడుతుంటే, మనోజ్ ఆమెను ఓదార్చి తామే బెస్ట్ కపుల్స్ అని ధైర్యం చెప్పాడు. మరోవైపు రవి-శృతి మధ్య పిల్లల అంశంపై మరో గొడవ జరిగింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 587 December 31th 2025 here is full story

Courtesy: jiohotstar

బుధవారం సీరియల్ ప్రారంభంలోనే బాలు,మీనా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మీనాను చూసిన బాలు కాస్త రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతాడు. 'నీ వల్లే నా జీవితం మారిపోయింది... నువ్వే నన్ను మార్చావు' అంటూ మీనాను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దీనికి మీనా కూడా 'మీరు దొరకడం నా అదృష్టం'అంటూ ఫన్నీగా స్పందిస్తుంది. ఈ క్రమంలో బాలు ఆత్రంతో డాన్స్ చేద్దామని మీనాను అడుగుతాడు. కానీ మీనా మాత్రం 'మనం హాల్లో ఉన్నాం... ఎవరైనా వస్తే బాగుండదు' అంటూ కొంచెం భయపడుతుంది.

అయితే బాలు మాత్రం 'మా అమ్మ వస్తే విజిల్ వేస్తూ కిందికి వస్తుంది... టెన్షన్ వద్దు'అంటూ మీనాతో రొమాంటిక్ స్టెప్పులు వేస్తాడు. ఇంతలోనే ఊహించని విధంగా ప్రభావతి అక్కడికి రావడంతో పరిస్థితి మారిపోతుంది. మీనా ముందే గమనించినా బాలు మాత్రం పట్టించుకోకుండా స్టెప్పులు కొనసాగిస్తాడు. ఒక్కసారిగా ప్రభావతిని చూసి బాలు షాక్ అవుతాడు. 'వెయ్యరా స్టెప్పులు... లక్ష రూపాయలు వచ్చాయి కదా, ఏమైనా చేస్తావ్'అంటూ ప్రభావతి సెటైర్లు వేస్తుంది. ఈ మాటలకు బాలు సైలెంట్‌గా ఉండిపోతాడు.

ఈ సన్నివేశం తర్వాత మీనా కీలక నిర్ణయం తీసుకుంటుంది. 'ఇకనైనా మనం సొంతంగా ఓ రూమ్ కట్టుకుందాం. మీ నాన్న కోరిక కూడా అదే' అంటూ బాలుతో చెబుతుంది. బాలు కూడా అంగీకరిస్తాడు. తనకు తెలిసిన మేస్త్రీలు ఉన్నారని, తక్కువ ఖర్చులో ఇల్లు కట్టిస్తారని మీనా భరోసా ఇస్తుంది. మరుసటి రోజు బాలు మేస్త్రిని తీసుకొచ్చి పైన రూమ్ గురించి వివరాలు చెబుతాడు. కొలతలు చూసిన మేస్త్రి మొత్తం ఖర్చు నాలుగు లక్షలు అవుతుందని చెప్పడంతో బాలు కాస్త ఆందోళన చెందుతాడు. తమ దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయని, మిగతా డబ్బు త్వరలో సర్దుబాటు చేస్తామని అంటాడు. అయితే మేస్త్రి మాత్రం 'మొత్తం డబ్బు ఉంటేనే పని మొదలుపెడతాను. మెటీరియల్‌కే మూడు లక్షలు ఖర్చవుతుంది'అని స్పష్టంగా చెబుతాడు. చివరికి బాలు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి పంపిస్తాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభావతి దొంగచాటుగా వింటుంది. విషయం గమనించిన బాలు తన తల్లిని ఆటపట్టిస్తాడు. 'మిగతా డబ్బు ఎలా తెచ్చుకుంటాం?'అని మీనా అడగగా... 'ఇంకేముంది... మా అమ్మ ప్రభావతి దేవి బంగారం ఉంది కదా, తాకట్టు పెడదాం.. వీలైతే మనోజ్ గాడిలా అమ్మేద్దాం'అంటూ జలకిస్తాడు. దీంతో ప్రభావతి 'ఇక్కడ ఉంటే నాకే టోపీ వేస్తున్నారు'అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మొత్తానికి బాలు-మీనా డ్రీమ్ హౌస్‌కు పునాది పడుతుంది.

మరోవైపు మీనా తన ఫ్రెండ్స్‌ను కలవడానికి వెళ్తుంది. లక్ష రూపాయలు గెలిచావు అంటూ అందరూ కంగ్రాట్స్ చెబుతారు. ఆ పోటీ ఏంటని అడగగా...
'ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ఆ పోటీ. మన మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకోవడమే దాని ఉద్దేశం'అని మీనా వివరించుతుంది. అయితే మీనా ఫ్రెండ్స్ మాత్రం 'ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునే మగాళ్లు ఉంటారా? కొత్తలో అంతే... తర్వాత వాళ్లకు నచ్చిందే చేస్తారు' అంటూ ఎద్దేవా చేస్తారు. మీనా మాత్రం బాలు ఎప్పటికీ తనపై ప్రేమ చూపిస్తాడని గట్టిగా నమ్ముతుంది.

దీంతో ఫ్రెండ్స్ పందెం వేస్తారు. 'నువ్వు కొత్తగా వంట చేసి పెట్టు. కానీ బాలు టేస్ట్ ఎలా ఉందని అడగకూడదు. నువ్వు అడగకముందే మెచ్చుకుంటే నువ్వే గెలిచినట్లే' అంటారు. పందెంలో భాగంగా మీనా ఉదయాన్నే బీట్రూట్ దోస చేస్తుంది. మామయ్య, రవి, ప్రభావతి అందరూ తిని మెచ్చుకుంటారు. కానీ బాలు మాత్రం ఫోన్‌లో మాట్లాడుకుంటూ హడావిడిగా వస్తాడు. టిఫిన్ తిన్నా ఎలా ఉందో చెప్పడం మర్చిపోతాడు. మీనా ఇన్‌డైరెక్ట్‌గా అడిగినా బాలు అర్థం చేసుకోకుండా నీళ్లు కావాలని అంటాడు. దీంతో మీనా కోపంగా 'ఏం అవసరం లేదు... మీరే తెచ్చుకోండి'అంటూ వెళ్లిపోతుంది. ఇలా మీనా పందెంలో ఓడిపోతుంది. మీనా ఫ్రెండ్స్ 'మొగుళ్లు ఇంతే... పెళ్లి కొత్తలో మురిపం, తర్వాత మర్చిపోతారు'అంటూ ఎగతాళి చేస్తారు. అయినా ఆగకుండా మరో పందెం వేస్తారు. ఈసారి ఓడితే రూ.500 తీసుకుంటామంటారు. మీనా ఒప్పుకుంటుంది.

మరోవైపు రోహిణికి తన కొడుకు నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ తీసుకున్న వెంటనే రోహిణి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అవతలి వైపు నుంచి కొడుకు, 'అమ్మా... నా పుట్టినరోజుకు నువ్వు ఖచ్చితంగా రావాలి. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు' అని అడుగుతాడు. దానికి రోహిణి కూడా ఎంతో ప్రేమగా, 'తప్పకుండా రా బాబు... నీ పుట్టినరోజుకు నేను కచ్చితంగా వస్తాను' అని హామీ ఇస్తుంది. 'ఏంటమ్మా... ఏం మాట్లాడట్లేదు? ఏం లేదు? చింటూ... నువ్వు కూడా నాలాగే మాటలు బాగా నేర్చావు' అంటూ సరదాగా మాట్లాడుతుంది రోహిణి. అంతలోనే కొడుకు, 'అమ్మా... నాకు ఏం కావాలో తెలుసా?' అని అడుగుతాడు. వెంటనే రోహిణి, 'చెప్పు నాన్న... జిప్ పాయింట్స్ కావాలా? కొత్త బూట్స్ కావాలా? కోర్టు షూ సెట్ తీసుకురానా?" అంటూ మురిసిపోతుంది. కొడుకు కోరినవన్నీ తీసుకొస్తానని, పుట్టినరోజు వేడుకలకు ఖచ్చితంగా వస్తానని మరోసారి చెబుతుంది.

ఈ ఫోన్ కాల్ పూర్తయ్యాక.. 'ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్?'అని మనోజ్ ప్రశ్నిస్తాడు. రోహిణి సమాధానం చెప్పబోయేలోపే మనోజ్ తన మనసులో ఉన్న కోరికను బయటపెడతాడు. 'మరోసారి గోవాకు వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా భయమేస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. వీళ్లందరికీ దూరంగా... కాస్త ఏకాంతంగా గడిపేసి వద్దామా?'అంటూ తన ఆలోచనను రోహిణి ముందు పెడతాడు. మనోజ్ మాటలు విన్న రోహిణి కాసేపు ఆలోచించి, "అవును... మనం తప్పకుండా ప్లాన్ చేద్దాం. కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు అదే మంచిది' అని అంగీకరిస్తుంది. మనోజ్ కోరుకున్న ఏకాంత ప్రయాణానికి రోహిణి కూడా ఒప్పుకోవడంతో, ఇద్దరి మధ్య కొత్త ప్లాన్‌కు పునాది పడుతుంది.

అప్‌కమింగ్ ఎపిసోడ్ ట్విస్టులు.. రాబోయే ఎపిసోడ్‌లో మీనా బాలు మీద తిక్క కూర్చడానికై క్యారేజీలో పల్లీలు, మిర్చి, పచ్చి కూరగాయలు పెట్టడం ఆసక్తికరంగా మారుతుంది. బాలు అవాక్కవుతాడు. ఫ్రెండ్ రాజేష్ "నీ వంటను మెచ్చుకోలేదని ఇదే పనిష్మెంట్" అని చెప్పడంతో బాలు నిజం గ్రహిస్తాడు. మరోవైపు రోహిణి తన కొడుకు పుట్టినరోజు కోసం షాపింగ్ చేస్తుంటే అదే షాప్‌కు ప్రభావతి, మీనాక్షి రావడం పెద్ద ట్విస్టుగా మారుతుంది. షాప్ కీపర్ "మీ కొడుకు కోసం బట్టలు తీసుకున్నారు" అని చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X